• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

మొట్టమొదటి శీతాకాలంలో మీ బిడ్డను సిద్ధం చేసే మార్గాలు ?

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Oct 20, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

* ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు కొత్తగా తల్లి అయిన వారికి కలిగే మొదటి ఆందోళన -

 

శీతాకాలంలో తన నవజాతశిశువు వెచ్చగా మరియు ఆరోగ్యంగా ఉంచడం ఎలా ?

 

చలి నుండి నేను బిడ్డను ఎలా రక్షించగలను;

ఎటువంటి బట్టలు సరిపోతాయి మరియు ఎటువంటి బట్టలను ఖరీదు చేయాలి ?

 

ఇది మీ శిశువు యొక్క మొదటి శీతాకాలం అయితే, ఈ భయంకరమైన చలినుండి బిడ్డను ఏవిధంగా కాపాడుకోవాలి అని మీరు ఎంతో ఆతృతగా ఉంటారు. మీరు దానిపై ఆందోళనగా ఉన్నట్లయితే, దానిని మర్చిపోండి. మీరు సరైన శ్రద్ధ వహిస్తే మీ చిన్నారి తో పాటు కుటుంబ సభ్యులందరూ ఈ శీతాకాలంలో ఎంతో ఆనందించగలరని నిర్ధారించుకోండి.

 

మీ బిడ్డను ఈ 6 రకాల తీవ్రమైన వ్యాధుల నుండి రక్షించగలరని నిర్ధారించుకోండి :


 

ఈ సీతాకాలంలో మీ నవజాత శిశువును సిద్ధం చేయడానికి మన సహపేరెంట్ రిధి దూమ్రా గారు కొన్ని సులభమైన చిట్కాలను పంచుకున్నారు. అయినప్పటికీ, ఆమె పంచుకున్న ఈ సమాచారం అందరికీ సరిపోతుంది అని అర్థం మాత్రం కాదు అని ఆమె నొక్కి చెబుతున్నారు. ఇవి కొన్ని ప్రాథమిక మార్గదర్శకాలు మాత్రమే. ఇవి అనుసరించినట్లయితే మీ పిల్లవాడిని సంతోషంగా మరియు సురక్షితంగా ఉంచటంలో సహాయపడుతాయి. మీ వ్యక్తిగత పరిస్థితులకు అనుగుణంగా వాటిని సర్దుబాటు చేసుకోండి. కొత్తగా తల్లి అయిన వారు వీటిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి.

 

మీ శిశువు యొక్క మొట్టమొదటి శీతాకాలం కోసం వారిని ఎలా సిద్ధం చేయాలి ?

 

మొదటి శీతాకాలంలో మీ చిన్నారిని సిద్ధం చేయడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. శీతాకాలం కోసం మీ చిన్నారిని సిద్ధం చేయడానికి ఇక్కడ ఒక చెక్లిస్ట్ ఇవ్వబడింది. తెలుసుకోవడానికి దీనిని చదవండి..

 

* తల్లి మరియు శిశువు ఆహారం :

మీ చిన్నారి తల్లిపాలను మాత్రమే తీసుకుంటూ ఉండవచ్చు. అలా అయితే వారి ఆహారంలో ఎటువంటి మార్పు  అవసరం లేదు. అయితే, తల్లిగా మీరు తీసుకునే ఆహారం గురించి స్పృహ కలిగిఉండాలి.

 

* చల్లని ఆహారము, చల్లనిపాలు మరియు చల్లనినీరు తీసుకోవడం మానుకోండి.

 

* సూప్ లు, శెనగపిండి మరియు నెయ్యితో ఇంట్లో తయారుచేసిన వంటకాలను ఎంచుకోండి. ఇది శిశువుకు వెచ్చదనాన్ని అందిస్తుంది.

 

* ఆయా సమయాలలో దొరికే కూరగాయలు మరియు పండ్లను పుష్కలంగా తీసుకోవడం చాలా ముఖ్యం.

 

* శిశువుకి పొరల వస్త్రాలు : సులువైన విధానం ఏమిటంటే, చిన్నారిని వెచ్చగా కప్పి ఉంచడం.

 

* ప్రత్యేకంగా డాక్టర్ దగ్గరకు లేదా  బయటకు వెళ్లవలసి వచ్చినప్పుడు పొరలుగా ఉండే వస్త్రాలను అందుబాటులో ఉంచుకోండి.

 

* మీరు ఇంటిలోపలికి వెళ్లినప్పుడు పొరలను సులభంగా తీసివేయవచ్చు.

 

* మీ శిశువు శరీరం మీలాగ చలిని నియంత్రించ జాలదు. కాబట్టి వారికి కొంత అదనపు వెచ్చదనం అవసరం ఉంటుంది.

 

*ఎస్ ఐ డి ఎస్ ప్రమాదాన్ని తగ్గించడానికి మీ చిన్నారి నిద్రపోతున్నప్పుడు ఎక్కువ బట్టలతో కప్పిఉంచకుండా జాగ్రత్త వహించండి.

 

* ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నట్లయితే మీ బిడ్డను రక్షించడానికి ధర్మల్ అండర్ వేర్ లను ఉపయోగించండి. ఇది బిడ్డలను చలి నుండి కాపాడడానికి బాగా ఉపయోగపడతాయి.

 

* మీరు బయటకు వెళ్ళినప్పుడు మిట్టెన్లు, సాక్స్ మరియు మంచి నాణ్యమైన వింటర్ క్యాప్ లను ఉపయోగించండి.

 

* సరైన సమయంలో టీకాలను వేయించండి : సరైన సమయానికి టీకాలను ఇప్పించడం మరిచిపోకండి. మీ శిశువు వైద్యుని సంప్రదించి కాలానుగుణంగా మీ శిశువుకు ఫ్లూ షాట్ ఇప్పించండి. మీ బిడ్డతో సన్నిహితంగా ఉండే కుటుంబ సభ్యులందరికీ కూడా ఇన్ఫ్లూయెంజా టీకాలు ఇప్పించడం మరిచిపోకండి.

 

దీనిని పరిశీలించండి :0-18 నెలల పిల్లల టీకా పట్టిక..

 

* స్నానం మరియు చర్మ సంరక్షణ : మీ చిన్నారి సున్నితమైన చర్మానికి శీతాకాలపు ఉష్ణోగ్రతలు కఠినంగా ఉంటాయి. మీరు మంచి శీతాకాలపు చర్మసంరక్షణ విధానాన్ని అనుసరించాలని నిర్ధారించుకోండి.

 

* శీతాకాలంలో శిశువులకు ప్రతి రోజు స్నానం చేయించవలసిన అవసరం లేదు. రోజు విడిచి రోజు స్నానం చేయించినట్లయితే సరిపోతుంది.

 

* స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేసినట్లయితే రక్తప్రసరణ బాగా జరగడానికి సహాయపడుతుంది మరియు చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

 

* నవజాత శిశువుల కోసం తయారు చేసిన మంచి నాణ్యత కలిగిన తేలికపాటి సబ్బులు మరియు బేబీ లోషన్లు ఉపయోగించాలని నిర్ధారించుకోండి.

 

తరచుగా తల్లి పాలివ్వడం ద్వారా హైడ్రేట్ గా ఉండడానికి బిడ్డకు సహాయపడుతుంది. తల్లిపాలు మీ చిన్నారి యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి.

 

* ఇంట్లో తయారు చేసిన వంటకాలు : మీ శిశువుకు మీరు తల్లిపాలను ఇస్తున్నట్లయితే, మీరు మీ శరీరం యొక్క వేడిని సహజంగా ఉంచుకోవాలి.

 

*మీరు తులసి ఆకులు మరియు తేనె తీసుకున్నట్లయితే దాని ప్రభావం మీ బిడ్డకు పాల ద్వారా అందుతుంది.

 

* కొన్ని తులసి ఆకులను నీటిలో ఉడకబెట్టి క్రమంతప్పకుండా తాగుతున్నట్లయితే, ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు మీ బిడ్డకు వెచ్చదనాన్ని ఇస్తుంది.

 

* పాలిచ్చే తల్లులు శీతాకాలంలో గోధుమలతో చేసిన లడ్డూలను తీసుకున్నట్లయితే ఎంతో మంచిది.

 

వీటిని పరిశీలించండి : 6-12 నెలల శిశువు లకు ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలు...

 

* అతిగా ఉడికించిన ఆహారాన్ని నివారించండి.

 

* ఎక్కువ వేడిని కలిగించే పరికరాలకు దూరంగా ఉండండి.

 

* వేడిని పుట్టించే పరికరాలు పిల్లలకు ప్రమాదకరం కావచ్చు.. దీనిని చదవండి..

 

* పరికరాల నుండి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ మీకంటే ఎక్కువగా మీ బిడ్డ మీద ప్రభావితం చూపిస్తాయి.

 

* మీ ఇంటిని వెచ్చగా వుంచడానికి సురక్షితమైన మార్గంలో వెళ్లవలసిన అవసరం ఉంది అని నిర్ధారించుకోండి.

 

* గదిని వెచ్చగా ఉంచడానికి మీరు అన్ని తలుపులను మరియు కిటికీలను మూసి ఉంచవచ్చు. కొంచెం సూర్యకాంతి వస్తున్న సమయంలో మాత్రమే వాటిని తెరిచిఉంచండి.

 

* మీ బిడ్డను మంచిగా కప్పి ఉంచి ఆ తర్వాత తలుపులు మరియు కిటికీలు తెరవండి. తద్వారా కొంత తాజా గాలి ప్రసరణ కూడా ఉంటుంది.

 

* మీరు హీటర్లను ఉపయోగిస్తున్నట్లు అయితే, గాలిని పీల్చివేయకుండా హ్యుమిడి ఫైర్ లను ఉపయోగించండి.

 

ఈ శీతాకాలంలో మీ బిడ్డను వెచ్చగా మరియు ఆరోగ్యంగా ఉంచడానికి పరీక్షించి ప్రయత్నించిన ఈ చిట్కాలను మీరూ ప్రయత్నించండి. సరైన జాగ్రత్తలు పాటించినట్లయితే మీరు మీ బిడ్డ సురక్షితంగా ఉండగలరు. కాబట్టి మీ శీతకాలం దుస్తులను బయటకు తీసి టీ కోసం మీ టేబుల్ సెట్ చేసుకోండి. మీ చిన్నారితో హాయిగా శీతాకాలాన్ని ఆస్వాదించండి.


మీ బిడ్డ మొదటి శీతాకాలంలో మీరు పాటించిన కొత్త చిట్కాలు మాతో పంచుకునేందుకు మీ వద్ద ఏవైనా ఉన్నాయా ? దయచేసి ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో వాటిని మాతో పంచుకోండి.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}