• లాగ్ ఇన్
 • |
 • నమోదు చేయు
పేరెంటింగ్

సామాజిక మరియు భావోద్వేగ అభివృద్ధి :1-3 సంవత్సరాలు

Mounika Saride
1 నుంచి 3 సంవత్సరాలు

Mounika Saride సృష్టికర్త
నవీకరించబడిన Feb 09, 2020

 1 3
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

మొదటి సంవత్సరం అనుభవాలు - ఒక జీవిత కాల ప్రభావం :

వారి ప్రారంభ సంవత్సరాల్లో పిల్లల కు  కలిగే అనుభవాలు వారి మెదడు పని చేసే  తీరును   

ప్రభావితం చేస్తాయి, వారు ఒత్తిడికి ప్రతిస్పందించే తీరు , మరియు వారు నమ్మకమైన బంధాలను  పెంపొందించే వారి సామర్థ్యం. ఈ సంవత్సరాలలో మెదడు అత్యంత  వృద్ధి చెందుతుంది, సామాజిక మరియు భావోద్వేగ అభివృద్ధి కోసం వేదికను నెలకొల్పుతుంది.

సంకర్షించే వారి సామర్ధ్యం మరియు వారి తక్షణ ప్రచోదనాలను నియంత్రించే  సామర్ధ్యం లతో ప్రభావితం కలిగి ఉంటాయి.

చిత్రం: భావోద్వేగ, అభిజ్ఞా, సాంఘిక, మరియు శారీరక అభోవృధులకు  పరస్పర సంబంధం మరియు ఒకదాని పై మరి ఒకటి  ప్రభావం కలిగి ఉండును

సామాజిక మరియు భావోద్వేగ అభివృద్ధి

1 -2  వయసు : గల వారిలో మనం సహజంగా గమనించ తగినవి

 • ఒక సంవత్సరపు వయస్సు వారు వారి భావాలను అప్పుడే  గుర్తించి, నిర్వహించడానికి నేర్చుకుంటున్నారు
 • ఈ వయసు పిల్లలలో  భావోద్వేగాల శ్రేణి పెంపొందును
 • సహాయం లేకుండా "తనంతట తానుగా " పనులను ప్రయత్నించి, స్వాతంత్రతను పొందే ప్రయత్నం చేస్తుంటారు.
 • సులభంగా మనోవైఫల్యతను చూపుతారు - వారు వారి భాషతో ఏదైనా వ్యక్తం  చేయలేకపోవడం కూడా కావచ్చు ఒకోసారి
 • ఇతరుల ముఖ సంజ్ఞలను అనుకరిస్తుంటారు . అందువలన ఈ వయసు లో వారు ఎప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారో శుభంగా చెప్పవచ్చు  వారి యొక్క ముఖ కవళికలను బట్టి
 • 'వద్దు'అనేది వారికి ఇష్టమైన పదం కింద ఉంటుంది , నిజానికి వారు ఒద్దు అన్నప్పుడల్లా దానిని  ఊదేశించరు కూడా
 • ఉదార భావం మరియు ఇతరుల భావోద్వేగాలపై అవగాహన కలిగి ఉంటారు
 • ఒకోసారి బాగా అభిమానని చూపుతారు, కౌగిలింతలు మరియు ముద్దులు కూడా ఇస్తుంటారు
 • ఇతరులతో ఉన్నపుడు వారు వారి అవకాశం కోసం వేచి ఉండేటప్పుడు  అసహనాని ప్రదర్శించవచ్చు .కొందరు పిల్లలు ఆధిపత్యం ప్రదర్శించే విదంగా kooda  ఉంటారు
 • ఇతరులకు వారి వస్తువులను  ప్రదర్శిస్తారు
 • ఇతరుల పదాలను మరియు ఆదేశాలను అర్థం చేసుకుంటారు  మరియు వాటికి స్పందిస్తుంటారు kooda

2-3  వయసు: గల వారిలో మనం సహజంగా గమనించ తగినవి

 • ఇష్టమైన పదం "ఎందుకు", టన్నుల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు .అప్పుడప్పుడూ పదే పదే అడిగిన ప్రశ్ననే మళ్ళీ మళ్ళీ  అడుగుతూ ఉంటారు, జవాబు తెలిసిన కూడా
 • ఇతరులతో చాలా అవుట్గోయింగ  మరియు చాలా స్నేహపూర్వ కంగా ఉంటారు
 • మనోభావాలు వేగంగా మారతాయి,ఈ క్షణం నవ్వితే మరు క్షణం ఏడుస్తుంటారు
 • ఇమాజినరీ ప్లేమేట్స్ అంటే ఊహాపూర్వకమైన ఆటగాళ్లు మూడు సంవత్సరాల వయస్సు గలవారి లో సాధారణం
 • వారు బలమైన భావోద్వేగాలు కలిగి మరియు అదృశ్య స్నేహితులతో సంభాషణలను కలిగి ఉంటారు
 • సహజంగా వారు కోరుకుంటున్నదాని గురించి దృఢంగా ఉండి మరియు పెద్దవారి అభ్యర్థలను తిరస్కరించటం లేదా  ఒద్దు లాంటివి చెప్పవచు
 • వారి మరియు ఇతరుల భావోద్వేగాలను గుర్తించగలరు
 • మార్పును  ఇష్టపడక పోవచ్చు, ఒక రొటీన్ వాళ్లకి అవసరము
 • సులభంగా విసుగు చెందుతారు
 • స్వాతంత్రం కావాలి, మరియు తల్లిదండ్రుల భద్రత కూడా అవసరమే
 • వారి వస్తువుల పై భద్రతా చూపవచ్చును
 • కొద్దిగా  ఇతర పిల్లలతో ఆటలను  ప్రారంభిస్తుంటారు
 • ఒకటి గుర్తు పెట్టుకోండి ,ప్రతి శిశువు చాల ప్రత్యేకం మరియు వారి యొక్క ప్రత్యేక  శైలి కలిగి ఉండవచ్చు  అందువలన వారు వారి సొంత పరిధిలో ఎదుగుదలను చూపవచ్చును .

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

 • 2
వ్యాఖ్యలు()
Kindly Login or Register to post a comment.

| Oct 29, 2019

Udikenchi pettali

 • నివేదించు

| Mar 28, 2019

naku 7. 5 month baby undi nen potato ela pettali na baby ki

 • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}