• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్

రుతుపవనాల సమయంలో లేదా వర్షాకాలంలో చిన్న పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన May 26, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

మండే ఎండల నుండి వర్షాలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి. అయినప్పటికీ ఈ సమయం లో శిశువుల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వర్షాకాలంలో తేమ, కీటకాలు,దోమలు మరియు బ్యాక్టీరియాలు అనేవి చాలా ఇబ్బందిని కలిగించే అంశాలు. వీటి వలన చిన్నారులకు అనేక వ్యాధులు సంభవిస్తాయి .పరిసరాలను పొడిగానూ మరియు పరిశుభ్రంగా ఉంచడం వల్ల మన చిన్నారులను ఇలాంటి ఎన్నో వ్యాధుల బారిన పడకుండా నివారించవచ్చు. వర్షాకాలంలో పిల్లల విషయంలో ఇంట్లోనూ మరియు బయటకు వెళ్ళినప్పుడు తీసుకొనవలసిన జాగ్రత్తలు ఏమిటో చదవండి.

 

రుతుపవనాల సమయంలో చిన్నారుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి :

 

మన తోటి పేరెంట్ బ్లాగర్ ' హీనా పంత్ ' గారు వర్షాకాలంలో శిశువుల సంరక్షణ కు తీసుకోవలసిన 10 సాధారణమైన మరియు ప్రతిభావంతమైన చిట్కాలను మనతో పంచుకుంటున్నారు...

 

బిడ్డను శుభ్రంగా ఉంచండి :

 

మీ బిడ్డను శుభ్రంగా మరియు పొడిగా ఉంచడం అన్నది ఎంతో ముఖ్యమైన విషయము .మీరు  శిశువుకు ప్రతి రోజు స్నానం చేయించ వలసిన అవసరం లేదు. దానికి బదులుగా టవల్ తో తుడిస్తే సరిపోతుంది .చల్లగా ఉన్నప్పటికీ పిల్లలకు కొన్నిసార్లు చెమటలు పట్టవచ్చు . అటువంటి సందర్భాలలో గోరువెచ్చని నీటితో మధ్యాహ్న సమయంలో స్నానం చేయించండి .ఏది ఏమైనప్పటికీ నెమ్ము మరియు దురదల విషయంలో కీళ్ళు మరియు ముడతల దగ్గర గమనిస్తూ ఉండండి.

 

దుస్తులు :

 

ఈ సమయంలో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి కనుక పిల్లలకు దానికి అనుకూలమైన బట్టలు వేయాలి. ఫుల్ స్లీవ్స్ లో ఉండే మెత్తని కాటన్ బట్టలను వేయాలి. అవి వెచ్చగా ఉండడమే కాకుండా క్రిములు మరియు దోమల నుండి కూడా వారిని కాపాడుతాయి. మందంగా ఉండే బట్టలు వేయడం వల్ల పిల్లలకు చెమట పడుతుంది. ఆ చెమట పట్టే బాగాలే బ్యాక్టీరియాను పెంచి పోషించే ప్రదేశాలు. కాబట్టి తరచుగా ఈ సీజన్ లో బట్టలు మారుస్తూ ఉండాలి.

 

ప్రైవేట్ భాగాలను శుభ్రపరచండి :

 

శిశువు యొక్క ప్రైవేట్ భాగాలను బాగా శుభ్రపరిచి ఎప్పుడూ పొడిగా ఉండేలా చూడటం చాలా అవసరం. డైపర్లు ఉపయోగిస్తున్నట్లు అయితే తరచుగా మారుస్తూ ఉండండి. మార్చే ముందు ఆ భాగాలను శుభ్రపరుస్తూ ఉండండి. ఆ ప్రాంతాలలో టాల్కం పౌడర్ ను వాడకండి. ఈ చల్లని వాతావరణంలో తరచుగా మూత్ర విసర్జన చేస్తున్నప్పటికీ రోజులో కొంత సమయం డైపర్ వేయకుండా గాలి తగిలేలా గా వదిలి ఉంచండి.

 

ఇంట్లో వండిన ఆహారాన్నే ఇవ్వండి :

 

ఆహారం తినే వయస్సు వచ్చిన పిల్లలకు ఇంట్లోనే శుభ్రంగా ఉడికించిన ఆహారాన్ని ఇవ్వండి . మీ చిన్నారులకు ఫార్ములా పాలు ఇస్తున్నట్లయితే ముందుగా నీటిని మరిగించి చల్లబరిచి ఉంచుకోండి.

 

ఇంటిని శుభ్రంగా ఉంచండి :

 

వర్షాకాలంలో ముఖ్యంగా నేల అంతా దుమ్ముతో నిండిపోతుంది .తడి బూట్లతో ఇంట్లోకి రాకుండా   ష్యు రాక్ ను ఒక్క మండపం లాంటి డబ్బాలో ఉంచండి .శిశువులు ఉన్న ఇంటిని కనీసం రోజుకి రెండు సార్లు శుభ్రపరచాలి .ఇంట్లో కానీ ,ఇంటి చుట్టు పక్కల కానీ నీటిని నిల్వ చేయకుండా చూసుకోండి.

 

శరీరము మరియు గది ఉష్ణోగ్రతల ను గమనించండి :

 

ఈ రోజులలో చాలా ఇళ్లల్లో ఎయిర్ కండిషనర్లు తప్పనిసరి అయ్యాయి. అదృష్టవశాత్తూ వాతావరణానికి అనుకూలంగా మార్పులు చేసుకునే విధంగా ఏసీలు అందుబాటులోకి వచ్చాయి .మీ బిడ్డ సౌకర్యవంతంగా ఉండేందుకు ఉష్ణోగ్రతల ప్రకారం ఏసీల సెట్ చేసుకోండి.

 

స్ప్రేలు మరియు నూనెలు :

 

ఈ వాతావరణంలో దోమలు అధికంగా ఉంటాయి .కాబట్టి మీరు ఇంటి నుండి బయటకు వెళ్లిన సమయంలో క్రిమిసంహారక మందులతో పిచికారి చేయించవచ్చు .పిల్లలను బయటకు తీసుకు వెళ్ళే సమయంలో దోమల బారి నుండి రక్షించేందుకు సహజమైన తేలికపాటి లావెండర్ ఆయిల్ ను వారికి రాయండి.

 

రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండండి :

 

మీ బిడ్డలను రద్దీగా ఉండే ప్రాంతాలకు తీసుకు వెళ్లడం అంటే అంటువ్యాధులకు ఆహ్వానం పలకడం లాంటిది . వర్షాకాలంలో గాలిలోనే ఇన్ఫెక్షన్ ఉంటుంది .అందువల్ల రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం నివారించండి.

 

మందులను ఎలా ఇవ్వాలో తెలుసుకోండి :

 

సొంతంగా మందులు వేయడం అన్నది ఎంత మాత్రం సూచించనప్పటికీ ,మీ పిల్లలు డాక్టర్లను సంప్రదించి సాధారణ జలుబు, దగ్గు ,మరియు జ్వరాల కోసం ఏ విధంగా వాడాలో వారి సలహాలు తీసుకోండి.

 

ప్రతి దానిని నివారించలేము. కానీ సాధ్యమైనంత వరకు వీటిని అనుసరించి నట్లయితే మీ బిడ్డ అనారోగ్యానికి గురయ్యే అవకాశాన్ని తగ్గిస్తుంది . ఇవి పాటించినట్లయితే  మీకు , మీ బిడ్డకు చక్కటి వాతావరణాన్ని ఆస్వాదించేలా చేస్తోంది .మీ చిన్నారుల కోసం ఈ రుతుపవన ఆరోగ్య తనిఖీ జాబితాను అనుసరించండి.

 

రుతుపవనాల సమయంలో శిశువు సంరక్షణకై ఇచ్చిన చిట్కాలను మీరు పాటిస్తున్నారా ? మీ పిల్లలను మీరు రుతుపవనాల  సమయంలో ఎలా సురక్షితంగా ఉంచుతారు ? మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి. మీ అభిప్రాయాలు వినడం మాకెంతో సంతోషం.

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}