వర్షాకాలం లేదా రుతుపవనాల సమయంలో శిశువుల సంరక్షణకు తీసుకోవలసిన 10 చిట్కాలు..

Aparna Reddy సృష్టికర్త నవీకరించబడిన Jun 17, 2022

మండే ఎండల నుండి వర్షం గొప్ప ఉపశమనం అయితే, ఈ సమయంలో శిశువులకు అదనపు జాగ్రత్తలు అవసరం. వర్షాకాలంలో తేమ, కీటకాలు, దోమలు మరియు బ్యాక్టీరియా అనేవి చాలా సాధారణం. ఇవి వివిధ వ్యాధులకు దారితీస్తాయి. ముఖ్యంగా శిశువులలో. శిశువులను పొడిగా మరియు పరిశుభ్రంగా ఉంచినట్లయితే ఇలాంటి అనేకమైన వ్యాధులను నివారించవచ్చు. వర్షాకాలంలో శిశువులకు ఇంట్లోనూ మరియు బయటకు వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చదవండి...
రుతుపవనాల సమయంలో పిల్లల విషయంలో తీసుకోవాల్సిన చిట్కాలు :
మనకందరికీ తెలిసిన బ్లాగర్ హీనా పంత్ వర్షాకాలంలో శిశువుల సంరక్షణకై 10 సులువైన మరియు ప్రభావవంతమైన చిట్కాలను పంచుకున్నారు.
1. బిడ్డను శుభ్రంగా ఉంచండి :
బిడ్డను శుభ్రంగా మరియు పొడిగా ఉంచడం అన్నది మొదటిది మరియు ముఖ్యమైనది. రోజువారీ స్నానం అవసరం లేదు. స్నానానికి బదులుగా వెచ్చని టవల్‌తో ఒళ్ళంతా తుడవడం ఒక ప్రత్యామ్నాయం. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ కూడా శిశువుకి చెమటలు పట్టవచ్చు . అలాంటి సందర్భాల్లో మధ్యాహ్న సమయంలో వేడి నీటితో స్నానం చేయించవచ్చు. దురద మరియు తడిలేకుండా కీళ్ల దగ్గర మరియు ముడతల దగ్గర పరీక్షించం.
2. ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం :
ఇంటిలో ముఖ్యంగా నేలపై భాగంలో వర్షాల సమయంలో చాలా దూళి పేరుకుపోతుంది. తడి బూట్లతో ఇంట్లోకి రాకుండా ఉండడానికి షూ రాక్ ను పోర్టికోలో ఉంచండి. శిశువులు ఉన్న ఇంట్లో కనీసం రోజుకి రెండు సార్లు ఇంటిని శుభ్రపరచాలి. ఇంటి లోపల లేదా చుట్టుపక్కల నీటిని నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
3.దుస్తులు
ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులకు లోనవుతుంది కాబట్టి, పిల్లలు దానికి అనుగుణంగా దుస్తులు ధరించాలి. మృదువైన పత్తి బట్టలు, పూర్తి స్లీవ్లతో, అవి వెచ్చగా ఉంచడమే కాకుండా, క్రిమి మరియు దోమ కాటు నుండి కాపాడుతుంది.ఓవర్డ్రెస్సింగ్ వల్ల మీ బిడ్డ చెమట పట్టడానికి అవకాశం ఉంది. ఆ తేమ చలికి కారణమవుతుంది మరియు బ్యాక్టీరియాకు సరైన సంతానోత్పత్తి ప్రదేశం. కాబట్టి ఈ సీజన్లో తరచుగా బట్టలు మార్చడం అవసరం.
4. ప్రైవేట్ భాగాలను శుభ్రపరచండి :
శిశువు యొక్క ప్రైవేట్ భాగాలను పూర్తిగా శుభ్రం చేసి ఎండబెట్టడం అవసరం. డైపర్లను ఉపయోగిస్తుంటే, తరచుగా మార్చండి మరియు శుభ్రపరచడం మరచిపోకండి. ఆ ప్రాంతాల్లో టాల్కమ్ పౌడర్ రాయకండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు తరచుగా మూత్రవిసర్జన చేస్తూ ఉన్నప్పటికీ కొంత సేపు మీ బిడ్డ డైపర్‌ను తీసివేసి ఉంచడానికి ప్రయత్నించండి.
5.ఇంట్లో వండిన ఆహారాన్ని ఇవ్వాలి :
ఘన పదార్థాలను తినగలిగే పిల్లలకు బాగా ఉడికించిన ఇంటి ఆహారాన్ని ఇవ్వాలి. ఫార్ములా పాలపై ఆధార పడే పిల్లలకు ముందుగా నీటిని మరగబెట్టి చల్లబరచాలి.
6.పరిశుభ్రత పాటించండి :
తల్లి మరియు ఇతర కుటుంబ సభ్యులు వారి పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం, ముఖ్యంగా బయటి నుండి వచ్చేటప్పుడు. శిశువును పట్టుకునే ముందు చేతులు కడుక్కోవడం, ఇంటి వెలుపల బూట్లు తీయడం వంటివి
గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు.
7. గదిని సరైన ఉష్ణోగ్రతలో ఉంచండి :
ఈ రోజుల్లో చాలా ఇళ్ళల్లో ఎయిర్ కండిషనర్లు తప్పనిసరి అయ్యాయి. అదృష్టవశాత్తు వాతావరణానికి తగిన విధంగా మనము సెట్టింగ్స్‌ను పెట్టుకోవచ్చు. మీ బిడ్డకు సౌకర్యంగా ఉండేవిధంగా వాతావరణాన్ని సెట్ చేయండి.
8. స్ప్రేలు మరియు నూనెలు :
ఈ వాతావరణంలో దోమలు బాగా వృద్ధి చెందుతాయి. కాబట్టి మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు క్రిమిసంహారక మందులతో పిచికారి చేయించవచ్చు. మీరు బయటకు వెళ్లే సమయంలో దోమ కాటు నుండి పిల్లలను సంరక్షించడానికి తేలికపాటి లావెండర్ నూనెలు ఉత్తమమైనవి మరియు సహజమైనవి.
9. రద్దీ ప్రదేశాలను నివారించండి :
మీ బిడ్డను రద్దీగా ఉండే ప్రదేశాలకు తీసుకు వెళ్లడం అంటే అంటు వ్యాధులను ఆహ్వానించడం లాంటిది. వర్షాకాలంలో గాలిలో ఇన్ఫెక్షన్ ఉంటుంది. అందువల్ల రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించాలి.
10. మందులను ప్రయత్నించండి :
సొంత వైద్యాలు మంచివి కానప్పటికీ, తల్లిదండ్రులగా మీరు మీ శిశు వైద్యుని తో ప్రాథమిక మందుల కోసం మాట్లాడవచ్చు. మరియు ఏదైనా అత్యవసర పరిస్థితులలో సాదారణమైన జలుబు, దగ్గు మరియు జ్వరాల కోసం తగిన మోతాదులో డాక్టర్ సలహా మేరకు ఇవ్వవచ్చు. ప్రతిదీ మనము నివారించలేము. కానీ, ముందుగా సిద్ధంగా ఉన్నందువల్ల వర్షాకాలంలో శిశువులు అనారోగ్యానికి గురయ్యే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఇది మిమ్మలను , మీ బిడ్డని కూడా ఈ సీజన్లో ఆనందించేలా చేస్తుంది. పిల్లల కోసం ఈ ఋతుపవన ఆరోగ్య తనిఖీ జాబితాను అనుసరించండి.
రుతుపవనాల సమయంలో శిశువు సంరక్షణ కొరకు చిట్కాలను మీరు తెలుసున్నారా ? వర్షాకాలంలో మీరు మీ బిడ్డను ఎలా సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతారు ? మీ వ్యాఖ్యలను మాతో పంచుకోండి. మీ నుండి వినడం మాకు చాలా ఇష్టం.
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు