• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

తల్లి కాబోతున్న గర్భిణిస్త్రీలకు 10 శీతాకాలపు సంరక్షణ చిట్కాలు...

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Oct 14, 2020

 10
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

గర్భం ఆనందాలతో నిండినప్పటికీ , కొంత మంది తల్లులకు ముఖ్యంగా శీతాకాలంలో కొంచెం కష్టంగా ఉంటుంది. గాలిలోని చల్లదనం వలన నొప్పులు మరియు తల్లి జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లకు గురవుతుంది. శీతాకాలపు గర్భధారణ సమయంలో మందులు తీసుకోవడం అంత మంచిదికాదు. శీతాకాలంలో మీకు సురక్షితమైన గర్భధారణ సమయం కలిగి ఉండడానికి మేము కొన్ని చిట్కాలను అందిస్తున్నాము...

 

శీతాకాలంలో గర్భవతి గా ఉండడం అద్భుతంగా ఉన్నప్పటికీ, ఈ కాలంలో గర్భవతిగా ఉన్న వారికి కొంత అదనపు ప్రేమపూర్వక సంరక్షణ అవసరం ఉంటుందని మీకు తెలుసా ? నవజాత శిశువులకు జీవం పోయడానికి మీ శరీరం పెరుగుతున్నందున అది నిరంతరం సాగుతుంది మరియు కొన్ని సమయాల్లో పొడిగా మారుతుంది. శీతాకాలపు గర్భధారణ ఈ సమయంలో మీరు ఎలా సిద్ధపడతారు ?

 

శీతాకాలంలో తల్లి కాబోతున్న వారు తమ గర్భధారణను ఎలా చూసుకోవాలి ?

 

మబ్బులు కమ్మే శీతాకాలం మీ ఆరోగ్యాన్ని మరియు మానసిక స్థితిని నిజంగా ప్రభావితం చేస్తుంది. చల్లటి నెలల్లో ఆరోగ్యంగా ఉండడానికి ఇక్కడ కొన్ని సూచనలు మరియు చిట్కాలు ఉన్నాయి.

 

1.జూలైలో తీసుకున్న విధంగానే నీటిని తీసుకోండి : నీరు త్రాగాలని అనిపించకపోయినా జూలైలో తగిన విధంగానే జనవరిలో కూడా మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడానికి నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చల్లటి గాలి దాహాన్ని కలిగించదు. కానీ మీ శరీరానిక నీరు ఎంతో అవసరం.

 

1 హైడ్రేట్ గా ఉండడానికి ఎక్కువగా నీరు, సాకే సూప్, హెర్బల్ టీ మరియు కూరగాయల సూప్ లను త్రాగాలి.

 

2. మీకు గొంతు నొప్పి లేదా దగ్గు వస్తున్నట్లయితే సిట్రస్ రసాలు, చల్లని లస్సి లేదా మజ్జిగ వంటి శీతల పానీయాలకు దూరంగా ఉండండి.

 

3.పెదవులు పగలడం, అధికంగా పొడిబారడం, మూత్రం పసుపు రంగులో రావడం లాంటి లక్షణాలు ఉన్నట్లయితే అవి నిర్జలీకరణకు సంకేతాలు. కాబట్టి మీరు సమస్య రాకముందే దిద్దుబాటు చర్యలు తీసుకోండి.

 

చిట్కా :

మీకోసం రెండు , మూడు బాటిల్ ల నీటిని ప్రత్యేకంగా ఉంచుకోండి. పగటిపూట వాటిని పూర్తి చేయాలి అని నిర్ధారించుకోండి. అలా చేసినట్లయితే మీరు వాటిని పూర్తి చేయగలరు. కొంచెం గోరువెచ్చని నీటిని కూడా ఫ్లాస్క్లో ఉంచుకోవచ్చు.

 

2.ఇంటి లోపల మరియు ఆరుబయట వ్యాయామం చేయండి : వెచ్చగా ఇంట్లో కదలకుండా ఉండాలి అనే కోరిక ఉన్నప్పటికీ అలా ఉండాలి అనుకోకండి. ఎండ వేడిమి తగిలే విధంగా ఉండండి.

 

1.పడక గదిలో నుండి బయటకు వచ్చి కొంత సమయం ఎండలో కూర్చోండి. ఇది మానసికంగా మీకు తక్షణమే ఎంతో హాయినిస్తుంది. ఇది శీతాకాలపు గర్భధారణ వలన కలిగే అసౌకర్యంతో పోరాడటానికి సహాయపడుతుంది.

 

2. ఉదయాన్నే నడవడానికి ప్రయత్నించండి. వాతావరణం చాలా కఠినంగా ఉన్నట్లయితే ఇంటిలోపల నడవండి.

 

3.శ్వాస వ్యాయామాలు మరియు శారీరక వ్యాయామాలు చేయండి.

 

చిట్కా :

శరీరానికి అవసరమైన రక్తప్రసరణను నిర్వహించడానికి మరియు శీతాకాలపు నిరాశతో పోరాడడానికి వ్యాయామం చాలా అవసరం.

 

3 .చల్లటి గాలిని నిరోధించడానికి పొరలుగా ఉండే వస్త్రాలను ధరించండి : శీతాకాలంలో జలుబు మరియు ఫ్లూ  రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది.

 

1.బరువుగా,  గట్టిగా ఉండే బట్టలను వేసుకోకుండా తేలికపాటి పొరలుగల వస్త్రాలను వేసుకోండి.

 

2.ఉన్ని వస్త్రాలు కూడా దురదలు రావడానికి కారణం కావచ్చు. ఆరు బయట ఉన్నప్పుడు మాత్రమే గాలిని నిరోధించడానికి ఉన్ని వస్త్రాలను ధరించండి.

 

3.చల్లటి గాలి వలన తలనొప్పి రాకుండా తలను కప్పుకోండి.

 

4 .పొడవైన కోట్లు లేదా స్వెట్టర్లను ఖరీదు చేయండి:  అది మీ వెనుకభాగాన్ని చలి నుండి కాపాడుతుంది.

 

1. పొడవైన స్వెటర్లు మరియు కోట్లను ఉపయోగించి నందువల్ల వెనుక వైపు భాగాన్ని చలినుండి కాపాడడానికి అవి ఉపయోగపడతాయి.

 

2.చల్లటి గాలులు వలన మీకు వెన్నునొప్పి, అసౌకర్యం కలగడానికి అవకాశం ఉన్నందువలన పొడవైన స్వెటర్లు వేసుకోండి.

 

చిట్కా :

బెడ్ మీద దుప్పట్లను ఒత్తుగా వేయండి. తద్వారా పడక వెచ్చగా ఉంటుంది మరియు మీ వెనక భాగానికి కూడా హాయిగా ఉంటుంది.

 

5.చలి గాలి నుండి మీ పాదాలను రక్షించుకోండి : చల్లని వాతావరణంలో రక్తప్రసరణ సరిగా లేకపోవడం వలన చలిగాలికి వేళ్ళ వాపు భరించడం చాలా బాధాకరమైనది మరియు చాలా అసౌకర్యంగా ఉంటుంది.

 

1. నివారణ కంటే నిరోధన ఉత్తమం.

 

2. మీ పాదాలకు చలి తగలకుండా నిండుగా కప్పుకోండి.

 

3. మీ పాదాలపై కొంత ప్రత్యేకమైన శ్రద్ధను చూపించండి. కొంచెం సేపు గోరువెచ్చని నీటిలో నానపెట్టడం, మసాజ్ చేయడం మరియు మీకు నచ్చిన నెయిల్ పెయింట్ ను వేసుకోవడం ద్వారా చాలా హాయిగా ఉంటుంది.(గర్భధారణ సమయంలో పాదాలకు మసాజ్ చేయడానికి ముందు మీ గైనకాలజిస్ట్ తో మాట్లాడండి ఎందుకంటే కొన్ని వైద్యపరమైన సమస్యలు ఉన్నట్లయితే దానిని నివారించడం మంచిది)

 

6.అనారోగ్యంతో ఉన్నప్పుడు మందులు వాడండి : కానీ వైద్యుని సలహాతో మాత్రమే! మీరు చలి దెబ్బతగిలి తట్టుకోలేకుండా ఉన్నట్లయితే మీ డాక్టర్ను సంప్రదించి మందులు వాడండి.

 

1.చల్లని వాతావరణం శరీరం యొక్క రోగనిరోధక శక్తి ప్రతిస్పందనలను తగ్గిస్తుంది. అందువలన మిమ్మల్ని మీరు సంరక్షించుకోవాలి.

 

2. గర్భధారణ సమయంలో జలుబు యొక్క లక్షణాలతో పోరాడడానికి తగినంత సురక్షితమైన మందులు ఉన్నాయి.

 

3.మీరు ఇన్ఫ్లూయెంజా వ్యాక్సిన్ ఇప్పటివరకు తీసుకోక పోయినట్లయితే దాని గురించి మీ గైనకాలజిస్ట్ తో మాట్లాడండి.

 

7.ప్రతిరోజు మసాజ్ లు చేసుకోండి: మిమ్మల్ని ఉత్తేజంగా ఉంచడానికి మసాజ్ లు ఎంతో బాగా పనిచేస్తాయి.

 

1.గోరువెచ్చని ఆయిల్ తో మసాజ్ లు చేయడం శీతాకాలంలో తగ్గిన రక్త ప్రసరణను పెంచడానికి, మరియు విశ్రాంతిని ఇవ్వడానికి మంచిగా సహాయపడతాయి.

 

2. గర్భధారణ సమయంలో తల మరియు పాదాలకు మసాజ్ చేసేందుకు శిక్షణ పొందిన వ్యక్తులను మాత్రమే ఎంచుకోండి.

 

8. హ్యుమిడిఫైర్ ను ఖరీదు చేయండి :

చల్లని వాతావరణం నుండి వచ్చే గాలి తేమ లేకుండా పొడిగా చేస్తుంది. దీనివలన మీ నాసికా రంధ్రాలు పొడిబారడం, శ్వాస తీసుకోవడంలో అసౌకర్యం మరియు చర్మ సమస్యలు వస్తాయి. హీటర్లు ఉపయోగించినట్లయితే సమస్యలు మరింత పెద్దవి అవుతాయి.  హ్యుమిడిఫైర్ ను ఉపయోగించడం వలన గాలిలో తేమను నిలపడానికి సహాయపడుతుంది.

 

9. మీ చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి :

గర్భధారణ సమయంలో చర్మం పొడిగా మరియు దురదగా ఉండి అసౌకర్యంగా ఉంటుంది. మరియు గర్భధారణ సమయంలో ఎన్నో రకాల హార్మోనల్ సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి మంచి మాయిశ్చరైజర్ ను కొనుగోలు చేయండి. దానికి తగినంత ఎస్పీఎఫ్ రక్షణ కూడా ఉండేలాగా చూసుకోండి.

 

10.తక్కువ మోతాదులో ఎక్కువసార్లు భోజనం చేయండి

కదలికలు తక్కువగా ఉన్నందువలన కొన్నిసార్లు జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. గర్భధారణ సమయంలో ఉబ్బసం, వాయువు , ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా తక్కువ మోతాదులో ఎక్కువసార్లు భోజనం చేయడం మంచిది. ఆరోగ్యంగా ఉండడానికి శీతాకాలంలో దొరికే పండ్లు మరియు కాయగూరలు తీసుకోండి.

 

మీ శరీరానుసారముగా ఉండండి మరియు ఆనందించండి. శీతాకాలంలో గర్భధారణ సమయం అన్నది కష్టతరం అయినప్పటికీ సరదాగా కూడా ఉంటుంది. సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన గర్భధారణ కలిగి ఉండండి.


మాతో పంచుకోవడానికి శీతాకాలంలో తీసుకోవాల్సిన గర్భధారణ చిట్కాలు మీ దగ్గర ఉన్నాయా ? క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి. !

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}