• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
వేడుకలు మరియు పండుగలు

తప్పక చెప్పాల్సిన 5 దీపావళి కథలు

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Nov 12, 2020

 5
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

దీపావళి!!! మీ పిల్లలు దీపాలు మరియు టపాకాయల గురించి చాలా సంతోషిస్తూ ఉంటారు. స్వీట్లు,  రంగోలి మరియు బహుమతులు ఉండనే ఉంటాయి. కానీ  రోజులో ఏదో ఒక సమయంలో ఉత్సాహమైన కథలు చెప్పే కార్యక్రమం మీ పిల్లలను ఒక ప్రత్యేకమైన ఉత్సాహమైన స్థితికి తీసుకువెళ్ళతుంది! వారిలోని ఊహాశక్తిని మరియు ఉత్సాహాన్ని వెలిగించండి. ప్రారంభిద్దాం !

 

పిల్లల కోసం దీపావళి చిన్న కథలు :

మీ పిల్లలకు చెప్పడానికి ఇక్కడ కొన్ని దీపావళి కథలు ఉన్నాయి -నాటకీయ సంజ్ఞలు మరియు వాయిస్ మాడ్యులేషన్లను యానిమేట్ చేయండి. అది మరేమిటో కాదు రామలీల , మామా స్టైల్!

 

1. మనం దీపాలు ఎందుకు వెలిగిస్తాము ?

దీపావళిలో అత్యంత ప్రాచుర్యం పొందిన కథ రాముడు, సీతా మరియు లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి రావడం. బహుశా ఆ కథ వారికి ఇప్పటికే తెలుసు.. కానీ కొన్ని వివరాలను జోడించండి. దసరా దీపావళికి ఎలా భిన్నంగా ఉంటుందో మీ పిల్లలకు చెప్పండి. దసరా రాముడు రావణుడి ఓడించిన రోజు, దుష్టుడైన లంకరాజును మరియు 14 సంవత్సరాల వనవాసానికి ముగింపు సూచిస్తుంది. ఇక్కడ అది వారిని ఉత్తేజపరుస్తుంది. రాముడు సీత మరియు లక్ష్మణులు మాయా (ఎగిరే)విమానంలో ప్రయాణించారు. అదే పుష్పక విమానం! వారు తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు అది చంద్రుడు లేని రాత్రి. అందువలన రాజ్య ప్రజలు రామునికి ఇంటికి వెళ్లే మార్గాన్ని చూపించడానికి దీపాలను వెలిగించారు. మరియు దీపాలను వెలిగించి వారి రాకడకు సంబరాలు జరుపుకున్నారు.

 

2. ప్రజలు ఎందుకు జూదం ఆడుతారు ?

దీపావళి సమయంలో జూదం ఆడటం గురించి మీ స్కూల్ కి వెళ్లే పిల్లలు తెలుసుకోవాలి. జనాదరణ పొందిన నమ్మకం ఏమిటంటే లక్ష్మీదేవిని (అదృష్ట దేవత) ఇంటికి ఆహ్వానించడం అని అర్థం. ఈ నమ్మకం ఎక్కడ నుండి ప్రారంభమైంది? మీ పిల్లలకు ఈ కథ చెప్పండి: దీపావళి సందర్భంగా శివుడు మరియు పార్వతి ఇద్దరు జూదం ఆడుకుంటారని పురాణకథనం. దేవతలు దీనిని ఒక నానుడిగా మార్చడానికి దీపావళి రాత్రి ఎవరు జూదం ఆడినరాబోయే సంవత్సరంలో మంచి అదృష్టం వరిస్తుంది అని ప్రకటించారు. జూదంలో మాదిరిగానే జీవితంలో కూడా అదృష్టం మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు మీరు గెలుస్తారు మరి కొన్నిసార్లు మీరు ఓడిపోతారు. కాబట్టి జూదం జీవితంలో గెలుపు ఓటములను గురించి మనకు తెలుపుతుంది.

 

3. రావణుడికి పది తలలు ఎందుకు ఉంటాయి?

రావణుడి పది తలలు పిల్లల్లో ఉత్సాహాన్ని మరియు ఆశ్చర్యాన్ని కలిగించడంలో ఎప్పుడూ విఫలంకావు. దీని వెనుక ఉన్న కథను వారికి చెప్పండి: రావణుడు శివుని ఆరాధించాడు. శివుడు పట్ల ఆయనకున్న భక్తి చాలా ఎక్కువ. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి రావణుడు తన తలను నరికివేశాడు. కానీ తల నరుక్కున్న ప్రతిసారి తిరిగి తల రావడం మొదలైంది.రావణుడు తన తపస్సు సమయాన్ని కొనసాగించాడు. రావణుడిలోని ఈ పరిపూర్ణమైన భక్తి శివుడిని ఎంతో సంతోష పరిచింది మరియు దానికి ప్రతిగా అతడు రావణుడికి పది తలలు ఇచ్చాడు! రావణుడికి పది తలలు 4 వేదాలు మరియు 6 శాస్త్రాలకు కూడా ప్రతీక. రావణుడు నిజంగా దయ్యం కాదు అని మీ పిల్లలకు తెలియ చెప్పండి.( సీతను అపహరించినందువలన అతడు ప్రజాదరణ పొందలేక పోయాడు) ఈ లోకంలోని ఎంతోమంది జ్ఞానులలో అతను ఒక్కడు.

 

4. ఒక ఉడుత కథ :

రావణుడు సీతను అపహరించిన తరువాత భగవంతుడైన రాముడు భార్యను రక్షించడానికి ఒక ప్రణాళిక వేశాడు. రాముడు కోతులు మరియు ఎలుగుబంట్లు సైన్యంతో కలిసి భారతదేశాన్ని లంకతో కలిపే వంతెనను సముద్రం మీద తయారు చేయడం ప్రారంభించాడు. ఒక చిన్న ఉడుత కూడా దీనిలో సహాయం చేయడానికి ప్రయత్నించింది! ఉడుత తన నోటితో చిన్న గులకరాళ్ళను ఎత్తుకొని వాటిని నిర్మాణ స్థలంలో పడేసేది. ఒక కోతి దీనిని గమనించి నవ్వటం ప్రారంభించింది. తరువాత సైన్యం మొత్తం నవ్వడం ప్రారంభించారు.

ఉడుత ఏడవడం మొదలు పెట్టింది. రాముడు దూరం నుండి ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు. రాముడు ముందుకు వచ్చి ఉడుత యొక్క వెనక భాగాన్ని నిమురుతూ ఉడుత చేసిన సహాయాన్ని ప్రశంసించాడు. అప్పుడు రాముడు ఉడుత తెచ్చిన చిన్న రాళ్ళు రెండు పెద్ద రాళ్ల మధ్య ఎలా కనెక్టర్ పని చేస్తుందో సైన్యానికి చూపించాడు. వాస్తవానికి, అన్ని ఉడతల యొక్క వెనుక భాగంలో ఉన్న తెల్లని చారలు భగవంతుడైన రాముని వేలిముద్రలు అని నమ్ముతారు. మీ పిల్లలు ఈ కథను తమ స్నేహితులతో పంచుకోవడానికి కూడా ఇష్టపడతారు.

 

5. మనం హనుమంతుడిని బజరంగబలి అని ఎందుకు పిలుస్తాము?

బజరంగ్ అంటే 'నారింజ' అని అర్థం. ఒకప్పుడు అంటే చాలా కాలం క్రితం రాముడి భార్య సీత వివాహం చేసుకున్నందుకు గుర్తుగా సింధూరము పెట్టుకునేది. దగ్గరగా నిలబడి ఉన్న హనుమంతుడు సీతను అడిగాడు:" మీరు దీనిని ఎందుకు పెట్టుకుంటున్నారు?"సీత ఇలా సమాధానమిచ్చింది: " ఇది రాముని సుదీర్ఘమైన ఆరోగ్యకరమైన జీవితం కోసం". హనుమంతుడు రాముని యొక్క నిజమైన భక్తుడు కనుక అతడు ఎంతో ఉత్సాహంగా అతని శరీరం అంతా సింధూరాన్ని రాసుకున్నాడు. రాముడు హనుమంతుని చూచినప్పుడు నవ్వడం మొదలుపెట్టాడు . మరియు అతనికి బజరంగబలి అని పేరు పెట్టాడు. కాబట్టి హనుమంతుడికి భజరంగబలి  అనే పేరు వచ్చింది.

 

నీ పిల్లలకు నచ్చిన ప్రత్యేకమైన కథ ఏదైనా ఉందా? వ్యాఖ్యల విభాగంలో మీ నుండి వినడానికి మీ ఇష్టపడతాము. దీపావళి శుభాకాంక్షలు!

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన వేడుకలు మరియు పండుగలు బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}