• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్

మీ టీనేజ్ పిల్లల కోసం 5 సింపుల్ హోమ్ మేడ్ ఫేస్ మాస్కులు

Ch Swarnalatha
7 నుంచి 11 సంవత్సరాలు

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన May 28, 2022

 5

 

మీకు ఇంట్లో యుక్తవయస్సులో ఉన్న పిల్లలు ఉన్నారా?  ఐతే, వారు మెరిసే, మచ్చలేని చర్మం కలిగి ఉండటం ఎంత ముఖ్యమో మీకు తెలుసు. ఆరోగ్యకరమైన, అందమైన చర్మాన్ని కలిగి ఉండటానికి, దాని pH బ్యాలెన్స్‌ను నిర్వహించడం ఇంకా  దానికి తగిన తేమను అందించి, హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. యుక్తవయస్కులకు చక్కని  చర్మాన్నిఅందచేస్తామని హామీ ఇచ్చే అనేక  రసాయనిక సౌందర్య ఉత్పత్తులు మార్కెట్లో పుష్కలంగా ఉన్నప్పటికీ, ఈ  వాగ్దానాలు చాలా వరకు నిరాధారమైనవి.  ఐతే మరి ఎం చేయాలంటారా? మీ టీనేజర్ల  కోసం మీరు ఇంట్లో తయారుచేసుకోగల ఫేస్ మాస్క్‌లు ఇందుకు చక్కటి ప్రత్యామ్నాయం. 

మీ టీనేజ్ పిల్లలు ఏ రకమైన చర్మాన్ని కలిగి ఉన్నా, దానిపై ఎటువంటి కఠినమైన ప్రభావాలు లేకుండా వారిని తీర్చగల శక్తి  సహజ పదార్ధాలు, ఉత్పత్తులకు  ఉంటు౦ది. ఈ హోం మేడ్ ఫేస్ మాస్కులు  మీకు చాలా డబ్బు ఆదా చేయడమే కాకుండా అవి చాలావరకు మీ ఫ్రిజ్ లేదా వంటింటి లోనే  అందుబాటులో ఉంటాయి. యుక్తవయస్కులకు వచ్చే రకరకాల చర్మ సమస్యలకుచెక్ పెట్టగల ఉత్తమమైన DIY  మాస్క్‌ల జాబితా, తయారీ విధానం ఇక్కడ ఉంది. ఇంకెందుకాలస్యం.. కొద్ది నిముషాల్లోనే చేసుకోగలిగిన ఈ నేచురల్ మాస్కులను ఇపుడే చేసి చూద్దాం పదండి...

1. సింపుల్ స్ట్రాబెర్రీ ఫేస్ మాస్క్:

ఈ స్ట్రాబెర్రీ మాస్క్ అనేక కారణాల వల్ల అత్యుత్తమం అని చెప్పవచ్చు.  ఇది అన్ని చర్మ రకాలకు సరిపోతుంది, ఇంకా చర్మం మరియు చర్మ రంధ్రాలను సహజంగా శుభ్రపరుస్తుంది. చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. మృత  చర్మ కణాలను తొలగించడం ద్వారా డల్ స్కిన్‌ను ప్రకాశవంతం చేస్తుంది. ఇక, దీన్ని ఎలా తయారు చేయవచ్చో ఈ కింద చూడండి:

కావాల్సిన పదార్ధాలు:

  • ¼ కప్ స్ట్రాబెర్రీల గుజ్జు

  • 1 టేబుల్ స్పూన్ బియ్యం పొడి

  • 3 టేబుల్ స్పూన్లు పెరుగు

ఇలా చేయండి: మిక్సింగ్ బౌల్ లో అన్ని పదార్థాలను కలిపి నేరుగా ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాలు అలాగే ఉండనివ్వండి, ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

2. సులభమైన బేకింగ్ సోడా మాస్క్:

అందరు యువత చేసే  ఒక సాధారణ ఫిర్యాదు-మొటిమలు.  రసాయన ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. ఈ పరిస్థితిలో  ఈ బేకింగ్ సోడా మాస్క్ మిమ్మల్ని ఆదుకుంటుంది. ఇది మొటిమలను సమర్థవంతంగా తగ్గిస్తుంది.. అదే సమయంలో, ఇతర మొటిమల నిరోధక ఉత్పత్తుల లాగా కాకుండా మీ చర్మానికి ఏ హాని కలిగించదు. కాకుండా ఒకేఒక పదార్ధంతో, అదికూడా మనం ఇంట్లో వాడేదానితో మనం కేవలం రెండే రెండు నిముషాల్లో తయారుచేసుకోవచ్చు. ఈ ఫేస్ మాస్క్‌ని రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల మీరు మొటిమలను వదిలించుకోవచ్చు.

కావాల్సిన పదార్ధాలు:

  • బేకింగ్ సోడా కొన్ని టేబుల్ స్పూన్లు

  • శుద్ధమైన నీరు

ఇలా చేయండి: బేకింగ్ సోడా మరియు నీటిని కలిపి ఒక సాధారణ మిశ్రమాన్ని సృష్టించండి. ఇపుడు దానిని ముఖానికి అప్లై చేసి, 20 నిమిషాల పాటు వదిలివేయండి. నీటితో శుభ్రం చేయు మరియు పొడిగా ఉంచండి.

3. అవకాడో మ్యాంగో ఫేస్ మాస్క్:

ఆలివ్ ఆయిల్, అవకాడో మరియు మామిడి లోని మంచి లక్షణాలతో సమృద్ధమైన ఈ ఫేస్ మాస్క్ చర్మానికి చాలామాన్ సొగసును కలిగిస్తుంది. ఆలివ్ ఆయిల్ చర్మ పోషణ మరియు హైడ్రేట్ చేస్తుంది, మృదుత్వాన్ని ఇస్తుంది. ఇక  అవోకాడో సున్నితమైన చర్మానికి సరైనది.  ఇది మంటను తగ్గించే సామర్థ్యాన్ని కలిగిఉంటుంది. ఒక్క చిటికెలో దీన్ని చేయడ౦ ఎలాగో ఇపుడు తెలుసుకోండి. 

కావాల్సిన పదార్ధాలు:

2 టేబుల్ స్పూన్లు తేనె

2 టేబుల్ స్పూన్లు అవోకాడో

2 టేబుల్ స్పూన్లు ఆలివ్ నూనె

1 మామిడి పండు గుజ్జు

ఇలా చేయండి: ఒక గిన్నెలో పై నాలుగు పదార్థాలను బాగా మిక్స్ అయ్యేవరకు కలపండి. దీన్ని మీ ముఖంపై అప్లై చేయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై శుభ్రం చేసుకోండి.

4. రిఫ్రెష్ బనానా ఫేస్ మాస్క్:

ఈ అరటిపండు ఫేస్ మాస్క్ తయారు చేయడం ఎంత సులభమో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.  దీనిలో మనం వాడే తేనె శక్తివంతమైన యాంటీమైక్రోబయల్ ఏజెంట్ అని తెలిసిందే. ఇంకా ఇది  చర్మంపై బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తుంది, తద్వారా అనేక చర్మ సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ ఉంది:

కావాల్సిన పదార్ధాలు:

1 పండిన అరటి పండు

ఒక నారింజ/నిమ్మకాయ రసం

1 టేబుల్ స్పూన్ తేనె

ఇలా చేయండి: మిక్సింగ్ బౌల్ లో , తేనె మరియు అరటిపండును కలిపి, ఆపై కొన్ని చుక్కల నిమ్మ/నారింజ రసం వేసి బాగా కలపండి. ఈ ఫేస్ మాస్క్‌ని ముఖానికి  అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

5. సహజమైన బ్లాక్ హెడ్ ఫేస్ మాస్క్:

మొటిమల తర్వాత టీనేజ్‌ పిల్లలకి అత్యంత  ఆందోళన కలిగించే రెండవ కారణం బ్లాక్‌హెడ్స్.  మరి వాటిని నివారించడం కేవలం రెండు ఇంట్లో ఉందీ అతి మామూలు పదార్ధాలతో సాధ్యం అంటే మీరు నమ్మలేరు కదా. నిజానికి వాటిని పరిష్కరించడం కష్టం కాదు. ఈజీ ఇంకా ప్రభావవంతమైన  ఈ బ్లాక్ హెడ్ ఫేస్ మాస్క్, సమస్యను అదుపులోకి తెస్తుంది..

కావాల్సిన పదార్ధాలు:

  • నిమ్మరసం కొన్ని చుక్కలు

  • 1 టేబుల్ స్పూన్ చక్కెర

ఇలా చేయండి: పై  రెండు పదార్థాలను కలిపి ముఖంపై అప్లై చేసి, బ్లాక్‌హెడ్స్‌ను  మెత్తగా మసాజ్ చేయండి. మాస్క్  పొడిగా అయేదాకా  ఉండనివ్వండి. ఆ  తరువాత నీటితో శుభ్రం చేసుకోండి.

టీనేజ్ స్కిన్ కోసం  ఇంట్లో ఫేస్ మాస్క్‌లను తయారు చేయడం నిజంగా కష్టం కాదు. ఇందుకు మీరు మీ టీనేజ్‌ పిల్లలను  కూడా  మీతో కలుపుకోవచ్చు. ఈ ఫేస్ మాస్క్‌లు సహజమైన ఆహారాన్ని ఉపయోగిస్తాయి, ఇవి మీ పిల్లల  టీనేజ్ చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. ఉత్తమ ఫలితాల కోసం ఇంట్లో తయారుచేసిన ఈ మాస్క్‌లను ప్రయత్నించడంతోపాటు మీ టీనేజ్ పిల్లలు మంచి ఆహారం మరియు పుష్కలంగా నీరు త్రాగాలని నిర్ధారించుకోండి. అవి పండ్లు, పెరుగు మరియు తేనె వంటి సహజమైన, సురక్షితమైన పదార్థాలతో తయారు చేయబడ్డాయి. కాబట్టి,  ఇప్పుడే  చేసిచూడ౦డి!

ఈ చిట్కాలు మీకు నచ్చాయా? అయిమీ అభిప్రాయాన్ని తెపియచేయండి. మీకు మరిన్ని తెలుసా? ఇక్కడే, ఐపుడే మీ తోటివారితో షేర్ చేసుకోండి...

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}