• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఫుడ్ అండ్ న్యూట్రిషన్

మీ పిల్లల కోసం 5 చల్లని వేసవి పానీయాల తయారీ విధానాలు

Aparna Reddy
3 నుంచి 7 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన May 22, 2020

 5
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

పిల్లలు ఎప్పుడూ రుచికరమైన మరియు తీపి పదార్థాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. పెరిగిపోతున్న వేడి కారణంగా మీ పిల్లలు చల్లని ఐస్ క్రీమ్ లు మరియు స్క్వాష్ ల కోసం పరిగెడుతూ ఉంటారు. వేసవిలో కూడా మీ చిన్నారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వాలి అని మీరు ఎలా నిర్ధారించుకోవాలి ? వేసవిలో ఇవ్వదగ్గ చల్లని పానీయాలు మీ ముందుకు తీసుకువస్తునము. ఇవి మీ పిల్లలను  చల్లగా , సంతోషంగా ఉంచుతాయి. తక్కువ కేలరీలు మరియు ఎక్కువ పోషకాలతో ఉన్న ఈ వంటకాలు మీ పిల్లల హృదయాలను గెలుచుకుంటాయి. తయారు చేయడానికి సిద్ధంగా ఉండండి..

 

చల్లని వేసవి పానీయాల వద్దకు వద్దాం...

 

1 . పుచ్చకాయ య మరియు నిమ్మకాయ జ్యూస్ :

 

కావలసిన పదార్థాలు :

 

పుచ్చకాయ ముక్కలు... రెండు కప్పులు

 

నిమ్మరసం... ఒక టేబుల్ స్పూన్

 

తురిమిన నిమ్మకాయ ముక్కలు (నచ్చితే)

 

తేనె... ఒక స్పూన్

 

కల్లుప్పు... చిటికెడు

 

తరిగిన పుదీనా ఆకులు.... కొన్ని.

 

తయారీ విధానం :

 

పుచ్చకాయను కట్ చేసి చిన్న ముక్కలుగా కోసుకోండి. అందులో గింజలను తొలగించి ఒక గంట సేపు ఫ్రిజ్లో ఉంచండి. ఇప్పుడు బ్లెండర్ లో కానీ మిక్సీ జార్ లో కానీ పుచ్చకాయ ముక్కలు ,నిమ్మరసం ,తేనె, ఉప్పు మరియు పుదీనా ఆకులు (నచ్చితే నిమ్మకాయ తురుము) వేసి  మెత్తగా గ్రైండ్ చేసుకొండి. మరియు గ్లాసు లోకి వంపు కోండి.బాగా చిక్కగా ఉన్నట్లయితే కొంచెం నీటిని కలుపుకోండి.

 

2.పీచి ఆరెంజ్ స్క్వాష్ :

 

దీనికి కావలసిన పదార్థాలు :

 

తాజా ఆరెంజ్ జ్యూస్.... ఒక కప్పు

 

తాజాగా కట్ చేసిన ఆరెంజ్ తొనలు.1 కప్పు

 

తరిగిన ఆపిల్ ముక్కలు.. ఒక కప్పు

 

ఐస్ క్యూబ్స్.... రెండు లేదా మూడు.

 

తయారీ విధానం :

 

బ్లెండర్ లో కానీ జ్యూస్ జార్లో కానీ పై పదార్థాలన్నింటిని వేసి బాగా గ్రైండ్ చేయండి. ఐస్ క్యూబ్స్ వాడడం ఇష్టం లేనట్లయితే ఒక గ్లాస్ చల్లని ఆరెంజ్ రసాన్ని కలపండి. చల్లగా వడ్డించండి. జ్యూస్ కి వాడవలసిన పండ్లను ఫ్రిడ్జ్ లో నిల్వ చేయండి.

 

3. ద్రాక్ష పండ్లు మరియు పైనాపిల్ జ్యూస్ :

 

కావలసిన పదార్థాలు :

 

ద్రాక్షపండ్లు ...రెండు కప్పులు

 

పైనాపిల్ ముక్కలు ...రెండు కప్పులు

 

లెమన్ జ్యూస్... ఒక టేబుల్ స్పూన్

 

కల్లుప్పు ... హాఫ్ టీ స్పూన్

 

బ్రౌన్ షుగర్ ... ఒక టేబుల్ స్పూన్

 

తయారీ విధానం :

 

ముందుగా ద్రాక్షపండ్లను శుభ్రంగా కడిగి తొక్కలను ,గింజలను తొలగించి ఉంచుకోండి. ద్రాక్షలో మిగిలిన అన్ని పదార్థాలను కలిపి మెత్తగా గ్రైండ్ చేసి 20 లేదా 30 నిమిషాల పాటు ఫ్రిజ్ లో ఉంచి చల్లగా సర్వ్ చేయండి.

 

4. చల్లని కర్బూజ జ్యూస్ :

 

కావలసిన పదార్థాలు :

 

పరిగి ముక్కలు చేసిన కర్బూజ...ఒకటి

 

నారింజ రసం... ఒక కప్పు

 

తేనె... ఒక్క స్పూన్

 

నిమ్మరసం ...ఒక స్పూన్

 

అల్లం రసం ..ఒక్క స్పూన్

 

కల్లుప్పు... రుచికి సరిపడా.

 

తయారీ విధానం :

 

ముందుగా కర్బూజ ను శుభ్రం చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఆ తరువాత మిగతా పదార్థాలు అన్నింటిని అందులో కలిపి బ్లండర్ లో గాని జ్యూస్ జార్లో గాని వేసి గ్రైండ్ చేసుకొండి. కావాలనుకుంటే అందులో రెండు లేదా మూడు ఐస్ ముక్కలను వేసుకోండి. దీనిని వడ కట్టకుండా తాగినట్లయితే  స్క్వాష్ లాగా రుచిగా ఉంటుంది.

 

5.పాన్  షాట్స్ :

 

కావలసిన పదార్థాలు :

 

తమలపాకులు... 6

 

గుల్ కండ్..(గులాబీ రేకుల జామ్) 2 టేబుల్ స్పూన్లు.

 

సోంపు...1 స్పూన్

 

పాలు .. 1/2 కప్పు

 

చల్లని నీళ్లు.... 1/2  కప్పు

 

ఇలాచీ పొడి ...1/2  టీ స్పూన్

 

దంచిన వక్కపొడి .. 1/2  టీ స్పూన్

 

తయారీ విధానం :

 

పై పదార్థాలన్నింటిని మెత్తగా మిక్సీ వేసుకోండి .ఇది బాగా మెత్తగా ఉండేలాగా చూసుకోండి .ఈ మిశ్రమాన్ని వడకట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. చల్లగా గ్లాస్ లో పోసి వడ్డించండి.

 

హ్యాపీ సమ్మర్ !!


నీ చల్లని వేసవి వంటకాలను మీరు నచ్చాయా ? తోటి తల్లిదండ్రులతో పంచుకోవాల్సిన వంటకాలు మీ దగ్గర ఉన్నాయా ? దయచేసి ఈ క్రింద విభాగంలో మాతో పంచుకోండి. మేము మీ నుండి వినడానికి ఇష్టపడతాము.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • 1
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.

| Jun 23, 2020

My baby 10 months. how to increase weight

  • Reply
  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}