5 చిట్కాలు : నవజాత శిశువుల దంత సంరక్షణ కొరకు

Aparna Reddy సృష్టికర్త నవీకరించబడిన Jul 03, 2020

శిశువు యొక్క నోటి ఆరోగ్య సంరక్షణ గర్భధారణ సమయం నుండి మొదలవుతుంది . ఎందుకంటే గర్భధారణ సమయంలో శిశువుకి పాల పళ్ళు రావడం మొదలవుతుంది. కనుక గర్భిణీ స్త్రీలు పాల దంతాలు సరిగ్గా ఏర్పడేందుకు అవసరమైన కాల్షియం కలిగిన ,ఆరోగ్యకరమైన ,సమతుల ఆహారం తీసుకోవడం చాలా అవసరం.
1. చిగుళ్లను శుభ్రపరచడం పుట్టిన వెంటనే ప్రారంభం కావాలి :
చిగుళ్లను శుభ్రమైన బట్టతో కానీ ,లేదా గాజు గుడ్డను చుట్టిన వేలితో గానీ శుభ్రపరచాలి. చిగుళ్ళు ,నాలుక ,బుగ్గల యొక్క లోపలి భాగాలను శుభ్రం చేయాలి. దీనికి కొంత ఓపిక అవసరం కావచ్చు . చిగుళ్లను పగటిపూట ఎప్పుడైనా శుభ్రం చేయవచ్చు .కానీ పాలు తాగిన వెంటనే చేస్తే మంచిది .కానీ దంతాలు రావడం మొదలైన తర్వాత మాత్రం వేలిని బ్రష్‌లాగా ఉపయోగించి శుభ్రం చేయాలి.
పిల్లలకు తమ మొదటి దంతాలు 4 నుండి 7 నెలల మధ్యలో మొలకెత్తుతాయి . ఈ దంతాల ప్రక్రియ సమయంలో చిగుళ్ళ నొప్పి, చిరాకు ,లాలాజలం తగ్గడం లాంటివి సంభవించవచ్చు . చిగుళ్లను వేళ్లతో మసాజ్ చేయడం , చిగుళ్ల మొదళ్లను శుభ్రంగా ఉంచడం, వలయాకారంలో శుభ్ర పరచడం ద్వారా వీటిని తగ్గించవచ్చు . శిశువులకు నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే నొప్పిని తగ్గించే జెల్ ను కూడా వాడవచ్చు . కొన్నిసార్లు రక్తం పేరుకుపోయి నీలిరంగు లేదా వాపు కలిగి ఉంటుంది . కొన్నిసార్లు దంతాలపై ద్రవం లేదా రక్తం కూడా రావచ్చు . తరచుగా మసాజ్ చేయడం ఈ సమస్యను పరిష్కరించడానికి సహాయపడుతుంది.
3. నాటల్ పళ్ళు :
కొన్నిసార్లు పిల్లలు పుట్టుకతోనే దంతాలు కలిగి ఉంటారు .వాటిని నాటెల్ పళ్ళు అంటారు. ఆ దంతాలు సరిగ్గా ఏర్పడనట్లయితే , వాటిని తొలగించ వలసిన అవసరం ఉంటుంది . దంతాలు బాగా ఏర్పడినట్లయితే తొలగించవలసిన అవసరం లేదు . ఎందుకంటే అవి ముందుగానే బయటకు వచ్చిన పాల పండ్లు . వాటి రూట్ పొడవు తక్కువగా ఉండటం వలన కదిలినట్లు గా అనిపించవచ్చు . కానీ ,రోజులు గడిచే కొద్దీ వాటి నిర్మాణం గట్టిపడుతుంది. అవి కదలడం ఆగి గట్టిపడతాయి. ఆ కదలికను గమనించేందుకు క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉండాలి. అవి చిగుర్లకు గట్టిగా అతుక్కొని ఉండ నట్లయితే వాటిని తొలగించవలసిన అవసరం ఉంటుంది.
4. పంటి కావిటీస్ :
నోటిలో దంతాలు ప్రక్రియ మొదలైన వెంటనే ఈ దంతాల కావిటీస్ అనేవి శిశువులపై ప్రభావితం చేస్తాయి .ఈ రకమైన కావిటీస్ ను చిన్న నాటి క్షయం అని పిలుస్తారు . ఇవి వేగంగా అభివృద్ధి చెంది దంతాలకు హాని కరం గా మారుతాయి. నోటిలో ఉండే స్ట్రెప్టోకాకస్ మ్యూటన్స్ అనే బ్యాక్టీరియా కారణంగా ఈ కావిటీస్ కలుగుతాయి. ఈ బ్యాక్టీరియా తల్లి నుండి బిడ్డకు సంక్రమించవచ్చు. (తల్లిలో స్ట్రెపటోకోకస్ మ్యూటన్స్ స్థాయిలు ,నోటి పరిశుభ్రత ,చిగుళ్ల ఆరోగ్యం మరియు నోటి చికిత్స చేయని కావిటీస్ సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.) నవజాత శిశువులలో కావిటీస్ తగ్గించేందుకు తల్లి మరియు ఇతర కుటుంబ సభ్యులు మంచి నోటి ఆరోగ్యం మరియు నోటి పరిశుభ్రతను పాటించ వలసిన అవసరం ఉంటుంది.
5. పాలు పట్టే విధానాలు :
తల్లి పాలు ఇవ్వడానికి కావిటీస్ కు నేరుగా సంబంధం లేనప్పటికీ , ఎనామిల్ లోపాలు, పిల్లలలో నోటి పరిశుభ్రత వంటి ఇతర అంశాలు కారణం కావచ్చు . మరో కారణం, ఫార్ములా పాలు తాగే పిల్లలకు బాటిల్ తో తాగడం వలన , అది కూడా కచ్చితంగా దంతక్షయానికి ముడిపడి ఉంటుంది. చిన్ననాటి దంత క్షయాలను నివారించేందుకు ఒక సంవత్సరం తర్వాత, తల్లి పాలను గాని, బోటిల్ పాలను కానీ రాత్రిపూట ఇవ్వడం మంచిది కాదు అని సిఫార్సు చేయబడింది. ఒక సంవత్సరానికి ముందుగానే పళ్ళ ప్రక్రియ ప్రారంభం అయినట్లయితే ,రాత్రిపూట ఆహారం ఇచ్చిన వెంటనే పళ్లను శుభ్రపరచి నట్లయితే కావిటీస్ రాకుండా నివారించవచ్చు.
ఈ బ్లాగ్ మీకు నచ్చిందా ? దయచేసి ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి. మీ అభిప్రాయాలు తెలుసుకోవడం మాకెంతో సంతోషం.
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు