• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్

చిన్న వయసులో పిల్లలకు నేర్పాల్సిన 6 ఉన్నతమైన అలవాట్లు

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన May 07, 2020

 6
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. నాన్నమ్మ ,అమ్మమ్మ ,తాతయ్య ,పిన్ని, బాబాయ్ ,అత్త ,మామయ్య అందరూ కలిసి జీవించే వారు. పెద్దలు ,నానమ్మలు, అమ్మమ్మలు పిల్లలకు ఏ పాఠశాలలోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ నేర్పని కొన్ని పద్ధతులను, విధానాలను నేర్పేవారు. వారి జీవితానుభవాలు పెద్దబాలశిక్ష లు ,సుమతి శతకాలు, వేమన శతకాలలోని సారాంశాలను పిల్లలకు నేర్పించేవారు. ఇప్పుడు ఆ బాధ్యత పూర్తిగా తల్లిదండ్రుల మీదనే పడిపోయింది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఉమ్మడి కుటుంబాలు అంతరించి పోయాయి. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడింది. సౌకర్యవంతమైన జీవితం గడపాలి అంటే ఇద్దరూ ఉద్యోగాలు చేయక తప్పటం లేదు పిల్లలను డే కేర్ సెంటర్ లకు పరిమితం చేయవలసి వస్తుంది .పిల్లలతో గడిపే సమయం తక్కువ అయిపోయింది. తల్లిదండ్రులలో ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది .ఆ కారణంగా పిల్లలు అడిగిన ప్రతిది వారికి కొంటున్నారు .పిల్లలు అడిగినవన్నీ కొనడంతో పిల్లలకు న్యాయం చేసినట్లు కాదు .పిల్లలు వారి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఈ వాస్తవికమైన విషయాలు పిల్లలకు తల్లిదండ్రులు తప్పక నేర్పాలి .అవేమిటో ఇక్కడ చూడండి. చిన్న వయసులో తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాల్సిన 6 అలవాట్లు : 1. సంస్కారం: సంస్కారం అనేది పిల్లలకు కచ్చితంగా ఇంట్లో నుండి మొదలు కావాలి .ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చిన వెంటనే ఒకసారి మర్యాదగా పలకరించడం, మనకంటే తక్కువ వారిని, మన ఇంటికివచ్చే పని వారిని గౌరవించడం నేర్పించాలి .మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వారికి చెప్పే ముందు దానిని తల్లిదండ్రులైన మీరు ఆచరించాలి .అప్పుడు మాత్రమే పిల్లలు దాన్ని నిజాయితీగా ఆచరించగలరు. 2. ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టడం :(స్పేస్ మేనేజ్మెంట్) ఎక్కువ మంది తల్లులు పిల్లల విషయంలో విసుగు చెందేది వారి వస్తువులను సర్దడం మరియు చిందరవందరగా పడేసిన ఆటవస్తువులను బొమ్మలను సెట్ చేసే విషయంలోనే.అందుకే తల్లులు వారి చిన్నారులకు అది కష్టం అనుకోకుండా చిన్న వయసులోనే ఎక్కడ నుండి తీసిన వస్తువులను అక్కడ వారితోనే పెట్టించడం అలవాటు చేసినట్లయితే తల్లులకు పని తగ్గడం మాత్రమే కాదు , ఆ క్రమశిక్షణ అన్నది వారి జీవితాంతం ఉపయోగపడుతుంది. కానీ తల్లులు దీనిని కొంచెం ఓపిక తో ప్రణాళికాబద్ధంగా పిల్లలకు అలవాటు చేయాలి. 3. ఆర్థిక విషయాలలో శిక్షణ : తల్లిదండ్రులకు పిల్లలు అడిగినవిి అన్ని కొనడం మాత్రమే పిల్లలకు న్యాయం చేయటం కాదు .కొందరు పేరెంట్సు పిల్లలు ఏది అడిగితే అది ఎంత కష్టం అయినా సరే కొనాలి అనుకుంటారు .అలా చేసినట్లయితే పిల్లలు కొంచెం పెద్దగా అయ్యే సరికి వారి కోరికలు అపరిమితంగా పెరుగుతాయి. అప్పుడు మీరు కొన లేనట్లయితే చాలా అసంతృప్తికి గురి అవుతారు . చిన్న వయస్సు నుండే వారికి ఏది అవసరమో అది మాత్రమే కొనడం అలవాటు చేయాలి. కొంచెం అర్థం చేసుకునే వయసు వచ్చాక మీ ఆర్థిక స్థితిగతులను పిల్లలకు తెలియజేయడం ఎంతో అవసరం. అలా చేసినట్లయితే పిల్లలకు జీవితాంతం ఎప్పుడు ఆర్థిక సమస్యలు అన్నవి తలెత్తవు. ముందుచూపుతో జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడానికి ఇది వారికి ఎంతో ఉపయోగపడుతుంది. 4. వారి సొంత పనులు వారు చేసుకోవడం అలవాటు చేయాలి : కొంతమంది పిల్లలు తాము తిన్న ప్లేటును అలాగే వదిలేసి వెళ్లిపోతారు. దానికి తోడు ప్లేట్ చుట్టూత తాము తిన్న ఆహార పదార్థాలను చిందరవందరగా వేస్తారు .అది చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది .కొంచెం ప్లేటు తీయగలిగే వయస్సు వచ్చాక ఎవరి ప్లేట్లు వారు తీసి కడిగి పెట్టడం అన్నది కచ్చితంగా తల్లులు నేర్పాలి .అదేవిధంగా వారి పడకలు వారే సరిచేసుకోవడం మరియు వారి దుప్పట్లు వాళ్ళు మడిచి పెట్టుకోవడం అన్నది నేర్పాలి. ఇది వినడానికి చిన్నగా అనిపించినప్పటికీ వారిని చాలా ఉన్నతమైన వ్యక్తులు గా నిలుపుతాయి. అదే సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత అన్నది పిల్లలకు శ్రద్ధగా దగ్గరుండి నేర్పించాలి. ఒక్కసారి మీరు వారికి వీటిని నేర్పినట్లు అయితే వారి జీవితాంతం వారిని సంస్కారవంతులుగా నిలుపుతాయి. 5.ఇతరులతో తమ వస్తువులను పంచుకోవటం చిన్నతనంలోనే అలవాటు చేయాలి : చిన్న వయసులోనే షేరింగ్ అన్నది అలవాటు చేసినట్లయితే ఇంట్లో సహోదరీ, సహోదరులు తో మొదలై వారిని మంచి వ్యక్తులుగా నిలిపేందుకు సహాయపడుతుంది. కానీ ఇది మీరు చెప్పినంత మాత్రాన ఉపయోగం ఉండదు. మీరు మీ నైబర్స్ విషయంలోనూ ఎవరైనా అవసరంలో ఉన్న వారి విషయంలోనూ ,మీ బంధువుల విషయంలోనూ శ్రద్ధ చూపించి నట్లయితే మరియు అవసరంలో ఉన్న వారిని ఆదుకునే అలవాటు ఉన్నట్లయితే వారికి కూడా అదే అలవాటు అవుతుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి . షేరింగ్ అనేది అపాత్రదానంలా కాకుండా చూసుకోవాలి. 6. మాట మీద నిలబడటం :(ప్రామిస్ మేనేజ్మెంట్) ఈ మాట మీద నిలబడటం అన్నది మీ పిల్లలను సమాజంలో ఎంతో గౌరవాన్ని తెస్తుంది .పిల్లలు నమ్మకస్తులుగా ఉన్నట్లయితే వారికి ఆ మాట నిలబెట్టుకోవడం అన్నది ఉన్నతమైన స్థానాన్ని ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది .అది ఇంట్లోనే చిన్న చిన్న విషయాల తోనే మొదలు కావాలి. ఉదాహరణకు చదువుకునేందుకు మొదలు పెట్టడం దగ్గర నుండి ఆటల నుండి తిరిగి రావడం లాంటి చిన్న చిన్న విషయాల వరఱకూ మాట మీద నిలబడటం అన్నది అలవాటు చేయాలి .ప్రతి దశలోనూ వారికి అది అలవాటుగా మారి పోవాలి. పెద్దవారయ్యాక వారిని ఎవ్వరూ దాని నుండి తొలగించలేరు.ఇక్కడ తల్లిదండ్రులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి .పిల్లలు ఎక్కడ ఫాల్స్ ప్రామిస్ చేయకుండా గమనిస్తూ ఉండాలి .ప్రారంభ దశలో వారిని గమనిస్తూ ,సరిచేస్తూ ఉన్నట్లయితే వారిని దాని నుండి ఎవరూ తొలగించ లేరు. ఏది ఏమైనా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నతమైన స్థితిలో చూడాలనుకుంటారు .వారిని ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి అనుకుంటారు . వారికి మంచి మంచి బహుమతులు ఇవ్వాలి అనుకుంటారు .కానీ మీ చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు మీరు ఇచ్చే బహుమతులకంటే మీరు వారితో కలిసి గడిపే సమయమే వారికి ఎంతో సంతృప్తిని ఇస్తుంది అని మరచిపోకండి . ఈ 6 కూడా పిల్లలకు నేర్పించడానికి మీరు కొంత ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసి ఉంటుంది. కచ్చితంగా తల్లిదండ్రులిద్దరూ ప్రణాళికాబద్ధంగా మీ పిల్లలను వాటిని అలవాటు చేసినట్లయితే ఆ తరువాత వాటి నుండి వచ్చే ఫలితం మాత్రం చాలా చాలా విలువైనదిగా ఉంటుంది .దాని ఖరీదు ఏమిటంటే మీ పిల్లల ఉజ్వలమైన నిండు జీవితం. ఈ ఆర్టికల్ మీకు ,మీ పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నారా ? దయచేసి మీ విలువైన అభిప్రాయాలను ఈ క్రింది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. చిన్న వయసులో పిల్లలకు నేర్పాల్సిన 6 ఉన్నతమైన అలవాట్లు ... ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. నాన్నమ్మ ,అమ్మమ్మ ,తాతయ్య ,పిన్ని, బాబాయ్ ,అత్త ,మామయ్య అందరూ కలిసి జీవించే వారు. పెద్దలు ,నానమ్మలు, అమ్మమ్మలు పిల్లలకు ఏ పాఠశాలలోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ నేర్పని కొన్ని పద్ధతులను, విధానాలను నేర్పేవారు. వారి జీవితానుభవాలు పెద్దబాలశిక్ష లు ,సుమతి శతకాలు, వేమన శతకాలలోని సారాంశాలను పిల్లలకు నేర్పించేవారు. ఇప్పుడు ఆ బాధ్యత పూర్తిగా తల్లిదండ్రుల మీదనే పడిపోయింది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఉమ్మడి కుటుంబాలు అంతరించి పోయాయి. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సౌకర్యవంతమైన జీవితం గడపాలి అంటే ఇద్దరూ ఉద్యోగాలు చేయక తప్పటం లేదు పిల్లలను డే కేర్ సెంటర్ లకు పరిమితం చేయవలసి వస్తుంది .పిల్లలతో గడిపే సమయం తక్కువ అయిపోయింది. తల్లిదండ్రులలో ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది .ఆ కారణంగా పిల్లలు అడిగిన ప్రతిదీ వారికి కొంటున్నారు .పిల్లలు అడిగినవన్నీ కొనడంతో పిల్లలకు న్యాయం చేసినట్లు కాదు .పిల్లలు వారి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఈ వాస్తవికమైన విషయాలు పిల్లలకు తల్లిదండ్రులు తప్పక నేర్పాలి .అవేమిటో ఇక్కడ చూడండి. చిన్న వయసులో తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాల్సిన 6 అలవాట్లు : 1. సంస్కారం: సంస్కారం అనేది పిల్లలకు కచ్చితంగా ఇంట్లో నుండి మొదలు కావాలి .ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చిన వెంటనే ఒకసారి మర్యాదగా పలకరించడం, మనకంటే తక్కువ వారిని, మన ఇంటికివచ్చే పని వారిని గౌరవించడం నేర్పించాలి .మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వారికి చెప్పే ముందు దానిని తల్లిదండ్రులైన మీరు ఆచరించాలి .అప్పుడు మాత్రమే పిల్లలు దాన్ని నిజాయితీగా ఆచరించ గలరు. 2. ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టడం :(స్పేస్ మేనేజ్మెంట్) ఎక్కువ మంది తల్లులు పిల్లల విషయంలో విసుగు చెందేది వారి వస్తువులను సర్దడం మరియు చిందరవందరగా పడేసిన ఆటవస్తువులను బొమ్మలను సెట్ చేసే విషయంలోనే.అందుకే తల్లులు వారి చిన్నారులకు అది కష్టం అనుకోకుండా చిన్న వయసులోనే ఎక్కడ నుండి తీసిన వస్తువులను అక్కడ వారితోనే పెట్టించడం అలవాటు చేసినట్లయితే తల్లులకు పని తగ్గడం మాత్రమే కాదు , ఆ క్రమశిక్షణ అన్నది వారి జీవితాంతం ఉపయోగపడుతుంది. కానీ తల్లులు దీనిని కొంచెం ఓపిక తో ప్రణాళికాబద్ధంగా పిల్లలకు అలవాటు చేయాలి. 3. ఆర్థిక విషయాలలో శిక్షణ : తల్లిదండ్రులకు పిల్లలు అడిగినవిి అన్ని కొనడం మాత్రమే పిల్లలకు న్యాయం చేయటం కాదు .కొందరు పేరెంట్సు పిల్లలు ఏది అడిగితే అది ఎంత కష్టం అయినా సరే కొనాలి అనుకుంటారు .అలా చేసినట్లయితే పిల్లలు కొంచెం పెద్దగా అయ్యే సరికి వారి కోరికలు అపరిమితంగా పెరుగుతాయి. అప్పుడు మీరు కొన లేనట్లయితే చాలా అసంతృప్తికి గురి అవుతారు . చిన్న వయస్సు నుండే వారికి ఏది అవసరమో అది మాత్రమే కొనడం అలవాటు చేయాలి. కొంచెం అర్థం చేసుకునే వయసు వచ్చాక మీ ఆర్థిక స్థితిగతులను పిల్లలకు తెలియజేయడం ఎంతో అవసరం. అలా చేసినట్లయితే పిల్లలకు జీవితాంతం ఎప్పుడు ఆర్థిక సమస్యలు అన్నవి తలెత్తవు. ముందుచూపుతో జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడానికి ఇది వారికి ఎంతో ఉపయోగపడుతుంది. 4. వారి సొంత పనులు వారు చేసుకోవడం అలవాటు చేయాలి : కొంతమంది పిల్లలు తాము తిన్న ప్లేటును అలాగే వదిలేసి వెళ్లిపోతారు. దానికి తోడు ప్లేట్ చుట్టూత తాము తిన్న ఆహార పదార్థాలను చిందరవందరగా వేస్తారు .అది చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది .కొంచెం ప్లేటు తీయగలిగే వయస్సు వచ్చాక ఎవరి ప్లేట్లు వారు తీసి కడిగి పెట్టడం అన్నది కచ్చితంగా తల్లులు నేర్పాలి .అదేవిధంగా వారి పడకలు వారే సరిచేసుకోవడం మరియు వారి దుప్పట్లు వాళ్ళు మడిచి పెట్టుకోవడం అన్నది నేర్పాలి. ఇది వినడానికి చిన్నగా అనిపించినప్పటికీ వారిని చాలా ఉన్నతమైన వ్యక్తులు గా నిలుపుతాయి. అదే సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత అన్నది పిల్లలకు శ్రద్ధగా దగ్గరుండి నేర్పించాలి. ఒక్కసారి మీరు వారికి వీటిని నేర్పినట్లు అయితే వారి జీవితాంతం వారిని సంస్కారవంతులుగా నిలుపుతాయి. 5.ఇతరులతో తమ వస్తువులను పంచుకోవటం చిన్నతనంలోనే అలవాటు చేయాలి : చిన్న వయసులోనే షేరింగ్ అన్నది అలవాటు చేసినట్లయితే ఇంట్లో సహోదరీ, సహోదరులు తో మొదలై వారిని మంచి వ్యక్తులుగా నిలిపేందుకు సహాయపడుతుంది. కానీ ఇది మీరు చెప్పినంత మాత్రాన ఉపయోగం ఉండదు. మీరు మీ నైబర్స్ విషయంలోనూ ఎవరైనా అవసరంలో ఉన్న వారి విషయంలోనూ ,మీ బంధువుల విషయంలోనూ శ్రద్ధ చూపించి నట్లయితే మరియు అవసరంలో ఉన్న వారిని ఆదుకునే అలవాటు ఉన్నట్లయితే వారికి కూడా అదే అలవాటు అవుతుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి . షేరింగ్ అనేది అపాత్రదానంలా కాకుండా చూసుకోవాలి. 6. మాట మీద నిలబడటం :(ప్రామిస్ మేనేజ్మెంట్) ఈ మాట మీద నిలబడటం అన్నది మీ పిల్లలను సమాజంలో ఎంతో గౌరవాన్ని తెస్తుంది .పిల్లలు నమ్మకస్తులుగా ఉన్నట్లయితే వారికి ఆ మాట నిలబెట్టుకోవడం అన్నది ఉన్నతమైన స్థానాన్ని ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది .అది ఇంట్లోనే చిన్న చిన్న విషయాల తోనే మొదలు కావాలి. ఉదాహరణకు చదువుకునేందుకు మొదలు పెట్టడం దగ్గర నుండి ఆటల నుండి తిరిగి రావడం లాంటి చిన్న చిన్న విషయాల వఱకూ మాట మీద నిలబడటం అన్నది అలవాటు చేయాలి .ప్రతి దశలోనూ వారికి అది అలవాటుగా మారి పోవాలి. పెద్దవారయ్యాక వారిని ఎవ్వరూ దాని నుండి తొలగించలేరు.ఇక్కడ తల్లిదండ్రులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి .పిల్లలు ఎక్కడ ఫాల్స్ ప్రామిస్ చేయకుండా గమనిస్తూ ఉండాలి .ప్రారంభ దశలో వారిని గమనిస్తూ ,సరిచేస్తూ ఉన్నట్లయితే వారిని దాని నుండి ఎవరూ తొలగించ లేరు. ఏది ఏమైనా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నతమైన స్థితిలో చూడాలనుకుంటారు .వారిని ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి అనుకుంటారు . వారికి మంచి మంచి బహుమతులు ఇవ్వాలి అనుకుంటారు .కానీ మీ చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు మీరు ఇచ్చే బహుమతులకంటే మీరు వారితో కలిసి గడిపే సమయమే వారికి ఎంతో సంతృప్తిని ఇస్తుంది అని మరచిపోకండి . ఈ 6 కూడా పిల్లలకు నేర్పించడానికి మీరు కొంత ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసి ఉంటుంది. కచ్చితంగా తల్లిదండ్రులిద్దరూ ప్రణాళికాబద్ధంగా మీ పిల్లలను వాటిని అలవాటు చేసినట్లయితే ఆ తరువాత వాటి నుండి వచ్చే ఫలితం మాత్రం చాలా చాలా విలువైనదిగా ఉంటుంది .దాని ఖరీదు ఏమిటంటే మీ పిల్లల ఉజ్వలమైన నిండు జీవితం. ఈ ఆర్టికల్ మీకు ,మీ పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నారా ? దయచేసి మీ విలువైన అభిప్రాయాలను ఈ క్రింది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • 1
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.

| Aug 24, 2020

So nice its helpful my baby

  • Reply
  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP

పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ చర్చలు

Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}