Food and Nutrition

8 నుండి 12 నెలల పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాలు మరియు తయారీ విధానాలు..

Aparna Reddy
0 to 1 years

Created by Aparna Reddy
Updated on Jun 23, 2020

8 12
Reviewed by Expert panel

పెరుగుతున్న పిల్లలకు ఇచ్చే ఆహారంలో మార్పులు చేయడం అది ఎంతైనా అవసరం. 8 నుండి 12 నెలల వయసు వచ్చే సరికి మీ పిల్లలు గంజి  మరియు మెత్తని గుజ్జులాంటి ఆహారంతో విసుగు చెందుతారు. వారి ఇష్టాలు మరియు ప్రాధాన్యతలకు సంకేతాలు చూపించడం ప్రారంభిస్తారు. పిల్లలకు వివిధ రకాల ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వాలని ఎప్పుడు గుర్తుంచుకోండి .మరియు ఒకసారి ఇచ్చిన ఆహారాన్ని కనీసం వారం  రోజుల వరకు తిరిగి ఇవ్వకండి .నిజానికి ఈ వయసు పిల్లలకు రోజులో మూడు లేదా నాలుగు సార్లు పాలు ఇచ్చి , మూడు సార్లు ఘానాహారాన్ని ఇవ్వడం అలవాటు చేసుకోండి .మీ కుటుంబ అలవాట్ల ప్రకారం ఈ ఆహారాలను రోజంతా ప్లాన్ చేసుకోవాలి .(తప్పక ప్రయత్నించండి 6 నుండి 12 నెలల పిల్లలకు ఇవ్వవలసిన ఘానాహారాలు)

 

ఇక్కడ మా సహా పేరెంట్ నందిని జ్ఞాన మీ పిల్లలకు ఆరోగ్యకరమైన రుచికరమైన మరియు సులభంగా తయారు చేసుకోగలిగిన కొన్ని మంచి ఆహార పదార్థాలను మనతో పంచుకుంటున్నారు . క్రింద వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకునేందుకు ఈ బ్లాగును చదవండి.

 

గుడ్డు దోస

 

ఉప్మా

 

ఫ్రూట్  ఫింగర్స్

 

రైస్ సేమ్యా మరియు ఇంకొన్ని రకాలు

 

మీ చిన్న పిల్లలు 8 నుండి 12 నెలల వయసు వచ్చేసరికి గంజిలు మరియు మెత్తని గుజ్జు లాంటి ఆహారాలతో విసుగు చెందుతారు.


 

ఒక కడాయి లో కొంచం నెయ్య, సన్నగా తరిగిన 3 ఉల్లిపాయ ముక్కలు ,చిన్న టమాటా, కొంచెం జీలకర్ర పొడి, పసుపు ,సన్నగా తరిగిన క్యారెట్ , బీన్స్ , బంగాళాదుంపలు మరియు మీకు నచ్చిన కాయగూరలను వేయండి. మూడు కప్పుల నీరు పోసి మరుగుతుండగా పై కాయగూరలు ముక్కలను వేసి ఉడికించండి .ఆ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఒక కప్పు వేయించిన రవ్వ వేసి బాగా కలపండి . రవ్వ ఉడికిన తర్వాత కడాయి మీద మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయండి.

 

ఎగ్ దోశ :

 

ఒక గిన్నెలో గుడ్డులోని పచ్చసొనను మాత్రమే తీసుకుని స్పూన్తో బాగా కలపండి .మీ బిడ్డకు ఒక సంవత్సరం వయసు వచ్చే వరకు గుడ్డులోని తెల్లసొనను ఇవ్వకపోవడం మంచిది .దోశ పెనం మీద కొంచెం మందమైన దోసెలాగా వేసి మూత పెట్టండి .ఒక నిమిషం తరువాత ఆ దోశ పైన కలిపి ఉంచుకున్న గుడ్డు సొనని పోసి మూత పెట్టండి . మీ చిన్నారి ఇష్టపడితే పైన కొంచెం మిరియాల పొడి చల్లండి.ఇవన్నీ కూడా తక్కువ వేడి మీద చేయాలి .మూత తీసి గుడ్డు బాగా ఉడికిందో లేదో చూసి వడ్డించండి.

 

3.రైస్ సేమ్యా:

 

ఒక కడాయి లో కొంచం నెయ్య, సన్నగా తరిగిన 3 ఉల్లిపాయ ముక్కలు ,చిన్న టమాటా, కొంచెం జీలకర్ర పొడి, పసుపు ,సన్నగా తరిగిన క్యారెట్ , బీన్స్ , బంగాళాదుంపలు మరియు మీకు నచ్చిన కాయగూరలను వేయండి. మూడు కప్పుల నీరు పోసి మరుగుతుండగా పై కాయగూరలు ముక్కలను వేసి ఉడికించండి . అవి బాగా ఉడికిన తర్వాత ఒక కప్పు బియ్యం సేమియా వేసి బాగా కలపాలి .ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ,సేమ్యా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయండి.

 

4. బియ్యపు నూకతో ఉప్మా :

 

ముఖ్య గమనిక: మీ చిన్నారికి సిట్రిక్ ఫ్రూట్స్ అలర్జీ లేకపోతే మాత్రమే నిమ్మరసాన్ని వాడండి.

 

ఒక కప్పు బియ్యపు నూకను ఒక గిన్నెలో పది నిమిషాల పాటు నానబెట్టి ఉంచుకోండి. ఒక కడాయి లో కొంచం నెయ్య, సన్నగా తరిగిన 3 ఉల్లిపాయ ముక్కలు ,చిన్న టమాటా, కొంచెం జీలకర్ర పొడి, పసుపు ,సన్నగా తరిగిన క్యారెట్ , బీన్స్ , బంగాళాదుంపలు మరియు మీకు నచ్చిన కాయగూరలను వేయండి. మూడు కప్పుల నీరు పోసి మరుగుతుండగా పై కాయగూరలు ముక్కలను వేసి బాగా ఉడికించండి . అవి బాగా ఉడికిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న బియ్యపు రవ్వను వేసి బాగా కలిపి కొంచెంసేపు మూత పెట్టండి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. (మరింత చదవండి : పసిబిడ్డలకు సులభమైన అల్పాహారం వంటకాలు)

 

12 నెలల పిల్లలకు లంచ్ వంటకాలు :

 

పొంగలి మరియు కిచిడి మీ పిల్లలకు మధ్యాహ్న భోజనానికి చాలా మంచి ఆహారము .వివిధ రకాల కూరగాయలు మరియు మొలకెత్తిన గింజలు కూడా అందులో కలిపి వండి కొత్తకొత్త రుచులకు ప్రయత్నించవచ్చు.

 

1. ప్లెయిన్ పొంగలి :

 

కుక్కర్లో కొంచెం నెయ్యి వేసి జీలకర్ర, మిరియాలు ,కడిగిన ఉప్పుడు బియ్యం ఒక కప్పు , పెసరపప్పు అర కప్పు వేసి అందులో ఐదు కప్పుల నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి నాలుగు లేదా ఐదు విజిల్స్ రానివ్వాలి.

 

ఒక కడాయిలో కొంచెం నెయ్యి వేసి ఆవాలు, కరివేపాకు ,తురిమిన అల్లం వేసి పోపు పెట్టి ఆ పొంగలి లో కలపండి.

 

2. కూరగాయల పొంగలి :

 

పొంగలి పైన చెప్పిన విధానంలోనే చేయండి. బియ్యం తో పాటుగా క్యారెట్టు ,బీన్సు, బంగాళదుంప ,బీట్రూట్ లేదా మీకు నచ్చిన ఇతర ఏ కాయగూరలు నైనా కలపండి. కొత్తదనం కోసం మీరు వేరు వేరు కాయగూరలను కలుపుకోవచ్చు (మరింత చదవండి బేబీ లంచ్ ఐడియాలు ,వంటకాలు)


 

12 నెలల పిల్లలకు స్నాక్ వంటకాల ఐడియాలు మరియు పిల్లల వంటకాల రెసిపీలు :

 

పిల్లలకు సులభమైన ,ఆరోగ్యకరమైన స్నేక్ వంటకాల తయారీ విధానాలు :

 

ఎగ్ ఆమ్లెట్ :

 

గుడ్డులోని పసుపు భాగాన్ని మాత్రమే ఈ ఆమ్లెట్ కు వాడండి .మీ బిడ్డకు మిరియాలపొడి అలవాటు చేసి ఉన్నట్లయితే దాన్ని కూడా కొంచెం కలపండి .దోశ పెనం మీద పోసి రెండువైపులా ఉడికించండి .గుడ్డును పూర్తిగా ఉడికే లాగా చూసుకోండి.

 

2. ఫ్రూట్ ఫింగర్స్ :

 

ఫ్రూట్స్ ను వేళ్ళ ఆకారంలో కట్ చేయండి . కుక్కర్ లో పెట్టి వాటికి కొంచెం ఆవిరి లో ఉంచండి .అవి మెత్తగా కాకుండా చూసుకోండి. వాళ్ళే స్వయంగా తీసుకుని తినే లాగా మీ పిల్లలను ప్రోత్సహించండి.

 

ఉడికించి ఇవ్వగలిగిన పండ్లు:

 

ఆపిల్ ,పియర్స్ . మరింత చదవండి :పిల్లల కోసం చిరుతిండి వంటకాలను గురించి తెలుసుకోండి.

 

వెజ్ సూప్ :

 

నీటిని బాగా మరిగించి క్యారెట్, బీన్స్, బీట్రూట్ ,బంగాళదుంప ,కొత్తిమీర ,పుదీనా, జీలకర్ర ,మిరియాలపొడి వేసి బాగా ఉడికించండి. కూరగాయ ముక్కలను మెత్తగా ఉడికిన తర్వాత గుజ్జులాగా చేయండి .(మీ పిల్లలు చిగుళ్ళతో నమలడం అలవాటు చేసుకున్నట్లయితే మెత్తగా చేయవలసిన అవసరం లేదు )అందులో కొంచెం వెన్న కలిపి వేడిగా వడ్డించండి .(ఇంట్లో తయారు చేసే పిల్లల వంటకాలను మరికొన్నింటిని మాతో పంచుకోండి.)

 

గుర్తుంచుకోండి! పిల్లలు పెరిగే సమయం లో  వివిధ రకాల వంటకాలతో కొత్త కొత్త రుచులతో మార్చి మార్చి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. 

This content has been checked & validated by Doctors and Experts of the parentune Expert panel. Our panel consists of Neonatologist, Gynecologist, Peadiatrician, Nutritionist, Child Counselor, Education & Learning Expert, Physiotherapist, Learning disability Expert and Developmental Pead.

  • Comment
Comments ()
Kindly Login or Register to post a comment.
+ Start A Blog

Top Food and Nutrition Blogs

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}