• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఫుడ్ అండ్ న్యూట్రిషన్

వేసవిలో పిల్లలకు ఇవ్వవలసిన 8 రకాల పండ్లు. వేసవిలో ఈ పండ్లు ఇచ్చేటప్పుడు....

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Apr 17, 2020

 8
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

 పిల్లలకు చెర్రీస్ మంచివా ? ,పిల్లలకు  లిర్చీస్ మంచిగా ఉంటాయా ? వేసవిలో తినేందుకు మంచి ఆహారం ఏమిటి ?వేసవి మొదలైనప్పటి నుండి తల్లిదండ్రుల మనస్సులో ఇవి మెదులుతూనే ఉంటాయి. మామిడి , కీరదోస ల నుండి పనసకాయల వరకు ఈ వేసవి లో మా ముఖ్యమైన 8 రకాల మంచి  పండ్ల జాబితా ఇక్కడ ఉంది . తల్లిదండ్రుల సలహాల నుండి ఈ జాబితా ఎంపిక చేయబడింది .ఈ పండ్లలోని ప్రయోజనాలు మాత్రమే కాకుండా మీరు ఇంట్లో తయారు చేసుకోగల ఆసక్తికరమైన రెసిపీ లను కూడా ఇక్కడ చూడవచ్చు.  మీరు చూసే అన్ని రకాల తీపి పదార్థాల కంటే ఏ మాత్రం అనుమానం లేకుండా  ఈ పండ్లు చాలా ఆరోగ్యకరమైనవి .అవి కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు . వీటిలో పోషకాలు, ఫైబర్ ,విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించి శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

మేము మీ అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటున్నాము

మామిడి ,కీర దోసకాయలు నుండి పనసకాయల వరకు ఇక్కడ మా సూపర్ వేసవి కాలపు పండ్ల జాబితా ఉంది. ఈ జాబితా తల్లిదండ్రుల సలహాలు నుండి స్వీకరించింది. పండ్ల యొక్క ప్రయోజనాలు మాత్రమే కాకుండా ఇక్కడ మీరు ఇంట్లోనే ప్రయత్నించగల ఆసక్తికరమైన రెసిపీలు కూడా ఉన్నాయి.

మీ పిల్లల కోసం 8 రకాల మంచి వేసవి కాలపు పండ్లు

మాలాంటి తల్లిదండ్రులైన వారిని  వారి పిల్లలు ఇష్టపడే ఒక వేసవికాలపు పండుని చెప్పమని అడిగితే చాలామంది తల్లిదండ్రులు ఈ 8 రకాల పండ్ల పేర్లను తెలిపారు.

1. కీర దోసకాయ: దోసకాయ లేదా కీరదోసకాయ ఇది వేసవి కాలంలో చాలా సేద తీరుస్తుంది .దీన్ని రౌండ్ గా కట్ చేసి లేదా పొడవుగా గాని లేదా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవచ్చు. ఇందులో 96% నీరు ఉంటుంది.మరియు అతి తక్కువ మోతాదులో విటమిన్లు, మినరల్స్ మరియు ఫైబర్ ఉంటాయి. అయినప్పటికీ ఇది ఎంతో మంచిది.

పేరెంటూన్ చిట్కా : దోసకాయలు ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఫ్రిజ్లో నిల్వ చేయండి .వీటిని ఇతర పండ్లతో కలిపి నిల్వ చేసినట్లయితే పసుపురంగులోకి మారతాయి .మరియు త్వరగా పాడైపోతాయి.

2. మామిడి పండ్లు : మామిడి పండ్లు విటమిన్ ఎ మరియు విటమిన్ సి లతో నిండి ఉంటాయి .మరియు క్యాన్సర్ను నివారించే బీటాకెరోటిన్ కలిగి ఉంటాయి. దీనిలో ఉన్న మంచి రంగు కారణంగా కెరోటినాయిడ్స్  లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి.10 నిమిషాల్లో తయారు చేసే వంటకం మీ కోసం .చిన్న పిల్లలకు ఇది ఎంతో మంచిది.

పెరుగు రెండు కప్పులు, తొక్క తీసి ముక్కలు చేసిన రెండు కప్పుల మామిడి మొక్కలు, రుచికి సరిపడా పంచదార.(ముగ్గురికి)

మామిడి ముక్కలు పంచదార మెత్తగా మిక్సీ వేసుకోండి .అందులో పెరుగు కలిపి మరొక్కసారి మృదువుగా వచ్చేవరకు మిక్సీ వేసుకోండి .కావాలంటే ఇందులో పన్నీరు (రోజు వాటర్ ) కూడా కలుపుకోవచ్చు . చల్లగా వడ్డించండి.

పేరెంటూన్ చిట్కా : పాలను ,పాల పదార్థాలను ఇష్టపడని పిల్లల కోసం ఈ మ్యాంగో లస్సీ ని ప్రయత్నించండి .ఈ వేసవి సమయంలో రుచికరమైన ఈ పానీయాన్ని బాగా ఆస్వాదిస్తారు .మరియు దానిలోని పెరుగు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది.

3. పుచ్చకాయ : ఇందులో విటమిన్ ఎ మరియు సి సమృద్ధిగా ఉంటాయి .మరియు మంచి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి .ఇది వేసవిలో మంచి ఆహారం .ఎండ నుండి చర్మాన్ని రక్షించే లైకోపీన్ ఇందులో ఎక్కువగా ఉంటుంది.

తల్లిదండ్రుల చిట్కా : పుచ్చకాయ తో షర్బత్ ఎలా తయారు చేయాలో ప్రయత్నించండి . గత వేసవిలో మా పిల్లల కోసం నేను దీనిని తయారు చేశాను.వారి స్నేహితులు వచ్చినప్పుడు నేను వారి కోసం కూడా ఇది తయారు చేశాను.

పుచ్చకాయను చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకోండి. సగం పుచ్చకాయకు సగం గ్లాసు నీళ్ళు.

కట్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలను మిక్సీలో వేసుకోండి కొంచెం కొంచెం నీళ్ళు పోసి మిక్సీ వేస్తే మెత్తగా షర్బత్ లా తయారవుతుంది.(ఇది కొంచెం చిక్కటి మిశ్రమం లా ఉండాలి) స్కూప్ చేసి వడ్డించండి. పుచ్చకాయలలో తీపి ఉంటుంది .కనుక పంచదార అవసరం లేదు.

4. బెర్రీలు : స్ట్రాబెర్రీ , రాజ్ బెర్రీ, బ్లూ బెర్రీ లు సువాసనతో కూడిన రుచి కలిగి ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. బత్తాయి లో కంటే కూడా ఇందులో సి విటమిన్ మోతాదు ఎక్కువగా ఉంటుంది .మరియు ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది.

పేరెంటూన్ చిట్కా : స్ట్రాబెర్రీ స్మూతీ ఎలా తయారు చేయాలో చూడండి.(ఇద్దరికీ)

మూడు కప్పుల పాలు, రెండు కప్పుల చిక్కని పెరుగు, 8 స్పూన్ల తేనె, పది స్ట్రాబెర్రీలు.

పై పదార్థాలను మెత్తగా ,స్మూత్ గా వచ్చేవరకు మిక్సీ వేసుకోండి. చల్లగా వడ్డించండి.

5. బొప్పాయి : బొప్పాయి లో పొటాషియం మరియు విటమిన్ ఏ మరియు సి  అధికంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తి కలిగి ఉంటుంది .మరియు జలుబు ,దగ్గు రాకుండా కాపాడుతుంది . ఇందులో జీర్ణశక్తిని పెంచే  పాపైన్ అనే ప్రోటీన్ కూడా ఉంటుంది .బొప్పాయి మలబద్ధకం మరియు జీర్ణక్రియ కు సహాయపడుతుంది.

చిట్కా : బొప్పాయిని ముక్కలుగా కట్ చేసి అలాగే తీసుకోవచ్చు .లేదా అరటి పండు, పైనాపిల్ ,ఆపిల్ ,సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ ముక్కలు మరియు చెర్రీస్ కలిపి సలాడ్ లేదా కస్టడ్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు.

6. సపోటా : దీనిని చికు అని కూడా పిలుస్తారు. దీనిలో విటమిన్ సీ, ఏ, సోడియం మరియు పొటాషియం ఎలక్ట్రోలైట్ వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి .ఇది విరోచనాలకు బాగా పనిచేస్తుంది . మరియు దీనిలోని విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరుస్తుంది.

పేరెంటూన్ చిట్కా : ఈ రుచికరమైన సపోటా మిల్క్ షేక్ రెసిపి ప్రయత్నించండి.

నాలుగు లేదా ఐదు సపోటా లను తీసుకుని తొక్క తీసి గింజలను తీసిన గుజ్జు , ఒకటిన్నర గ్లాసు చల్లని పాలు, వెనీలా ఐస్ క్రీమ్, ఐస్ క్యూబ్ లు.

ఐస్ ముక్కలు కాకుండా మిగతావన్నీ హై స్పీడ్ లో మిక్సీ వేసుకోండి. రెండు గ్లాసుల లో ,రెండు లేదా మూడు ఐస్ ముక్కలు, రెండు లేదా మూడు స్పూన్ల ఐస్ క్రీమ్ వేయండి. అందులో మిల్క్ షేక్ ను పోయండి .చివరిగా కొన్ని తరిగిన సపోటా ముక్కలతో గార్నిష్ చేయండి.

7. పనసకాయ : ఇందులో ఎక్కువగా శక్తి, డైటరీ ఫైబర్ ,ఖనిజాలు మరియు విటమిన్లు ఉంటాయి .ఇందులో కొలెస్ట్రాల్ లేకుండా మంచి కొవ్వును కలిగి ఉంటుంది. వేసవికాలంలో ఇది మంచి రిలీఫ్ ఇస్తుంది. ఇది అల్సర్లను అజీర్తిని తగ్గిస్తుంది.

పేరెంటూన్ చిట్కా : మీ పిల్లలు పనస తొనలను అలాగే తినడానికి ఇష్టపడనట్లయితే వారి ప్రయోజనాల కోసం వీటిని మాంసాహారంలో గాని లేదా శాఖాహార వంటకాల లో గాని కలిపి వండుకోవచ్చు.

8. అరటి : అరటి పండ్లు ఏడాది పొడవునా లభిస్తాయి . మరియు విటమిన్లు ,ఖనిజాలు మరియు ఫైబర్ తో నిండి ఉంటాయి. అరటిపండ్లు క్రమం తప్పకుండా తిన్నట్లయితే మంచి కంటి చూపు తో పాటు ఎముకలకు మంచి శక్తి లభిస్తుంది .మరియు తక్షణ శక్తిని ఇస్తుంది.

పేరెంటూన్ చిట్కా : బయటకు వెళ్ళేటప్పుడు అరటి పండ్లు తీసుకు వెళ్లడం సులభం .గడబిడ లేనిది మరియు ఆరోగ్యకరమైనది.

వేసవిలో పిల్లలకు పండ్లు ఇచ్చేటపుడు గుర్తుంచుకోవలసిన కొన్ని సూచనలు

పండ్ల రసం ఎప్పుడూ పండ్లతో సమానం కాదు.ఒక్క పండు ని జ్యూస్ చేసినప్పుడు దానిలోని పీచుపదార్థం పోతుంది .మరియు తీపి శాతం పెరుగుతుంది. పండ్ల రసాలు, స్మూతీలు మీ పిల్లలకు అప్పుడప్పుడు మాత్రమే ఇవ్వండి .పండ్లను ఇచ్చేముందు శుభ్రంగా కడిగి తుడవండి. ఇది పండ్ల పై భాగంలోనే క్రిమిసంహారక మరియు పురుగుల మందులను తొలగిస్తుంది. పిల్లలకు వడ్డించే ముందు మాత్రమే పండ్లను కట్ చేయండి.తినగా మిగిలిన మొక్కలను ఫ్రిజ్లో భద్రపరచండి .భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం అంత మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అది సరిగా జీర్ణం కాక పోవచ్చు. పోషకాలను సరిగ్గా గ్రహించు కోకపోవచ్చు. అందుచేత భోజనం అయిన 30 నిమిషాల తర్వాత మీ పిల్లలకు పండ్లు ఇవ్వండి.

మీ పిల్లలకు ప్యాకేజ్ ఫ్రూట్ జ్యూస్ లను ఇవ్వకండి. వాళ్ళుకు ఎక్కువ పంచదారను కలుపుతారు. మరియు అందులో తక్కువ శాతం పండ్లను కలుపుతారు.

ఇది మీకు మీ పిల్లలకు సహాయ పడుతుందని ఆశిస్తున్నాము.

"మీ బిడ్డకు ఇవ్వడానికి ఉత్తమ వేసవి పండ్లు"అనే బ్లాగ్ మీకు నచ్చిందా ? దయచేసి మీ అభిప్రాయాలను ,సలహాలను కామెంట్ విభాగం లో తెలపండి .మీ అభిప్రాయాలను తెలుసుకోవడం మాకెంతో సంతోషం.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}