ఆటలు ఆడ్డిదం, ఆరోగ్యం పెంచుదాం

Radha Shree సృష్టికర్త నవీకరించబడిన Apr 11, 2021

బాల్యం యొక్క ఆరంభ దశ ఎంతో సున్నితమైంది. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల ఎదుగుదల కాలాన్ని బాల్యారంభ దశగా పరిగణిస్తే, ఆ సమయంలోనే వారిలో అన్ని విధాలుగా ఎదుగుదలకు ఉపయోగపడే బీజాలు నాటాలి. ఈ సమయంలోనే వారిలో చూపు, స్పర్శ, గుర్తింపు, వినికిడిలాంటి చేతనలన్నీ విజ్ఞానరూపం వైపు తొంగిచూస్తుంటాయి. ఈ సమయంలో ఏ మాత్రం మొరటు తనానికి వారు గురైనా, వారి భావి జీవితాలకు ఎంతో నష్టం కలుగుతుంది.ఆరు సంవత్సరాల లోపు పిల్లల మానసిక స్థితి అత్యంత సున్నితంగా ఉంటుంది. వారి వ్యక్తిత్వపు మొలకలు ఆరంభమయ్యే రోజులు ఇవి . ఈ పూర్వ ప్రాథమిక దశలోని పిల్లల అవసరాలు తెలుసుకోవటం ఎంత ముఖ్యమో, అలాగే వారి శక్తి సామర్థ్యాలు అవగాహన చేసుకోవటం అంతకన్నా ముఖ్యం. ఈ అవగాహన బలం తోటే పిల్లల సమగ్ర అభివృద్ధిని మరింత మెరుగ్గా సాధించవచ్చు.
ఆరు సంవత్సరాల లోపు పిల్లల మానసిక స్థితి అత్యంత సున్నితంగా ఉంటుంది. వారి వ్యక్తిత్వపు మొలకలు ఆరంభమయ్యే రోజులు ఇవి . ఈ పూర్వ ప్రాథమిక దశలోని పిల్లల అవసరాలు తెలుసుకోవటం ఎంత ముఖ్యమో, అలాగే వారి శక్తి సామర్థ్యాలు అవగాహన చేసుకోవటం అంతకన్నా ముఖ్యం. ఈ అవగాహన బలం తోటే పిల్లల సమగ్ర అభివృద్ధిని మరింత మెరుగ్గా సాధించవచ్చు.
నిత్యం పిల్లల చుట్టూ ఉండే వాతావరణానికి, పిల్లల మనస్తత్వానికి సంబంధం ఉందని అంటుంటారు. వారి చుట్టూ ఉండే వాతావరణం అంటే కుటుంబం, కుటుంబంలోని వ్యక్తులు, పిల్లల సామర్థ్యాన్ని ప్రత్యేక బోధన ద్వారా అభివృద్ధి పరచవచ్చని నిపుణుల ఉద్దేశం.
పిల్లలని బయటకు తీసుకెళ్లి సామాజిక పనులు చేస్తే చిన్నతనంలోనే వారికి పాజిటివ్ ఆలోచనలు ఇమిడే అవకాశం ఉంది. పిల్లల ను పార్కు లో ఆడు కొనడానికి తీసుకెళ్లడం అక్కడ వార్ని ఊయల ఊంచడం, వారికి చనువు ఇచ్చి ఇతర పిల్లల తో మెలిగేల చేయడం వారికి ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఒక బంతి తో పిల్లల తో పాటు తల్లిదండ్రుల వారితో సమయం గడపడం వలన వారు ఎంతో చనువుగ తల్లిదండ్రుల తో మెలగుతారు.
ఆరో సంవత్సరం వరకు పిల్లల్లో శారీరక ఎదుగుదల చాలా త్వరితంగా జరుగుతుంది. అప్పటి వారి శారీరక స్వభావం ప్రకారం గెంతటం, పరిగెత్తటం, దూకటం, లాగటం, తొయ్యటం, గుండ్రంగా తిరగటం, విసరటం, పట్టుకోవటం లాంటి చర్యలు సహజంగా పిల్లలకు ఇష్టమైన చర్యలు. వారి ఈ ఇష్టానికి అనుగుణంగా వారిని ఆడించాలి. ఈ ఆటలవల్లే వారి శారీరక అభివృద్ధి జరుగుతుంది. సూక్ష్మ, స్థూల కండరాల చలనం, చూపు – చేతల సమన్వయం ఈ సమయంలోనే బలపడతాయి. ఆసక్తే తప్ప మంచి చెడులు సరిగ్గా తెలియని వయసు వారిది. ఈ సమయంలో వారి ఆసక్తి, సరదా తీరేలా, వారికి హాని చెయ్యని ఆటల్ని, ఆట వస్తువుల్ని అందుబాటులోకి తేవాలి. ఈ ప్రక్రియ సాగుతుండగానే వారి సామర్థ్యం పెరుగుతూ వస్తుంది. గుర్తు, గుర్తింపు, వ్యక్తీకరణ, స్పందన, ఊహ, ఇలా క్రమేపి వారి ప్రపంచం విస్తరిస్తుంది. స్కూలుకి వెళ్ళి పాఠాలు చదువుకోవటానికి ముందు ఆరు సంవత్సరాలలోపు దశలో అభివృద్ధి చెందే వారి స్థాయి, తరువాత భవిష్యత్తులో వారికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.
ఇప్పుడన్నీ చిన్న కుటుంబాలే. తీరికలేని తల్లిదండ్రులు. దాంతో పిల్లలకి కాలక్షేపం ట్యాబ్‌లు, స్మార్ట్ఫోన్లే అయిపోయాయి. దాంతో అదేపనిగా ఆడే ఆటలు. చేరుకునే లక్ష్యాలు వారి చిన్న మెదడుపై ఒత్తిడిని పెంచుతాయి. అంతేకాదు... ఒంటరిగా గడపడం అలవాటైన చిన్నారులు నలుగురిలోనూ కలవలేకపోతున్నారు. అయితే తరచూ టెక్నాలజీకి పరిమితమైన పిల్లల ఆలోచనలపై ప్రతికూల ప్రభావం ఎక్కువేనంటున్నారు అధ్యయనకర్తలు.
పిల్లల ఎదుగుదలలో తొలి రెండు నుంచి నాలుగేళ్లు చాలా కీలకం. వాళ్ల మెదడు వేగంగా వికసించే వయసు ఇది. తల్లిదండ్రులు చెప్పేమాటలు విని వూకొట్టి, వాళ్లని అనుకరించే అన్నీ నేర్చుకుంటారు. ఆటవస్తువుల్ని తాకి చూసి స్పర్శజ్ఞానం తెలుసుకుంటారు. బయటి పిల్లలతో కలిసి ఆటలాడటం ద్వారా వ్యక్తీకరణ, ఉద్వేగ ప్రజ్ఞ సొంతం చేసుకుంటారు. సహజమైన ఈ ఎదుగుదలకి స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్‌లు, కంప్యూటర్లు అడ్డుపడుతున్నాయి. పిల్లలని పూర్తిగా తమ వశం చేసుకుని.. కదలనివ్వకుండా చేస్తున్నాయి. ఇందులో కనిపించే ఆకర్షణీయమైన దృశ్యాల కారణంగా అవి తప్ప మరేవీ ఆసక్తిగా అనిపించవు పిల్లలకి. ప్రకృతి సిద్ధమైనవేవీ నచ్చవు. ఐదు నిమిషాలకంటే ఎక్కువ దేనిపైనా శ్రద్ధపెట్టలేరు. అంతేకాదు బయటివాళ్లతో కలవకపోవడం వల్ల భాషానైపుణ్యాలు అంతగా ఉండవు. రాత్రి సమయంలో మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే లేతనీలి వెలుగు నిద్ర లేకుండా చేస్తుంది. వీటి బారినపడుతున్న పిల్లలు చిన్నప్పుడే తీవ్ర నిద్రలేమికి గురవుతున్నారు. ఏకాగ్రత కోల్పోతున్నారు.
చంటి పిల్లలు పదేపదే ఏడుస్తున్నారని దేనికో మారాం చేస్తున్నారని చటుక్కున మొబైల్ ఫోన్ ఇవ్వకండి. వాళ్లు ప్రతిదీ తల్లిదండ్రుల దగ్గరే నేర్చుకోవాలి. చుట్టూ ఉన్న బాహ్య వస్తువులకే ముందు అలవాటుపడాలి. అప్పుడే వాళ్ల మెదడు సహజంగా వికసిస్తుంది.
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు


{{trans('web/app_labels.text_some_custom_error')}}
{{trans('web/app_labels.text_some_custom_error')}}