• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
వేడుకలు మరియు పండుగలు

ఆడదే అనంత శక్తి

Mounika Saride
గర్భధారణ

Mounika Saride సృష్టికర్త
నవీకరించబడిన Mar 07, 2019

మార్చి 8 న ప్రపంచవ్యాప్తంగా "మహిళల అంతర్జాతీయ దినోత్సవం "జరుపుకోవటం మహిళలు వారు పొందిన గౌరవం. నిజానికి, సృష్టికి ఆడదే ఆధారం.ఆడదే అనంత  శక్తి .

వారు కేవలం పునరోత్పత్తికి, పిల్లలకు సాకే తల్లిగా మాత్రమే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో పురోగమిస్తున్నారు.

క్రీడలు , సాహిత్యం , సంగీతం, సినీ రంగం , టి.వి రంగాలూ మాత్రమే కాకుండా జర్నలిజం , బ్యాంకింగ్,వాణిజ్యం , వైద్యం ,విద్య , వ్యవసాయం లాంటి రంగాలలోనే   కాకుండా  రాజకీయ రంగం లో కూడా రాణిస్తున్నారు.

ఒకప్పుడు కేవలం పురుషులకు మాత్రమే పరిమితమైన ,సాహసోపేత క్రీడలు , ఆకాశ పయనం ఇలా అన్ని రంగాల్లోనూ పురుషులలో సమానంగా విజయాలు సాధిస్తూ ,వారి సాధికారికత ని చాటుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎందరో మహిళ తేజాలు భావితరాలకు స్ఫూర్తినిస్తున్నారు . 

అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా నటన, నాట్యం, సంగీతం సాహిత్యం, దర్శకత్వం , స్టూడియో అధినేతగా, రాణించిన అలనాటి ప్రతిభావంతురాలైన భానుమతి రామకృష్ణ గారు మొదలుకొని ఈనాటి ఝాన్సీ ,సుమవంటి బుల్లి తెర సెలబ్రిటీస్ వరకు అటు తల్లి బాధ్యతలు నెరవేరుస్తూనే వారి వారి రంగాల్లో రాణించారు .

బుల్లి తెర యాంకర్ సుమ గూర్చి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసమే లేదు , ఆవిడ యాంకరింగ్  ఫీల్డ్ కే ఒక బెంచ్ మార్క్. 

ఈవిధంగా చూసినట్లయితే యాంకర్,నటి ఐన    అనసూయ గారు కూడా  తల్లి గా పెరుగుతున్న వారి  బాధ్యతలు నెరవేరుస్తూ కూడా వారి రంగాల్లో కూడా పరోగతిస్తున్నారు

సినీ,రాజకీయ, బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న  రోజగారు కూడా వారు వారి వృతులలో రాణిస్తున్నప్పటికినీ వారి కుటుంభం,సంతాన బాధ్యతలను కూడా నిర్వహిస్తూ మన సమజాంలోని స్త్రీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు .

ఆంధ్ర ప్రదేశ్ , తెలుగు జనాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన    మహిళా వెయిట్ లిఫ్టర్   మల్లీశ్వరి గారు కూడా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డు, మరియు పద్మ శ్రీ అవార్డు గ్రహీత. 

పులిపాక సుశీల గారు వారి ప్రతిభను ఆరు దశాబ్దాల పాటు దక్షిణ భారతీయ సినిమా పరిశ్రమకు అందించారు. గిన్నిస్   బుక్  అఫ్   వరల్డ్  రికార్డ్స్  అండ్  ది  ఆసియ  బుక్  అఫ్  రికార్డ్స్  వారికి  ఖ్యాతి చెందింది.

విజయ  లక్ష్మి  ఏమని  గారు  ఇండియన్  అమెరికన్  సోషల్  ఆక్టివ్విష్    ,గృహ హింస చట్టం కోసం పని చేసారు, ఆవిడ ఇండియన్  అమెరికన్   కమ్యూనిటీ కి సివిక్ లీడర్ గా వారి సేవను అందచేశారు. ఆవిడ ధైర్యానికి బరాక్  ఒబామా  మెచ్చి    ప్రెసిడెంటిల్  సిటిజన్స్  మెడల్ ను అందచేశారు. ఆంధ్ర ప్రదేశ్ కర్నూల్ లో పుట్టిన ఏమని అమెరికా లో  " రోల్  మోడల్  ఫర్  విక్టింస్  అఫ్  డొమెస్టిక్  అబ్యూస్ "గా కీర్తిని పొందారు. ఈవిడకి ఇద్దరు కుమార్తెలు కూడా.

వీరి అందరిలో మనం ఆదర్శంగా తీసుకోవలసిన విషయం   ఏమి  టంటే వారు వారి కుటుంభం బాధ్యతలను నెరవేరుస్తూ కూడా వీరు వారి రంగాలలో  ప్రత్యేక స్థానాన్ని సాధించారు.

ఇలా మరి ఎందరో మహిళలు వారి ప్రతిభనుశక్తులను  వంటగది మరియు  పిల్లలను  సాకడానికే పరిమితం చేయకుండా ఆడదే అనంత శక్తీ రూపిని అని నిరూపించారు, నిరూపిస్తున్నారు . నిజానికి మన జీవితం లో కూడా ఇలాంటి  రియల్ టైమ్  సెలెబ్రిటీలను మన ఇళ్లలోనూ  చుట్టుపక్కల  కూడా చూస్తుంటాము.

వాస్తవానికి ప్రతీ తల్లి ఐన  మహిళ ఒక సెలబ్రిటీ నే ఎందుకంటే భవిష్యతుపౌరులను తీర్చి దిద్దడం సహజమైన పని కాదు సుమా ! అందుకే పైన రాసిన ఎనిమిది సెలెబ్రెటీలకు  ఒక స్థానం ఉన్నట్లే , మీకు మీరే ఈ పేజీలో తొమ్మిదవ స్థానం సెలబ్రిటీ అని చెప్పవచు.

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
పైన వేడుకలు మరియు పండుగలు బ్లాగ్లు
Tools

Trying to conceive? Track your most fertile days here!

Ovulation Calculator

Are you pregnant? Track your pregnancy weeks here!

Duedate Calculator
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}