• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

రోగనిరోధక శక్తిని పెంచే అల్లం-తులసి టీ త్రాగడం వలన పాలిచ్చే తల్లులకు కలిగే ప్రయోజనాలు.

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jun 16, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

మీరు పాలిచ్చే తల్లుల తో పాటు అల్లం- తులసి టీ అభిమానులా! ఇదిగో! మీకు ఒక శుభవార్త ..ఇది పాలిచ్చే తల్లులకు అమృతంలా పనిచేస్తుంది .కాబట్టి , ఇక ఆలస్యం ఎందుకు ! తల్లి పాలు ఇచ్చే సమయంలో అల్లం టీ యొక్క ప్రయోజనాలను తెలుసుకునేందుకు మీ కప్పు టీ ని తయారు చేసుకోండి మరియు చదవడం ప్రారంభించండి .మీ రెసిపీ ఇక్కడ ఉంది...

 

అల్లం - తులసి టీ తయారు చేయడం ఎలా ?

 

మీరు పంచదార మరియు పాలతో పాటుగా దీన్ని తయారు చేసుకోవచ్చు .అవి లేకుండా కూడా తయారు చేసుకోవచ్చు .ఇక్కడ చెప్పిన అల్లం పరిమాణం చాలా తక్కువ అని గుర్తుంచుకోండి .మీకు టీ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అనే దాని ప్రకారం ఒకటి నుండి ఐదు గ్రాములు అల్లం తీసుకోవచ్చు .

 

పాలతో అల్లం - తులసి చాయ్:

 

చిన్నగా తరిగిన మూడు లేదా నాలుగు అల్లం ముక్కలు , ఐదు తులసి ఆకులను ఒక కప్పు నీటిలో పావు కప్పు పాలను కలిపి సుమారు ఐదు నిమిషాల పాటు మరిగించండి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టండి .రెండు నిమిషాలు వేచి ఉండండి . ఇప్పుడు అల్లం మరియు తులసిలోని సారం అంతా బయటకు వస్తుంది. సర్వ్ చేయండి .చక్కెర సిఫారస్సు చేయబడలేదు.

 

పాలు లేకుండా అల్లం - తులసి టీ :

 

తాజా అల్లం ముక్క తీసుకొని  పీలర్ తో తొక్క తీసిన తర్వాత శుభ్రంగా కడిగి అల్లాన్ని తురుము కొండి.  లేదా మిక్సీ జార్ లో కూడా వేసుకోవచ్చు . లేదా రోటిలో కూడా దంచుకోవచ్చు .ఒక గిన్నెలో రెండుకప్పుల నీళ్లు పోసి అల్లం వేసి బాగా మరిగించండి. మరిగే సమయంలో సిమ్ లో పెట్టండి .ఎంత ఎక్కువ సేపు సిమ్ లో ఉంచుతారో టీ అంత స్ట్రాంగ్ గా వస్తుంది .ఇప్పటికే తరిగిన లేదా దంచిన తులసి ఆకులను వేసి స్టవ్ ఆఫ్ చేయండి . ఆ గిన్నెను రెండు నిమిషాల మూసి ఉంచండి.తర్వాత వడకట్టి సర్వ్ చేయండి.

 

మీరు ఇందులో తేనె ,నిమ్మరసం ,తాజాగా దంచిన నల్లమిరియాలు కూడా కలుపుకోవచ్చు . ఇది రుచిని పెంచడం మాత్రమే కాదు .అల్లం - తులసి టి మరికొన్ని ప్రయోజనాలను కూడా ఇస్తుంది .ఇక్కడ పేర్కొన్న అన్ని  పదార్థాలు కూడా మీ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి .నిమ్మ రసం తులసి మరియు అల్లం లోని యాంటీ ఆక్సిడెంట్ల ప్రభావాన్ని మరియు రోగం తో పోరాడే శక్తిని పెంచుతాయి .పంచదారకు బదులుగా తేనెను తీసుకున్నట్లయితే అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది.

 

అల్లం - తులసి చాయ్ ఎందుకు అంత ప్రయోజనకరంగా ఉంటుంది ?

 

అల్లం -తులసి యొక్క ప్రయోజనాలను విశ్లేషించే ముందు అల్లం మరియు తులసి లో అంత ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం!

 

త్రాగే నీటిలో కొన్ని తులసి ఆకులను వేసినట్లయితే ఆ నీటిని శుద్ధి చేసేందుకు మరియు సూక్ష్మక్రిములను చంపడానికి సహాయపడతాయని మీకు తెలుసా ?అదే తులసి యొక్క శక్తి.

 

తులసి  ఆకులలో ఉండే యూజినాల్ అనే క్రియాశీలక భాగం దానిలోని శక్తి కి ముఖ్య కారణం . వుర్ సోనిక్ ఆమ్లము మరియు కార్వా క్రోల్ వంటి ఇతర యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కూడా తులసి కలిగి ఉంటుంది. కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది .(ఇమ్యూనో మాడ్యూల్లేటర్  లక్షణాలు ) తులసిలో యాంటీ డయాబెటిక్ , యాంటీ కొలెస్ట్రాల్లేమియా, యాంటీ హైపర్టెన్షన్, యాంటీ కార్దినోజనిక్, అనల్ జ టిక్ , యాంటీ పైరీ ఠిక్,యాంటీ అలర్జీ లక్షణాలు, యాంటీ టుస్సివ్ మరియు ఎక్స్పర్ట్ రెంట్ లక్షణాలు ఉన్నాయి .అవన్నీ తులసిని ప్రత్యేకమైనదిగా చేస్తాయి.

 

అన్ని సుగంధ ద్రవ్యాలు లోనూ యాంటీఆక్సిడెంట్లు ఉన్నప్పటికీ అల్లం మాత్రం  మరో 25 రకాల వేరు వేరు యాంటీ ఆక్సిడెంట్లను తో మనలను దీవిస్తుంది. ఇది ప్రకృతి మనకు ప్రసాదించిన యాంటీ ఆక్సిడెంట్ లో ఒకదానిగా చేరింది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ డయాబెటిక్, ధర్మో జనిక్ లక్షణాలను కలిగి ఉంది .దీనిలోని రక్తాన్ని పలుచన చేసే గుణాలు ఎంతో ఉపయోగకరమైనవి.

 

బిడ్డకు తల్లిపాలు ఇచ్చే సమయంలో అల్లం- తులసి తీసుకున్నందుకు వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి ?

 

పాలిచ్చే తల్లులకు అల్లం తులసి టీ వలన కలిగే ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి...

 

అద్భుతమైన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

 

రోగనిరోధక శక్తిని పెంచడంలో తులసి మరియు అల్లం రెండు కూడా ఎంతో అద్భుతమైనవి .మరియు పాలిచ్చే తల్లులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో సూక్ష్మజీవుల ద్వారా వచ్చే రకరకాల వ్యాధులు సంభవించకుండా కాపాడుతాయి.

 

తల్లి లో సమృద్ధిగా పాల ఉత్పత్తి పెరిగేందుకు సహాయపడతాయి :

 

తల్లి పాల యొక్క ఉత్పత్తిని సమృద్ధిగా పెంచే లాక్టోజనిక్ ఆహారాల జాబితా లో తులసి మరియు అల్లం కూడా చేర్చబడ్డాయి. అందువల్ల పాలిచ్చే తల్లులకు అల్లం - తులసి టీ త్రాగడం చాలా ప్రయోజనకరం.

 

ఒత్తిడిని తగ్గించే గుణం కలిగి ఉంటాయి :

 

తులసి ఒక అద్భుతమైన  ఎడాప్ట్ జెన్ .ఇది మీ అడ్రినల్ గ్రంధులను ప్రేరేపిస్తుంది .ఇది మీలోని ఒత్తిడిని తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా అల్లం లోని సినోల్ కూడా ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సహాయపడుతుంది. అందువల్ల తులసి - అల్లం టీ త్రాగడం వలన పాలిచ్చే తల్లులలో ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడుతుంది.

 

జలుబు మరియు ఫ్లూ లకు అద్భుతమైన ఆహారం :

 

అల్లం తులసి టీ లలో అన్ని చికిత్స లక్షణాలతో పాటుగా పాలిచ్చే తల్లులను ఎక్కువగా బాధించే జలుబు, ఫ్లూ వంటి లక్షణాలను తగ్గించేందుకు ఇది ఒక అద్భుతమైన పరిష్కారం .అల్లం యొక్క వార్మిన్గ్ ప్రాపర్టీ (ధర్మో జనిక్) కఫంతో పోరాడేందుకు సహాయపడుతుంది. అదేవిధంగా ఊపిరితిత్తులలోని మంట, అలర్జీలు మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి తులసి సహాయపడుతుంది.

 

జీర్ణక్రియకు సహాయపడుతుంది :

 

పాలు ఇచ్చే తల్లులు తమ పాల ఉత్పత్తి పెంచుకునేందుకు కొత్త ఆహార పదార్థాలను, లేదా సప్లిమెంట్స్ ను తీసుకున్నట్లయితే కొన్ని రకాల గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. ప్రతిరోజు అల్లం - తులసి టీ తీసుకోవడం గ్యాస్ట్రిక్ సమస్యలను అరికట్టడానికి ఒక మంచి మార్గం .ఇది అన్ని రకాల గ్యాస్ట్రిక్ సమస్యల నుండి చాలా త్వరగా ఉపశమనాన్ని ఇస్తుంది.

 

వికారం నుండి తగ్గిస్తుంది :

 

కొంత మంది తల్లులకు బిడ్డకు తమ పాలు ఇచ్చే సమయంలో మొదటి కొన్ని వారాల పాటు వికారంతో బాధ పడుతున్నట్లు గా తెలుపుతారు .ఈ అల్లం - తులసి టీ ఆ వికారాన్ని తగ్గించడానికి చాలా ప్రసిద్ధి చెందినది.

 

బరువు తగ్గేందుకు సహాయపడుతుంది :

 

మీరు గర్భధారణ సమయంలోనూ మరియు ప్రసవానంతరం పెరిగిన అదనపు బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? ఇదిగోండి! మీకు శుభవార్త !ప్రతిరోజు మూడు నుండి నాలుగు గ్లాసుల అల్లం - తులసి (పాలు మరియు చక్కెర లేకుండా )తాగడం వలన బరువు బాగా తగ్గుతారు.

 

తప్పక చదవండి : సహజ మూలికలు అయిన తులసి , పసుపు యొక్క ప్రయోజనాలు మరియు ఉపయోగాలను చూడండి.

 

పాలిచ్చే తల్లులు అల్లం - తులసి టీ తాగడం వలన కలిగే ప్రయోజనాలను తెలిపే ఈ బ్లాగ్ మీకు నచ్చిందా ? దయచేసి మీ అభిప్రాయాలను మరియు సూచనలను ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో మాతో పంచుకోండి.
 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}