• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

బ్రష్ చేయడం ఏ వయసు నుండి ప్రారంభించాలి ? పళ్ల ఆరోగ్యం కోసం నివారించవలసిన ఆహారాలు ఏమిటి ?

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Sep 09, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

 

" నా బిడ్డ సరిగ్గా పళ్ళు తోముకోడు! ";" నా బిడ్డ రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం అవసరమా?"; "ఎటువంటి టూత్ బ్రష్ ను ఉపయోగించాలి"? మరియు పిల్లల దంత పరిశుభ్రత గురించి ప్రశ్నలు ఈ విధంగా కొనసాగుతాయి. ఇక పిల్లల ఆరోగ్య విషయానికి వస్తే మనము దంత సంరక్షణను కూడా వదిలి పెట్ట జాలము. కాబట్టి మనలో చుట్టుముట్టిన ఈ ప్రశ్నలన్నిటికీ పేరేంటూన్ దంత నిపుణులు డాక్టర్ సోనాలి బస్సి గారు తమ తెలివైన చిట్కాలను ఇవ్వడానికి మరియు దంతాల సంరక్షణ కోసం చేయవలసినవి మరియు చేయకూడని వాటిని అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడ్డారు.

 

మరింత సమాచారం కోసం..

 

బ్రషింగ్ ప్రారంభించడానికి సరైన వయస్సు ఏమిటి ?

 

మీ చిన్నారి నోటిలో రెండు లేదా మూడు దంతాలు చూసిన వెంటనే వారిని బాత్ రూం లోకి రానివ్వకండి. ఆరు లేదా ఏడు నెలల పిల్లలకు ఇలా చేయడం చాలా తొందరపాటు అవుతుంది.

 

దానికి బదులుగా శుభ్రమైన గాజు గుడ్డతో రోజుకి రెండు సార్లు కొత్తగా వచ్చిన దంతాల చుట్టూ నెమ్మదిగా రుద్దండి.

 

బ్రష్ ను అంత త్వరగా ఉపయోగించ వలసిన అవసరం లేదు.

 

మీ చిన్నారికి ఫార్ములా పాలు పడుతున్న నట్లయితే ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు గాజు గుడ్డతో నాలుకను శుభ్రం చేయండి.

 

సరైన టూత్ బ్రష్ ను ఎలా ఎంచుకోవాలి ?

 

మీ చిన్నారి మొదటి సంవత్సరంలోకి అడుగుపెట్టిన వెంటనే మృదువైన బ్రిసిల్స్ అంటే చిన్న తలగల బ్రష్ ని కొనండి. (ఈ రోజులలో చిన్న పిల్లల కోసం వయసు వారిగా తయారుచేయబడిన మృదువైన సిలికాన్ తో తయారు తయారుచేయబడిన చిగురులను కూడా మసాజ్ చేసుకోగలిగిన విధంగా బ్రష్ లు అందుబాటులో ఉన్నాయి).[అన్వేషించండి: పిల్లలలో చెడు శ్వాసకు కారణాలు & నివారణ]

 

వాస్తవానికి, మీ బిడ్డకు 10 లేదా 12 సంవత్సరాలు వచ్చే వరకు చిన్న తలలు ఉన్న బ్రష్ ను వాడాలి. చిన్న తలలు ఉన్న బ్రష్ పళ్ళు మరియు నోటి మూలలకు సులువుగా చేరుతుంది. లేదంటే వెనుకవైపు ఉన్న దంతాలను బ్రష్ శుభ్రపరిచజాలదు. ఇది కావిటీస్ రావడానికి కారణం అవుతుంది.

 

ప్రారంభంలో మీరు ఫింగర్ బ్రష్ ను ఉపయోగించవచ్చు- ఇది తల్లిదండ్రులు చూపుడు వేలిపై ధరించగలరు . ఈ చిన్న టూత్ బ్రష్ తో తల్లిదండ్రులు జాగ్రత్తగా చేసినట్లయితే నోటి లోపలి వరకు వెళ్లి శుభ్రపరచడానికి అనుకూలంగా ఉంటుంది. చిన్నపిల్లలు టూత్బ్రష్ వాడడం వల్ల కలిగే గాయాలు సంభవించకుండా ఉంటాయి. నుబీ, మదర్ కేర్ మరియు మీమీ తో సహా అనేక కంపెనీలు దీన్ని అందిస్తున్నాయి.

 

సరైన టూత్ పేస్ట్ ను ఎలా ఎంచుకోవాలి ?

 

ఈ వయసులో వారు నోరు సరిగా కడుక్కోవడం మరియు ఉమ్మివేయడం చేయలేరు. అందుకే నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఫ్లోరైడ్ టూత్ పేస్టులను వాడతం మంచిది కాదు. ఫ్లోరైడ్ పసి పిల్లలకు హాని కలిగిస్తుంది. పిజియన్ మరియు చిక్కు వంటి చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఫ్లోరైడ్ లేకుండా టూత్ పేస్ట్ ను తయారు చేసి విక్రయించే కంపెనీలు మార్కెట్లో ఎన్నో ఉన్నాయి.

 

సరైన దంత ఆరోగ్యం కోసం ఆహారాలు నివారించాలి ?

 

పళ్లకు అతుక్కునే ఏ ఆహారమైనా సరే కావిటీస్ కు కారణం అవుతుంది. ఉప్పు గా ఉండే బిస్కెట్స్ కూడా అనారోగ్యానికి కారణం కావచ్చు.

ఏది ఏమైనప్పటికీ మనము వీటి నుండి పిల్లలను పూర్తిగా దూరం చేయలేము. ఈ రోజుల్లో పిల్లలు తరచుగా బర్త్డే పార్టీ లకు, పిక్నిక్ లకు మరియు సినిమాలకు వెళుతూ ఉంటారు.

కానీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అయితే పోషకాలతో కూడిన పీచు పదార్థాలను ఇవ్వగలము. అవి తిన్నప్పుడు మాత్రమే  మీకు కేక్ ఇస్తాము అని చెప్పండి. కానీ ముందుగా మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోవాలి.

 

మీరు పిల్లలకు క్యారెట్, దోసకాయ, ఆపిల్, ఆయా సమయాలలో దొరికే పండ్లను ఇచ్చినట్లయితే వాటితో పిల్లలు కడుపు నిండిపోతుంది . మరియు జంక్ ఫుడ్ లను తక్కువగా తీసుకుంటారు.

 

మనందరికీ తెలిసినట్లుగా ప్రతిరోజు ఒక ఆపిల్ తిన్నట్లయితే అది వారిని వైద్యుడికి దూరంగా ఉంచుతుంది.

 

కాబట్టి, ఆపిల్ దంతాలను శుభ్రంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ప్రత్యేకంగా బ్రష్ చేయవలసిన అవసరం కూడా లేదు. కావిటీస్ ను నివారించడానికి మీరు ప్రతి ఉదయం మరియు రాత్రి మీ  పిల్లలను బ్రష్ చేసుకోమని చెప్పండి.

 

చెడు అలవాట్లను మాన్పించండి :

 

మీ బిడ్డ నిద్రలో బొటనవేలు చీకుతున్నాడా ? మీ చిన్నారికి నాలుగు సంవత్సరాలు దాటి పోయిన ఇంకా అలవాట్లను మానకపోతే డాక్టర్ను సంప్రదించాలి. ఎందుకంటే ఆరు సంవత్సరాల వయసులో పిల్లలకు శాశ్వత దంతాలు ఏర్పడతాయి . మరియు ఈ రకమైన అలవాట్లు నిజంగా దవడ ఆకారాన్ని మరియు బయటకు వచ్చే దంతాల ఆకారాన్ని మార్చగలవు. ఈ అలవాటు నుండి పిల్లలను బయటకు తీసుకురావడానికి ఎన్నో కొత్త పద్ధతులు మరియు ఆవిష్కరణలు ఉన్నాయి. ఈ విధంగా బొటనవేలు చీకే అలవాటు ఉన్న పిల్లల కోసం దానిని మానిపించడానికి ఒక ఉపకరణం ఉంది. ఇది నాలుగు నుండి ఆరు నెలల వయస్సు గల పిల్లల దవడకు అతికించడం ద్వారా అది వారు ఆ అలవాటును మానడానికి సహాయపడుతుంది.

 

బాటిల్ పాలను ఇవ్వకండి :

 

బాటిల్ తో పాలు పట్టడం అన్నది శిశువుకు ఆరోగ్యకరమైనది మాత్రం కాదు. ఇది పిల్లల దంత ఆరోగ్యం, కావిటీస్ మరియు మిల్క్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ కు దారి తీస్తుంది. బాటిల్ పాలు తాగే పిల్లలు పాలు తాగిన తరువాత చాలా సేపు ఆ తీపి దంతాలకు అతుక్కుని ఉంటుంది. రాత్రిపూట పాలు తాగుతున్నందువల్ల చాలా మంది పిల్లల్లో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. అందువలన సాధ్యమైనంత తొందరలో పిల్లలకు బాటిల్లో పాలు పట్టడం మానేయండి. పాలు పట్టిన తర్వాత మీ బిడ్డ నోరు సరిగ్గా శుభ్రపరచటం మరిచిపోకండి.

 

దంత సంరక్షణ కోసం చేయవలసిన మరియు చేయకూడని కొన్ని పనులు :

 

దంత సంరక్షణ కొరకు చేయవలసినవి :

 

రోజుకి కనీసం రెండు సార్లు బ్రష్ చేయడం.

 

ఫ్లోసింగ్ చాలా ప్రయోజనకరమైనది . ఇది చిన్న వయసులోనే అలవాటు చేయాలి.

 

రాత్రిపూట బ్రష్ చేయడం విషయంలో ఎంత మాత్రం రాజీ పడకూడదు.

 

ప్రతి ఆరు నెలలకు ఒకసారి దంత పరీక్షలు చేయించాలి.

 

ఆపిల్, నారింజ, క్యారెట్, దోసకాయ వంటి పీచు పదార్థాల వినియోగాన్ని పెంచాలి.

 

ఆరోగ్యకరమైన మరియు సమతుల్య ఆహారం ఇవ్వండి.

 

ఆహారం తీసుకున్న ప్రతిసారీ నోటిని శుభ్రం చేసుకోవడం అలవాటు చేయండి.

 

చిన్న తలగల మృదువైన టూత్ బ్రష్ ను ఉపయోగించండి.

 

దంత సంరక్షణకు చేయకూడనివి :

 

నిద్రపోయే సమయంలో శిశువుకు సీసా పాలు ఇవ్వడం మానుకోండి.

 

కుకీలు, స్వీట్లు, చాక్లెట్లు మరియు కూల్డ్రింక్స్ వంటి అతుక్కునే ఆహారాలకు దూరంగా ఉండాలి.

 

పిల్లలకు మౌత్ వాష్ లను వాడకండి. వారికి అన్నిటికంటే ఉత్తమమైన మౌత్ వాష్ నీరు.

 

పిల్లలు ఎలా ఉమ్మి వేయాలో నేర్చుకునే వరకు ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ లను ఉపయోగించండి.

 

ఆహారాలలో పంచదారను చేర్చడం  మానుకోండి.

 

బాగా పాతబడిన టూత్ బ్రష్లను వాడడం మానుకోండి.

 

నాలుకను శుభ్రపరచడం మంచిది. కానీ, ఆ పనిని చాలా సున్నితంగా చేయాలి.


మీ పిల్లల దంత సంరక్షణ కై వచ్చిన ఈ బ్లాగ్ మీకు ఉపయోగపడిందా? దయచేసి మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాతో పంచుకోండి.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}