• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

నవజాత శిశువులకు ఎయిర్ కండిషనర్లు లేదా కూలర్లు: అవి సురక్షితమా ?

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన May 25, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

నవజాత శిశువులు చాలా సున్నితమైన వారు .కాబట్టి తల్లిదండ్రులు వారికి ఉపయోగించే ప్రతి వస్తువులు విషయంలోనూ శ్రద్ధ కలిగి ఉంటారు. అదే విధంగా వేడి మరియు ఒక్క పూతతో కూడుకొన్న వేసవి నుండి కూడా తమ చిన్నారుల కోసం ఎయిర్ కండిషన్ లేదా కూలర్ లను ఎంచుకుని విషయంలో మనలో చాలామంది ఎప్పుడు సందిగ్ధత లో ఉంటారు.ఏసీ లను ఉపయోగించవద్దు అని మన అనుభవజ్ఞులైన పెద్దలు చెబుతున్నారు . అదేవిధంగా కూలర్లను వాడ కూడదు అని తెలిపే ఎంతో మంది స్నేహితులు కూడా ఉన్నారు.

ఇది ఎంతో వాస్తవం. ఏ నిర్ణయం తీసుకోవాలో అన్నది ఎప్పుడు భయం తో నిండి ఉంటుంది . కాబట్టి వాటి వల్ల జరిగే మంచి చెడులను గురించి వివరంగా తెలుసుకుందాం.

శిశువులు పెద్దల మాదిరిగా వారి శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించుకోలేరు. కాబట్టి  పెద్దలే సరైన ఉష్ణోగ్రతలను వారికి అందించడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి . ఎక్కువ చల్లదనం మరియు ఎక్కువ వేడి కూడా వారిని అసౌకర్యానికి గురి చేస్తుంది.

ఉక్క పోతతో కూడుకొన్న వేడి లేదా అధిక చల్లదనం యొక్క ప్రభావాలు :

ఎక్కువ వేడి మరియు ఉక్కపోత గా ఉన్నట్లయితే పిల్లలకు ఈ విధమైన సమస్యలు సంభవిస్తాయి...

దద్దుర్లు, దురదలు, మరియు వడదెబ్బ.

మరియు ఎక్కువగా చలి గా ఉన్నట్లయితే చిన్నారులు వీటి బారిన పడతారు....

తరచుగా జలుబు రావడం, దగ్గు, గొంతు నొప్పి మరియు జ్వరాల బారిన పడతారు.

అందుకే చిన్నారులకు చల్లదనాన్ని ఇచ్చే పరికరాల విషయంలో ఎంతో తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.

కూలర్లు మరియు ఎయిర్ కండిషనర్లు ఎలా పనిచేస్తాయి ?

కూలర్లు :

ఇవి వేడిని ఆవిరి రూపంలో బయటకు పంపుతాయి .గాలిని చల్లగా చేసేందుకు కూలర్ లోపలకి ప్యాడ్స్ ద్వారా గాలి వెళుతుంది. అది చల్లదనానికి కారణం అవుతుంది. కాబట్టి ఒకలాంటి ఉక్కపోత ఏర్పడుతుంది.అందుచేత ఆ ఒక్క పోతన నియంత్రించేందుకు ఎల్లప్పుడూ తలుపు లేదా కిటికీలను తెరిచి ఉంచాలి.

ఎయిర్ కండిషనర్లు :

ఎయిర్ కండిషనర్లులు గ్యాస్ కంప్రెసర్ తో పనిచేసే శీతలీకరణ సూత్రంపై పనిచేస్తాయి . మరియు గదిని చల్లగా ఉంచుతాయి. ఉష్ణోగ్రతలను బాగా బ్యాలెన్స్ చేస్తాయి .ఉక్క పోతను నియంత్రించే సాధనాలుగా కూడా పని చేస్తాయి.

శిశువులకు ఎయిర్ కండిషనర్ లేదా కూలర్ ఏది మంచిది ?

నా అవగాహన మరియు అనుభవం ప్రకారం అందుబాటులో ఉన్నట్లయితే కూలర్ కంటే కూడా ఎయిర్ కండిషనర్ లు ఎంతో మంచివి.

ఎయిర్ కండిషనర్లు ఎక్కువ ఉష్ణోగ్రత ను బాగా నియంత్రిస్తాయి .ఇవి గది మొత్తాన్ని సమానంగా చల్లబరుస్తాయి అయితే కూలర్ల నుండి వచ్చే గాలి ఒక నిర్దిష్ట ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఇంటిలో ఉక్కపోత ను పెంచుతాయి . ఇది శిశువు కి అసౌకర్యంగా ఉంటుంది .వాతావరణంలో మార్పులు మరియు  దూళి లాంటి వాటిని నివారించేందుకు కూలర్ కంటే ఎయిర్ కండిషనర్లు ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు  క్రిమిసంహారక ఎయిర్ కండిషనర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

శిశువులకు శీతలీకరణ యంత్రాలను ఉపయోగించడం సురక్షితమా ?

ఎయిర్ కండిషనర్ వాడకం అనేది అన్ని రకాలుగా శ్రేయస్కరం అని అయితే ధ్రువీకరించలేము .వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లయితే అప్రమత్తంగా ఉండాలి.

అవి వాడేటప్పుడు పరిశీలించవలసిన కొన్ని విషయాలు.

కూలర్ల నుండి గాని మరియు ఎయిర్ కండిషనర్ల నుండి గాని వచ్చే గాలి పిల్లలకు నేరుగా తగలకుండా ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. వాటిలో దుమ్ము, అచ్చు మరియు ఇన్ఫెక్షన్లు రాకుండా వాటి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి.

తక్షణమే ఏసి లు అందుబాటులో లేనట్లయితే కూలర్లను ఉపయోగించమని కూడా సూచిస్తున్నాము. కానీ వీటిని ఉపయోగించేటప్పుడు ఎంతో అవగాహన అవసరం ఉంటుంది .మీ చిన్నారికి ఎంత వేడి లేదా చల్లదనం అవసరమో నిర్ధారించే ముందు ఈ విషయాలను పరిశీలించండి.

ఎక్కువ చలిగా లేకుండా ఉండేందుకు మీ చిన్నారికి ఎక్కువ పొరలు గల పలుచని దుస్తులను వేయండి. మీకంటే కూడా వారికి ఎక్కువ పొరలు గల వస్త్రాలు అవసరం ఉంటాయి.శిశువులు ఉన్న గదిని చల్లగా ఉంచేందుకు ఇతర మార్గాలు అయినా ఫ్లోరింగ్ మ్యాట్స్ ను ఉపయోగించడం మరియు నీటితో నింపిన గిన్నెలను గదిలో ఉంచడం కూడా చేయవచ్చు. నవజాత శిశువుకు గాలి ఆడని మూసి ఉన్న గదులు సురక్షితం కాదు.పగటి పూట కంటే కూడా రాత్రి వేళల్లో చల్లగా ఉంటుంది .కనుక వారి శరీర ఉష్ణోగ్రతలను గమనిస్తూ ఉండండి. 23 నుండి 26 డిగ్రీల వాతావరణం బిడ్డల ఆరోగ్యానికి అనుకూలమైనది. సాయంత్రం పూట తాజా గాలి కోసం కర్టెన్లను తెరిచి ఉంచండి. పగటి పూట లోపలకి వేడి రాకుండా కర్టెన్లను మూసి ఉంచండి. చిన్నారుల ఉష్ణోగ్రతను పరిశీలించే సమయంలో  కేవలం పాదాలు ,చేతుల మీద మాత్రమే చూసి నిర్ధారించకుండా వారి మెడ మరియు  చాతిమీద కూడా చూసి పరిశీలించండి.

ఏ విధంగా అయినా సరే బిడ్డ బాగా సౌకర్యంగా నిద్రిస్తున్న ట్లయితే తల్లికి అంతకంటే ఎక్కువగా ఏమీ అవసరం లేదు. ఆహ్లాదకరమైన వేసవి మరియు ఆరోగ్యకరమైన చల్లదనం.

ఈ బ్లాగ్ మీకు ఉపయోగకరంగా ఉందా ? తోటి తల్లిదండ్రులతో మీ అభిప్రాయాలను పంచుకోండి. మీ అభిప్రాయాలను వినేందుకు మేము ఇష్టపడతాము.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}