• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందా!

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Aug 01, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

కరోనావైరస్ రద్దీగా ఉండే ప్రదేశాలలో గాలిలో ఉండే అవకాశం ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించింది. ఇక్కడ గాలి లోని బిందువుల ద్వారా ప్రసరిస్తుంది అనే విషయాన్ని మనం తిరస్కరించ లేము.  నేను తల్లిదండ్రులను , ముఖ్యంగా పిల్లలను దృష్టిలో ఉంచుకొని ఈ బ్లాగును పంచుకుంటున్నాను. ఈ మహమ్మారి  సమయంలో సురక్షితంగా ఉండటానికి మీకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది అని నేను ఆశిస్తున్నాను. 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తల బృందం  మూడు రోజులు పరిశోధనలు చేసి జాతీయ అంతర్జాతీయ సంస్థలతో ధృవీకరించబడిన తరువాత కోవిడ్ - 19 గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది అని నిర్ధారించారు.

 

ఈ మూడు కేంద్రాల లెక్కలు మరియు పరిశోధన నుండి కనుగొన్న ఫలితాల ప్రకారం మాస్క వేసుకున్న వారి యొక్క మరియు మాస్కులు లేకుండా ఉన్న వారి యొక్క వ్యత్యాసాలను గమనించి మాస్కులు తప్పనిసరి అని సూచించారు. రద్దీగా ఉండే మూసి ఉండే ప్రదేశాలలో, సరిగ్గా గాలి ప్రవహించని ప్రదేశాలలో గాలిలోని బిందువుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. ఇది తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది అన్నది అతి ముఖ్యమైన విషయము. దగ్గు , తుమ్ములు మరియు మాట్లాడేటప్పుడు తుళ్ళి పడే తుంపర్ల ద్వారా ఈ వైరస్ యొక్క వ్యాప్తి ఉంటుందని ఇప్పటికే నమ్ముతున్నారు.

 

బిందువులు అంటే ఏమిటి ? శ్వాసకోశ తుంపర్ల కంటే  అవి ఎలా భిన్నంగా ఉంటాయి ?

 

ఈ బిందువులు అతి చిన్నగా ఉండి  బలంగా బయటకు వస్తాయి. ఇవి గాలిలోనే దుమ్ము, పొగ లేదా పొగమంచు వాటితో కలిపి నిలిచిపోయే కణాలుగా ఉంటాయి. ఇక్కడ   ఈ సూక్ష్మ బిందువులు శ్వాసకోశ బిందువుల కన్నా చాలా చిన్నవి గా (ఐదు మైక్రాన్లు లేదా అంతకంటే తక్కువ పరిమాణంలో) ఉంటాయి. ఇవి నేల మీద పడడానికి ఎక్కువ సమయం పడుతుంది.

 

గాలి ద్వారా వ్యాపించు బిందువులకు మరియు శ్వాస నాళాల ద్వారా వ్యాపించే తుంపరలు లకు మధ్య వ్యత్యాసం ఏమిటంటే, తుంపర్ల వలన వైరస్సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు  లేదా దగ్గినప్పుడు ఇతర వ్యక్తికి కళ్ళు , ముక్కు లేదా నోటి ద్వారా ప్రవేశిస్తుంది. ఈ గాలిలో నిలిచే బిందువులు  6 నుండి 9 అడుగుల వరకు ప్రయాణం చేయగలవు.ఈ బిందువులు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మూడు అడుగులు (ఒక మీటరు ) కన్నా తక్కువ దూరం ప్రయాణిస్తాయి. కాబట్టి  గాలి ద్వారా సంభవించేది ఎక్కువ దూరం ఉంటుంది ఎక్కువ వ్యాప్తికి దారి తీస్తుంది.

 

దానిని మనం ఎలా ఎదుర్కోవాలి ? సురక్షితంగా ఎలా ఉండాలి ?

 

నిజానికి, గాలి ద్వారా వ్యాప్తి చెందే దీనిని సరైన మాస్కులు ధరించడం ద్వారా దీని వ్యాప్తిని నిరోధించగలము. అధ్యయనాలలో కనుగొన్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సరైన రక్షణ ఫేస్ మాస్క్ లను ధరించడం వలన ఇది వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు లేదా పరిమితం చేయవచ్చు అని తెలుపుతున్నాయి. సరైన ఫేస్ మాస్కులు ధరించినప్పుడు ఒక మనిషి నుంచి మరొక మనిషికి వ్యాప్తి చెందడంను నివారించ డంలో బాగా పని చేస్తుంది అని రుజువు చేయబడింది.

 

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి రద్దీగా ఉండే ప్రదేశాలు, ఒకరికొకరు దగ్గరగా ఉండడం, చీకటిగా ఉండే మూసివేయబడ్డ ప్రదేశాలకు వెళ్లడం నివారించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి పరిచింది.

 

ఇంట్లోనే ఫేస్ మాస్క్ ఎలా తయారు చేయాలో తెలుసుకోవడానికి దయచేసి ఈ వీడియో చూడండి.

 

ఫేస్ మాస్క్ ధరించడం ఎలా ?

 

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ ఆదేశాల ప్రకారం ఫేస్ మాస్క్ ను ఎలా ధరించాలి అనే ఈ విషయంలో దయచేసి ఈ సూచనలను అనుసరించండి.

 

ఫేస్ మాస్క్ వేసుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

 

మీ ముక్కు మరియు నోటిని కప్పుతూ గడ్డం కింద గా దానిని భద్రపరచండి.

 

మీ ముఖానికి అన్ని వైపులా సౌకర్యవంతంగా ఉండే లాగా మాస్క్ ను అమర్చుకోండి.

 

మీరు సులభంగా ఊపిరి పీల్చుకునే  విధంగా సరి చూసుకోండి.

 

ఫేస్ మాస్క్ ను ఎలా తొలగించాలి ?

 

తల వెనుక భాగం నుండి మాస్కను తొలగించండి.

 

కేవలం ముడిని లేదా చెవి ధారాలను మాత్రమే తొలగించండి.

 

బయట భాగాలను మాత్రమే మడవండి.

 

దానిని అలాగే ఉంచి వాషింగ్ మిషన్ లో వేయండి.

 

మాస్క ను తొలగించే సమయంలో మీ కళ్ళు, ముక్కు మరియు నోటిని తాకకండి. 

మాస్కను తొలగించిన వెంటనే చేతులను శుభ్రపరచుకోండి.

 

కరోనా వైరస్ నుండి మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారిని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

 

1. ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగా ఉండే ఏ ప్రదేశానికి వెళ్తున్నప్పుడైనా మాస్కును ధరించడం తప్పనిసరి. గాలి ద్వారా వ్యాప్తి చెందే దీనిని మాస్క్ ద్వారా మాత్రమే నియంత్రించగలం.

 

2. తుమ్ములు మరియు దగ్గు ఉన్నప్పుడు మీ నోటిని మరియు ముక్కును టిష్యూ పేపర్ తో కప్పి వుంచండి. వాటిని ఉపయోగించిన తర్వాత దగ్గరలోని చెత్త కుండీలో వేయండి.  తుమ్ములు మరియు దగ్గు ఉన్నప్పుడు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోండి.

 

3. మూసి ఉండే మరియు రద్దీగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళకండి. ఒకవేళ వెళ్లవలసి వచ్చినా తప్పకుండా మాస్కులు ధరించండి. మాస్కులను ధరించేటప్పుడు మరియు తీసేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించండి.

 

4. మధ్య మధ్యలో మీ ముఖాన్ని తాకకండి. మీ ముఖం , ముక్కు , కళ్ళు సాధ్యమైనంతవరకు తాకకుండా ఉండండి.

 

5. శారీరక దూరం పాటించండి. మరియు ప్రతి రెండు మూడు గంటలకు ఒక సారి సబ్బు మరియు నీటితో ప్రతి సారి 20 సెకండ్ల పాటు చేతులను శుభ్రంగా కడుక్కోండి.

 

6. కార్యాలయాలు ,పాఠశాలలు ,ఆస్పత్రులు మరియు ఇతర భవనాలలో తగినంత గాలి వెలుతురు ఉండే ప్రదేశాలను ఎంచుకోండి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ లు మరియు ఫిల్టర్ల వంటి వాటిని ఉపయోగించడం ద్వారా గాలి ద్వారా వ్యాప్తి చెందడం నియంత్రించవచ్చు.

 

7. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి మరియు  క్రిమికీటకాలు లేకుండా ఉండేలాగా చూసుకోండి..

 

8. కనీసం 9 నుండి 12 అడుగుల సురక్షిత సామాజిక దూరాన్ని పాటించండి.

 

గుర్తుంచుకోండి, ముందు జాగ్రత్తలు పాటించడం రోగ నివారణ కంటే ఎప్పుడు మంచిది. కరోనా వైరస్ నుండి మిమ్మల్ని , మీ ప్రియమైన వారిని సురక్షితంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ఉన్న ఈ బ్లాగ్ మీకు సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి.


 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}