• లాగ్ ఇన్
 • |
 • నమోదు చేయు
చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్

బాలల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ లో కంప్లైంట్ మోనిటరింగ్ సెల్‌: వివరాలివే!

Ch Swarnalatha
0 నుంచి 1 సంవత్సరాలు

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jun 09, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఇందుకుగాను ప్రధాన ప్రభుత్వ శాఖలన్నింటినీ సమన్వయపరుస్తోంది. బాలల హక్కుల పరిరక్షణకు గాను జగన్ ప్రభుత్వం వచ్చే నెలలో ప్రత్యేకంగా ‘కంప్లైంట్‌ మానిటరింగ్‌ సెల్‌ (సీఎంఎస్‌)’ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా పిల్లలకు సంబంధించిన  విజ్ఞాపనలు, ఫిర్యాదులను పరిశీలించి సమన్వయం చేసేందుకు రాష్ట్రస్థాయిలో ఒక సమన్వయకర్త (కోఆర్డినేటర్‌)ను నియమిస్తారు. ప్రతి గ్రామ, పట్టణాల్లోని వార్డు స్థాయిల్లో అధికారులకు బాధ్యతలు అప్పగిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, మహిళా పోలీస్, వలంటీర్‌లను సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేస్తారు. ఇందుకోసం ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. 

ముఖ్యాంశాలు

 •  విద్యా హక్కు చట్టాన్నిమరింత  పటిష్టంగా అమలు చేస్తారు.

 •  చిన్నారులపై లైంగిక వేధింపులు, లైంగిక దాడులు వంటి నేరాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా పోలీస్‌ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తారు. 

 • పోక్సో చట్టంతోపాటు బాలల హక్కులపైన పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహి౦చనున్నారు.

 • బాలల అక్రమ రవాణాపై ప్రభుత్వం పిడికిలి బిగించనుంది. పేదరికం, ఆర్థిక సమస్యలు, కోవిడ్‌ కారణంగా పేద కుటుంబాలకు చెందిన బాలలు అక్రమ రవాణా బారిన పడుతున్నారు. కొందరు బ్రోకర్లు బాలలను కార్మికులుగా, బలవంతపు వ్యభిచారానికి, యాచక వృత్తిలోకి దింపుతున్నారు. బాలలపై ఈ అమానుషాలనుఅరికట్టేలా పటిష్టమైన చర్యలు చేపట్టింది.

 • ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బాల్య వివాహాలు, డ్రాపవుట్స్‌  వంటి వాటిని నివారించేందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను భాగస్వాముల్ని చేయనున్నారు.

 • దత్తత పేరుతో జరుగుతున్న మోసాలను నివారించడంపై దృష్టి పెట్టారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో చేసే దత్తత రిజిస్ట్రేషన్‌ చెల్లదనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల దత్తతకు కేంద్ర, రాష్ట్ర మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కఠినంగా అమలు చేయనున్నారు.

 • ప్రభుత్వ యంత్రాంగం జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు, పోలీసులను సమన్వయ౦తొ భ్రూణ హత్యలకు దారితీసే లింగ నిర్ధారణ పరీక్షలు, ఆడ శిశువులను వదిలించుకునే వారు, సరోగసి (అద్దె గర్భాల) మాఫియాలపైనా దృష్టి పెట్టారు. పరిచి ఈ మాఫియాపై కఠిన చర్యలు చేపడుతున్నారు.

 • బాలల స్వీయ రక్షణకు తోడ్పడే దిశ అప్లికేషన్‌ (యాప్‌)పై ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోంది. ఈ యాప్‌ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆపద సమమంలో దిశ యాప్‌ రక్షణ కవచంలా ఉంటుందని బాలలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

పది ప్రభుత్వ శాఖలతో సమన్వయం

బాలల హక్కులు, సమస్యలపై పది ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణతో పనిచేయనున్నారు. ప్రధానంగా వైద్య ఆరోగ్య, విద్య, పోలీస్, కార్మిక, పంచాయతీరాజ్, మహిళా శిశు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలతోపాటు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమన్వయంతో బాలల సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతోంది.

 • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}