మీ పిల్లల గొడవ వెనుక మీరు కారణమా ? బహుశా అవును!

Aparna Reddy సృష్టికర్త నవీకరించబడిన Oct 05, 2020

ప్రియాంక బిడ్డ ఘన పదార్థాలు తినడం ప్రారంభించినప్పటి నుండి, గిన్నె లోని చివరి ముద్ద వరకు పూర్తిచేయాలని తాపత్రయం లోనే ఉంటుంది. కొన్నిసార్లు చివరి మూడు ముద్దలు తినడం కోసం పోరాటం చేస్తుంది. తన బిడ్డ ఆహారాన్ని తినడం విషయంలో ఆమె ఎంతో ఆతృతగా ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే - ఆమె ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే- బిడ్డ మొదటి సంవత్సరం దాటే సమయానికి ఎంతో ఆశ్చర్యపోతుంది!
బిడ్డ భోజనం విషయంలో, ముఖ్యంగా మన దేశంలో పిల్లలు తినేందుకు సహకరించటం లేదని బెదిరించడం మరియు లంచం ఇవ్వడం లాంటివి చేస్తారు. అవును, దాని వెనుక ఉన్న ఆమె ఉద్దేశం మంచిది. ఆమె తన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటుంది. పిల్లలు ఆకలితో లేనప్పుడు కూడా మీరు ఆత్రుతగా ఆహారాన్ని ఇవ్వడం విషయంలో బలవంతం చేయాల్సిన అవసరం ఉందా? బలవంతంగా ఆహారాన్ని తినిపించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు అది వ్యతిరేకమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. ఆ సంకేతాలు ఎలా ఉంటాయో మీరు తెలుసుకునేందుకు సహాయపడటానికి మేము ఎక్కడ ఉన్నాము. అలా చేయడాన్ని మానేయండి.
మీ పిల్లలకు బలవంతంగా ఆహారం ఇవ్వడం ఎందుకు మంచిది కాదు ?
తాత్కాలికంగా మీ పిల్లవాడు కడుపునిండా భోజనం చేసినట్లుగా మీకు అనిపించవచ్చు. బిడ్డ ఎంతో వ్యతిరేకించినప్పటికీ ఆహారాన్ని పూర్తిగా తినిపించగలుగుతారు. బలవంతంగా తినిపించడం వలన కొన్ని ప్రతికూల ప్రభావాలు ఇక్కడ ఉన్నాయి-
ఆహారపు రుగ్మతలు :
ప్రారంభ దినాలలో బలవంతంగా ఆహారం ఇవ్వడం వలన ఆకలి మందగించడం మరియు ఊబకాయం వంటి రుగ్మతలకు దారితీస్తుంది.
విరక్తి :
మీ బిడ్డకు ఆహారం తినాలి అనిపించక పోయినప్పటికీ ఇప్పుడే తినాలి, ఎంత తినాలి అని నిరంతరం బలవంతం చేస్తూ ఉన్నందువల్ల ఆహారం పట్ల విముఖత కలుగుతుంది. భోజనం విషయంలో ప్రతికూలత సంభవిస్తుంది. మీ పిల్లవాడు భోజన సమయం యుద్ధానికి సిద్ధంగా ఉంటాడు. దీనివల్ల నష్టం వాటిల్లుతుంది.
అనారోగ్యకరమైన ఆహారపు ప్రాధాన్యత :
మీరు భోజనం తినడానికి పిల్లలకు స్వీట్స్ లేదా జంక్ ఫుడ్స్ ను లంచంగా ఇస్తే, వారు అటువంటి ఆహారంపై మాత్రమే ఇష్టాన్ని పెంచుకుంటారు. మరియు అది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
బలవంతంగా ఆహారాన్ని తినిపించడం నివారించడానికి నేను ఏమి చేయగలను ?
శుభవార్త ఏమిటంటే, మీ పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడం మీరు అనుకున్నంత కష్టం కాదు. అవును, దీనికి కొంత ప్రయత్నం అవసరం. కానీ బలవంతంగా పిల్లలకు ఆహారాన్ని తినిపించవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. ఇక్కడ కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి :
సమయం కోసం వేచి ఉండండి :
మీ బిడ్డ ఆకలితో ఉన్నప్పుడు కొన్ని గుర్తులు ఉంటాయి. చిన్న పిల్లలు ఏడుస్తారు లేదా మొండిగా ఉంటారు. కొంచెం పెద్ద పిల్లలు అయితే ఆహారం కోసం అడుగుతారు లేదా వంటింటి వైపు పరుగులు పెడతారు. అయితే, ఆకలి తీవ్రతరం కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఇప్పుడు మీ పిల్లల ప్రవర్తనను కనుగొన్నారు మరియు వారు ఎప్పుడూ ఆకలితో ఉన్నారో మీకు తెలుస్తుంది. పిల్లలు ఆకలిగా లేనట్లయితే ఆహారాన్ని దూరంగా నెట్టేస్తారు.
గొడవను పెంచుకోవద్దు :
మీ బిడ్డకు ఆహారాన్ని బలవంతంగా ఇవ్వడం వలన వద్దు అని చెప్పే అలవాటు పెరిగిపోతుంది. దాని గురించి ఆలోచించండి. సాధారణంగా బలవంతంగా చేయబడిన ఏ పని అయినా ఇష్టపడరు. పిల్లలు తినాలన్న ఆలోచనను మాని, తినకుండా ఎలా ఎదుర్కోవాలా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు.
భోజన సమయాన్ని సరదాగా ఉంచండి :
అందరూ కలిసి భోజనం చేయండి. ఆరోగ్యకరమైన ఆహారాలను తయారు చేయండి. వారికి ఇష్టమైన దాన్ని ఎంచుకుని తిన నివ్వండి. భోజన సమయం అంటే సంభాషణలు మరియు కబుర్లు చెప్పుకోవడానికి తగిన సమయం. కాబట్టి మీ పిల్లలతో మాట్లాడండి మరియు వారిని మీతో అన్ని పంచుకోవడానికి ప్రోత్సహించండి.
ఆహారపు ఆటలు :
మీరు కొన్ని ఆహారపు ఆటలను ఆడటం ద్వారా భోజనం సమయంలో ఆనందించవచ్చు. ఉదాహరణకు.." అది ఒక ఎర్రని రోజు" మీరు రకరకాల ఎర్రటి ఆహారాన్ని ఆరోజు కలిగి ఉండవచ్చు. క్యాప్సికం, టమాటా , డెసర్ట్ కోసం స్ట్రాబెర్రీలు. వేగంగా తినడం లేదా ఎవరు మొదట పూర్తిచేస్తారు అనేటటువంటి ఆటలు ఆడకుండా జాగ్రత్త వహించండి. ఎందుకంటే, పిల్లలు త్వరగా. ఆహారాన్ని నమలకుండ బలవంతంగా తినడం వలన అజీర్ణానికి దారితీస్తుంది.
వంటగది సహాయకులు :
కొంచెం పెద్ద పిల్లలు అయితే భోజనం తయారు చేసేటప్పుడు మీరు వారి సహాయం కోసం అడగవచ్చు. వంట చేసేటప్పుడు పాలుపంచుకోవడం వారికి బాధ్యత భావాన్ని ఇస్తుంది. మరియు వారు వండటానికి సహాయం చేసిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. పసిపిల్లలు కూడా అన్నిటిలో పాలు పంచుకోవడం అంటే ఎంతో ఇష్టపడతారు. వారు చేయదగిన చిన్న చిన్న పనులను వారిని చేయనివ్వండి.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మీరు అనుకున్న దానికంటే చాలా సులభం. దీనికి కొంత సహనము మరియు ప్రేమ అవసరం ఉంటుంది. ఎంత మాత్రం బలవంతం చేయకూడదు. హ్యాపీ పేరెంటింగ్ !
భోజన సమయ యుద్ధాలలో మీరు ఎలా వ్యవహరిస్తారు ? క్రింది వ్యాఖ్యల విభాగంలో మీ చిట్కాలను మాతో పంచుకోండి !
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు
పైన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్లాగ్లు
పైన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చర్చలు
పైన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ప్రశ్న

{{trans('web/app_labels.text_some_custom_error')}}
{{trans('web/app_labels.text_some_custom_error')}}