• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఫుడ్ అండ్ న్యూట్రిషన్

ఆరోగ్యమే మహాభాగ్యము

Radha Shree
1 నుంచి 3 సంవత్సరాలు

Radha Shree సృష్టికర్త
నవీకరించబడిన Dec 03, 2019

మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము.

మనదేశంలో ఎక్కువశాతం పిల్లలు 6నెలల వరకు తల్లిపాల మీదే ఆధారపడి ఉంటారు. వారి పెరుగుదల కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే 6నెలల తరువాత నుంచి తల్లిపాలు మాత్రమే సరిపోవు వారి పోషణకు. 6నెలల నుంచి వారి పెరుగుదలకు కావలసిన కాలరీలు, ప్రోటీన్ల ఆవశ్యకత పెరుగుతుంది. ఆ అవసరాలను తల్లిపాలు మాత్రమే తీర్చడం కుదరదు. అందుచేత 6 నెలల తరువాత నుంచి పిల్లలకు తల్లిపాలతో పాటు, పోతపాలు లేదా ఇతర ఆహార పదార్థాలను ద్రవరూపంలో గాని, గణరూపంలో అలవాటు చేసే పద్ధతిని వీనింగ్‌ అని అంటారు.

పిల్లలను క్రమంగా తల్లిపాలతో పాటు ఇతర ఆహారానికి అలవాటు చేసే ఆహార పదార్థాలను వీనింగ్‌ ఫుడ్స్‌ అని అంటారు. పాలలో విటమిన్‌ సి చాలా తక్కువగా లభ్యం అవుతుంది. ఈ విటమిన్‌ సి ని అందివ్వడానికి పిల్లలకు 6నెలల నుండి పండ్ల రసాలను ఇవ్వాలి. తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఏర్పడిన ఐరన్‌ నిల్వలు లివర్‌లో ఉంటాయి. ఇవి పుట్టినప్పటి నుండి 4-6 నెలల వరకు సరిపోతాయి. తరువాత నుండి ఐరన్‌ ఆహారం ద్వారా వారికి లభించాలి.

పాలలో విటమిన్‌ డి కూడా తక్కువగా లభిస్తుంది. పిల్లలు అనుకున్న రీతిలో ఆరోగ్యంగా, పెరగాలి అంటే సప్లిమెంటరీ ఫీడింగ్‌ 6నెలల నుండి ఆరంభించాలి. లేకపోతే పిల్లల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది.

పుష్టికరమైన ఆహారంతోబాటు మంచిగా వ్యాయామం చేస్తే మీ పిల్లల్లో పెరుగుదల కనపడుతుందని చిన్నపిల్లల వైద్యులు తెలిపారు. పిల్లల్లో పౌష్టికాహార లోపానికి గురైన పిల్లలు శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. వీరిలో ఎదుగుదల లేకపోవడం, అర్థం చేసుకొనే శక్తి లోపించడం జరుగుతుంది. ఈ తరహా పిల్లలు బడి మానివేయడం జరగవచ్చు. వీరిలో జబ్బులను ఎదుర్కొనే శక్తి లోపించడం వల్ల తరచు వ్యాధుల బారిన పడతారు.

పిల్లల్లో పౌష్టికాహార లోపం వల్ల కలిగే కొన్ని పర్యవసనాలు తిరిగి సవరించుకోలేనివిగా ఉంటాయి. పోషకాహారం లేకపోవడం అనేది పిల్లల్లో తీవ్ర ఆందోళనలు కలిగించే విషయం, పోషకాహారం తక్కువగా లభించే పిల్లలు తప్పనిసరిగా శారీరక, మానసిక లోపాలకు కూడా గురవుతారు. పిల్లలు ముఖ్యంగా విటమిన్ - ఎ ఐరన్, కాల్షియం, అయొడిన్ వంటి పోషక పదార్థాల లోపానికి గురవుతారు. ఆ లోపాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ అవి పిల్లల ఎదుగుదలకు, రోగనిరోధకశక్తి పై ప్రభావం చూపుతుంది.

బిడ్డ పెరుగుదల, అభివృద్ధికి సంబంధించిన లోపాలు లేకుండా ఉండటమే, బిడ్డ గర్భస్థస్థితిలో ఉన్నప్పటి నుండి 5 సం.ల వయస్సు వచ్చే వరకు కాకుండా ఆ బిడ్డ శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఆరోగ్యంగా ఉండటాన్నే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు అని చెప్పగలం.

గర్భస్థంగా ఉన్నప్పుడు, నవజాత శిశువు, శిశువు దశలో, చిరు బాల్య దశలో ప్రీ  స్కూల్ దశలో :

ఈ వయస్సులో ఉన్న పిల్లలు ఎక్కువగా అంటువ్యాధులకు, ఇతర లోపాలకు ఎక్కువగా గురవుతుంటారు. కాబట్టి ఈ దశలో మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరి ఆరోగ్యాన్ని కాపాడాటానికి సరైన ఆరోగ్య సేవలు అనేవి గర్భస్థ దశ నుంచి అవసరము. అంతే కాకుండా బాల్య దశలోని ఆరోగ్య స్థితి జీవితంలోని అనేక దశలలోని ఆరోగ్య స్థితిపై ప్రభావితం చూపిస్తుంది.

నవజాత శిశువుకు వచ్చే ఆరోగ్య సమస్యలు – కామెర్లు, ధనుర్వాతం, శ్వాస సంబంధ సమస్యలు, ఉష్ణోగ్రతను క్రమపరచకోవటం నోటి పూత సంబంధిత వ్యాధులు .

పిల్లల పెరుగుదల, అభివృద్ధిని పర్యవేక్షించడం చాలా ముఖ్యమైనది. ఇది పిల్లల ఆరోగ్యాన్ని వారి పోషణ స్థితిని తెలియచేస్తుంది. మరియు పిల్లల పెరుగుదలలో వచ్చే తేడాలను తెలియచేస్తుంది. దీని వలన కుటుంబ స్థాయిలో నివారణోపాయాలను తీసుకోవడానికి సహాయపడుతుంది.

పిల్లలలో ముఖ్యంగా ఎత్తు, బరువు, తల, ఛాతిలను కొలవటం ద్వారా తెలుసుకో వచ్చును.

పిల్లలలో పెరుగుదలను క్రమ బద్ధంగా పర్యేవేక్షించుట ద్వారా కుపోషణ వలన పిల్లల పెరుగుదలలో ఏదైనా తరుగుదల కనిపించటం తెలుస్తుంది. వెంటనే ఆరోగ్య కార్యకర్త /తల్లులు వారిని తిరిగి మామూలు స్థితికి రావడానికి చర్యలు తీసుకోవచ్చు. క్రమంగా బరువు పెరగటం అనేది ఆరోగ్యానికి సూచిక వంటిది.

ఈ దశలో అంటువ్యాధులు సోకకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పిల్లలు వేసుకునే దుస్తులు, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పిల్లల పట్ల ప్రేమ ఆప్యాయతలను కనపరచాలి. దీని వలన పిల్లలో రక్షణ భావం, నమ్మకం, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుంది. సరిపోయినంత ప్రేమ, ఆప్యాయత మరియు ఇతర అవసరాలకు సరైన స్థితిలో లేకపోవడం వలన పిల్లలలో అభద్రతాభావం ఏర్పడుతుంది. దీని వలన వారి మానసిక మరియు ప్రవర్తనలో మార్పులు జరుగుతాయి. కనుక తల్లిదండ్రులకు వారి పిల్లలు శారీరకంగా, మానసికంగా భావోద్రేకాలపరంగా రక్షణ కల్పించడం అవసరం. ఇది వారిలో ఆత్మస్థైర్యాన్ని, నమ్ముకున్న విషయాలను గ్రహించే శక్తిని మరియు భద్రతాభావాన్ని కల్పిస్తుంది.

పిల్లలు చిన్న వయసులో సున్నితముగ ఉండటం వలన వారిని  జాగ్రత్తగా ఎటువంటి అంటువ్యాధులు, ఇతర వ్యాధులు రాకుండా కాపాడుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. పైన సూచించిన విధాలుగా తగిన చర్యలు తీసుకుంటే పిల్లలు వ్యాధుల బారిన పడకుండా ఉంటారు, పెద్దలకు కూడా ఉపశమనం దొరుకుతుంది.


 

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్లాగ్లు

Always looking for healthy meal ideas for your child?

Get meal plans
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}