• లాగ్ ఇన్
 • |
 • నమోదు చేయు
పేరెంటింగ్

హైదరాబాద్ లో మైనర్ బాలికపై దారుణం: టీనేజ్ పిల్లల భద్రత పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Ch Swarnalatha
11 నుంచి 16 సంవత్సరాలు

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jun 04, 2022

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున కారులో ఓ మైనర్ బాలిక పై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. పబ్‌ కి వెళ్ళిన బాలికను ఇంట్లో దింపేస్తామంటూ కారు ఎక్కించుకున్న ఐదుగురు దుండగులు.. నిర్మానుష్యమైన గల్లీల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆందోళనకు లోనైన బాలిక ఇంటికి వచ్చాక రెండురోజులు ముభావంగా ఉండటం చూసి తల్లిదండ్రులు ఆరా తీసారు. జరిగిన అమానుషం తెలిసి ఫిర్యాదు చేయడం.. పోలీసులు లోతుగా ఆరా తీయడంతో ఈ దారుణం బయటపడింది. ఈ నేపధ్యంలో మన టీనేజ్ పిల్లలపై ఇల్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తల్లితండ్రులుగా మనం తీసుకోవాల్సిన చర్యలేమిటో తెలుసుకుందా౦. 

చాలా మంది యుక్తవయస్కులు మరింత స్వేచ్ఛ కావాలనుకుంటారు. మరోవైపేమో, బయటకి వెళ్ళినపుడు వారికి ఎం జరుగుతుందో అని తల్లిదండ్రులు తరచుగా భయపడతారు.

తల్లితండ్రులు ఎం చేయాలంటే..

 • యుక్తవయస్కులు బయటకు వెళ్లడానికి ముందు వారు ఎంత దూరం వెళ్ళవచ్చు,  మరియు కారును లేదా బైక్ ను ఎంతసేపు ఉపయోగించగలరు అనే వాటిని పరిమితం చేయ౦డి.  వారికి మరింత బాధ్యతను ఇవ్వండి.

 • టీనేజర్లు మరింత స్వాతంత్ర్యం కోసం సిద్ధంగా ఉన్నారో లేదో నిర్ణయించేటప్పుడు వారు ఇంతకుముందు తీసుకున్న నిర్ణయాల చరిత్రను పరిగణించండి. హఠాత్తుగా, హడావిడిగా  నిర్ణయాలు తీసుకునే పిల్లలకు ఎక్కువ సమయం మరియు మార్గదర్శకత్వం అవసరం కావచ్చు.

 • వారితో కనెక్ట్ అయి ఉండండి మరియు కమ్యూనికేట్ చేయండి.  

 • గుంపులుగా బయటకు వెళ్లడం వల్ల టీనేజ్ పిల్లలు ఒకరినొకరు  తోడుగా, సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది.  అయితే స్నేహితులు ప్రమాదకర నిర్ణయాలు తీసుకోమని ప్రోత్సహిస్తే అది ఇబ్బందులకు దారి తీస్తుంది.

 • మీ టీనేజ్‌లు ఎవరితో గడుపుతున్నారో, అక్కడ  పెద్దలు ఎవరైనా ఉన్నారో తెలుసుకోండి. మీ కుటుంబ విలువలు గురించి,  అసురక్షిత పరిస్థితుల్లో ఏమి చేయాలో అనేదాని  గురించి మాట్లాడండి.

 • మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోండి. వారి ప్లాన్‌లు మారినపుడు లేదా వారు ఇంటికి రావటం ఆలస్యం అయినపుడు మీకు తెలియజేయమని అడగండి.

బయటకు వెళ్ళినపుడు టీనేజర్లు ఏం చేయాలంటే..

యుక్తవయస్కులు ఒంటరిగా లేదా స్నేహితులతో ఇంటిని విడిచిపెట్టే ముందు, ఇంతకు ముందు విన్నప్పటికీ, వారు సురక్షితంగా ఉండేందుకు ఉపయోగపడే  ఈ భద్రతా  చిట్కాలను పరిశీలించండి. వాటిని  పాటించాల్సిందిగా మీ టీనే జర్లకు  తెలియచేప్పండి.

 • మీ సెల్‌ఫోన్‌ను ఛార్జ్ చేయండి మరియు మీరు అత్యవసర కాల్ చేయవలసిఅది  అందుబాటులో  ఉండాలి.

 • మీరు ఎక్కడ ఉంటారో మరియు ఎవరితో ఉన్నారో తల్లిదండ్రులకు తెలియజేయండి. ప్లాన్‌లు మారితే వాటిని అప్‌డేట్ చేయండి.

 • ట్రాఫిక్, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు,  మీరు మీ కారును ఎక్కడ పార్క్ చేసారో సహా మీ పరిసరాలపై శ్రద్ధ వహించండి.

 • రాత్రిపూట బాగా వెలుతురు ఉన్న బహిరంగ ప్రదేశాల్లోనే నడవండి.

 • రాత్రిపూట జాగింగ్ లేదా బైకింగ్ చేసేటప్పుడు డార్క్ కలర్స్ కాకుండా స్పష్టంగా కనపడే   దుస్తులను ధరించండి.

 • మీరు నడుస్తున్నప్పుడు లేదా జాగింగ్ చేసేటప్పుడు హెడ్‌ఫోన్‌లను ధరిస్తే వాటిని తక్కువ వాల్యూమ్‌లో ఉంచండి.

 • డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, నదుస్తున్నపుడు  ఫోన్ లను వాడవద్దు. వారి ఫోన్‌లను పక్కన పెట్టమని మీ స్నేహితులకు కూడా  గుర్తు చేయండి.

 • మద్యం సేవించవద్దు, డ్రగ్స్  వాడవద్దు. మద్యం సేవించిన లేదా డ్రగ్స్ వాడుతున్న వారితో లేదా డ్రైవర్‌తో కారులో ఎక్కవద్దు.

 • పరిస్థితి అసురక్షిత౦గా  లేదా అసౌకర్య౦గా ఉంటె, బయటపడటానికి మీ  తల్లిదండ్రులను సాకుగా ఉపయోగించండి.

టీనేజర్లకు  మార్గనిర్దేశం చేయడం, వారిని కాపాడటం తల్లిదండ్రుల పని. మీరు నిబంధనలను సెట్ చేసి,  కొంత బాధ్యతతో  వారిని బయట అడుగు పెట్టనివ్వడం.. బయటకు వెళ్ళినపుడు, భద్రంగా  ఉండటానికి వారిని సిద్ధం చేస్తుంది. టీనేజర్ల భద్రతపై మరిన్ని అంశాలను  మీరు తెలుసుకోవాలన్నా లేదా మీకు తెలిసినవి పంచుకోవాలన్నా కామెంట్ చేయండి. 

 • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}