• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

లాక్ డౌన్ కారణంగా పసి పిల్లలకు వేసే టీకాలు ఆలస్యం అయినట్లయితే. నిపుణులు ఏమంటున్నారు ?

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Apr 23, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన అంటువ్యాధిగా మారింది. భారత ప్రభుత్వం దీని నుండి దేశాన్ని కాపాడేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగా అన్ని రాష్ట్రాలలోనూ లాక్ డౌన్ ప్రకటించవలసి వచ్చింది.అందులో కొన్ని రాష్ట్రాల జనాభా అయితే యూరోపియన్ దేశాల జనాభా కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ జనాభాను కలిగి ఉన్నాయి.

అనేక నగరాలలో కర్ఫ్యూలు ,లాక్ డౌన్లో ల కారణంగా ప్రయాణ సౌకర్యాలు ఆగిపోయాయి. ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో అని చాలా మంది భయపడుతున్నారు .అదేవిధంగా ఎందరో నవజాత శిశువులు ఉన్న తల్లిదండ్రులు కూడా తమ చిన్నారులకు ఇవ్వ వలసిన టీకాల విషయం లోనూ ఇతర ఇన్ఫెక్షన్ల భద్రత విషయంలోనూ ఎంతో ఆందోళన చెందుతున్నారు.

అయితే ప్రస్తుత అవసరాలు ఏమిటి ? అందుకోసం మీరు హాస్పిటల్కు వెళ్లవలసిన అవసరం ఉందా?

ఈ విషయాలపై తల్లిదండ్రులు సాధారణంగా అడిగే కొన్ని ప్రశ్నలకు ఎంతో మంది నిపుణుల యొక్క సమాధానాలు ఇక్కడ ఉన్నాయి. (మీరు ఈ ప్రశ్నలను నేరుగా నిపుణులే అడగవచ్చు.ఈ ప్రశ్నలను పోస్ట్ చేసేందుకు ఇక్కడ నొక్కండి)

ప్రశ్న 1. మా చిన్నారి కి టీకాలు ఇవ్వవలసిన టైం అయింది. లాక్ డౌన్ కారణంగా కొన్ని రోజుల తర్వాత ఇప్పించ వచ్చా ?

సమాధానం: కరొనా వైరస్ ఇన్ఫెక్షన్ కు దూరంగా ఉండడం అన్నది ప్రస్తుతం మనం చేయవలసిన ముఖ్యమైన పని. కొవిడ్ ,-19 సంక్రమించకుండా సురక్షితంగా ఉండేందుకు స్థానిక సంస్థలు మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసే సూచనలను పాటించండి. రోగనిరోధక శక్తి పెంచే తల్లిపాలను ఇవ్వండి. లాక్  డౌన్ అనేది  ఒక తాత్కాలికమైన ఏర్పాటు మాత్రమే .పరిస్థితులు చక్కబడిన తర్వాత మీరు సాధారణ టీకాలకు వెళ్ళవచ్చు.

ఈ సమయంలో మీరు ఫోన్ ద్వారా కానీ ఆన్లైన్ చాటింగ్ ద్వారా కానీ మీ వైద్యులను సంప్ర దించవచ్చు .అధికారులు మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మీరు స్వయంగా హాస్పిటల్కు వెళ్ళకూడదు.

ప్రశ్న2. లాక్ డౌన్ సమయంలో మా శిశువు అనారోగ్యానికి గురి అయితే మేము ఏమి చేయాలి ?

సమాధానం: లాక్ డౌన్ సమయంలో కూడా మందుల షాపులు తెరిచి ఉంటాయి .కాబట్టి మీరు మందులు ఖరీదు చేయవచ్చు .కానీ ఆ ప్యాకెట్లు తెరిచి ఉపయోగించే ముందు వాటిని శుభ్రపరచండి .డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం కొన్ని సాధారణ మందులను నిలువ చేసుకోవచ్చు .తరచుగా మెడికల్ షాపులకు వెళ్ళకండి.

మీరు ఫోన్ ద్వారా గాని ,వీడియో చాట్ ద్వారా కానీ మీ వైద్యుని తో సన్నిహితంగా ఉండండి .తద్వారా మీకు అవసరం అయినప్పుడు వారిని సంప్రదించవచ్చు. మందుల విషయంలో భయపడవలసిన అవసరం లేదు .ఈ సమయంలో కూడా అన్ని మందుల షాపులు తెరిచి ఉంటాయి.

ప్రశ్న 3. చిన్న పిల్లలలో కరోనా ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు ఏమిటి ?

సమాధానం: చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరిలోనూ కరోనా వైరస్ లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి .సాధారణంగా చిన్న పిల్లల్లో ఈ లక్షణాలు అంత ఎక్కువగా ఉండకపోవచ్చు .(ఇప్పటివరకు నిర్ధారించిన కేసుల ఆధారంగా )ఈ లక్షణాలు పొడిదగ్గు, తేలికపాటి జ్వరం మరియు శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది.

మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఏమైనా కనిపించినట్లయితే వెంటనే కరోనా వైరస్ అత్యవసర నెంబర్ కు కాల్ చేసి వారి సూచనలను అనుసరించండి.

ప్రశ్న 4. నేను అనుకుంటున్న విధంగా గర్భంతో ఉన్న మహిళలకు కరోనా వైరస్ వచ్చేందుకు ఎక్కువగా అవకాశం ఉందా ?

సమాధానం: సి డి సి (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ )మరియు ఇతర వైద్య అధికారుల ప్రకారం కొవిడ్-19 మహిళలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మాత్రం ధృవీకరించడం లేదు .అయినప్పటికీ గర్భధారణ సమయంలో శరీరం అనేకమైన హార్మోనల్ మార్పుల కు గురి అవుతుంది. ఈ కారణంగా తల్లులకు సాధారణంగా  ప్లూ వంటి అనారోగ్యాలను ఎదుర్కొనేందుకు కూడా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.

అందువల్ల మీరు గర్భధారణ సమయంలో ఎక్కువ పరిశుభ్రతను పాటించాలి.మరియు అనారోగ్యంతో ఉన్న వారికి మరియు ఈ వైరస్ సంక్రమించే అన్నింటికీ దూరంగా ఉండాలి .రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం మంచిది కాదు .సబ్బునీటితో చేతులను క్రమం తప్పకుండా కడుక్కోండి. ఈ సమయంలో ఫోన్ లేదా వాట్సాప్ లో మీ వైద్యునితో సన్నిహితంగా ఉండండి.

ప్రశ్న 5. నేను అనుకుంటున్నట్లుగా ,నేను కరోనా వైరస్ బారినపడినట్లయితే అది నా శిశువుకు కూడా సంక్రమిస్తుందా ?

సమాధానం: ఇప్పటివరకు 10 మంది కంటే ఎక్కువ కరోనా వైరస్ బారిన పడ్డ తల్లులు తమ బిడ్డకు జన్మనిచ్చారు.కానీ వారు పుట్టే టప్పటికీ వారిలో ఎటువంటి రోగలక్షణాలు కనిపించలేదు. కానీ పుట్టిన తర్వాత తల్లి సంపర్కం వల్ల 7 గురు శిశువులలో ఈ వ్యాధి సంక్రమించినట్లు గుర్తించారు. 

కానీ తల్లి పాలు త్రాగడం వలన ప్రమాదం సోకే అవకాశం లేదని కనుగొనబడింది.

ప్రశ్న 6. ఈ లాక్ డౌన్ సమయంలో బయటకు వెళ్లేందుకు మా సొంత వాహనాన్ని ఉపయోగించవచ్చా ?

సమాధానం: ఈ కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధిగా కనుగొన్నారు .మీరు ఎంత ఎక్కువ సమయం బయట గడుపుతారో అది మీకు, ఇతరులకు కూడా అత్యంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది .అందువల్ల నిజమైన అవసరం ఉంటేనే కానీ బయటకు వెళ్ళకండి. చాలా నగరాలలో ఫోన్ల ద్వారా డాక్టర్లను సంప్రదించే ఏర్పాట్లు చేశారు. అత్యవసర మైన కేసులలో మాత్రమే క్లినిక్ లకు పిలుస్తారు.

ఒకవేళ మీ నగరం లేదా పట్టణంలో కర్ఫ్యూ విధించి నట్లయితే మీ వాహనాన్ని పోలీసులు స్వాధీనం లోకి తీసుకోవడం, లేదా భారీ జరిమానా విధించడం ,లేదా జైలు శిక్ష అనుభవించాల్సి రావచ్చు. అత్యవసర పరిస్థితులలో అయితే మీరు అంబులెన్స్కు ఫోన్ చేయవచ్చు . కరోనా వైరస్ (దగ్గు ,జ్వరం మొదలైనవి )యొక్క లక్షణాలతో మీరు బాధపడుతున్నా ,లేదా కనుగొన్నా కరోనా వైరస్ హెల్ప్లైన్ నెంబర్లకు ఫోన్ చేయండి.

లాక్ డౌన్ అంటే ఏమిటి ?

లాక్ డౌన్ అనేది తాత్కాలిక మరియు అత్యవసర పరిస్థితి. లాక్ డౌన్ సమయంలో అన్ని అత్యవసరమైన ప్రైవేట్ సంస్థలు మరియు ప్రజా రవాణా వ్యవస్థలో మూసివేయబడ్డాయి .ప్రజలు వారి ఇళ్లలోనే ఉండాలి .అత్యవసరమైనవి మరియు మందుల వంటి నిజమైన అవసరం ఉంటేనే మాత్రం బయటకు వెళ్ళాలి.

ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో మీరు సురక్షితంగా ఉండేందుకు ఈ అదనపు జాగ్రత్తలను అనుసరించాలి . దీన్ని గుర్తుంచుకోండి:

ఇది భయంకరమైన అంటువ్యాధి. దానిని నివారించేందుకు  లాక్ డౌన్ విధించబడింది.

ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరమైనది. మరియు ప్రాణాంతకమైనది.

ఈ వ్యాధికి నివారణ లేదు.

తాకడం ద్వారా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది .అందువల్ల రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్ళకండి.మరియు సామాజిక దూరాన్ని పాటించడండి . నివారణ చర్యలకు ఎదురు చూడండి.

లాక్  డౌన్ సమయంలో ప్రజలకు సేవలు అందుబాటులో ఉన్నాయి ?

లాక్ డౌన్ సమయంలో క్రింది సేవలు కొనసాగుతాయి:

మెడికల్ స్టోర్స్

పాలు, కాయగూరలు మరియు కిరాణా షాపులు.

ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రులు

టెలిఫోన్ మరియు ఇంటర్నెట్ సేవలు

పెట్రోల్ పంపులు

ఎల్పిజి ఏజెన్సీలు

పోస్ట్ ఆఫీస్ మరియు కొరియర్ సేవలు

మీడియా ఆఫీసులు

అంబులెన్స్ మరియు అత్యవసర సేవలు.

అవసరం అయినా వస్తువులు మరియు ఆహారం విషయంలో భయపడకండి. ఆహార వస్తువులను ఎక్కువగా నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది అనవసరమైన కొరతకు దారితీసి ధరల పెరుగుదలకు దారి తీయవచ్చు. ఇది కొంతమందికి ఇబ్బందిని కలిగిస్తుంది.

మనుగడకి అవసరమైన వస్తువుల తో సహా అవసరమైన సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}