• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఫుడ్ అండ్ న్యూట్రిషన్

పాలు మానిపించే సమయంలో పిల్లలకు ఇవ్వవలసిన ఆహారం : 7 - 12 నెలలు

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Apr 21, 2020

 7 12
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

 

నెమ్మదిగా మీ పిల్లలు కూర్చోవడం, నమలడం మొదలు పెడతారు . పళ్ళు బయటకు రావడం కూడా మొదలై ఉండవచ్చు .కొంచెం ఘనాహారాన్ని వారికి ఇవ్వడాననికి  ప్రయత్నించండి . మీ చిన్నారులకు ఇచ్చే ఆహారంలో ఒక స్పూన్ వెన్న ,నెయ్యి లేదా నూనె లను చేర్చవచ్చు. బియ్యం తక్కువ ఎలర్జీలు కలిగి ఉండే ఒక తృణ ధాన్యం . పిల్లలకు మంచి తృణధాన్యాలయిన పెసరపప్పు లేదా పెసలు ఇవ్వడం చాలా మంచిది. కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా పిల్లలకు అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది .ఇవి ఇచ్చే ముందు కొంచెం జాగ్రత్త వహించండి .అవి ఏమిటంటే సోయాబీన్స్ ,గుడ్డులోని తెల్ల సొన ,ఆవు పాలు మొదలైనవి...

7 - 8 నెలల మధ్యలో

ఇప్పుడు మీరు కాయగూరలు మరియు పప్పు ధాన్యాలతో మొదలుపెట్టవచ్చు. మెత్తగా చేసిన కిచిడీ లో ,బాగా ఉడికించిన కాయగూరలను కానీ లేదా ఉడికించిన బంగాళదుంప పేస్టుని కానీ కలపవచ్చు. పప్పు ,పెరుగు ,గోధుమ రవ్వను కూడా ఆహారంలో చేర్చవచ్చు .ఒక పద్ధతి ప్రకారం రెండు నుండి మూడు చెంచాల తో మొదలు పెట్టి ,ఒక కప్పు వరకు పెంచవచ్చు .పాలు మానిపించే సమయంలో రోజుకు 2 లేదా 3 సార్లు పాలు ఇస్తూ మరియు రెండు లేదా మూడు సార్లు ఒక్కొక్క కప్పు ఆహారాన్ని ఇవ్వాలి.

ఎలా ఇవ్వాలి :ఆహారాన్ని పలచగా (జారుగా ) ఇవ్వండి .బిడ్డ జీర్ణ శక్తిని చూచి మెల్లగా చిక్కదనాన్ని పెంచుకుంటూ పోవచ్చు.

10 - 12 నెలల మధ్యలో

ఒక గుడ్డు ,మాంసము అన్ని రకాల కాయగూరలు (బఠాణీలు ,మొక్కజొన్న మినహాయించి )పండ్ల తో సహా అన్నింటిని ఇవ్వవచ్చు .ఇప్పుడు మీరు గుడ్డును ఉడికించి మరియు ఆమ్లెట్ మరియు కస్టర్డ్ రూపంలో కూడా ఇవ్వవచ్చు .ఒకసారి మీ డాక్టర్ని సంప్రదించి మాంసాన్ని కైమా లాగా కట్ చేసి మెత్తగా ఉడికించి ఇవ్వవచ్చు. సన్నగా కట్ చేసిన కాయగూరలను మరియు పండ్లను కూడా ఇవ్వవచ్చు .వీటిని ఉడికించి లేదా పచ్చివి కూడా ఇవ్వవచ్చు.

ఎంత మోతాదులో ఇవ్వాలి - ఒక గుడ్డును ఇవ్వవచ్చు .పండ్లు ,కాయగూరలు కొంచెంకొంచెంగా మొదలు పెట్టండి .మెల్లగా వాటిని పెంచుకుంటూ వెళ్ళండి.

ప్రణాళిక బద్ధకంగా - బిడ్డ ఇప్పుడు మెల్లగా కొరకడం మరియు నమలడం మొదలుపెడుతుంది. ముందు కొంచెం పలచగా ఇచ్చి , మెల్లిగా కొంచెం చిక్కగా ఇస్తూ కాయగూరలు, పండ్లను ఇవ్వడం అలవాటు చేయండి .

శిశువుకి ఏడాది వయసు వచ్చేసరికి మనం ఇంట్లో తినే ఆహారాన్ని అలవాటు చేయాలి. అందరితో కలిసి తినాలి అనుకునే విధంగా ఉండాలి. అలా మెల్లగా రోజుకు ఒకటి రెండు సార్లు కుటుంబ సభ్యులందరితో కలిసి భోజనం చేసేలా  అలవాటు చేయాలి.

తల్లిపాలు మానిపించే సమయంలో చేయవలసినవి

1.ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఆహారాన్ని మాత్రమే అలవాటు చేయండి .కొద్దిరోజుల తర్వాత వేరొక రుచికి అలవాటు అవనివ్వండి.

2. ముందు కొంచెం కొంచెం ఇవ్వండి . క్రమంగా దానిని పెంచుతూ వెళ్ళండి. ముందు పలచగా ఇవ్వండి .తర్వాత మధ్యరకంగా ఇస్తూ మెల్లగా చిక్కగా ఇవ్వడం ప్రారంభించండి…

3. పిల్లలను కొత్త కొత్త రుచులకు అలవాటు చేయండి .లేదంటే వారికి ఆహారం అంటేనే విసుగు వచ్చే అవకాశం ఉంది .అన్ని రకాల ఆహార పదార్థాలను అలవాటు చేసినట్లయితే వారు పెరిగి పెద్దయ్యాక కూడా ఆహార విషయంలో మీకు ఇబ్బంది కలిగించరు .ఎక్కువ రకాల ఆహార పదార్థాలు ఉన్నట్లు అయితే అన్ని రకాల పోషకాలు కూడా అందుతాయి.

4. నెమ్మదిగా పిల్లలు వేరువేరు రంగులలో, ఆకారాలలో మరియు ఆకృతిలో ఉండే ఆహారాన్ని ఇష్టపడతారు . అలా చేసినట్లయితే పిల్లలు ఆహారం పట్ల ఆకర్షితులవుతారు.

పాలు మానిపించే సమయంలో చేయకూడనివి :

1. పిల్లలకు బలవంతంగా ఆహారాన్ని ఇవ్వకండి .పిల్లలకు ఒక ప్రత్యేకమైన ఆహారం నచ్చనట్లయితే దాన్ని అప్పటికీ ఇవ్వడం మానేయండి . కొంతకాలం  తరువాత దాన్ని తిరిగి మొదలు పెట్టండి.

2. అప్పుడు కూడా పిల్లలు దాన్ని తినేందుకు నిరాకరించినట్లు అయితే దాన్ని ఇవ్వడం ఆపేయండి .ప్రతి ఆహారానికి ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది .దానికి బదులుగా వేరొక ఆహారాన్ని ఇవ్వవచ్చు.

3. శిశువుకు ఎక్కువగా కారంగా ఉండే ఆహారాన్ని ఇవ్వకండి .అలాగే ఎక్కువ  ఫ్రై చేసిన ఆహారాన్ని కూడా ఇవ్వకండి.

4. కొన్ని రకాల ఆహార పదార్ధాలు మీద మీకు అయిష్టత ఉన్నట్లయితే పిల్లల ముందు దాన్ని చూపించండి. వారు కూడా ఆ ఆహారాన్ని తినడానికి ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలను అనుకరిస్తారు.

కాదనలేని నిజం : మొదట ఆరు నెలలు బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం అన్నిటికంటే ఉత్తమం. తల్లిపాలు ఎంతో సమతుల్యమైన పోషకాలను మరియు రక్షణను ఇస్తాయి. పిల్లల అవసరాలు మరియు తల్లి యొక్క పాల ఉత్పత్తిని బట్టి పిల్లలకు ఆహారాన్ని మొదలు పెట్ట వలసిన అవసరం ఉంటుంది. మరింత సమాచారం కోసం దయచేసి శిశు వైద్యుని సంప్రదించండి.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • 1
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.

| Aug 09, 2020

  • Reply
  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}