• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఫుడ్ అండ్ న్యూట్రిషన్

మీ చిన్నారి ఇష్టపడే అరటిపండుతో వంటకాలు

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jul 14, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

వంట చేయడం అన్నది ఒక కళ. కానీ 1-3 సంవత్సరాల పిల్లలకు ఆహారాన్ని తయారు చేయడం వల్ల మీరు ప్రతిరోజూ కళాఖండాలను సృష్టించాలి. పిల్లలకు రోజువారీ పోషకాహార అవసరాన్ని ఇవ్వవలసిన అవసరం ఉన్నందున ఇది సవాలుగా ఉంటుంది.  ఆహారంలో అరటి పండును చేర్చడం పసిపిల్లలకు మరియు ఏ వయసు పిల్లలకైనా  వారి పెరుగుదలకు సహాయపడుతుంది.

 

 ఇక్కడ కొన్ని త్వరగా మరియు సులభంగా తయారు చేసుకునే వంటకాలు ఇక్కడ ఉన్నాయి - ఇవన్నీ ‘బేబీ ఫుడ్’ అరటిపండు తో తయారు చేసినవి.  మీ బిడ్డ వీటన్నింటినీ ప్రేమిస్తుందని నాకు తెలుసు.  ఇది అరటి దోస నుండి మగ్ కేకులు,  అరటిపండు హల్వా, అరటి చిప్స్, అరటిపండుతో పాన్ కేక్ మరియు అరటి కుకీల వరకు ఉన్నాయి.

 

 మీ పిల్లల కోసం రుచికరమైన అరటి పండు తో తయారు చేసే వంటకాలు.

 

 12 నుండి 36 నెలల వయస్సు గల మీ పిల్లల కోసం అరటిపండు  వంటకాలు ఇక్కడ ఉన్నాయి...

 

 # 1. వెంటనే తయారయ్యే రాగి అరటి దోస

 # 2. ఓట్స్ అరటి పాన్కేక్

 # 3. అరటి సూజీ హల్వా 

 # 4. గుడ్డు లేని అరటి నువ్వుల కుకీలు

 # 5. పచ్చి అరటికాయ చిప్స్

 

 1 . రాగి అరటి దోస రెసిపీ :

 

రాగి అరటి దోస తయారుచేయడానికి కావలసిన పదార్థాలు, పరిమాణం మరియు తయారీ విధానం.

 

మొలకెత్తిన రాగుల పౌడర్   1/2 కప్పు

అరటిపండు (మెత్తని)   1 

తురిమిన కొబ్బరి కోరు   1 టేబుల్ స్పూన్ 

 కేసర్ బాదం పౌడర్.      2 టేబుల్ స్పూన్లు  ఆర్గానిక్ బెల్లం పౌడర్     1 టేబుల్ స్పూన్

ఉప్పు                            చిటికెడు.

 

రాగి అరటి దోసను ఎలా తయారు చేయాలో చూద్దాం... 

బెల్లం పొడిని 2 టేబుల్ స్పూన్లు పాలు లేదా నీటితో చక్కగా కరిగించండి. అరటి పండును మెత్తగా గుజ్జులా చేసి అందులో కలపండి.

ఇప్పుడు అందులో రాగి పౌడర్, ఒక చిటికెడు ఉప్పు, కొబ్బరికోరు, కేజర్ బాదం పొడి వేసి బాగా కలపండి.

ఆ పిండిని కొంచెం గరిటజారుగా చిక్కగా కలుపుకోండి. వేడెక్కిన దోసె పెనంపై కొంచెం మందంగా పాన్ కేక్ లాగా వేసి రెండు వైపులా ఎర్రగా వేగనివ్వాలి.


 

2 .ఓట్స్ అరటి పాన్కేక్ తయారీ విధానం :

 

దీనికి తయారీకి కావలసిన పదార్థాలు, పరిమాణం మరియు తయారీ విధానం..

 

ఓట్స్ పౌడర్ ..1 టేబుల్ స్పూన్ 

అరటిపండు (మెత్తని) ..1 

పాలు .. 1 టేబుల్ స్పూన్ 

నెయ్యి ...(వేయించడానికి)

 

వోట్స్ అరటి పాన్కేక్  తయారీ విధానం :

అరటి పండును మెత్తగా గుజ్జులా చేసి పక్కన పెట్టుకోండి. ఓట్స్ పౌడర్ లో పాలు వేసి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకొని అందులో అరటిపండు గుజ్జుని చేర్చి బాగా కలపండి.

పిండిని కొంచెం గరిటజారుగా చిక్కగా కలుపుకోండి. వేడెక్కిన దోసె పెనంపై కొంచెం మందంగా పాన్ కేక్ లాగా వేసి రెండు వైపులా ఎర్రగా వేగనివ్వండి.

 

 

3 . అరటి సూజీ హల్వా :

 

అరటి సుజి హల్వా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, పరిమాణం మరియు తయారీ విధానం..

 

సుజీ రవ్వ .. రెండు టేబుల్స్పూన్లు

పాలు లేదా నీరు .. ఒక కప్పు

ముగ్గిన అరటి పండు ...1

ఇలాచి ...2 (ఇష్టమైతే)

కేసర్ ... కొంచం (ఇష్టమైతే)

 

అరటి సుజి హల్వా తయారీ విధానం:

కడాయి వేడి చేసి కొంచెం నెయ్యి వేసి నెయ్యి వేడెక్కాక అందులో సుజీ రవ్వ వేసి మంచి సువాసన వచ్చే వరకు బాగా వేపండి. నెమ్మదిగా నీరు ( లేదా పాలు) పోస్తూ  గడ్డకట్టకుండా కలపండి. కొంచెం గట్టిపడిన తర్వాత ఇలాచీ పొడి మరియు కేసర్ ను కలపండి. 

ఇందులో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ను కూడా కలుపుకోవచ్చు. దీనిని గోరువెచ్చగా సర్వ్ చేయండి.


 

4. గుడ్డు లేని అరటి , నువ్వుల కుకీస్ :

 

దీని తయారీకి కావలసిన పదార్ధాలు పరిమాణం మరియు తయారీ విధానం.

 

గోధుమ పిండి.. 11/2 కప్పు

వెన్న...             1/2 కప్పు

బ్రౌన్ షుగర్ అర కప్పు

(అరటి పండ్లు తీయగా ఉన్నట్లయితే కొంచెం తక్కువగా వేసుకోండి)

పాలు ..1/4 కప్పు

అరటిపండు 1

తెల్లనువ్వులు .. 1/2 కప్పు

బేకింగ్ పౌడర్.    3/ 4 స్పూన్.

వెనిలా ఎసెన్స్.   1/2 స్పూన్

చాకో పౌడర్ (మీ ఇష్టం)

అరటిపండు నువ్వులు కుకీస్ తయారీ విధానం :

తెల్ల నువ్వులను ఎర్రగా వేపి పొడి చేసి రెడీ గా ఉంచుకోండి. అరటి పండును మెత్తగా గుజ్జులా తయారు చేసి ప్రక్కన పెట్టుకోండి. చక్కెరను వెన్నలో వేసి కరిగించి పక్కన ఉంచుకోండి. మిగతా పదార్థాలన్నింటినీ పై మిశ్రమాలతో చేర్చి మెత్తగా కలుపుకోండి. 

ఈ పిండిని ఓవెన్లో కాల్చడానికి అనుకూలంగా కొంచెం పాలతో కలపండి. ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి బట్టర్ పేపర్ పెట్టిన ప్లేట్ లో ఉంచండి. ఆ ఉండలని ఫోర్క్ తో చదునుగా చేయండి. ఈ కుకీస్ ను180 డిగ్రీల సెల్సియస్ వద్ద లేదా కుకీ బేస్ కొద్దిగా బ్రౌన్ అయ్యే వరకు 15 నుండి 20 నిమిషాలు కాల్చండి.

 

5 పచ్చి అరటికాయ చిప్స్ :

 

అరటికాయ చిప్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు , పరిమాణం మరియు తయారీ విధానం...

మీడియం సైజ్ అరటికాయ.. 1

ఉప్పు... రుచికి సరిపడా

ఆయిల్.. వేయించడానికి సరిపడా.

 

అరటికాయ చిప్స్ తయారీ విధానం : 

 

పదునైన కత్తిని ఉపయోగించి అన్ని వైపుల నుండి అరటి కాయ తొక్కని శుభ్రంగా తీసేయండి. ఇప్పుడు అరటిని సన్నని రౌండ్లుగా ముక్కలు చేసుకోండి. నాన్ స్టిక్ పాన్ లో నూనె వేడి చేసి ముక్కలు అందులో వెయ్యండి. మూత పెట్టి 2 నిమిషాల పాటు వేపండి.

బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని కొన్ని చుక్కల నిమ్మరసం , కొంచెం ఉప్పు పైన చళ్ళుకోండి. వీటిని ఒక డబ్బాలో 2 రోజుల పాటు నిలువ చేసుకోవచ్చు.

 

ఈ అరటి వంటకాలపై మీ అభిప్రాయాన్ని వినడానికి మేము ఇష్టపడతాము.  దిగువ వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి!

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}