• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్

ఉమ్మడి కుటుంబం... తల్లి మరియు పిల్లలకు ఒక వరం

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Aug 26, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

చిన్న కుటుంబాలు వారి సొంత ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకుంటారు. బహుశా అది అతిపెద్ద స్వతంత్ర భావన.
ఏది ఏమైనప్పటికీ, సహాయము మరియు మద్దతు అనేవి ఎంతో గొప్పవి. వీటిని ఇప్పుడు గణనీయమైన ఖర్చుతో
బయట వెతుకుతున్నాము. ఉమ్మడి కుటుంబంలో కుటుంబ సభ్యులందరితో కలిసి జీవించడం వలన జ్ఞానము, భద్రత
మరియు అనుభవ సంపద కలుగుతుంది.

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ యొక్క ప్రయోజనాలు ఏమిటి?

అందుకే, ఉమ్మడి కుటుంబం లో ఉన్న ప్రయోజనాలను నేను ఇక్కడ పంచుకోవాలి అని అనుకుంటున్నాను.

1. డబ్బు ఆదా చేసే ఈ సమయంలో దానికి విలువలను కూడా జోడించడం :

తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నట్లయితే మీ పిల్లల సంరక్షణ కోసం డేకేర్ సేవలను ఎంచుకుంటారు. ఉమ్మడి
కుటుంబం కలిగి ఉన్నట్లయితే ఈ ఖర్చును గణనీయంగా తగ్గించుకోవడంలో సహాయపడుతుంది. అదే సమయంలో
మీ బిడ్డను ఉత్తమమార్గంలో మరియు కుటుంబ వాతావరణంలో చూసుకుంటారు అనే భరోసా ఉంటుంది. డే కేర్
ఖర్చులకోసం ఉపయోగించే డబ్బును మీ పిల్లల భవిష్యత్తు కోసం మ్యూచువల్ ఫండ్స్ లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.

2. మీ కోసం కొంత సమయాన్ని వెచ్చించు కోవచ్చు :

మీ కోసం మీరు శ్రద్ధ వహించడానికి మరియు బ్యూటీ పార్లర్ , జిమ్ లేదా యోగా క్లాసులు లేదా ఏదైనా పార్టీలు
ఉన్నప్పుడు ప్రశాంతంగా గడపడానికి మీకు పెద్దల సహాయం ఉంటుంది. మీ కంటే ఎక్కువ అనుభవజ్ఞులైన వారు
ఎవరైనా ఇంట్లో ఉన్నారని మీకు అనిపించినప్పుడు మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

విశ్రాంతి తీసుకుంటూ మరియు తమకోసం తాము కొంత సమయాన్ని వెచ్చించుకొనే మహిళలు మంచి తల్లులు
మరియు మంచి భార్యలుగా ఉంటారు.

3.కుటుంబ అభివృద్ధికి సహాయం :

చిన్న కుటుంబాలలో సాధారణంగా పిల్లలు ఎక్కువ సమయం తల్లిదండ్రులతో గడుపుతారు.
తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలలో అలసిపోయి సాయంత్రానికి ఇంటికి వస్తారు. వారికి పిల్లలతో మాట్లాడడానికి , ఆటలు
ఆడడానికి సమయం ఉండదు. ఇది మీ పిల్లల శారీరక , మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దీని
ప్రభావంతో పిల్లలకు మాటలు రావడం ఆలస్యం అవుతుంది. అదేవిధంగా ఉమ్మడి కుటుంబం లో ఉంటున్న పిల్లలకు
మాటలు ఆలస్యం అయినప్పటికీ స్పీచ్ తెరపిస్ట్ లు అవసరం లేదు. ఎందుకంటే మీ బిడ్డతో మీరు, మీ భాగస్వామి
మాత్రమే కాకుండా మాట్లాడడానికి ఎంతో మంది ఉంటారు.

4.సురక్షితమైన వాతావరణం :

ఉమ్మడి కుటుంబంలో నివసించడం వలన మీ పిల్లలకు శారీరక మరియు సామాజిక భద్రత లభిస్తుంది. మీ పిల్లలకు
మార్పు అవసరం అయినప్పుడు వారి స్నేహితుల ఇంటికి పంపించవలసిన అవసరం లేదు. ఉమ్మడి కుటుంబంలో
ఉన్న మీ పిల్లలు అన్ని వయస్సుల వారికి సంభాషించగలుగుతారు.

5.ఎంచుకొని తినే పిల్లలకు ఉపయోగకరం :

ప్రతిరోజు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసేటప్పుడు, మీ పిల్లలు రకరకాల వ్యక్తులు, అన్ని రకాల ఆహార
పదార్థాలను ఆస్వాదిస్తూ తినడం చూస్తూ పెరుగుతారు. కేవలం టీవీలు మరియు మొబైల్ ఫోన్ల తో కలిపి తక్కువ
భోజనం చేయడం కంటే ఇది ఎంతో ఉపయోగకరం.

6 .సంస్కృతి మరియు సాంప్రదాయ జ్ఞానాన్ని పొందడం :

అమ్మమ్మలు, తాతయ్యలు, అత్తమామలు మరియు మేనమామలు అందరితో కలిసి పెరగడం వలన విస్తృతమైన
అనుభవం మరియు సామాజిక జ్ఞానము అలవడుతుంది. ఇది మన పిల్లలకు మాత్రమే కాదు . మనకు కూడా

ఆహారము, ఆరోగ్యము, సాంప్రదాయాలు మరియు మంచిచెడుల వంటివి తెలుసుకోగలుగుతాం. ఇది అమూల్యమైన
అనుభవాన్ని ఇస్తుంది. ఇది మన పిల్లలు ప్రపంచాన్ని భిన్నమైన విధానాలలో చూడడానికి సహాయపడుతుంది.
బహుశా ఒక రోజు వారు తమ పిల్లలకు కూడా అదే అవగాహనను ఇవ్వగలరు !

ఎక్కువ మంది స్త్రీలకు అత్తమామలతోను మరియు బంధువులతోనూ సర్దుకోవడం చాలా కష్టం అని నేను అర్థం
చేసుకోగలను. కానీ మనం కొంచెం రాజీపడగలిగితే మీకు మరియు మీ బిడ్డకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మీరు
ఈ వ్యాసాన్ని సానుకూలంగా తీసుకుంటారని మరియు ఉమ్మడి కుటుంబాలలో భాగం కావడానికి మరింత సానుకూల
దృక్పథాన్ని అలవర్చుకోవాలి అని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను.

ఉమ్మడి కుటుంబంలో జీవించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అరిక బ్లాగ్ మీకు ఉపయోగపడిందా ? ఉమ్మడి
కుటుంబాలపై మీ అనుభవాలు ఏమిటి ? మీ వ్యాఖ్యలను మాతో పంచుకోండి. మీ నుండి వినడం మాకు చాలా
సంతోషం.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}