• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పిల్లలతో ప్రయాణించడం

బాలింతలకు ప్రయాణ చిట్కాలు

Radha Shree
0 నుంచి 1 సంవత్సరాలు

Radha Shree సృష్టికర్త
నవీకరించబడిన Feb 17, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

మీ శిశువు జన్మించిన తరువాత మొదటి కొన్ని నెలలు ఇంటికి  దగ్గరగా ఉండాలని మీరు అనుకోవచ్చు. ఆహారం మరియు డైపర్ మార్పుల మధ్య, ఒక కొత్త శిశువుకు దాదాపు నిరంతర శ్రద్ధ అవసరం, పైగా ప్రయాణిస్తున్న సమయం లో నవజాత శిశవు ఏ అనారోగ్యం బారిన పడకుండా చూసుకోవడం చాల ముఖ్యం. ప్రయాణిస్తున్న సమయంలో బేబీ కి ఏమైనా వంట్లో బాగోకపోవడం  చాల ఇబ్బంది పెట్టగలదు. అందుకని ఈ కింది చిట్కాలను పాటిస్తే వీలైనంత గందగోళం తగ్గించుకోవచ్చు.

చెక్ లిస్ట్ తయారుచేసుకోండి

ఆకస్మిక ప్రయాణ ప్రణాళికకు మానుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మొహమాటానికి కానీ, మరింకే కారణాలవల్ల కానీ ప్రయాణానికి కనీసం వారం రోజులు ముందే నిర్ణయించుకోకుండా వెళ్ళకండి. తద్వారా మీరు ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకోవచ్చు. అడపాదడపా గుర్తొచ్చినవి రాసుకోవడానికి మీకు సమయం దొరుకుంది. ఈ కింది లిస్ట్ లో ఉన్నవై మాత్రం కచ్చితంగా ఉండేట్టు చూసుకోండి.

 

శిశువుకు ప్రయాణం ముందు విశ్రాంతి తీసుకునేట్టు  చూడండి

ప్రయాణానికి ముందు రోజు మీ పిల్లలు ప్రశాంతంగా పడుకునేట్టు చుడండి. బాగా విశ్రాంతి పొందిన శిశువు కొత్త మరియు తెలియని పరిస్థితుల అంటే మరింత సహనంతో ఉంటుంది.అందువాళ్ళు బయలుదేరే సమయానికి మీ పిల్లలు కూడా మీకు సహకరించడానికి అవకాశాలు ఎక్కువ. ఈ తేడా మీకు కచ్చితంగా తెలుస్తుంది.

క్యూలలో ముందు వెళ్ళడానికి ప్రయత్నించండి

బాలింత మరియు పిల్లలు అంటే ప్రపంచం మొత్తం మీద అందరు సహాయత స్వభావం తోనూ, ఉదారంగాను ప్రవర్తిస్తారు. ఈ అవకాశాన్ని పూర్తిగా వాడుకోండి. తప్పు ఏమి లేదు. మీరు ఎక్కువసేపు నిల్చుంటే మీకు కానీ, మీ బేబీ కి కానీ మంచిది కాదు . మీ ప్రయాణం సౌకర్యంగా జరగాలంటే, మీ పిల్లల సౌకర్యాన్ని అన్నిటికన్నా ముందుంచండి. అందుకే, చాల గుళ్ళల్లో, ఎయిర్పోర్ట్ లో అన్నిటిలోను గర్భిణీ మరియు బాలింత తల్లులకు వేరే క్యూలు  ఉంటాయి.
 

బ్రెస్ట్ ఫీడింగ్:

విమానంలో తల్లి పాలు ఇవ్వాల్సిన  అవసరం రావచ్చు. మీరు పూర్తి గా తెలియని వల్ల పక్కగా కుర్చీని ఫీడింగ్ చెయ్యడానికి ఇబ్బంది గా ఉంటె, మీరు రెండు పిన్నులు తీసుకుని. మీకు, మీ ముందు సీటు కి కలిపి ఒక కర్టెన్ లాగా ఒక పరదా సొంతంగా సృష్టించుకోవచ్చు.

అవసరమైన వస్తువులు దగ్గరగా పెట్టుకోవాలి

బొమ్మలు, సీసాలు, సిప్పీ కప్పులు, పాసిఫైయర్లు, స్నాక్స్, మరియు వంటివి: మీరు ప్రయాణ రోజున అవసరమైనటువంటి కొన్ని ప్రత్యేక అవసరాలు. వీటిని అందువిడిగా పెట్టుకోవాలి. పిల్లల్ని వెంటనే దివెర్ట్ చెయ్యాల్సిన అవసరమైనప్పుడు చేతికి అందువిడిగా ఉంటె పిల్లలు కూడా మారం చెయ్యరు.
 

బుక్ చేసుకున్న హోటల్ అది చిల్డ్రన్  ఫ్రెండ్లీగా ఉన్నాయా లేదా అని ముందే చూసుకోండి

చాల వరకు బుకింగ్ చేసేటపుడు, వివరాల్లో, రివ్యూస్ లో మనం వెళ్లే హోటల్ పిల్లలకి అనువుగా ఉందా లేదా, చాంగింగ్ టేబుల్స్ అవి ఉన్నాయా లేదా, దగ్గరలో హాస్పిటల్స్ ఎంత దూరం అవన్నీ ముందే ఆలోచించుకుని బయలుదేరడం శ్రేయస్కరం.

బేబీ పీడియాట్రిషన్ నెంబర్ తీసుకుని ఉంచుకోండి

బేబీ తో ప్రయాణం అనుకున్నాక, ఒకసారి పీడియాట్రిషన్ ని కలిసి, వివరించి, ఎన్ని రోజులు, ఎక్కడికి, వెళ్తున్న చైతు యొక్క వాతావరణ వివరాలు చెప్పి, అవరమైన మందులు, అత్యవసరమైన మందులు వెంట తీసుకువెళ్తే ఒక్క ఫోన్ కాల్ దూరం లో డాక్టర్ తో మాట్లాడి, పీడియాట్రిషన్ చెప్పిన మందులు ఆలస్యం చెయ్యకుండా వెయ్యొచ్చు. ప్రయాణం ఆపివెయ్యాల్సిన పని ఉండదు.

ప్రయాణ ప్రణాళిక

పారాయణ ప్రణాళిక ఉండడం మంచిదే. కానీ పిల్లల మూడ్ బట్టి మార్చడానికి లేకుండా ఉంటె ఎంత గొప్ప ప్రణాళిక అయినా చిత్తు అయినట్టే . మనం పిల్లలకోసమ్ ఎంత ప్లాన్ చేసి డ్రాయింగ్  బుక్, స్నాక్స్, బొమ్మలు తీసుకువెళ్లిన, కొన్నిసార్లు పిల్లలు తిరగడానికి మూడ్ లో లేకపోతె, వారిని బలవంత పెట్టి తీసుకువెళ్లడం అనుచితం కాదు. ఒకవేళ తీసుకువెళ్లిన, ఇంకా ఎక్కువ మారం చేసే అవకాశాలు ఎక్కువ. అందుకని, ఒక చోటకి వెళ్తే ఉన్నవన్నీ చూడాలనుకోవడం మంచిదే. కానీ, కుదరకపోతే విరమించుకోవడానికి కూడా అవకాశం  ఇచ్చేట్టు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

అన్ని మనం అనుకున్నట్టు ఊహించినట్టు జరగకపోవచ్చు, పిల్లలు, వాళ్ళ అజీర్తి, డైపర్ నిండిపోవడము, సడన్ గా ఏడవడము, వీటన్నిటికీ మనం ఏమి చేయలేము. కానీ, మనకి వీలైనంత వరకు వాటిని నిరోధించడానికి ప్రయత్నం మాత్రమే చేయగలము.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • 3
వ్యాఖ్యలు()
Kindly Login or Register to post a comment.

| Nov 04, 2019

మా పాపకు 3 నెలలు తనుకు నా మిల్క్ సరిపోవడం లేదు తనకి ఎమి ఇ స్త్యే బాగుంటుంది చేపండి plsss

  • నివేదించు

| Jun 25, 2019

please give diet chart for 7 months+ old baby boy

  • నివేదించు

| Apr 03, 2019

28Lqhqkñbfwq,Q

  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పిల్లలతో ప్రయాణించడం బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}