• లాగ్ ఇన్
 • |
 • నమోదు చేయు
బిడ్డ సంరక్షణ ఆరోగ్యం మరియు వెల్నెస్

చంటి పిల్లలకు వచ్చే అలెర్జీలు మరియు నివారణోపాయాలు

Vidhya Manikandan
0 నుంచి 1 సంవత్సరాలు

Vidhya Manikandan సృష్టికర్త
నవీకరించబడిన Dec 14, 2018

అప్పుడే పుట్టిన నాటి నుంచి ఒక సంవత్సరం వరకు వయసున్న పిల్లలలో కొన్ని రకాల అలెర్జీలు ఇబ్బంది పెడుతుంటాయి. కొంతమంది శరీరంలో రోగ నిరోధక శక్తి మూలంగా అలెర్జీన్ లు అనే రసాయనాలు విడుదలవుతాయి. వీటి కారణంగా శరీరంపై దద్దుర్లు, ముక్కు కారడం, దురద, తుమ్ములు, దగ్గు వంటివి కలుగుతాయి. ఒక వేళ అలెర్జీలు తీవ్రమైతే ఊపిరి తీసుకోవడంలో కష్టంగా ఉండడం, శరీరం ఉబ్బడం వంటివి కలిగి అత్యవసర పరిస్థితికి దారితీస్తాయి.

పిల్లలలో అలెర్జీలకు కారణాలు

చంటి పిల్లలకు ఎనిమిది నెలల లోపు వచ్చే అలెర్జీలకు ప్రధాన కారణం, పురుగులు, కీటకాలవంటివి కుట్టడం, ఆహారం మరియు మందుల ప్రతిచర్యలు లేదా పడకపోవటం. ఎనిమిది నెలల పైబడినవారికి పూవులలోని పుప్పొడి, శిలీంధ్రాలు , పెంపుడు జంతువుల నుంచి రాలే వెంట్రుకల మూలంగా అలెర్జీలు కలుగుతాయి.

పాపకి అలెర్జీలు ఉన్నట్లయితే పైన పేర్కొన్న వాటి మూలంగా ముక్కు కారడం, ఎక్సిమా వంటి చర్మ సంబంధ సమస్యలు, జీర్ణ వ్యవస్థకు, శ్వాసకోశ సంబంధ సమస్యలు ఎదురవుతాయి. పుప్పొడి రేణువులు ప్రధానంగా వసంత కాలంలోమాత్రమే ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్నారులకు వాటి వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు.

సాదారణంగా వచ్చేఅలెర్జీలు అధిక శాతం దుమ్ము కణాల వలన వస్తాయి. అలాగే శీతాకాలం లేదా గాలిలో తేమ ఎక్కువగా ఉండే సమయాల్లో శిలీంధ్రాల వల్ల కూడా అలెర్జీలు కలగవచ్చు.

పిల్లలలో అలెర్జీలు గుర్తించడం ఎలా?

 • సాదారణంగా వచ్చేజలుబు, దగ్గులు అలెర్జీలు వచ్చినప్పుడు కూడా కనిపిస్తాయి. రెండిటికి తేడా తెలుసుకోవాలి. ఈ క్రింద పేర్కొన్న లక్షణాలు పిల్లలకి ఉంటే వారిది అలెర్జీ కారణంగా ఏర్పడిన అనారోగ్యంగా తెలుసుకోవచ్చు.

 • ఒకవేళ మీ బుజ్జాయికి ఎప్పుడు చూసినా జలుబుగా ముక్కు కారుతూ ఉంటుందా?. సాధారణ జలుబు పది రోజులకి మించి ఉండదు. కాబట్టి ఎక్కువ రోజులు పాటు జలుబు ఉంటే అది అలెర్జీ కావచ్చు.

 • ముక్కుదిబ్బడతో గాని ముక్కునుంచి నీరు కారడం గాని పిల్లలు అధిక కాలం బాధపడుతున్నారా?

 • ముక్కునుంచి కారే ద్రవం నీరులా పల్చగా ఉందా? ఐతే అది అలెర్జీ అయ్యే అవకాశం ఉంది. సాధారణ జలుబులో ఐతే పసుపు రంగు లేదా పచ్చ రంగు ద్రవాలు కనిపిస్తాయి.

 • ఎక్కువగా తుమ్ముతున్నా లేదా అధిక కాలం పొడి దగ్గుతో బాధపడుతున్నా అలెర్జీలు కారణం కావచ్చు.

 • చర్మంపై దురద, ఎరుపు రంగు దద్దుర్లు వంటివి ఉన్నాయా?

ఒకవేళ పైన పేర్కొన్న లక్షణాల్లో ఏమైనా ఉన్నట్లయితే వారికి ఏదో ఒక పదార్థం వలన అలెర్జీ కలుగుతుందని అర్థం. వంశ చరిత్రలో పెద్దలకు ఈ సమస్య ఉంటే, పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ.

ఏ కారణాల వల్ల అలెర్జీ వస్తుందో తెలుసుకోవడం ఎలా?

పెంపుడు జంతువులైన కుక్క, పిల్లి వంటి వాటి వెంట్రుకల వల్ల అలెర్జీలు వచ్చినట్లయితే, పాప మీ ఇంటి బయట లేదా మరి ఏ ఇతర ప్రదేశానికయినా వెళ్ళినప్పుడు చక్కగా ఎటువంటి తుమ్ములు,జలుబు లేకుండా ఉంటుంది. ఇలా కనుక జరిగితే పాప అలెర్జీకి కారణం మీ ఇంటిలోని వస్తువులు కావచ్చు. ఐతే కేవలం జంతువులే ఈ సమస్యకి కారణం అనుకోకుండా ఇతర విషయాలు కూడా గమనించండి. ఇంట్లో అధికంగా దుమ్ము ఉంటే మీ పాప ఇంట్లో కంటే బయటకి వచ్చినప్పుడు అలెర్జీ లేకుండా ఉండవచ్చు.

పిల్లలకు పెట్టే ఆహరం మీద ద్రుష్టి పెట్టండి. ఏదయినా ఒక ఆహారం ఇచ్చిన తర్వాత దగ్గు గాని, దద్దుర్లు గాని, ముక్కు కారడం, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తే మీ పిల్లలకు ఆ ఆహారం సరిపడదు అని తెలుసుకోండి. అవి పెట్టకపోతే దాదాపు వారికి ఎటువంటి సమస్య రాదు. పిల్లలు పడుకునే పడకను ఒకసారి పరిశీలించండి . ఏమైనా నల్లులు, పురుగులు, లేదా కీటకాలు ఉన్నాయేమో చుడండి.

అలెర్జీలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవడానికి కొంత పరిశోధన అవసరం. కాబట్టి ఓపికగా, జాగ్రత్తగా గమనించండి.

పిల్లలను అలెర్జీల బారినుంచి ఎలా కాపాడాలి?

 • పిల్లలు పడుకునే పరుపులు కొత్తవై ఉండాలి లేదా వాటిపై శుభ్రంగా ఉతికిన కాటన్ బట్టను పరుపు పూర్తిగా కప్పే విధంగా పరవండి.

 • పిల్లలు వాడే బట్టలు ఏవైనా వారానికి ఒక సారి వేడి నీటిలో డెట్టాల్ వేసి నానబెట్టి ఉంచి ఉతకండి. దీని వల్ల బట్టలలో క్రిములు నశిస్తాయి.

 • పిల్లల గదిలో టెడ్డి బేర్ లు వంటి దూదితో నింపిన మెత్తని బొమ్మలు ఎక్కువగా ఉంచకండి. మెత్తగా ఉండే అటువంటి బొమ్మలు అధిక దుమ్ముని ఆకర్షిస్తాయి, వాటిపై దుమ్ము వల్ల అలెర్జీలు రావచ్చు.

 • ఏసీ గదిలో గనక పిల్లలు ఉంటే వాటి ఫిల్టర్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి. లేదా వాటినుంచి దుమ్ము వెలువడి పిల్లలకి అలెర్జీలు కలిగిస్తాయి.

 • ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వాటికి తరచుగా స్నానం చేయించి శుభ్రంగా దువ్వండి. దీనివల్ల వాటి వెంట్రుకలు ఇంట్లో రాలడం తగ్గుతుంది.

 • పుప్పొడి ఎక్కువగా ఉండే పూలు వారికి దూరంగా ఉంచండి. గోడల మీద శిలీంద్రాలు, దుమ్ము లేకుండా పరిశుభ్రంగా ఉంచండి .

 • సంవత్సరం లోపు పిల్లలను తాకేటప్పుడు చేతులు శుభ్రం గా కడుక్కోండి.

ఈ జాగ్రత్తలు పాటించడం వలన దాదాపు డబ్బయి శాతంవరకు అలెర్జీలు నివారించవచ్చు, ఐతే పిల్లలలో ఏదయినా అలెర్జీ లక్షణాలు కనిపిస్తే వైద్యుడికి తెలియచేసి తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

 • 2
వ్యాఖ్యలు()
Kindly Login or Register to post a comment.

| May 25, 2019

a sop vadadam manchidi

 • నివేదించు

| Dec 22, 2018

Tk et ugg good day we ey

 • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు
పైన బిడ్డ సంరక్షణ బ్లాగ్లు
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}