• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఫుడ్ అండ్ న్యూట్రిషన్

చంటి పిల్లలకు మొదటి పన్నెండు నెలలు పోషకాహారం- జాగ్రత్తలు

Canisha Kapoor
0 నుంచి 1 సంవత్సరాలు

Canisha Kapoor సృష్టికర్త
నవీకరించబడిన Nov 03, 2018

బిడ్డ పుట్టిన తరువాత మొదటి నెల నుంచి ఒక సంవత్సరం నిండే వరకు మనం ఇచ్చే ఆహారం వారి ఆరోగ్యానికి బలమైన పునాది వేస్తుంది. తల్లి పాలను మించిన ఔషధం, పోషణ మరెందులోను లేదు. పాప వయసును బట్టి తల్లి పాలతో పాటు ఇతర ఆహరం ఇవ్వడం వలన వారిలో పోషకాహార లోపాలని నివారించవచ్చు. సాంప్రదాయ పరంగా ఆచరించే అలవాట్లకు తోడుగా మరికొన్ని శాస్త్రీయమైన పద్ధతులు పాటించటం వల్ల వారికి సంపూర్ణ పోషణ, ఆరోగ్య రక్షణ అందించగలుగుతాం.

మొదటి నెల నుంచి అయిదు నెలల వయసు పిల్లలు  

అప్పుడే పుట్టిన బిడ్డకు మూడు నెలలు వయసు వచ్చే వరకు కేవలం తల్లి పాలను మాత్రమే పట్టించాలి. మంచి నీళ్లు కూడా ఈ దశ లో ఇవ్వకూడదు. తల్లి పాలలో పాపకి కావలసిన  ద్రవాలు పోషకాలు అందుతాయి కాబట్టి మంచి నీళ్లు కానీ మరి ఏ ఇతర ద్రవాలు కానీ ఇవ్వడం వలన పిల్లలకు అజీర్తి కలిగి ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం రావచ్చు. చాలా మంది పాపకు మూడు నెలలు నిండ గానే ఘనాహారం ఇవ్వడానికి ఇష్టపడతారు. ఒక వేళ  మీరు సెరిలాక్ వంటి ఆహారం అందించాలనుకున్నా బిడ్డకు జీర్ణించుకొనే సామర్థ్యం ఉన్నప్పుడు మాత్రమే ఒక చెంచాడు సెరిలాక్ తో మొదలుపెట్టి నెమ్మదిగా పరిమాణం పెంచండి. ఆహారంలో అరవయి శాతం వరకు కేవలం తల్లి పాలు మాత్రమే ఉండేలా చుడండి.

అయిదు నుంచి  ఏడు నెలల వయసు పిల్లలు

పాపాయికి అయిదు నెలలు వయసు వచ్చిన తరువాత తల్లి పాలతో పాటు తేలికగా జీర్ణమయ్యే ఇతర ఆహారాలను ఇవ్వడం మొదలు పెట్టవచ్చు. బాగా మెత్తగా మెదిపిన అరటి పండు, బాగా ఉడికించి మెదిపిన కారట్ వంటివి ఇవ్వవచ్చు.

పాపకు ముందుగా కేవలం ఒక చెంచాడు మాత్రమే ఇవ్వండి అంతకు మించి వద్దు.  రోజుకి రెండు చెంచాల చొప్పున మూడు లేదా నాలుగు రోజులు కేవలము ఒకే రకం కొత్త ఆహారం ఇవ్వాలి. అంటే ఉదాహరణకి మీరు ఈరోజు పాపకి ఉడికించి మెదిపిన కారట్ దుంపని ఇచ్చారనుకుందాం, రోజుకు కేవలం రెండు చెంచాల చొప్పున  మూడు రోజుల పాటు అదే ఆహరం ఇవ్వండి. ప్రతీ రోజు తాజాగా చేయండి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచకండి. ఇలా మూడురోజులు ఒకే కొత్త ఆహారం ఇవ్వడం వల్ల పాపాయి ఈ కొత్త ఆహారానికి సరిగ్గా అలవాటుపడుతుందా లేదా అని తెలుసుకోగలం.  ఇచ్చిన కొత్తఆహారం జీర్ణం కాకపోయినా లేదా ఎలర్జీలు కలిగినా ఈ మూడు రోజుల్లో మనకి తెలుస్తుంది.

ఎటువంటి సమస్య ఎదురుకాకపోతే మరొక కొత్త ఆహారం అంటే మెదిపిన అరటి పండుని ఇవ్వడం మొదలుపెట్టండి. ఒకేసారి  ఒకటి కంటే ఎక్కువ కొత్త ఆహారం ఇవ్వవద్దు. పాపకి అరటి పండు, ఆపిల్ గుజ్జు ఇవ్వవచ్చు. నిమ్మ జాతి పండ్లు, కరకర లాడే  ఆహారం, పెరుగు మరి ఏ ఇతర ఆహారం ఇవ్వకూడదు అవి పాప జీర్ణక్రియకు సరిపడవు. బుజ్జాయి తినడానికి ఇష్టం చూపక పోతే బలవంతపెట్టకండి, మెల్లగా అలవాటు చేయండి.

బియ్యాన్ని దోరగా వేయించి , నూకలా చేసి, మెత్తగా ఉడికించి పప్పు తేట కానీ చారు కానీ కలిపి నెయ్యి వేసి  తినిపించాలి. నేరుగా బియ్యంతో వండిన అన్నం పెడితే పిల్లలకు అజీర్తి సమస్యలు వస్తాయి .

ఎనిమిది నుంచి పది నెలల పిల్లలు

ఈ వయసులో మెల్లగా వారికి పాలపళ్ళు రావడం మొదలవుతుంది కాబటికి మెత్తగా ఉడికించిని అన్నం,  టమాటా సూపులు, ఉడికించిన కూరగాయలు, పండ్ల గుజ్జు, పప్పన్నం వంటివి పెట్టవచ్చు.

పది నుంచి పన్నెండు నెలల పిల్లలు

పిల్లలకు పది నెలలు నిండిన తరువాత మనం తినే  ఆహారాల్లో చాలా వరకు పెట్టవచ్చు . ఎందుకంటే వారికి నమిలి  అరిగించుకొనే శక్తీ వస్తుంది కాబట్టి.

కిచిడి, ఇడ్లి, దోస, హల్వా, చిరు ధాన్యాలు, పెరుగన్నం, మెదిపిన పండ్లు, కూరగాయలు, అలాగే పండ్ల ముక్కలు మెల్లగా తినిపించవచ్చు

పిల్లల విషయంలో పాటించ వలసిన ముఖ్యమైన జాగ్రత్తలు

పుట్టిన ప్రతి బిడ్డ ఎవరికి వారే ప్రత్యేకం, వేరొక బిడ్డ తినే విదంగా మన పిల్లలు తినడం లేదు అని  పోల్చుకోనవసరం లేదు. కొంత మంది పిల్లలు తిండి మీద ఎక్కువ ఇష్టం చూపించరు అటువంటి వాళ్లకు మెల్లగా అలవాటు  చేయాలి . అజీర్తి సమస్యలు ఉంటె వెంటనే వైద్యుడిని సంప్రదించండి. గొంతులో అడ్డుపడే జిగురుగా ఉండే ఆహారం, గట్టిగా ఉండేవి తినకుండా జాగ్రత్త వహించండి.

మనలో చాలా మంది  చంటి పిల్లలకు తేనెని పడుతుంటారు. తేనె స్వతహాగా మంచిదే అయిన్నప్పటికీ  బిడ్డకు ఒక సంవత్సరం వచ్చే వరకు తేనె ఇవ్వకపోవడం ఉత్తమం. తేనె లో క్లాస్ట్ర్రీడియమ్ అనే ఒక విధమైన  బాక్టీరియా ఉండడం వల్ల పిల్లలకు అనారోగ్యం ఏర్పడే ప్రమాదం ఉంది.

ఒక సంవత్సరం నిండే  వరకు వారికి కేవలం ఇంట్లో  తయారు చేసిన ఆహారం మాత్రమే  ఇవ్వాలి. పీచు, మాంసకృత్తులు అధికంగా ఉండే  ఆహారం వారికి సరిగా జీర్ణం కాదు.

పిల్లలకు ఏది పెట్టవచ్చు అనేది ఆ కుటుంబ స్థితి గతులు మరియు అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. కానీ పిల్లలకు ఎట్టి పరిస్థితులలోను మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహారం, అధికమైన మోతాదులలో చక్కర, నూనె లేదా నెయ్యి వేసి చేసిన తీపి పదార్థాలు, శీతల పానీయాలు  మరి ఏ ఇతర అంగట్లో కొన్న ఆహారం పెట్టకూడదు. దీని వల్ల వారికి కఫ దోషం, జీర్ణ వ్యవస్థలో ఇన్ఫెక్షన్స్ లు వంటివి రావచ్చు. కాబట్టి ఎల్ల వేళలా వారికి మీరు ప్రేమ మరియు శ్రద్ధతో చేసిన తాజా ఆహారాన్నే అందించండి.

  • 1
వ్యాఖ్యలు()
Kindly Login or Register to post a comment.

| Aug 19, 2019

హాట్ అండి మా పాప కు 7వ నెల మా పాప కు ఇడ్డిలి పెట్టవచున

  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు
పైన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్లాగ్లు

Always looking for healthy meal ideas for your child?

Get meal plans
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}