• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

సిజేరియన్ డెలివరీ తర్వాత తల్లిపాలు ఇవ్వడంపై ఉండే అపోహలు

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Aug 05, 2022

గర్భధారణ సమయంలో మరియు ముఖ్యంగా సిజేరియన్ ఆపరేషన్ విషయంలో ఎన్నో అపోహలు ఉన్నాయి. ఎంతోమంది ఎన్నో రకాల సలహాలు ఇస్తూనే ఉంటారు. అప్పటికే ఆందోళనలో ఉన్న తల్లిలో మరింత ఆందోళనను పెంచుతారు.

 

నేను సిజేరియన్ ఆపరేషన్ ద్వారా నా కొడుకును ప్రసవించాను. అందుకే ఈ అపోహల గురించి నాకు బాగా తెలుసు. సిజేరియన్ ఆపరేషన్ అన్నది ఎంతో కష్టతరమైనది అని మరియు అది  బిడ్డకు పాలు ఇవ్వడంపై  ఎంతో అసౌకర్యాన్ని కలిగిస్తుందని నేను కూడా అనుకున్నాను. సిజేరియన్ విషయంలో నాకున్న మిడిమిడి జ్ఞానంతో నేను అయోమయంలో పడి పోయాను.

 

సిజేరియన్ తర్వాత ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. దీనివలన కూర్చోవడం  మరియు తల్లిపాలు ఇవ్వడంలోను ఎంతో బాధాకరంగా ఉంటుంది. మీరు మందులు కూడా ఉపయోగించకూడదు. మందులు ఉపయోగించినట్లయితే మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

 

డెలివరీ సమయంలో నాతో పాటుగా ఉన్న ఒక ఆంటీ సంభాషణలలో ఇది ఒకటి. నేను ఎప్పుడూ భయపడలేదు. నేను క్రమంగా కడుపుపై ఉన్న కుట్లను అలవాటు చేసుకోవడం మొదలు పెట్టాను.

 

మీకు సాధారణ డెలివరీ అయినప్పటికీ లేదా సిజేరియన్ అయినప్పటికీ కొన్ని రకాల కష్టాలు అన్నవి అనివార్యం. కానీ వాటిని భరించడం అసాధ్యం అని కాదు.

 

డెలివరీ తర్వాత తల్లిపాలు ఇవ్వడానికి సంబంధించిన సాధారణమైన అపోహల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాను.

 

1. సిజేరియన్ అయినట్లయితే తల్లి పాలివ్వడం కష్టతరం అవుతుంది.

 

ప్రతి తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం అన్నది నేర్చుకున్న ఒక అలవాటు. ప్రతి తల్లి తన బిడ్డకు సౌకర్యవంతంగా ఉండే భంగిమలో పాలు ఇవ్వడానికి చాలా సాధన చేస్తుంది. మరియు సిజేరియన్ అయిన తల్లి కుట్లు ఉన్నందున మరింతగా జాగ్రత్త వహించడానికి మొగ్గు చూపుతుంది. అంతే కాని ఏ తల్లికి కూడా బిడ్డకు తల్లి పాలివ్వడం అస్సలు కష్టం కాదు.

 

బిడ్డను సరైన స్థితిలో అనుకూలంగా ఉండే విధంగా చూసుకోండి.

 

సౌకర్యం కోసం శిశువు క్రింద ఒక దిండును ఉంచండి.

 

రెండు వైపులా మార్చి మార్చి పాలు పట్టండి.

 

పాలను నిల్వ చేసుకునేందుకు పంపును ఉపయోగించండి.

 

పాలు ఇవ్వడం వలన వచ్చే చనుమొనల నొప్పుల నుండి సురక్షితంగా ఉండేందుకు మాయిశ్చరైజర్లు మరియు ఎసెన్షియల్ ఆయిల్ ను ఉపయోగించండి.

 

2. సిజేరియన్ ఆపరేషన్ వలన తల్లిపాల ఉత్పత్తి ఆలస్యమవుతుంది.

 

సిజేరియన్ ఆపరేషన్ వలన తల్లిపాల ఉత్పత్తి ఆలస్యం అవుతుంది అనేది పూర్తి అపోహ. అనస్తీషియా ప్రభావం వలన, మందుల ప్రభావం నుండి బయటకు రావడానికి తల్లికి కొన్ని గంటల సమయం పడుతుంది. శిశువు కూడా పుట్టిన వెంటనే నిద్రలో ఉంటుంది. కాబట్టి తల్లిపాలు ప్రారంభించడానికి కొంత సమయం అవసరం ఉంటుంది.

 

3. సిజేరియన్ ఆపరేషన్ తర్వాత తల్లి పాలివ్వడం ఎప్పుడు బాధాకరంగా ఉంటుంది.

 

సిజేరియన్ ఆపరేషన్ ద్వారా శిశువును ప్రసవించడం అన్నది నిస్సందేహంగా ఒక సున్నితమైన ప్రక్రియ. ఇది కోతలతో కూడుకున్నది. దీని వలన కొంత నొప్పి ఉంటుంది మరియు కుట్ల విషయంలో ఎంతో జాగ్రత్త అవసరం. అయినప్పటికీ తల్లి కొన్ని ముఖ్యమైన చిట్కాలను ప్రారంభ దినాలలో అవలంబించినట్లయితే తక్కువ కష్టంతో అయిపోతుంది.

 

తల్లి ఒక ప్రక్కకు తిరిగి పాలివ్వడం సౌకర్యంగా ఉంటుంది. ఇది నేను కూడా తేలికగా మరియు సౌకర్యంగా ఉండేందుకు కనుగొన్న ఉత్తమమైన మార్గం. ప్రక్కకు తిరిగి పడుకోవడం వలన పొత్తికడుపుపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఇది మీ బిడ్డకు కూడా సులభతరంగా ఉంటుంది.

 

ఫుట్బాల్ హోల్డింగ్ విధానం కూడా తల్లిపాలు ఇవ్వడానికి సౌకర్యంగా ఉంటుంది.

 

శిశువుతో అనుబంధం బలపడడానికి తల్లికి ఇది ఎంతో సహాయపడుతుంది.

 

4. పెయిన్ కిల్లర్స్ పాల ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తాయి మరియు శిశువుల ఆరోగ్యానికి మంచిది కాదు.

 

మీకు నొప్పిగా ఉన్నట్లయితే ఆ ఔషధాలను తీసుకోవడం వలన వేగంగా కోలుకుంటారు. మరియు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. డాక్టర్ల సూచన మేరకు మందులు తీసుకోవడం సురక్షితం.

 

నేను కూడా కుట్ల నొప్పి నుండి నన్ను నేను రక్షించుకున్నాను మరియు ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా శిశువుతో నా సమయాన్ని ఆస్వాదించాను. చివరిగా తల్లి పాలివ్వడంలో ఉన్న ఆనందం ఔషధ తైలం వలె పనిచేస్తుంది.

 

తల్లిపాలు ఇవ్వడం అన్నది రాత్రికి రాత్రి నేర్చుకో లేము. ఇది సమయము మరియు అభ్యాసంతో సాధించవలసినపని.

 

మా కజిన్ నేహా ఒక మంచి తల్లిగా ఎదగడం నేను చూశాను. ఆమె తన డాక్టర్ ద్వారా సరైన భంగిమలు మరియు తల్లిపాలు ఇచ్చే విధానం గురించి తెలుసుకున్నది. వైద్యులు సూచించిన సురక్షితమైన పెయిన్ కిల్లర్స్ ను తీసుకోవడానికి ఆమె ఎప్పుడూ వెనుకాడలేదు. అత్యవసర పరిస్థితులలో సిజేరియన్ చేయించుకోవడం ఆమెకు ఎంతో ఉపయోగకరం అయింది. ఇది మానసికంగా ఎటువంటి ఆందోళనకు గురి చేయలేదు. సిబ్బంది మరియు నిపుణుల నుండి సరైన సమాచారాన్ని సేకరించడం ద్వారా హాస్పిటల్ లో ఉన్న సమయాన్ని ఉపయోగించుకునే విషయంలో నేహా చాలా తెలివైనది. వారిది చిన్న కుటుంబం కావడం మరియు అన్నిటిని ఒంటరిగా చూసుకోవలసి రావడం వలన ఆమె బ్రెస్ట్ ఫీడింగ్ పంపును ఎంచుకున్నది. ఇది ఆమెకు ఎంతో సౌలభ్యాన్ని ఇచ్చింది.

 

ఆమె తన బాధను మరియు అసౌకర్యాలను అధిగమించినట్లుగా మనమందరం కూడా అధిగమించగలము. కాబట్టి మీకు సిజేరియన్ ఆపరేషన్ అవుతుంది అనుకుంటే దయచేసి ఎటువంటి ఒత్తిడి యొక్క ఉచ్చులో కూరుకు పోకండి. అందుబాటులో ఉన్న సమాచారాన్ని స్వీకరించడం మంచిది. అదే సమయంలో అందులోని వాస్తవాలను అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యమైనది.


అపోహల నుండి దూరంగా ఉండండి మరియు మీ మనసు చెప్పే మాటలు వినండి. మీ చిన్నారికి తల్లిపాలు ఇస్తూ ఆస్వాదించండి.

  • 1
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.

| Jan 04, 2021

  • Reply
  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}