• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
వేడుకలు మరియు పండుగలు

క్రిస్మస్ సందర్భంగా 6 రకాల గ్లూటెన్ ఫ్రీ కేక్ రిసిపీలు

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Dec 17, 2020

 6
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

మీరూ వెతుకుతున్నారా - గ్లూటెన్ ఫ్రీ కేకులు ఇంట్లో ఎలా తయారు చేయాలి ? క్రిస్మస్ దగ్గరలోనే ఉన్నందున ప్రతి ఒక్కరూ ఈ పండుగ కోసం సన్నద్ధమవుతున్నట్లుగా అనిపిస్తుంది. షాపింగ్ చేసి బహుమతులు కొనడం నుండి కుకీలు మరియు కేకులు బేకింగ్ వరకు, మీరు ఇప్పటికే ఎక్కడ చూసినా క్రిస్మస్ సందడిని చూస్తూ ఉండవచ్చు. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే, వారికి గ్లూటెన్ ఎలర్జీ ఉన్నట్లయితే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి మీరు  గ్లూటెన్ ఫ్రీ కేకులను తయారు చేయాలి.  గ్లూటెన్ ఫ్రీ కేకులు చాలా అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మీతో పంచుకుంటాను. అయితే ముందుగా ' గ్లూటెన్ ' అంటే ఏమిటో తెలుసుకుందాం.

 

గ్లూటెన్ అంటే ఏమిటి ?

 

గ్లూటెన్ అంటే గోధుమ, బియ్యం మరియు బార్లీ వంటి ధాన్యాలలో లభించే  ప్రోటీన్లకు నుండి వస్తుంది. గ్లూటెన్ కలిగిన  గోధుమలను ఎక్కువగా వినియోగిస్తారు. గ్లూటెన్ లోని రెండు ప్రధాన ప్రోటీన్లు గ్లూటెన్ మరియు గ్లీయాడెన్. గ్లియడెన్ ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను చూపిస్తుంది. మీరు ఈ పిండిని నీటితో కలిపినప్పుడు గ్లూటెన్ ప్రోటీన్లు జిగురు లాంటి లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ జిగురు పిండిని సాగేలా చేస్తుంది చపాతీలు చేసే సమయంలో బాగా పొంగి సంతృప్తికరమైన రుచి మరియు ఆకృతిని ఇస్తుంది.

 

గ్లూటెన్ ఎటువంటి సమస్యలకు కారణం అవుతుంది ?

 

ఇది పిల్లలలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. చాలా మంది పిల్లలు గ్లూటెన్ వలన అసౌకర్యాలను భరిస్తున్నారు. కడుపు నొప్పి, అలసట, విరేచనాలు మరియు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీ పిల్లలలో ఈ లక్షణాలను మీరు గమనించినట్లయితే వారు గ్లూటెన్ వలన ఇటువంటి అసౌకర్యానికి గురవుతున్నారని మీరు నిర్ధారించుకోవచ్చు.

 

గ్లూటెన్ ఉదర కుహర వ్యాధికి కారణమవుతుంది !

 

గ్లూటెన్ తీవ్రమైన రూపం జీర్ణ సమస్య. చిన్న ప్రేగులలో సమస్య, ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం, తలనొప్పి, అలసట, చర్మంపై దద్దుర్లు, బరువు తగ్గడం వంటివి. కొంతమంది పిల్లలలో జీర్ణసమస్యలు కనిపించవు కానీ అలసట లేదా రక్తహీనతకు గురవుతారు.

 

రుచికరమైన మరియు గ్లూటెన్ ఫ్రీ కేక్ రెసిపీలు :

 

మీ పిల్లలకు  గ్లూటెన్ అలర్జీలు, సెలియక్ వంటి వ్యాధులు రాకుండా చూసుకోవాలి.

8 రకాల గ్లూటెన్ ఫ్రీ  కేకుల జాబితాను ఇస్తాను. అవి తయారు చేయడానికి సులభం మరియు తినడానికి రుచికరమైనవి.

 

1. రుచికరమైన లెమన్ డ్రిజిల్ కేక్ :

 

లెమన్ డ్రిజిల్ కేక్ తయారు చేసేందుకు  కావలసిన పదార్థాలు ..

 

350 గ్రాముల ఉప్పు లేని మెత్తటి వెన్న

 

350 గ్రామాల క్యాస్టర్ చక్కెర

 

8 మీడియం గుడ్లు

 

6 నిమ్మకాయలు

 

150 గ్రాములు  గ్లూటెన్ ఫ్రీ పిండి.

 

100 గ్రాముల గ్రైండ్ చేసిన బాదం

 

150 గ్రాముల షుగర్ క్యూబ్స్

 

లెమన్ డ్రిజిల్ కేక్ తయారీ విధానం :

ఓవెన్ ను 180° సీ ప్రి హీట్ చేసి  బ్రెడ్ బౌల్ ను పర్చ్మే ట్  కాగితం వేసి గ్రీస్ చేయండి.

 

ఒక పెద్ద గిన్నెలో వెన్న మరియు చక్కెరను బాగా కలిపి 5 నిమిషాల పాటు మెల్లిగా మృదువుగా అయ్యేవరకు కలపండి.

 

అందులో గుడ్లను కొట్టండి , ఆ తర్వాత నాలుగు నిమ్మకాయలను తురిమిన కోరు మరియు ఒక నిమ్మకాయ రసం కలపండి.

 

పిండిని మరియు గ్రౌండ్ ఆల్మోమ్డ్స్ను ఫోల్డ్ చేసి పెట్టుకున్న  బాదంను కలపండి.

 

ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని బేక్ చేసే టిన్ లో వేసి 40 నుండి 50 నిమిషాల వరకు ఉడికించి స్పూన్ కి అంటుకోకుండా శుభ్రంగా ఉడికే వరకు ఉంచండి.

 

ఆ తర్వాత 20 నిమిషాల పాటు  చల్లారనివ్వండి. ఆ తర్వాత దాన్ని బోర్లించండి.

 

ఇంతలో ఒక చిన్న బౌల్ తీసుకొని షుగర్ క్యూబ్స్ వేసి అందులో 2  1/2 నిమ్మకాయల రసాన్ని మరియు రెండు నిమ్మకాయలు తురుమును సిద్ధం చేసుకోండి.

 

అయిదు నిమిషాల పాటు నాననివ్వండి. ఆ తర్వాత స్పూన్ వెనుకభాగాన్ని ఉపయోగించి షుగర్ క్యూబ్స్ ని నొక్కండి.

 

వడ్డించే ముందు పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేయండి.

 

2. యమ్మి బనానా కేక్ :

 

బనానా కేక్ తయారు చేసేందుకు కావలసిన పదార్థాలు :

 

150 గ్రాముల ఉప్పులేని మెత్తని బట్టర్

 

150  గ్రాముల మాస్కోవాడో చక్కెర

 

4 పెద్ద గుడ్లు

 

100 గ్రాముల మృదువైన ఆపిల్ సాస్

 

సుమారు 750 గ్రాములు తొక్క తీసి, మెత్తగా తయారు చేసిన బాగా ముగ్గిన 6 అరటిపండ్లు

 

2 1/2 స్పూన్ల మిశ్రమ మసాలా

 

300 గ్రాముల గ్లూటెన్ ఫ్రీ పిండి

 

2 స్పూన్ల   గ్లూటెన్ ఫ్రీ బేకింగ్ పౌడర్

 

బనానా కేక్ కు కావలసిన ఐసింగ్ పదార్థాలు

 

1 టేబుల్ స్పూన్ పాలు ( అవసరమైతే)

 

అలంకరించడానికి బనానా చిప్స్, మీకు ఇష్టమైతే.

 

బనానా కేక్ తయారీ విధానం :

 

ఓవెన్ ను 180 డిగ్రీల సీ ప్రి హీట్ చేసి  బ్రెడ్ బౌల్ ను పర్చ్మే ట్  కాగితంవేసి గ్రీస్ చేయండి.

 

ఒక పెద్ద గిన్నెలో వెన్న మరియు మాస్కోవాడో చక్కెరను క్రీంలాగ మారే వరకు బాగా కలపండి.

 

ఇందులో మెల్లిగా గుడ్లను, ఆపిల్ సాస్ ను కలపండి. ఆ తర్వాత అరటిపండు గుజ్జును వేసి కలపండి.

 

మసాలా, పిండి, బేకింగ్ పౌడర్ మరియు చిటికెడు ఉప్పు వేసి జల్లించి అందులో కలపండి.

 

మిశ్రమాన్ని వేడెక్కిన బౌల్లో పోయండి.

 

50 నిమిషాల నుండి ఒక గంట వరకు ఉంచి స్పూన్ తో చూసినప్పుడు ఏమి అంటుకోకుండా ఉంటుంది. 10  నిమిషాల పాటు చల్ల పడేందుకు అందులోనే వదిలేయండి. ఆ తర్వాత తీసి బోర్లించండి.

 

ఐసింగ్ కోసం వెన్న మరియు చక్కెరను వేసి బాగా కలపండి. అవసరమైతే మృదువుగా రావడానికి పాలను వాడండి.

 

కేక్ బాగా ఆరిన తర్వాత దీనిని కేక్ పై స్ప్రెడ్ చేయండి.

 

కట్ చేసి ఆరగించండి

 

3. రుచికరమైన బ్లూ బెర్రీ మరియు లెమన్ కేక్ :

 

బ్లూ బెర్రీ అండ్ లెమన్ కేక్ తయారీకి కావలసిన పదార్థాలు..

 

450 గ్రాముల ఉప్పులేని మెత్తని బట్టర్

 

450 గ్రాముల క్యాస్టర్ షుగర్

 

8 గుడ్లు

 

3 నిమ్మకాయల రసం

 

150 గ్రాముల పోలెంటా

 

300 గ్రాముల గ్లూటెన్ ఫ్రీ పిండి

 

400 గ్రాముల బ్లూ బెర్రీస్

 

బ్లూబెర్రీ మరియు నిమ్మకాయ కేక్ డెకరేషన్ కి కావలసిన పదార్థాలు

 

600 మీ. లీ డబల్ క్రీం

 

8 టేబుల్స్పూన్ల జల్లించిన ఐసింగ్ షుగర్

 

200 గ్రాముల బ్లూ బెర్రీస్

 

బ్లూ బెర్రీ మరియు లెమన్ కేక్ తయారీ విధానం

 

ఓవెన్ ను 180 డిగ్రీలతో ఫ్రీ హిట్ చేసుకోండి. బేకింగ్ పర్చ్మే ట్ తో 30.5 సెంటీమీటర్లు × 40.5 సెంటీమీటర్లు × 10 సెంటీమీటర్లు.

 

కేక్ తయారు చేయడానికి వెన్న మరియు పంచదారను ఒక పెద్ద గిన్నెలో వేసి బాగా చిలకండి.

 

క్రమంగా  గుడ్లను మరియు మిగతా పదార్థాలను కూడా అందులో వేసి బాగా కలపండి. నిమ్మరసాన్ని కూడా చేర్చండి.

 

పోలేంటా, పిండి, బేకింగ్ పౌడర్ మరియు నాలుగు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి ఆ పిండిని మృదువుగా కలుపుకోండి.

 

సగం బ్లూ బెర్రీస్ ని పక్కన తీసి ఉంచుకోండి.

 

సిద్ధం చేసుకున్న బౌల్లో సగం వరకు ఈ మిశ్రమాన్ని పోయండి.

 

మిగిలిన బ్లూ బెర్రీస్  పైన చల్లుకోండి.

 

40 నిమిషాల పాటు లేదా బంగారు రంగులోకి వచ్చేవరకు ఉంచండి. స్పూన్ తో పరీక్షించినప్పుడు అది ఏమి అంటుకోకుండా ఉండాలి. చల్లబడ్డాక దానిని బోర్లించండి.

 

కేక్ పూర్తిగా చల్లబడిన తర్వాత పెద్ద సర్వింగ్ ప్లేట్ లోకి మార్చండి.

 

డెకరేషన్ కోసం క్రీం మరియు ఐసింగ్ చక్కెరను ఒక గిన్నెలో వేసి బాగా కలిపి అందులో నిమ్మరసం చేర్చండి.

 

చల్లబడిన కేక్ పై ఐసింగ్ మరియు 100 గ్రాముల బ్లూ బెర్రీస్ తో అలంకరించండి.

 

4. రుచికరమైన లెమన్ టార్ట్ :

 

లెమన్ టార్ట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు...

 

150 గ్రాముల వెన్న

 

100 గ్రాముల క్యాస్టర్ చక్కెర

 

2 నిమ్మకాయల తురుము (అభిరుచిని బట్టి)

 

2 గుడ్లు

 

150 గ్రామాల బియ్యం పిండి

 

లెమన్ టార్ట్ నింపడానికి కావలసిన పదార్థాలు..

 

6 గుడ్లు

 

6 గుడ్ల పచ్చసొన

 

4 నిమ్మకాయల రసం (అభిరుచిని బట్టి)

 

400 గ్రామాల క్యాస్టర్ చక్కెర

 

2 టేబుల్స్పూన్ల మొక్కజొన్న పిండి

 

80 గ్రాములు వెన్న

 

లెమన్ టార్ట్  డెకరేషన్కు కావలసిన పదార్థాలు.

 

ఐసింగ్ షుగర్, పైన చల్లేందుకు

 

లెమన్ టార్ట్  తయారీ విధానం..

 

పేస్ట్రీ తయారీకి వెన్న, చక్కెర, మీ రుచికి సరిపడా నిమ్మరసం, బియ్యం పిండిని ఫుడ్ ప్రాసెసర్ లో వేసి బాగా కలుపుకొండి.

 

ఈ మిశ్రమం బాగా కలిసిన తర్వాత అందులో గుడ్డును చేర్చండి.

 

ఈ మిశ్రమాన్ని గుండ్రంగా చేసి  క్లింగ్ పేపర్లో చుట్టి 30 నిమిషాల పాటు నాననివ్వాలి.

 

ఓవెన్ ను 200° సీ లో ఫ్రీ హీట్ చేసి సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్రీ ని అందులో ఉంచండి.

 

బియ్యప్పిండిని పైన కొంచెం చల్లి పేస్ట్రీ ని బయటకు తీయండి.

 

20.5 సెంటీమీటర్ల రౌండ్, 4 సెంటీమీటర్ల ఎత్తు లో ఉండే టిన్ లో శాండ్విచ్  తయారు చేయండి.

 

15 నిమిషాల పాటు దీనిని చల్లారనివ్వండి.

 

పేస్ట్రీ ని బేకింగ్ ఫార్చిమెంట్ తో సెట్ చేసి  తర్వాత బేకింగ్ బీన్స్ తో నింపండి.

 

పేస్ట్రీ ని 15 నిమిషాల పాటు వేడి చేయండి. ఆ తర్వాత బీన్స్ మరియు ఫార్చిమెంట్ ను జాగ్రత్తగా తొలగించండి.

 

పేస్ట్రీ కేసును తిరిగి ఓవెన్ లో ఉంచి బంగారు రంగు వచ్చేవరకు ఎనిమిది నుండి పది నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత ఓవెన్ నుండి తీసి పక్కన పెట్టండి.

 

ఫిల్లింగ్ చేయడానికి మొత్తం గుడ్లు మరియు పచ్చసొనలు , సరిపడా నిమ్మరసం, కాస్టర్ చక్కెర మరియు కాన్ఫ్లోర్ కలిపి పాన్ లో ఉంచండి.

 

ఈ మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ బుడగలు వచ్చే వరకు ఉడికించండి.

 

ఆ మిశ్రమాన్ని స్టవ్ మీద నుండి దింపి బట్టర్ బాగా కలిసిపోయే వరకు కలపండి. ఆ తర్వాత బేక్ చేసిన పేస్ట్రీలో నింపండి.

 

కనీసం నాలుగు గంటల పాటు బాగా చల్లబడే వరకూ వదిలేయండి

 

సర్వ్ చేయడానికి ముందు ఐసింగ్ షుగర్ తో డెకరేట్ చేసి మీకు నచ్చితే ముక్కలుగా కట్ చేసుకుని వడ్డించుకోండి.

 

5. చాక్లెట్ ప్రియులకు చాక్లెట్ కేక్ :

 

చాక్లెట్ కేక్ తయారీకి కావలసిన పదార్థాలు :

 

150 గ్రాముల బట్టర్, మరికొంత గ్రీజింగ్ కోసం

 

150 గ్రాముల  గ్లోటన్ ఫ్రీ ప్లైన్ చాక్లెట్

 

400 మెత్తని బ్రౌన్ షుగర్

 

4 గుడ్లు

 

200 ఎంఎల్  స్వచ్ఛమైన పెరుగు

 

వెనిల్ల ఎసెన్స్ కొంచెం

 

400 రాముల బ్రౌన్ రైస్ పౌడర్

 

4.5 ఎంఎల్ వీట్ ఫ్రీ బేకింగ్ పౌడర్

 

8 ఎంఎల్ సోడా

 

చాక్లెట్ కేక్ పై ఐసింగ్ చేయడానికి కావలసిన పదార్థాలు..

 

600 గ్రాముల గ్లూటెన్ ఫ్రీ ప్లేన్ చాక్లెట్

 

400 ఎంఎల్ కార్టౌన్ డబల్ క్రీమ్

 

చాక్లెట్ కేక్ తయారీ విధానం :

 

ఒక లోతైన 18 సీ ఎం రౌండ్ ఉన్న కేక్ టిన్ కు గ్రీస్ రాసి గ్రేస్ ప్రూఫ్ కాగితం వేసి సిద్దం చేసుకోండి

 

చాక్లెట్ ను చిన్న ముక్కలుగా కట్ చేసి , ఒక గిన్నెలో నీరు పోసి సిమ్లో పెట్టి కలుపుతూ కరిగేవరకు ఉంచండి.

 

దాన్ని కొంచెం చల్లారనివ్వండి

 

బట్టర్ మరియు చక్కెరను మృదువుగా వచ్చేవరకు కలపండి.

 

గుడ్లను కొట్టి అందులో కరిగించిన చాక్లెట్,పెరుగు మరియు వెనిల్ల ఎసెన్స్లతో ఈ మిశ్రమాన్ని కలపండి.

 

పిండి, బేకింగ్ పౌడర్, వంట సోడా బాగా జల్లించి పై మిశ్రమంలో కలపండి.

 

ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న టీన్ లోకి వేయండి. 180° సీ వద్ద 45 నిమిషాల నుండి ఒక గంట వరకు ఉంచండి. మధ్యలో బాగా ఉదికిండో లేదో తెలుసుకోవడానికి స్పూన్తో చెక్ చేసుకోండి.

 

10 నిమిషాలు చల్లబడడానికి టీన్ లోనే వదిలివేయండి

 

చాక్లెట్ కేక్ ఐసింగ్ విధానం..

 

చాక్లెట్ ను చిన్న ముక్కలుగా కట్ చేసి హీట్ ప్రూఫ్ గిన్నెలో ఉంచండి.

 

క్రీం ను బాగా కరిగిన తర్వాత చాక్లెట్ పై పోయండి.

 

ఐదు నిముషాల పాటు ఉంచండి

 

చాక్లెట్ బాగా కరిగి మెత్తగా అయ్యేవరకు కలపండి.

 

ఈ మిశ్రమం గట్టిపడేవరకు ఉంచి ఆ తర్వాత కేక్ పై కవర్ చేయండి.

 

6. ఈజీ పీజీ కోకోనట్ కేక్ :

 

కోకోనట్ కేక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు..

 

300 గ్రాముల డైరీ ఫ్రీ సన్ ఫ్లవర్స్ స్ప్రెడ్

 

5 టేబుల్ స్పూన్స్ బత్తాయి రసం

 

200 ఏంఎల్ కొబ్బరి పాలు

 

150 గ్రాముల బాదం పొడి

 

2 గుడ్లు

 

2 టీ స్పూన్ల గ్లుటన్  ఫ్రీ బేకింగ్ పౌడర్

 

150 గ్రాముల క్యాస్టర్ షుగర్

 

కొబ్బరి కేక్ ఐసింగ్ కోసం కావలసినవి...

 

80 గ్రాముల క్యాస్టర్ షుగర్

 

2 స్పూన్లు క్రీం

 

కొన్ని చుక్కల వెనిల్ల ఎసెన్స్

 

వేపిన కొబ్బరి రేకులు (అలంకరించడానికి)

 

కొబ్బరి కేక్ తయారీ విధానం...

 

180° సీ వద్ద 18 సెంటీమీటర్లు రౌండ్ గిన్నెకు గ్రేఅస్ రాసి పార్చమెంట్ తో సిద్ధ పరచుకోండి

 

కేక్ తయారు చేయడానికి పై పదార్థాలన్నింటినీ ఫుడ్ ప్రాసెసర్లోవేసి బాగా కలపండి.

 

ఈ మిశ్రమాన్ని టిన్లో వేసి 40 నుండి 45 నిమిషాలపాటు ఉంచండి.  బంగారు రంగు వచ్చేవరకు ఉంచి మధ్యలో స్పూన్తో చెక్ చేసుకుంటూ ఉండండి.

 

పదినిమిషాల పాటు చల్లబడడానికి టిన్ లో వదిలేయండి. ఆ తర్వాత టెన్ నుండి తీసి బోర్ల వేయండి.

 

ఐసింగ్ కోసం, ఒక చిన్న గిన్నెలో చక్కెర మరియు క్రీమ్ వేసి నాలుగు టేబుల్ స్పూన్ల వేడినీటిని వేసి కలుపుతూ ఉండండి.

 

10 నిమిషాలపాటు సరైన చిక్కదనం వచ్చే వరకు బాగా కలపండి. అందులో వెనిలా ఎసెన్స్ ను వేయండి

 

చల్లబడిన కేకుపై ఈ  ఐసింగ్ ను వేయండి. మీకు  నచ్చినట్లయితే కొబ్బరి రేకులతో డెకరేట్ చేసుకోండి.

 

ముక్కలుగా కట్ చేసి వడ్డించండి


గ్లూటెన్ ఫ్రీ కేక్ వంటకాలు మీకు నచ్చాయా ? క్రింది వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన వేడుకలు మరియు పండుగలు బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}