• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
బిడ్డ సంరక్షణ

శిశువులకు కొబ్బరి నూనె మసాజ్ ప్రయోజనాలు...కొబ్బరి నూనెతో మసాజ్ చేయడానికి చిట్కాలు.

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Aug 25, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

పిల్లలు చాలా సున్నితమైన మరియు మృదువైనవారు. వారి తొలి రోజులలో మసాజ్ నుండి ఎంతో ప్రయోజనం
పొందుతారు. ఎందుకంటే అది వారి ఎముకల నిర్మాణానికి మరియు మంచి రక్త ప్రసరణకు సహాయపడుతుంది.
భారతీయులమైన మనము అందరమూ దాదాపుగా శిశువులకు మసాజ్ చేస్తాము. పిల్లల పెంపకంలో మీ చిన్నారికి
ఉత్తమమైన మసాజ్ ఆయిల్ ను ఎంచుకోవడం మీరు ఎదుర్కోవాల్సిన కఠినమైన పనులలో ఒకటిగా గుర్తించవచ్చు.

మార్కెట్లో బేబీ మసాజ్ ఉత్పత్తులు ఎన్నో ఉంటాయి. అంటే బాదం నూనె , కొబ్బరి నూనె మొదలైనవి. నవజాత
శిశువులకు ఏది మంచిది అనే దానిపై కొత్తగా తల్లిదండ్రులు అయిన వారు మనసులో ఎప్పుడూ సందేహం ఉంటుంది.
కొంతమంది తల్లిదండ్రులు కొత్త ఉత్పత్తులను ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు. మరికొంతమంది సాంప్రదాయక
ఉత్పత్తులపై పూర్తిగా నమ్మకం ఉంచుతారు. ఎందుకంటే వారి పెద్దలు వాటిపై నమ్మకం ఉంచారు.

శిశువుకు మసాజ్ చేయడానికి కొబ్బరి నూనెను ఎందుకు ఇష్టపడతారు ?

మీ శిశువు యొక్క మృదువైన మరియు సున్నితమైన చర్మం పై పూర్తిగా సహజమైన, పరిశుభ్రమైన, సురక్షితమైన
మరియు తేలికగా ఉండే కొబ్బరి నూనె మీ బిడ్డకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. మసాజ్ ఆయిల్ యొక్క
ముఖ్య పాత్ర మరియు ప్రయోజనం చర్మాన్ని తేమగా ఉంచడం. ఆ పని కొబ్బరినూనె సరిగ్గా చేస్తుంది. తేలికగా
ఉండడంవల్ల చర్మము సులువుగా పీల్చుకుంటుంది. కొబ్బరి నూనె ఎన్నో చర్మ సమస్యలకు మంచిగా
ఉపయోగపడుతుందని నిరూపించబడింది. చర్మం దీనిని సులువుగా గ్రహించడంతో చర్మాన్ని త్వరగా హైడ్రేట్ చేసే
గుణాన్ని కలిగి ఉంటుంది . కొబ్బరినూనె వేసవిలో చర్మాన్ని చల్లబరిచడానికి మరియు శీతాకాలంలో చర్మాన్ని వేడిగా
ఉంచడానికి ఉపయోగించవచ్చు. దీనిని బేబీ మసాజ్ కోసం ఏడాది పొడవునా వాడవచ్చు. కొబ్బరి నూనెతో చిన్న
పిల్లలకు మసాజ్ చేయడం వలన కలిగే ప్రయోజనాలు.

కొబ్బరి నూనెతో మసాజ్ వలన పసిపిల్లల చర్మానికి కలిగే ప్రయోజనాలు :

మన సాంప్రదాయ పద్ధతి ప్రకారం, ఈరోజు కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వలన పసిపిల్లలకు కలిగే కొన్ని
ప్రయోజనాలను మీకు అందిస్తున్నాము.

చర్మ శోధ చికిత్స :

నవజాత శిశువులలో సాధారణంగా తలెత్తే చర్మ శోధను తగ్గించడానికి కొబ్బరినూనె సహాయపడుతుంది. తొలి
దినాలలో శిశువులకు చర్మశోథ సాధారణంగా ఉంటుంది. తలమీద చర్మం పై చుండ్రు లాగా పొరలుపొరలుగా వస్తుంది.
కొబ్బరి నూనెతో తల మీద తేలికపాటి మసాజ్ చేయడం ద్వారా దీనిని పరిష్కరించవచ్చు. ఈ నూనెను తలపై 20
నిమిషాల పాటు ఉంచి ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

పొడవైన మరియు మృదువైన జుట్టుని పొందండి :

ఇప్పటివరకు టీవీ ప్రకటనలు మిమ్మల్ని సంతృప్తిపరచనట్లయితే కొబ్బరి నూనె శిశువు జుట్టుకు అద్భుతాలు
చేయగలదని నేను భరోసా ఇస్తున్నాను. ప్రతిరోజు రాత్రి మీ శిశువు జుట్టుకు కొంచెం కొబ్బరి నూనె రాసినట్లయితే జుట్టు
అందంగా మెరుస్తూ ఉంటుంది.

బేబీ తామర :

శిశువు యొక్క చర్మం పొడిగా మరియు దురద ఉండటాన్ని తామర అని పిలుస్తారు. కొబ్బరి నూనెతో మసాజ్
చేయడం వల్ల తామర సంభవించిన ప్రదేశాలను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని తేమగా మరియు మృదువుగా
మార్చడానికి కొబ్బరి నూనె సహాయపడుతుంది.

డైపర్ దద్దుర్లు చికిత్సకు ప్రభావవంతంగా పనిచేస్తుంది

కొత్తగా తల్లిదండ్రులైన వారికి డైపర్లు జీవితంలో ఇప్పుడు ఒక భాగం అయిపోయాయి. శిశువులు తొలి దినాలలో చాలా
తరచుగా డైపర్ దద్దుర్లు తో బాధపడతారు. అటువంటి సందర్భాలలో ఎరుపు , నొప్పి మరియు దద్దుర్ల యొక్క
తీవ్రతను తగ్గించడానికి కొబ్బరినూనె సహాయపడుతుంది.

పగిలిన పెదవులకు ఉపశమనం :

ముఖ్యంగా శీతాకాలంలో పసిబిడ్డ యొక్క పగిలిన పెదవులకు కొంచెం కొబ్బరి నూనెను రాయడం వలన ఎంతో
సహాయపడుతుంది.

కీటకాల కాటు :

నవజాత శిశువులు దోమల వంటి కీటకాల బారిన పడటం చాలా సాధారణం. దోమకాటు వలన శిశువు యొక్క చర్మం
ఎర్రగా మారిపోతుంది. దాని నుండి ఉపశమనం పొందడానికి మీరు కొబ్బరినూనెను దోమకాటు పై రాయవచ్చు. కొబ్బరి
నూనె లోని యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నుండి దోమకాటుకు ఉపశమనం
కలుగుతుంది.

శిశువు పేలుకు చికిత్స చేయడం :

ఇంట్లో ఎవరికైనా పేలు ఉన్నట్లయితే శిశువులకు కూడా వచ్చే అవకాశం ఉంది. కొబ్బరినూనె రాయడం వలన ఇవి
పెరగకుండా నియంత్రిస్తుంది.

దంతాల నొప్పులను తగ్గిస్తుంది :

కొబ్బరి నూనెను చిగుళ్లపై రాయడం వలన దంతాలు నొప్పి తగ్గడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇది యాంటీ-
ఇన్ఫ్లమేటరీ కనుక చిగుర్ల మంటను తగ్గిస్తుంది. కొంచెం కొబ్బరి నూనె తీసుకొని మీ శిశువు యొక్క చిగుళ్లపై తేలికగా
మసాజ్ చేయండి. పిల్లలు నోట్లో పెట్టుకునే బొమ్మలపై కూడా కొంచెం కొబ్బరి నూనెను రాయవచ్చు.

బాడీ లోషన్ :

కొబ్బరి నూనె చాలా తేలికైనది మరియు దీనిని శరీరం సులభంగా గ్రహించగలదు. కాబట్టి దీనిని బాడీ లోషన్ గా కూడా
ఉపయోగించుకోవచ్చు. కొద్దిగా మీ చేతుల్లోకి తీసుకొని మీ శిశువు శరీరానికి పూర్తిగా మసాజ్ చేయండి.

కోల్డ్ రబ్బ లాగా :

శిశువుకు రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. మరియు ఉష్ణోగ్రత లోని మార్పులకు గురి అయినప్పుడు
పిల్లలు చలికి ఇబ్బంది పడవచ్చు. అప్పుడు కూడా కొబ్బరి నూనె రక్షించగలదు. పిప్పర మెంట్ నూనె లేదా
యూకలిప్టస్ నూనె లో కొన్ని చుక్కలు కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని చేతుల్లో వేసి వేడి చేయండి. చలి
నుండి బయటపడడానికి దానిని మీ శిశువు యొక్క ఛాతిపై రుద్దండి.

నవజాత శిశువు మసాజ్ కోసం కొబ్బరి నూనె ని ఎలా ఉపయోగించాలి :

వేసవిలో అప్పుడే పుట్టిన బిడ్డ మసాజ్ కోసం కొబ్బరినూనె ఉపయోగిస్తున్నట్లు అయితే దానిని వేడి చేయవలసిన
అవసరం లేదు. అయితే దానిని సీతాకాలంలో వాడవలసి వస్తే మాత్రం కొద్దిగా వేడి చేయాలి. కొన్ని చుక్కలు మీ చేతిలో
వేసుకొని ఛాతి నుండి ప్రారంభించి బిడ్డ యొక్క తల, చేతులు, మెడ మరియు కాళ్లపై నూనెతో మసాజ్ చేయడం
కొనసాగించండి. వృత్తాకారం లోనూ మరియు క్రిందనుండి పైకి మసాజ్ కదలికలు ఉన్నట్లయితే రక్తప్రసరణ బాగా
జరుగుతుంది. ఈ నూనె చాలా తేలికైనది మరియు శరీరం సులువుగా గ్రహిస్తుంది కాబట్టి దీనిని రోజుకి ఒకటి కంటే
ఎక్కువ సార్లు కూడా ఉపయోగించవచ్చు. అయినప్పటికీ అప్పుడే పుట్టిన బిడ్డకు ముక్కు , నాభి, కళ్ళు లేదా చెవుల
సమీపంలో నూనెను వాడకండి. దీనిని శుభ్రపరచకుండా వదిలేసినట్లు అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం
ఉంటుంది.

పిల్లల మసాజ్ కు వాడే కొబ్బరి నూనె లోని రకాలు :

పసిపిల్లలకు మసాజ్ చేయడం లోని శాస్త్రీయ ప్రయోగాలను మీరు తప్పక తెలుసుకోవాలి. ఇది తల్లీబిడ్డల
అనుబంధాన్ని కి మంచి సమయం కూడా.ఆవ నూనె మరియు ఆలివ్ నూనెను కూడా శిశువుకు మసాజ్

చేయడానికి ఉపయోగించవచ్చు. కానీ కొబ్బరి నూనె గురించి ప్రతిదీ తెలుసుకోవాలి అనుకుంటున్నాను. కాబట్టి
మొట్టమొదటిగా కొబ్బరినూనె లోని రకాలు ఏమిటి. కొబ్బరి నుండి తీసిన కొబ్బరినూనె లో ఈ క్రింది రకాలు ఉంటాయి.

నేచురల్ కొబ్బరినూనె :

ఇది ఎండిన కొబ్బరి నుండి తీయబడినది. మిల్లులో వేసి కొబ్బరి నూనెను తయారు చేస్తారు. దీనిని శిశువుకు మసాజ్
చేయడానికి ఉపయోగించవచ్చు.

శుద్ధిచేసిన కొబ్బరి నూనె :

బ్లీచింగ్ వంటి రసాయనిక ప్రక్రియలను ఉపయోగించి కొబ్బరి అభివృద్ధి చేయడం ద్వారా వాసన మరియు రంగు
లేనిదిగా తయారవుతుంది.

వర్జిన్ కొబ్బరి నూనె :

దీనిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటాయి. ఆహ్లాదకరమైన వాసన మరియు రుచిని కలిగి తాజా కొబ్బరి
కాయల పాల నుండి తీయబడుతుంది. శిశువుకు మసాజ్ చేయడానికి వర్జిన్ కొబ్బరి నూనెను వాడాలి.

సేంద్రియ కొబ్బరినూనె :

ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా సేంద్రియగా పెరిగిన కొబ్బరి కాయల నుండి తీసుకోబడినది. ఈ రోజుల్లో
చాలామంది సేంద్రియ కొబ్బరినూనెను బేబీ మసాజ్ కోసం ఉపయోగిస్తున్నారు.

బేబీ మసాజ్ కోసం కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చా అనేది మీ మనసులో తలెత్తి ప్రశ్న. నేను మీకు
చెప్పేదేమిటంటే ఇది కేవలం సురక్షితమైనది మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా తల్లులందరూ ఇష్టపడుతారు

కొబ్బరి నూనెలో మరెన్నో ఉపయోగాలున్నాయి. దీనిని పిల్లలతో పాటు పెద్దలు కూడా ఉపయోగించుకోవచ్చు.
అందుకే దీనిని ఆల్రౌండ్ ఆయిల్ అని పిలుస్తారు. సహజమైన మరియు రసాయన రహితమైన కొబ్బరినూనె
శిశువులకు సురక్షితమైనది. దీనినే తల్లిదండ్రులు శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. కాలిన గాయాలు లేదా పురుగు
కాట్లు లేదా తెగిన గాయాలకు కొబ్బరినూనెను రాసినట్లయితే చర్మంపై గుర్తులను కూడా పోగొడుతుంది. నేను
విశ్వసించినట్లుగా మీరు కూడా దీనిని గుడ్డిగా విశ్వసించవచ్చు. ఏదిఏమైనప్పటికీ, తల్లిదండ్రులుగా ఈ విషయం మీకు
బాగా తెలుసు.

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • 1
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.

| Aug 26, 2020

Nuvvula nune to massage chestunnam parvaleda

  • Reply
  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన బిడ్డ సంరక్షణ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}