• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్ ఆరోగ్యం మరియు వెల్నెస్

పిల్లలు ఫేస్ మాస్క్‌ ధరి౦చడంపై 9 సాధారణ అపోహలు మరియు నిజాలు

Ch Swarnalatha
3 నుంచి 7 సంవత్సరాలు

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jun 13, 2022

 9

కోవిడ్-19 మహమ్మారి ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు సరికదా మరిన్ని కొత్త అంటువ్యాధులు  తలెత్తడంతో మాస్కులు ధరించాల్సిన అవసరం పెరుగుతోంది. COVID వ్యాక్సిన్‌లకు ఇంకా అర్హత లేని  2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు మాస్క్‌లను సురక్షితంగా ధరించవచ్చు. ఇవి గాలిలో ఉండే బిందువుల ద్వారా కరోనావైరస్ మన శ్వాసకోశ వ్యవస్థలోకి ప్రవేశించే అవకాశాలను తగ్గిస్తాయి. COVID-19 వ్యాప్తిని పరిమితం చేయడానికి మాస్క్‌లు సులభమైన మరియు అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. 

ఇటీవల  COVID-19 కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింనప్పటికీ.. మరల అది ముంబై, హైదరాబాద్ తో సహా కొన్ని నగరాల్లో పెరుగుతున్నట్టు తెలియవచ్చింది.  కోవిడ్ నుండి రక్షణకు ఒక ముఖ్యమైన ముందు జాగ్రత్త చర్యగా మాస్క్‌ల ప్రాముఖ్యతను నేటికీ విస్మరించలేము. అయితే, చిన్నారులు మాస్క్ ధరించడం పట్ల సమాజంలో, తల్లోదండ్రుల్లో కొన్ని అపోహలు ఉన్నాయి.   అటువంటి అపోహలను తొలగించి  నిజాలను తెలిపే ప్రయత్నం  చేసాము: 

అపోహ 1: మాస్క్‌లు పిల్లలకు శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తాయి.

వాస్తవం: పిల్లలకి అవసరమైన ఆక్సిజన్‌ను నిరోధించని బ్రీతింగ్ మెటీరియల్ తో ముసుగులు తయారు చేయబడ్డాయి. రెండు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఎక్కువ కాలం పాటు సురక్షితంగా ముసుగులు ధరించవచ్చు. 

అపోహ 2: ముసుగులు కార్బన్ డయాక్సైడ్ ను ఆపివేసి ప్రమాదానికి దారితీస్తాయి.

వాస్తవం 2: కార్బన్ డయాక్సైడ్ అణువులు వైరల్ లోడ్ల వలె కాకుండా చాలా చిన్నవి మరియు అవి మాస్కులో చిక్కుకోలేవు. గాలి లేదా మాలిక్యూల్ పార్టికల్ ను నిరోధించకుండా  తగిన వెంటిలేషన్ అ౦దే  విధమైన  శ్వాసక్రియ పదార్థంతో తయారు చేయబడిన మాస్క్‌లను, అవి సులభంగా తప్పించుకోగలవు. కాబట్టి, మాస్క్‌లు హైపర్‌క్యాప్నియాకు కారణం కావు.

అపోహ 3: మాస్క్‌లు పిల్లల ఊపిరితిత్తుల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి.

వాస్తవం 3: మాస్క్‌లు తేలికపాటి మెటీరియల్‌తో తయారు చేయబడ్డాయి, ఇవి ముఖ్యంగా పిల్లలకు శ్వాస మరియు సౌకర్యాన్ని సులభతరం చేస్తాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీలో పీడియాట్రిక్ పల్మనరీ ఫెలో అయిన కింబర్లీ డిక్సన్, మాస్క్‌లు పిల్లల ఊపిరితిత్తుల అభివృద్ధికి ప్రతికూలం కాదని నిర్ధారించడంతో,  శిశువైద్యులు ఈ సిద్ధాంతాన్ని తొలగించారు. 

అపోహ 4: మాస్క్ ధరించి ఉంటే, మీరు సామాజిక దూరం పాటించాల్సిన అవసరం లేదు.

వాస్తవం 4: ఇది COVID-19 వ్యాప్తిని పరిమితం చేయడం అనేది  ప్రభావవంతంగా ఉండే పలు అభ్యాసాల కలయిక.  మాస్క్ ధరించడం ఒక్కటిసరిపోదు. కాబట్టి సామాజిక దూరం మరియు మాస్క్‌లు ధరించడంతోపాటు చేతుల పరిశుభ్రతను పాటించడం ఉత్తమ ఫలితాల కోసం ఏకకాలంలో సాధన చేయవలసిన కీలకమైన పనులు. 

అపోహ 5: గుడ్డ ముసుగులు పిల్లలకు సురక్షితం కాదు. 

వాస్తవం 5:  శ్వాసక్రియకు వీలైన, మృదువుగా ఉ౦డే  కనీసం రెండు పొరల బట్టతో తయారైన మాస్క్‌లు వాడవచ్చని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC)  సిఫార్సు చేస్తుంది.

అపోహ 6: మాస్క్‌లు చాలా అసౌకర్యంగా ఉంటాయి, పిల్లలకు ధరించడం కష్టం.

వాస్తవం 6: ముసుగులు ధరించడానికి సౌకర్యవంతంగా ఉండే విధంగా రూపొందించబడ్డాయి. మాస్క్ ధరించడంలో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు  నిరంతరం ఉదాహరణగా  ఉంటే,  వాటిని పిల్లలు కూడా నేర్చుకుంటారు. అలాగే తల్లిదండ్రులు మాస్కులు ధరించకపోవడం వల్ల కలిగే ప్రమాదాన్ని గుర్తించాలి. కాబట్టి మీరే ముసుగు ధరించడం పిల్లల అలవాటును  బలోపేతం చేయడానికి గొప్ప మార్గం. 

అపోహ 7: మాస్క్‌లు మాట్లాడటానికి, భాష అభివృద్ధిలో జాప్యాన్ని కలిగిస్తాయి.

వాస్తవం 7: భాషా అభివృద్ధి ప్రధానంగా మెదడు యొక్క కుడి అర్ధగోళంలో ఏర్పడుతుంది.  ఇక, మాస్కులు  మెదడు అభివృద్ధికి ఏ విధంగానూ హాని కలిగించవు. కాబట్టి మాస్క్‌లు భాషా నైపుణ్యాల సముపార్జనకు అంతరాయం కలిగించవు.  పిల్లలు వాటిని ధరించిన తర్వాత కూడా మాట్లాడగలరు మరియు అర్థం చేసుకోగలరు. అలాగే, చాలా మంది పిల్లలకు 18 నుండి 24 నెలల వరకు  మాటలాడటం  అభివృద్ధి చెందుతుంది. అందుకే,  సాధారణంగా ఈ వయస్సులో ముసుగు ధరించడం నిషేధించబడి౦ది.

అపోహ 8: పిల్లలు ఆరుబయట ఉన్నప్పుడు వారి శరీరంలోకి బ్యాక్టీరియా చేరకుండా మాస్క్‌లు ఉపయోగపడవు.

వాస్తవం 8: CDC సిఫార్సుల ప్రకారం, పిల్లలు తమ మాస్క్‌లు ధరించే ముందు మరియు తీసే ముందు చేతులు కడుక్కోవడం నేర్పించాలి. ఈ విధమైన సానుకూల ప్రవర్తన సహాయంతో, ఆరుబయట కూడా బ్యాక్టీరియా లేదా వైరల్ ప్రసార ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

అపోహ 9: ఆస్తమా, మధుమేహం ఉన్న పిల్లలు మాస్క్ ధరించకూడదు.

వాస్తవం 9: మాస్క్ ధరించడం అనేది ఆస్తమా మరియు మధుమేహం ఉన్న పిల్లలకు వాస్తవానికి సురక్షితమైనది. అంతేకాకుండా,  ఎందుకంటే వాస్తవానికి వారికి  COVID-19ని పట్టుకునే మరియు ఇతర తీవ్రమైన సమస్యలు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, మాస్క్ ధరించడం వల్ల వారి గ్లూకోజ్ స్థాయిలు అంతరాయం కలిగించవు,పెరగవు ఇంకా  వారి శరీరానికి ఏదైనా అదనపు ఒత్తిడిని కూడా తీసుకురాదు.

మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, షేర్ చేయడానికి... కింద వ్యాఖ్యానించండి.

https://www.parentune.com/parent-blog/common-myth-and-mythbusters-on-face-masks-for-children/7638

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}