• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

గర్భధారణ సమయంలో మలబద్ధకం... కారణాలు, సమస్యలు మరియు పరిష్కారాలు

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Aug 06, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

 

గర్భధారణ సమయంలో శరీరంలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ పెరుగుదల మీ శరీర కండరాలు సడలింపు కారణం అవుతుంది . అది మీ ప్రేగులలో కూడా కలిసిపోయి ఉంటుంది. మరియు పేగులు నెమ్మదిగా కదులుతాయి. అంటే జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది . ఇది మలబద్ధకానికి దారితీస్తుంది . గర్భధారణ సమయంలో మలబద్ధకం ఎందుకు సాధారణమో తెలుసుకుందాం..

 

గర్భధారణ సమయంలో మలబద్ధకం :

 

గర్భధారణ సమయంలో మలబద్ధకం అన్నది చాలా సాధారణం . ప్రతి నలుగురు గర్భిణీ స్త్రీలలో దాదాపు ముగ్గురు స్త్రీలు మలబద్ధకం మరియు ఇతర  సమస్యలను ఎదుర్కొంటారు.  ముందుల నుండి సహజ నివారణల వరకు మలబద్ధకం ఉపశమనం కోసం సాధారణంగా ప్రయత్నాలు చేస్తారు. మలబద్ధకం కోసం మందులను ఉపయోగించడం గర్భవతులకు చాలా ప్రమాదకరం. దీని ఉపశమనం కోసం ఎన్నో నివారణలు అందుబాటులో ఉన్నాయి.

 

గర్భధారణ సమయంలో మలబద్ధకానికి కారణాలు ?

 

గర్భధారణ సమయంలో మలబద్ధకం చాలా సాధారణం. మరియు గర్భవతిగా ఉన్నప్పుడు మలబద్ధకానికి అనేక రకమైన కారణాలు ఉంటాయి. పొత్తికడుపులో నొప్పి మరియు ప్రేగు కదలికలు అసౌకర్యంగా ఉండి మలవిసర్జన సమయంలో  గట్టిగా మరియు కష్టతరంగా మలవిసర్జన జరుగుతుంది. దురదృష్టవశాత్తూ, గర్భధారణ సమయంలో సుమారు సగం మంది మహిళలను ఇది ప్రభావితం చేస్తుంది. గర్భధారణ సమయంలో మలబద్ధకానికి ప్రధానమైన మూడు కారణాలు ఇక్కడ ఉన్నాయి... ముఖ్యంగా మీరు గర్భధారణ ప్రారంభ దశలో మలబద్ధకం కలిగి ఉంటే...

 

దిగులు, ఆందోళన, శారీరక శ్రమ లేకపోవడం, ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం శరీరంలోని అన్ని అసౌకర్యాలకు సాధారణమైన కారణాలు. శరీరంలోని హార్మోన్ల మార్పుల వల్ల కూడా పేగు కండరాలను సడలించి గర్భాశయాన్ని విస్తరించి పేగులలో ఒత్తిడి కలిగిస్తుంది.

 

గర్భధారణ సమయంలో మలబద్ధకానికి మరొక కారణం గర్భం యొక్క పెరుగుదల. ఇది శరీర కండరాలను సడలించి పేగులతో సహా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది . అందువలన మలబద్దకానికి కారణం అవుతుంది.

 

గర్భవతిగా ఉన్నప్పుడు మలబద్ధకానికి మరొక కారణం డీహైడ్రేషన్. మీ శరీరంలో తాగిన నీటి కంటే కూడా కోల్పోయే నీరు ఎక్కువ అయినప్పుడు నిర్జలీకరణ జరుగుతుంది. అందువలన గర్భధారణ సమయంలో పుష్కలంగా జ్యూస్ లు మరియు నీటిని త్రాగడం ఎంతో మంచిది.

 

కొంతమంది మహిళలలో ఐరన్ మాత్రలు మలబద్దకానికి కారణం కావచ్చు. మరికొంతమందిలో వీటి ప్రభావం లేకపోవచ్చు. మీరు ఐరన్ టాబ్లెట్లు తీసుకుంటూ మరియు మలబద్ధకంతో బాధ పడుతున్నట్లు అయితే ఈ విషయం గురించి మీ డాక్టర్ తో చర్చించవచ్చు. కొంతమంది మహిళలలో ఐరన్ టాబ్లెట్లు విరోచనాలకు కూడా దారి తీయవచ్చు.

 

గమనిక : డాక్టర్లు సూచించే మాత్రల నుండి సహజ నివారణ నెల వరకు మలబద్ధకం యొక్క ఉపశమనానికి ఎన్నో నివారణలు అందుబాటులో ఉన్నాయి. కానీ మీరు గర్భవతిగా ఉన్నప్పుడు పరిష్కారాలు సంఖ్య తగ్గిపోతుంది. అందువలన మీరు అజీర్ణము మరియు మలబద్ధకం తో బాధపడుతున్నట్లయితే మీ డాక్టర్ను సంప్రదించడం మంచిది.

 

గర్భవతిగా ఉన్నప్పుడు మలబద్ధకం రావడం సాధారణమా ?

 

అవును , గర్భధారణలో మలబద్ధకం రావడం అన్నది చాలా సాధారణం. ఎందుకంటే గర్భధారణ సమయంలో ప్రొజెస్టిరోన్ హార్మోన్ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది . దీని ఫలితంగా జీర్ణక్రియ నెమ్మదిగా సాగుతుంది. తద్వారా మలబద్ధకానికి దారితీస్తుంది . ఫైబర్ అధికంగా ఉండే ఆహారం లేకపోవడం, నీరు సరిగ్గా తీసుకోకపోవడం మరియు శారీరక శ్రమ వంటి ఇతర అంశాలు...

 

గర్భధారణ సమయంలో మలబద్ధకాన్ని నివారించడానికి మార్గాలు :

 

మలబద్ధకాన్ని నివారించడానికి మరియు మీ గర్భధారణను ఆస్వాదించడానికి మీ గర్భధారణ సమయంలో మీరు చేయవలసిన కొన్ని జీవనశైలి మార్పులు ఉన్నాయి. గర్భధారణ సమయంలో మలబద్ధకాన్ని నివారించడానికి మీరు పాటించవలసిన 5 విషయాలను ఇక్కడ పంచుకుంటున్నాను.

 

ఫైబర్ (పీచు పదార్థాలు)ఎక్కువగా ఉండే ఆహారం :

 

గర్భధారణ సమయంలో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. గర్భధారణ సమయంలో మీరు తీసుకునే ఆహారం పై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. తృణధాన్యాలు , రొట్టెలు,  పండ్లు మరియు కూరగాయల వంటి ఎక్కువ ఫైబర్ కలిగి ఉండే ఆహారాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఇవి జీర్ణక్రియకు ఎంతో సహాయ పడతాయి. పుష్కలంగా నీరు త్రాగి మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోండి.

 

పొట్టుతో కూడిన ఆహారం పై మాత్రమే ఆధారపడకండి :

 

మలబద్ధకాన్ని నివారించడానికి కేవలం పొట్టుతో కూడిన ఆహారం పై మాత్రమే ఆధారపడకండి. ఇటువంటి ఆహారం తీసుకొని మీరు నీరు ఎక్కువగా తాగడం తాగట్లయితే ఇది మీ పేగులకు కు అతుక్కొని జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది.

 

ఎంతో ముఖ్యమైన మరియు సంతోషకరమైన వ్యాయామం :

 

క్రమం తప్పకుండా వ్యాయామం చేసినట్లయితే శరీరం చురుకుగా ఉండడమే కాకుండా మలబద్ధకాన్ని నివారించడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది. నడక, ఈత, సున్నితమైన సైక్లింగ్ లేదా గర్భధారణ వ్యాయామం యొక్క తరగతులు తీసుకోవడం మలబద్ధకం నుండి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి చాలా సహాయపడుతాయి.

 

గర్భిణీ స్త్రీలకు యోగ :

 

గర్భధారణ యోగా చేయడం వల్ల మలబద్దకాన్ని అరికట్టవచ్చు. ఈ వ్యాయామాలు మీ లోపలి కడుపు కండరాలను కదిలిస్తాయి. ఇది మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతాయి.

 

కెఫిన్ ను మానడం లేదా తగ్గించడం :

 

టీ , కాఫీ మరియు కూల్డ్రింక్స్ వంటి పానీయాలను తగ్గించండి. ఈ పానీయాలు మిమ్మల్ని డీహైడ్రేట్ చేసి మీ మలబద్ధకాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. ఒకవేళ మీరు వాటిని తగ్గించ లేకపోతే, 1:2 నియమాన్ని పాటించండి. అంటే, ఒక కప్పు టీ తీసుకున్నట్లయితే దానిని సమతుల్యం చేయడానికి రెండు గ్లాసుల నీటిని తీసుకోండి.

 

గర్భవతిగా ఉన్నప్పుడు మలబద్దకానికి చికిత్స ఏమిటి ?

 

అవును! మీరు తీవ్రమైన మలబద్ధకాన్ని కలిగి ఉన్నారు మరియు ఇప్పుడు సరైన మార్గంలో చికిత్స చేయాలనుకుంటున్నారు. కాబట్టి, మలబద్ధకం లేకుండా ఉండటానికి మరియు మీ మిగిలిన గర్భధారణను ఆస్వాదించడానికి మీరు ఏం చేయాలి. మీరు గర్భధారణ సమర్థవంతంగా చికిత్స చేయగల 5 మార్గాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి..

 

పీచు పదార్థాలు (ఫైబర్) ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి :

 

ఫైబర్ అధికంగా ఉండే ఆహారం మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇది విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ను కూడా ఇస్తుంది. గర్భిణి స్త్రీలు ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు 25 నుండి 30 గ్రాముల ఫైబర్ ను ఆహారంలో తీసుకోవాలి. అందులో తాజా పండ్లు , సలాడ్లు,  ఆకుకూరలు , బీన్స్ , బఠాణీలు మరియు చపాతీలు కూడా ఉంటాయి. మొలకెత్తిన గింజలు మరియు క్యారెట్లు కూడా గర్భధారణ సమయంలో అద్భుతమైన ఆహారాలు.

 

పుష్కలంగా నీరు త్రాగండి :

 

గర్భధారణ సమయంలో శరీరానికి చల్లదనం ఎంతో అవసరం. మీరు గర్భధారణ సమయంలో నీటిని తీసుకోవడం రెట్టింపు చేయాలి. గర్భిణీ స్త్రీలు రోజుకి కనీసం 12 గ్లాసుల నీటిని తీసుకోవాలి. ఇది మీ ప్రేగుల కదలికలను మృదువుగా ఉంచడానికి మరియు  జీర్ణవ్యవస్థ బాగా పని చేయడానికి ఉపయోగపడి మలబద్దకం లేకుండా ఉండడానికి సహాయపడుతుంది.

 

కొంచెం కొంచెంగా ఆహారాన్ని తీసుకోండి :

 

మీ రోజువారీ ఆహారాన్ని 5 నుండి  6 సార్లు కొంచెం కొంచెం గా తీసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి ఏదైనా కొంచెం కొంచెం గా తీసుకోండి. అలా చేయడం వలన ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. తద్వారా సులువుగా మీ  పేగులకు బదిలీ చేయగలుగుతుంది. ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీ కడుపు నిండి పోయి మీరు తినే ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం కష్టతరం చేస్తుంది.

 

శారీరకంగా చురుకుగా ఉండండి :

 

వ్యాయామం మీ ప్రేగు కదలికలను ప్రేరేపిస్తుంది. క్రమం తప్పకుండా చేసే శారీరక శ్రమ మలబద్ధకాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. మీరు ఈత , నడక మరియు యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు ఎంచుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు 20 నుండి 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడానికి ప్రయత్నించాలి. మీకు మరియు మీ బిడ్డకు  ఏ వ్యాయామాలు సురక్షితంగా ఉంటాయో మీ వైద్యుని సంప్రదించి పాటించండి.

 

అద్భుతంగా పనిచేసే పుచ్చకాయ :

 

ఇది పాత కాలం నాటి పరిష్కారంలో చేర్చబడింది. పాత కాలంలో మంత్రసానులు మలబద్ధకంతో బాధ పడుతున్న గర్భిణీ స్త్రీలకు పుచ్చకాయ విత్తనాలను ఉడకబెట్టి దానితో టీ తయారు చేసి ఇచ్చేవారు. అయినప్పటికీ, మీరు పుచ్చకాయను యధావిధిగా తీసుకోవచ్చు. ఇది నీటితో నిండి ఉన్నందున ప్రేగుల ద్వారా ఆహారాన్ని తరలించడానికి సహాయపడుతుంది. కానీ ఇది తాజాగా ఉందని మరియు రసాయనాలతో పండించ పడలేదని నిర్ధారించుకోవాలి.

 

గర్భధారణ సమయంలో మలబద్ధకానికి రిధి గారి పరిష్కారాలను కనుగొన్నారా? మీ గర్భధారణ సమయంలో మలబద్ధకాన్ని ఎలా నివారించారు ? దయచేసి ఈ వ్యాఖ్యల విభాగంలో మాతో పంచుకోండి. మీ నుండి తెలుసుకోవడం మాకు చాలా సంతోషం.
 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}