పిల్లలలో మలబద్ధకాన్ని నయం చేయడానికి గృహ వైద్యాలు లేదా చిట్కాలు

Aparna Reddy సృష్టికర్త నవీకరించబడిన May 27, 2020

మీ చిన్నారి మలవిసర్జన సమయంలో కష్టపడుతున్నట్లయితే బిడ్డకు మలబద్ధకం ఉందని మొదటి నీకు అర్థం అవుతుంది. వారి మలం గట్టిగా ఉంటుంది .మరియు రక్తపు మరకలు కూడా ఉండవచ్చు .కొన్ని సార్లు రక్తపు మరకలు కనిపించకపోవచ్చు. మలబద్ధకం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది .కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు పొత్తికడుపులో నొప్పి కూడా సంభవిస్తుంది .కాబట్టి తల్లిదండ్రులు గా మీరు మీ బిడ్డ మలబద్దకం లేకుండా ఆరోగ్యంగా పెరుగుతున్నట్లుగా ఎలా నిర్ధారిస్తారు ?
ఇక్కడ నేను పరీక్షించి మరియు ప్రయత్నించిన కొన్ని ఇంటి నివారణలను మీతో పంచుకుంటున్నాను .మరియు మీ పిల్లలు మలబద్దకం నుండి ఉపశమనం పొందడానికి పెద్దల సలహాలను కూడా మీ ముందుకి తీసుకు వస్తున్నాను.
మీ పిల్లల యొక్క మలబద్ధకాన్ని నివారించేందుకు గృహ వైద్యాలు :
బెల్లం :
మలబద్ధకాన్ని నివారించడానికి బెల్లం ఒక పురాతనమైన నివారణ .బెల్లం మనకందరికీ తెలిసిన విధంగా జీర్ణవ్యవస్థను బాగా పని చేసేందుకు ఉపయోగపడుతుంది .మరియు బెల్లం శరీరంలోని జీర్ణ ఎంజైములను సక్రమంగా పనిచేసేందుకు కూడా ఉపయోగకారిగా ఉంటుంది .ప్రేగుల యొక్క కదలికలను ప్రోత్సహిస్తుంది .మరియు మలబద్ధకాన్ని నివారించడానికి మరియు ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.
తియ్యని నీరు :
నీరు మలబద్దకానికి చాలా మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది .ఒక అర కప్పు ఆర్ వో నీటిలో ఒక స్పూన్ పంచదార కలిపి ఆ నీటిని మీ చిన్నారికి ఇవ్వండి. వేపుడు పదార్థాలను ఇవ్వడం మంచిది కాదు. మీ చిన్నారి మలబద్ధకంతో బాధ పడుతున్నట్లయితే వేపుడు పదార్థాలను మరియు ఎక్కువ మసాలాలు ఉన్న ఆహార పదార్థాలను ఇవ్వకండి.
బిస్కెట్లను పిల్లలకు దూరంగా ఉంచండి :
బిస్కెట్స్ మరియు మైదా ఎక్కువగా ఉండే కారమైన చిప్స్ ని కూడా ఎట్టిపరిస్థితుల్లోను పిల్లలకు ఇవ్వకండి .ఇవి మలబద్దకాన్ని మరింతగా పెంచుతాయి.
ఎక్కువ ద్రవపదార్ధాలు ఇవ్వండి :
మలబద్ధకం సమయంలో ఎక్కువగా నీటిని తీసుకోవడం ఎంతో మంచిది .మరియు సూప్ లు, పండ్ల రసాల లాంటి ద్రవాలు కూడా ఎంతో మంచిది . ఎక్కువ నీటిని తీసుకోవడానికి మీ చిన్నారులు ఇబ్బంది పడుతున్నట్లు అయితే, ఇంట్లో తయారుచేసిన పలుచని మజ్జిగను కూడా ఇవ్వవచ్చు. అదేవిధంగా బార్లీ నీరు కూడా మలబద్దకానికి ఎంతో మంచిది. కాబట్టి ఎక్కువ నీటి శాతం కలిగిన టమాటా , క్యారెట్ , కీర దోసకాయ వంటి కాయగూరలను ఎక్కువగా ఇవ్వండి.
నానబెట్టిన ఎండు ద్రాక్ష :
మీ చిన్నారులు మలబద్దకం నుండి ఉపశమనం పొందడానికి మీరు రాత్రిపూట నానబెట్టిన ఎండు ద్రాక్షను కూడా ఇవ్వవచ్చు. కానీ వాటిని మితంగా ఇవ్వవలసి ఉంటుందని మాత్రం మర్చిపోకండి.
మలబద్ధకాన్ని తగ్గించేందుకు తేనె :
తేనెలో విరోచనాల మందు లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మలబద్ధకం సమయంలో రోజుకి రెండు సార్లు ఒక స్పూన్ తేనెను ఇవ్వవచ్చు.
అరటిపండు :
అరటి పండ్లకు సీజన్ లతో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటాయి. మీ చిన్నారులలో మలబద్ధకాన్ని నివారించేందుకు అరటి పండు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కానీ మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేవలం ఆకుపచ్చ అరటిపండు మాత్రమే ఇవ్వండి. పసుపు పచ్చ అరటి పండు వల్ల మలబద్దకం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
ఆయా సమయాలలో దొరికే పండ్లు :
మలబద్ధకం నుండి రక్షించేందుకు ఆయా సమయాలలో దొరికే పండ్లను కూడా బాగా ఇవ్వవచ్చు. కాబట్టి ఆపిల్, నారింజ, ద్రాక్ష, పుచ్చకాయ మరియు పియర్స్ వంటి పండ్లను కూడా ప్రయత్నించండి . ఉడికించిన రాజ్మా, ఉడికించిన పెసలు, ఉడికించిన బొబ్బర్లు, చిన్న చిన్న ముక్కలుగా తరిగిన పన్నీరు, బియ్యం పాయసం, సగ్గుబియ్యం తో తయారు చేసిన పాయసం, పాలతాలికలు మరియు ఉడికించిన బంగాళదుంపలను కూడా ఇవ్వవచ్చు. మలబద్దకంతో బాధపడే పిల్లలకు జామకాయలను ఇవ్వడం మంచిది కాదు. జామకాయల వల్ల జీర్ణశక్తి కష్టతరమై కొత్త సమస్యలకు దారి తీయవచ్చు.
మలబద్ధకం వల్ల పిల్లలలో పిచ్చి రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మీ చిన్నారి తగినంత నీరు తీసుకునేలాగా చూసుకోండి. ఇవి మలబద్ధకంతో బాధ పడుతున్న చిన్నారుల కోసం బాగా పని చేసే కొన్ని గృహ వైద్యాలు. మీ వద్ద మరేదైనా చిట్కాలు ఉన్నట్లయితే ఈ జాబితాలో చేర్చండి. దయచేసి ఈ క్రింద వ్యాఖ్యల ఈ విభాగంలో తెలియజేయండి. మీ అభిప్రాయాలను పంచుకోవడం మాకెంతో సంతోషం.
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు
పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు
పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ చర్చలు
పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ ప్రశ్న

{{trans('web/app_labels.text_some_custom_error')}}
{{trans('web/app_labels.text_some_custom_error')}}