• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఫుడ్ అండ్ న్యూట్రిషన్

ఎండ తీవ్రత నుండి మిమ్మల్ని కాపాడే కొన్ని వేసవి పానీయాలు

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Apr 18, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

మండిపోతున్న ఎండలు ,దానికితోడు ఉక్క పోతా మనల్ని ఎంతో అసౌకర్యానికి గురి చేయడమే కాకుండా శక్తి హీనులుగా చేస్తుంది. పిల్లల విషయంలో ఇది మరీ దారుణంగా ఉంటుంది .పిల్లలని ఎక్కువ సేపు ఇంటి లోపలే ఉంచలేము .ఈ వేడి ప్రతాపాన్ని తగ్గించి మీ పిల్లలను సౌకర్యవంతంగా ,చల్లగా ఉంచేందుకు ఏమి చేయాలి ? మిమ్మల్ని ఈ ఎండ తాకిడి నుండి కాపాడేందుకు కొన్ని పానీయాలను పరీక్షించి మీ ముందుకు తెస్తున్నాము.

చెమట కారణంగా శరీరం లో నుండి ఎంతో నీరు ఆవిరైపోతుంది. దానిని తిరిగి సమకూర్చ వలసిన అవసరం ఉంటుంది.   కావున మీ పిల్లలకు ఎక్కువగా నీటిని ఇవ్వండి. (ఐస్ వాటర్ ఇవ్వవలసిన అవసరం లేదు .కానీ చల్లని నీటిని ఇవ్వండి ) నీరు మాత్రమే కాదు, సోడియం , పొటాషియం కూడా చెమట తో పాటుగా పోతాయి. చెమట వలన పోగొట్టుకున్న ఖనిజాలను సమకూర్చుకునేందుకు నీరు సరిపోతుంది .ఇతర ఆహార పదార్థాలు పోషక నష్టాన్ని భర్తీ చేస్తాయి .విపరీతమైన వేడి వలన ఆహారం మీదఇష్టం తగ్గిపోయి తీసుకోవలసినంత ఆహారాని కంటే కూడా తక్కువ ఆహారాన్ని తీసుకోవడం వలన కడుపులో ఒక రకమైన అస్వస్థత మరియు నీరసంగా ఉంటుంది. ఇది పిల్లల్లో కనిపించే సాధారణ అసౌకర్యమే.అందుకే నీటితో పాటుగా కొంచెం ఎలక్ట్రోలైట్స్ అని కూడా చేర్చండి.

కొబ్బరి నీళ్లు లేదా నిమ్మకాయ నీళ్లు - లేత కొబ్బరి నీళ్లు మరియు నిమ్మకాయ నీటిలో పొటాషియం లభిస్తుంది . చెమట రూపంలో కోల్పోయిన ఎలక్ట్రో లైట్స్ ను ఇది సమకూరుస్తుంది . ఇవి సోడియం కూడా అందిస్తాయి. (సహజమైన కొబ్బరి నీటితో పాటు ఉప్పు కలిపిన నిమ్మకాయ నీటి ద్వారా )పిల్లలకు చెమట నుండి వచ్చే నష్టాన్ని నివారించవచ్చు.

చిట్కా : ఐస్ క్రీమ్ మౌల్డ్స్ (కప్పులు) లో లేత కొబ్బరి నీరు ,కట్ చేసి పెట్టిన పండ్లముక్కలు లేదా లీచేస్ లేదా బెర్రీస్ ను వేసి డీప్ ఫ్రిజ్లో పెడితే ఐస్ రోల్స్ తయారవుతాయి.

మంచిగా చలువ చేసే పానీయాలు - బార్లీ నీళ్లు, మజ్జిగ, బేల్ (మారేడు)ఫ్రూట్  షర్బత్ లు బాగా చలువ చేస్తాయి. ఇవి శరీరానికి తగినంత నీరు ,కేలరీలు ,ఎలక్ట్రో లైట్స్ ను అందించడం ద్వారా సహాయపడుతాయి. మరియు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.

బేల్ ( మారేడు ) షర్బత్ రెసిపీ :

బాగా పండిన మారేడు పండు లో నుండి గుజ్జును బయటకు తీసి నీళ్లలో నానబెట్టి కొన్ని గంటలపాటు ప్రక్కన పెట్టండి .ఆ తరువాత దానిని చేతితో పిసికీ పీచుని మాత్రం తొలగించండి .అందులో కొంచెం పుదీనా మరియు రుచి కోసం పంచదార వేసి చల్లగా సర్వ్ చేయండి.

మరికొన్నింటిని చూడండి

మిల్క్ షేక్ -పిల్లలు ఈ వేడి కారణంగా సరిగ్గా ఆహారాన్ని తీసుకోని కారణంగా వారికి తగినంత పోషకాలు అందవు .కాబట్టి పాలతో కలిపి అరటి ,సపోట మరియు మామిడి పండ్లతో మిల్క్ షేక్ చేసి ఇచ్చినట్లయితే విటమిన్లు ,మినరల్స్, ప్రోటీన్స్ మరియు శక్తి లభిస్తుంది .అందులో గుప్పెడు నానబెట్టిన డ్రైఫ్రూట్స్ వేసినట్లయితే మరిన్ని పోషక విలువలు లభిస్తాయి.

లస్సి మరియు పెరుగుతో స్మూతీ - ఇది మీ పిల్లలు పాలను ఇష్టపడ్డనట్లయితే దానితో సమానమైన చల్లదనాన్ని మరియు ఉపయోగాన్ని , శక్తిని ఇస్తుంది. ఈ స్మూతీ లో మీరు ఆపిల్, ద్రాక్ష లేదా మీకు నచ్చిన ఇతర ఫ్రూట్స్ ను కూడా కలుపుకోవచ్చు.

పన్నా - దీని తయారీకి పచ్చిమామిడికాయలు ,తృణధాన్యాలు, చింతపండు లాంటి పుల్లటి పదార్థాలు కావాలి .ఇది   వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీనీ)పెంచడంతోపాటు ఎలక్ట్రో లైట్స్ తో పాటు విటమిన్లు కూడా కలిగి ఉంటుంది. ఈ పండ్ల యొక్క గుజ్జులో పంచదార లేదా ఉప్పు కలుపుకోవచ్చు. దీని రుచిని పెంచుకునేందుకు వేపిన జీలకర్రపొడిని మరియు పుదీనా ఆకులను కలుపుకోండి.

చిట్కా : దీన్ని ఐస్క్రీం మౌల్డస్ లో పోసి ఫ్రిజ్లో ఉంచినట్లయితే మీ పిల్లలకు ఐస్ రోల్స్ తయారవుతాయి.

వేసవిలో ఆరోగ్యంగా ఉండేందుకు ద్రవపదార్థాలతో పాటుగా తీసుకోవలసిన మరి కొన్ని ఆహారపదార్ధాలు...

పుచ్చకాయలు - పుచ్చకాయలు, దోసకాయలు (మస్క్ మిలన్), కిరినీ కాయలు (కాంట్ లూప్) లలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో పీచు పదార్ధాలతో పాటుగా ఐరన్ ,మెగ్నీషియం, మరియు విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లలోని నీరు ,ఫైబర్ మలబద్ధకాన్ని పోగొట్టేందుకు సహాయపడతాయి. ఇవి పిల్లల ఉదర భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

చిట్కా : ఐస్ స్కూప్  తో పుచ్చకాయలను చిన్న చిన్న బాల్స్ లాగా కట్ చేయండి . లేదా కుకీ కట్టర్తో స్టార్స్ మరియు పిరమిడ్స్ వంటి వేర్వేరు ఆకారాలలో కట్ చేయండి. కలర్ఫుల్గా మరియు అందమైన ఆకారాలలో లో ఉంటే పిల్లలు కచ్చితంగా ఇష్టపడతారు.

పొట్లకాయ, కాకరకాయ, బూడిద గుమ్మడికాయ,సొరకాయ మొదలైన కాయగూరలు లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ కాయగూరలు చాలా త్వరగా జీర్ణమవుతాయి .మీ పిల్లలకు ఇవి తేలికగా, చాలా మంచిగా ఉంటాయి.

బియ్యము చాలా సులువుగా జీర్ణమయ్యే మరొక తేలికపాటి ఆహారం. రైస్ ను పప్పుతో గాని , కూర తో గాని మరియు పెరుగుతో గాని ఇవ్వవచ్చు. (వేసవిలో మధ్యాహ్నం ఇవ్వడానికి ఇది మంచి ఆహారం)బియ్యము కాయగూరల ముక్కలతో తయారుచేసిన  పులావ్ ను రైతాతో వడ్డిస్తే ఇది పూర్తి భోజనం అవుతుంది.

మరికొన్ని చిట్కాలు

ఎప్పుడూ ఈ చలువచేసే పానీయాలను ఒక జార్ లో ఉంచి ఫ్రిజ్లో  రెడీగా ఉంచండి.(ముఖ్యంగా గ్లాస్ జగ్గు లో)పిల్లలు స్కూల్ నుండి గాని ,ఆటల నుండి గాని తిరిగి వచ్చిన తర్వాత పన్నా ,నిమ్మకాయ నీళ్లు, లేదా షర్బత్  గానీ ఏదైనా ఇవ్వండి. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ గానీ జ్యూస్లు కానీ ఇవ్వకండి. ఇందులోని కెమికల్స్ మరియు అధికంగా ఉండే పంచదార వారి శక్తిని తగ్గించవచ్చు. ఏరేటెడ్ (కూల్ డ్రింక్స్)  డ్రింక్స్ ను ఎంత మాత్రం ఇవ్వకండి. పిల్లలకు గొంతు నొప్పి లాంటివి ఉన్నట్లయితే ఈ పానీయాలను ఇవ్వండి. కానీ అవి రూమ్ టెంపరేచర్ లో మాత్రమే ఉండాలి. మీ పిల్లలు బయటికి వెళ్లే ప్రతిసారీ నిమ్మకాయ నీళ్ల బాటిల్ గాని ,మంచినీళ్ళ బాటిల్ గాని తప్పక ఇచ్చి పంపించండి.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}