• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

భారత్ లో కరోనా ఫోర్త్ వేవ్? కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ పూర్తి వివరాలు ఇవే!

Ch Swarnalatha
గర్భధారణ

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jun 09, 2022

దేశవ్యాప్తంగా కరోనా ఫోర్త్ వేవ్ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత రెండు వారాలుగా దేశవ్యాప్తంగా, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారిక సమాచారం ప్రకారం ఈ రోజు (09.06.2022) దేశంలో ఆక్టివ్ కరోనా కేసుల సంఖ్య 32,498. ఇది నిన్నటికంటే 3641 అధికం. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో రెండు, మూడు జిల్లాల్లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. గత రెండు వారాలుగా యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో 6 వందల యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేంద్రం అప్రమత్తం చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, మహరాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు ఉన్నాయి. పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొనడం, మాస్క్, సామాజిక దూరం పాటించకపోవడం.. కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించాలని తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

మరో కొవిడ్‌ వేవ్‌ మొదలవుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో..రోగనిరోధక శక్తిని నిర్వహించడానికి బూస్టర్ షాట్‌లు అవసరం అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. మరి, కోవిడ్ బూస్టర్ డోసును గురించిన ముఖ్య వివరాలు..

బూస్టర్ డోసులు ఎందుకు?

COVID-19 వ్యాక్సిన్‌లు తీవ్రమైన అనారోగ్యం మరియు మరణం నుండి ప్రజలను రక్షించగలిగినప్పటికీ, ప్రారంభ టీకా మోతాదుల తర్వాత రక్షణ క్షీణించడం ప్రారంభమవుతుంది, రోగనిరోధక శక్తిని నిర్వహించడానికి బూస్టర్ షాట్‌లు అవసరం.

ఉచిత బూస్టర్ షాట్‌కు ఎవరు అర్హులు?

ప్రస్తుతానికి, ఫ్రంట్‌లైన్ కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లకు ప్రభుత్వం ఉచిత బూస్టర్ షూట్ అందుబాటులో ఉంచింది. ప్రభుత్వ టీకా కేంద్రాల్లో ఈ టీకాలు అందుబాటులో ఉంటాయి. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మరియు రెండవ డోస్ వేసుకుని  9 నెలలు పూర్తయిన వారందరూ బూస్టర్ మోతాదుకు అర్హులు.

కోవిడ్ బూస్టర్ డోసు పొందటం ఎలా?

కరోనా టీకా యొక్క మూడవ డోస్‌కు అర్హులైన వారు CoWIN పోర్టల్ ద్వారా తమను తాము నమోదు చేసుకోవచ్చు.  అపాయింట్‌మెంట్ సేవలు మరియు రిజిస్ట్రేషన్‌లను ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో యాక్సెస్ చేయవచ్చు కాబట్టి మీరు కోవిన్‌లో స్లాట్‌లను బుక్ చేయలేకపోతే, వాక్-ఇన్ సౌకర్యాలను ఉపయోగించడం ద్వారా బూస్టర్ షాట్‌ను పొందవచ్చు.

ఏ ధ్రువ పత్రాలు  అవసరం?

అధికారిక CoWIN వెబ్‌సైట్ ప్రకారం, పౌరులు తమ తుది టీకా ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లాలి (రెండు మోతాదుల వివరాలతో కూడినది). మునుపటి డోసులకు ఉపయోగించిన అదే మొబైల్ నంబర్ మరియు ID కార్డ్‌ని ఉపయోగించాలి. 

దుష్ప్రభావాలు ఉంటాయా?

COVID-19 వ్యాక్సిన్‌లు తీవ్రమైన అనారోగ్యం మరియు మరణం నుండి ప్రజలను రక్షించగలిగినప్పటికీ, కొందరు వ్యక్తులు టీకా నుండి దుష్ప్రభావాలను కలిగి ఉంటారు, ఇది వారి శరీరం రక్షణను నిర్మిస్తుందనే సాధారణ సంకేతాలు.

ముందు తీసుకున్న వాక్సినే ఇపుడూ తీసుకోవాలా?

అవును. కోవిడ్ బూస్టర్ షాట్‌ల కోసం, భారతదేశం హోమోలాగస్ వ్యాక్సినేషన్‌ విధానాన్ని అనుసరిస్తూ౦ది. అంటే గతంలో కోవిషీల్డ్‌ని పొందిన వ్యక్తులు, మూడవ బూస్టర్ డోస్‌గా కోవిషీల్డ్‌నే పొందుతారు.. మరియు అంతకుముందు కోవాక్సిన్ పొందిన వారు ముందుజాగ్రత్త మోతాదుగా కోవాక్సిన్‌ని పొందుతారు.

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}