• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఫుడ్ అండ్ న్యూట్రిషన్

5 పన్నీరు వంటకాలు (కాటేజ్ చీజ్ ) మరియు పిల్లలకు అందులోని పోషక విలువలు.

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jul 23, 2020

5
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

 

భారతీయులమైన మనకు పన్నీరు అంటే ఎంతో ఇష్టం. అవును కదూ ? దీనిని తయారు చేయడం కూడా ఎంతో సులభం. ఇది యువకులకు, వృద్ధులకు కూడా ఎంతో ప్రియమైనది. పిల్లలు కూడా దీన్ని ఎంతో ఇష్టపడతారు. మరియు దీని పోషక విలువలు చూస్తే పన్నీరును వద్దు అని చెప్పే అవకాశమే లేదు. అవును కదూ !

 

ఈ అద్భుతమైన ఆహారంలో క్యాల్షియం అధికంగా ఉండి పెరుగుతున్న పిల్లలలో ఎముకలకు ఎంతో బలాన్ని మరియు  ముత్యాల్లాంటి పళ్ళను నిర్మించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో  అద్భుతమైన ప్రోటీన్ కూడా ఉంటుంది. మీకు అర్థమైందా ? అది మరేమిటో కాదు ... మన ఇండియన్ సూపర్ ఫుడ్ పన్నీర్.

 

పన్నీరు లో పసిబిడ్డలకు లభించే పోషకాలు :

 

పన్నీరు అనేది భారతీయులమైన మనకు తెలిసిన ఎన్నో రకాలుగా తయారు చేయగల రుచికరమైన ఆహారాలలో ఒకటి. ఇది ఎంతో ఉపయోగకరమైన పాలతో తయారు చేయగల ఆహారం. దీనితో ఎన్నో రకాల వంటకాలు తయారు చేయవచ్చు .వృద్ధులు మరియు యువకులు దీనిని ఎక్కువగా ఇష్టపడతారు. మీరు బిడ్డకు పాలిచ్చే తల్లి అయితే మాత్రం పన్నీరు అద్భుతమైన పాల ఉత్పత్తిని పెంచుతుంది.

 

చిన్నపిల్లలకు పన్నీరులో లభించే పోషక పదార్థాలు ఏమిటో చూద్దాం :

 

ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి :

 

ఇది అద్భుతమైన ప్రోటీన్లకు మూలము. మీ బిడ్డకు పాలు మాన్పించే సమయంలో ఉప్పు మరియు తీపి ఆహారాలు పరిచయం చేయకుండానే పన్నీరు తో మొదలు పెట్టవచ్చు.

 

ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాలు :

 

పనీర్లో క్యాల్షియం మరియు భాస్వరము ఎక్కువగా ఉంటుంది. వీటి కారణంగా ఆరోగ్యకరమైన ఎముకలు మరియు స్థిరమైన దంతాల పునాదులు ఏర్పడడానికి ఎంతో సహాయపడుతుంది.

 

బరువు పెరుగుట :

 

పాలతో తయారు చేయబడ్డాయి పన్నీర్ వల్ల మీ శిశువు యొక్క కండరాల నిర్మాణం లో బలం పెరిగి బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది. దీనిలోని ప్రొటీన్లు, కొవ్వు మరియు విలువైన విటమిన్లు కూడా ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి సహాయపడుతుంది.

 

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది :

 

పనీర్ను చిన్న పిల్లలలోనూ మరియు పెద్దల్లోనూ రోగనిరోధకశక్తి ఔషధంగా పిలుస్తారు. జలుబు, దగ్గు మరియు అలర్జీల వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుండి కూడా ఇది కాపాడుతుంది.

 

మీ బిడ్డ మంచిగా ఎదగడానికి సహాయపడుతుంది :

 

ఇది బిడ్డలు సరిగ్గా ఎదగడానికి కావలసిన విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంటుంది. పన్నీరు పిల్లలకు మంచి పోషకాహారాన్ని అందించడంలో సహాయపడుతుంది.

 

పన్నీరు శిశువులకు వయసులో ఇవ్వవచ్చు ?

 

ఆరు నెలల వరకు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను సంతోషంగా ఉండడానికి , మా చిన్నారి వృద్ధి చెందడానికి కారణం తల్లిపాలు. కానీ ఆ తర్వాత నేను ఒక అయోమయ ప్రపంచంలో పడిపోయాను. శిశువు ఆహారం విషయంలో ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా చెప్పేవారు. నేను సరైన మార్గం కోసం వెతుకుతున్నాను. పిల్లలు సాధారణంగా అరటి పండు, బియ్యము పప్పు తో తయారుచేసిన కిచిడి మరియు పన్నీర్ను వారి ఏడో నెల నుంచి శిశువులకు పరిచయం చేయవచ్చు. కానీ కొంతమంది పిల్లలకు పాల ఉత్పత్తులు సరిపడవని గుర్తుంచుకోండి. మీ బిడ్డకు మీరు పన్నీరు ఇచ్చిన తర్వాత ఏదైనా  ప్రతి స్పందనలు కలుగుతాయో గమనించండి. మీ పిల్లల ఆరోగ్యం కోసం మీ ఇంట్లోనే స్వయంగా పన్నీరు తయారు చేసుకోండి. (నేను ఎన్నో ప్రయత్నించి చివరికి ఈ ప్రక్రియను ఎంచుకున్నాను)

 

చిన్న పిల్లలకు పన్నీరు ఎలా ఇవ్వాలి ?

 

నేను ఉప్పు లేదా చక్కెర లేకుండా ఇంట్లోనే తయారుచేసిన మృదువైన , మెత్తని పన్నీర్ తో ప్రారంభించాను. మా చిన్నారి దానిని ఎంతో ప్రేమించడం ప్రారంభించింది. నేను ఆమెకు వారానికి రెండుసార్లు పన్నీరు తయారు చేయడం మొదలుపెట్టాను. మీరు ఇంట్లో చేసిన పన్నీర్ అయితే శిశువులకు కూడా ఇవ్వవచ్చు. అది మృదువైనది , తేలికైనది మరియు అందులో ఏమి కలవలేదు అని ఖచ్చితంగా తెలుసు.

 

చిన్న పిల్లల కోసం ఐదు పన్నీరు వంటకాలు (భారతీయ) :

 

ఇక్కడ నేను మా పాపకు ముఖ్యంగా అందరూ ఇష్టపడే పన్నీర్ టిక్కా ను ఎలా తయారు చేయాలో పంచుకుంటున్నాను. అవును, పన్నీర్ టిక్కా... మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు.. పసి బిడ్డ కోసం పన్నీర్ టిక్కా...! కానీ అది ఇంట్లో తయారు చేస్తే, సాధారణ మసాలా దినుసులతో తయారు చేసుకోవచ్చు. దాన్ని ఎక్కువగా అలంకరించ వలసిన అవసరం లేదు మరియు ఎక్కువ మసాలాలు ఉపయోగించవలసిన అవసరం కూడా లేదు . మరియు మీ చిన్న బిడ్డలు దానిని ఎక్కువగా ఇష్టపడతారు . ఎంతో సంతోషంగా తింటారు.

 

 1.చిన్న పిల్లల కోసం పన్నీర్ ఖీర్  రెసిపీ :

 

పన్నీర్ కీర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు :

 

పాలు ... 2 కప్పులు

 

పన్నీరు ... (కాటేజ్ చీజ్) 200 గ్రాములు

 

డ్రై ఫ్రూట్స్ .... పౌడర్ 2 స్పూన్లు

 

పంచదార .... 2 స్పూన్లు

 

గింజలు లేని ఖర్జూరం..2 లేదా 3 

 

యాలకుల పొడి ..... 1 స్పూన్

 

చిన్న పిల్లల కోసం పన్నీర్ ఖీర్ తయారు చేసే విధానం :

 

దీనికోసం మీరు ఎప్పుడు పాలు కాచేందుకు ఉపయోగించే పాత్రను మాత్రమే ఉపయోగించండి.

పాలు మరిగిన తర్వాత ఆ పాలలో ఖర్జూరమును చిన్న ముక్కలుగా తరిగి అందులో వేసి పదిహేను నిమిషాలపాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి.

 

ఇప్పుడు పన్నీరును తురిమి పెట్టుకోండి. ఈ పన్నీరు ఉండలుగా ఉండకూడదు . అలాగే మెత్తగా కూడా చేయకూడదు అని గుర్తుంచుకోండి.

 

మరిగించి పక్కన పెట్టుకున్న పాలలో తురిమిన  పన్నీర్ ను కలపండి. ఈ పాలను మళ్ళీ 5 నుండి 10 నిమిషాల పాటు మరిగించాలి.

 

పాలు చిక్క పడడం మొదలైన తరువాత డ్రైఫ్రూట్స్ పొడి మరియు పంచదార వేసి బాగా కలపండి.

 

దీనిని మీరు చల్లగా లేదా వేడిగా కూడా వడ్డించవచ్చు.

 

2. చిన్న పిల్లల పన్నీరు మరియు గోధుమపిండి తో కుకీస్ తయారీ విధానం :

 

 పన్నీరు గోధుమ పిండితో కుకీస్ తయారు చేసేందుకు కావలసిన పదార్థాలు : 

 

చల్లని పన్నీరు (ఇండియన్ కాటేజ్ చీజ్).1/2 కప్పు.

 

గోధుమపిండి...1/2 కప్పు.

 

బేకింగ్ పౌడర్ (నచ్చితే)... 1/4 టీ స్పూన్

 

ఉప్పు కలిపిన వెన్న....100 గ్రాములు (ఏడు టేబుల్ స్పూన్లు)

 

చిన్న ఉల్లిపాయలు ... 2

 

పచ్చిమిర్చి....1 లేదా 2

 

వామ్ము....2 స్పూన్లు

 

కరివేపాకు..... 20 ఆకులు.

 

పిల్లలకు పన్నీర్ కుకీలను తయారు చేసే విధానం :

 

ఒక జల్లెడ తీసుకొని అందులో గోధుమ పిండి మరియు బేకింగ్ పౌడర్ను జల్లించి పక్కన పెట్టుకోండి. గోధుమ పిండి మరియు బేకింగ్ పౌడర్ మెత్తగా ఉంటేనే కుకీలు సరైన ఆకారంలో వస్తాయి అని గుర్తుంచుకోండి.

 

ఆ తర్వాత ఓవెన్ను 180 డిగ్రీల ఫ్రీ హీట్ సెట్ చేసి పెట్టండి. ఆ తర్వాత బేకింగ్ ట్రే ను గ్రీస్ చేసి దానిని పక్కన ఉంచండి.

 

ఇప్పుడు ఉల్లిపాయలు ,పచ్చిమిర్చి , వాము మరియు కరివేపాకు బరకగా మిక్సి లో వేసి పక్కన పెట్టుకోండి.

 

ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని పన్నీరు మరియు వెన్న కలిపి అది మెత్తగా అయ్యేవరకు కలపండి.

 

అది మృదువుగా మారిన తర్వాత అందులో పిండి మరియు మిగిలిన పదార్థాలను వేసి బాగా కలపండి. ఆ పిండి మరీ మృదువుగా  ఉన్నట్లయితే అందులో కొంచెం పిండిని చేర్చుకోండి.

 

ఇప్పుడు పూరి కర్ర సహాయంతో పిండిని రౌండ్ గా చేసి కుకీ  కట్టర్ల సహాయంతో కట్ చేసుకోండి. మీరు వీటిని గుండ్రంగా మీ చేతితోనే చేసుకోగలిగి నట్లయితే , మీ చేతులతోనే చేసుకోవచ్చు. మీ చేతులతో వీటిని తయారు చేసుకునేటప్పుడు అన్ని వైపులా ఒకే లాగా ఉండి కరకరలాడే కుకీస్ వచ్చేలాగా చూసుకోండి.

 

ఇప్పుడు ఫోర్క్ సహాయంతో కుకీలపై రంధ్రాలను పెట్టండి. తద్వారా అవి పైకి ఉబ్బి పోకుండా ఉంటాయి.

 

170 సి హీట్ లో 15 నుండి 20 నిమిషాలు పాటు వాటిని ఉంచండి. ప్రతి ఐదు నిమిషాలకు క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. తద్వారా అవి మాడి పోకుండా చూసుకోగలరు.

 

కుకీలు గోధుమ రంగులోకి మారడం ప్రారంభించిన తరువాత వాటిని బయటకు తీసి వేరే పెద్ద పళ్ళెంలో వేసి చల్లారనివ్వండి.

 

కుకీలు ముందు మెత్తగా కనిపిస్తాయి. కానీ అవి చల్లబడిన తర్వాత మంచిగా కరకరలాడుతూ వస్తాయి.

 

ఇది బాగా చల్లారిన తర్వాత గాలి తగలని డబ్బాలలో నిల్వ చేసుకోండి.

 

ఇంట్లో తయారు చేయబడిన ఈ కుకీలు సరిగ్గా నిలువ చేసినట్లయితే 10 నుండి 15 రోజులకు పైగా తాజాగా ఉంటాయి.

 

3. పాలకూర మరియు పన్నీర్ రైస్  :

 

పాలకూర మరియు పన్నీర్ రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు :

 

తరిగిన పాల కూర ...1/4  కప్పు

 

కడిగిన బియ్యం ...1 కప్పు

 

తరిగిన పన్నీర్... 1/4 కప్పు

 

నెయ్యి.... 1 టీ స్పూన్

 

ఉప్పు.... రుచికి సరిపడా

 

పాలకూర మరియు పన్నీర్ రైస్ తయారీ విధానం :

 

ఒక బాండీ లో స్వచ్ఛమైన వెన్న లేదా నెయ్యి వేసి అది మరిగాక ఉడికించిన అన్నాన్ని అందులో వేయండి. ఒక్క నిమిషం పాటు ఉడికించండి.

 

తరువాత అందులో పన్నీరు , పాలకూర, ఉప్పు కొంచెం నీరు వేసి కొన్ని నిమిషాల పాటు ఉడికించండి.

 

దీనిని రైస్ గది ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడు సర్వ్ చేయవచ్చు.

 

4. చిన్న పిల్లల కోసం పన్నీర్ పకోడా :

 

పన్నీర్ పకోడా తయారు చేసేందుకు కావాల్సిన పదార్థాలు :

 

శెనగపిండి ... 2 కప్పులు

 

బియ్యం పిండి... 1/2 కప్పు

 

పన్నీరు.... 250 గ్రాములు

 

బేకింగ్ సోడా.. 1 టేబుల్ స్పూన్

 

ఉప్పు .... రుచికి సరిపడా

 

నూనె....1 కప్పు

 

చిన్న పిల్లల కోసం పన్నీర్ పకోడీ తయారు చేసే విధానం :

 

ఒక పెద్ద గిన్నెలో శనగపిండి , బియ్యప్పిండి, ఉప్పు , బేకింగ్ సోడా మరియు నీటిని వేసి కలిపి పక్కన పెట్టుకోండి.

 

10 నుండి 15 నిమిషాల పాటు దీనిని పక్కన ఉంచండి.

 

ఇప్పుడు ఒక మూకుడు లో నూనెను వేడి చేసి పన్నీర్ ముక్కలను ఈ పిండిలో మంచి మరిగే నూనెలో వేసి గోధుమరంగు వచ్చేవరకు దానిని ఫ్రై చేయండి.

 

టమోటా కచప్ తో దీనిని వడ్డించండి.

 

5. చిన్నపిల్లల కోసం పన్నీర్ టిక్కా :

 

చిన్నపిల్లలకు పన్నీర్ టిక్కా తయారు చేసేందుకు కావలసిన పదార్థాలు :

 

పన్నీరు ముక్కలు....200 గ్రాములు

 

క్యాప్సికం మొక్కలు...1/2 కప్పు

 

ఉల్లిపాయ .. 1 

 

టమాటా ముక్కలు....కొన్ని

 

అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక టేబుల్ స్పూన్.

 

కారం...1 టేబుల్ స్పూన్. (నచ్చితే)

 

కస్తూరి మేతి (ఎండిన మెంతి ఆకులు)..1 టేబుల్ స్పూన్..

 

చాట్ మసాలా...1 టేబుల్ స్పూన్

 

తందూరి మసాలా...1 టేబుల్ స్పూన్ (నచ్చితే)

 

నిమ్మరసం...1 టేబుల్ స్పూన్

 

పెరుగు..1 కప్పు

 

నూనె...1 టేబుల్ స్పూన్

 

ఉప్పు... రుచికి సరిపడా

 

చిన్నపిల్లలకు పన్నీర్ టిక్కా తయారు చేసే విధానం

 

ఒక గిన్నెలో పెరుగు , నిమ్మరసం , ఉప్పు , అల్లం వెల్లుల్లి పేస్టు మరియు అన్ని మసాలా దినుసులను కలుపుకోండి.

 

పన్నీర్ ముక్కలు మరియు కాయ కూర ముక్కలను మ్యారినేట్ చేసి నాలుగు గంటల పాటు ఫ్రిజ్లో ఉంచండి.

 

ఇప్పుడు కాయకూర  ముక్కలు మరియు పన్నీర్ ముక్కలను పుల్లలకు గుచ్చి అమర్చండి.

 

ఓవెన్ లో 450 డిగ్రీల ఎఫ్ లో వేడి చేయండి.

 

బేకింగ్ ట్రే , పన్నీరు మరియు కాయగూరలు పై కొంచెం నూనెను తీసుకొని బ్రష్ చేయండి.

 

పన్నీరు మరియు కాయగూరలను పదిహేను నిమిషాలపాటు గ్రిల్ చేయండి.

 

పిల్లల కోసం పన్నీరు ను ఇంట్లోనే ఎలా తయారు చేయాలి ?

 

ఇంట్లోనే పన్నీరును తయారుచేయడం చాలా సులభమైన పని .అయితే దీనికి కొంత సమయం పడుతుంది. కానీ ఎటువంటి కల్తీ లేని ,మృదువైన , రుచికరమైన , తాజా పన్నీరు తయారవుతుంది. ఈ పన్నీరు ను పిల్లలకు మరియు పసిపిల్లలకు కూడా సమానంగా ఇవ్వవచ్చు . మీరు ఎంతో ప్రేమించే మీ పిల్లలు సరైన పోషక శక్తిని కలిగి ఉన్నారని మీకు ఇది ఎంతో మనశ్శాంతిని ఇస్తుంది.

 

ఇంట్లో పన్నీరు తయారు చేయడానికి కావలసిన పదార్థం :

 

కేవలం ఒక లీటర్ పాలు. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ పాలు తీసుకోవచ్చు.

 

మృదువైన మెత్తని పన్నీరు కోసం ఫుల్ క్రీమ్ పాలను తీసుకోండి.

 

ఒక నిమ్మకాయ , ఒక చెంచా పెరుగు ను (లేదా వెనిగర్) ఈ పాలలో కలపండి.

 

ఈ ద్రవాన్ని వడ కట్టడానికి ఒక పాత్ర, ఒక గట్టి గాజు వస్త్రం.

 

ఇంట్లోనే పన్నీరు తయారు చేసుకునే విధానం :

 

ఫుల్ క్రీమ్ మిల్క్ ను ఒక గిన్నెలో పోసి బాగా మరగనివ్వాలి.

 

ఆ పాలను కొన్ని నిమిషాల పాటు సిమ్లో ఉంచి మరిగించండి.

 

ఒక చెంచా పెరుగు లేదా కొన్ని చుక్కల నిమ్మరసం లేదా వెనిగర్ ను ఈ పాలలో వేయండి. ఈ మూడింటిలో ఏదో ఒకటి వేస్తే సరిపోతుంది.

 

ఒక్కసారి ఆ పాలు గడ్డ గా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి  కొంచెం సేపు పక్కన పెట్టండి.

 

ఈ పాలను గాజు బట్టలో వేసి వడకట్టండి. ఇవి వేడిగా ఉంటాయి . కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

 

ఆ వస్త్రం యొక్క పైభాగాన్ని ముడిపెట్టి ఆ పన్నీరు ను సున్నితంగా పిండి నీటిని తొలగించండి.

 

ఈ పన్నీరు ను ఒక పెద్ద గిన్నె కింద ఉంచండి.

 

ఎంతో రుచి కరమైన , మృదువైన , ఇంట్లో తయారుచేసిన పన్నీరు మీదే...

 

నేను ఆనందించిన విధంగా ఈ వంటకాలను తయారు చేయడంలో మీరు ఆనందిస్తారని ఆశిస్తున్నాను.ఈ వంటకాల పై మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి . మరియు  మీకు కూడా కొన్ని పన్నీరు వంటకాలు ఉన్నట్లయితే ఈ దిగువ వ్యాఖ్యల విభాగంలో వాటిని కూడా మాతో పంచుకోండి. 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}