• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

దంతాలు బయటకు వచ్చే సమయంలో ఇవ్వకూడని 5 ఆహారాలు

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Nov 20, 2020

 5
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

తల్లి గర్భం దాల్చిన రెండు నెలల తర్వాత పిల్లలకు దంతాలు ప్రారంభం అవడం అన్నది సహజ ప్రక్రియ. శిశువు జన్మించిన సమయానికి వారి దవడ ఎముకలలో ఇరవై పండ్లు లోతుగా ఏర్పడతాయి. మరియు పిల్లలకు ఆరునెలల వయస్సు వచ్చేసరికి అవి కనిపించడం ప్రారంభమవుతాయి. పాల పళ్ల ఆకారంలో పిల్లలకి పిల్లలకి మధ్య వ్యత్యాసం ఉంటుంది. పిల్లలకు ఈ పళ్ళు అన్నవి ఎంతో ముఖ్యమైనవి ఎందుకంటే అవి శాశ్వత దంతాల కోసం ఒక స్థలాన్ని కలిగి ఉంటాయి. మీ పిల్లలు మాట్లాడే విధానాన్ని మరియు ఆహారాన్ని నమలడానికి గల సామర్థ్యాన్ని పెంచడంలో పిల్లలు పళ్ళు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

 

దంతాల యొక్క ప్రతి దశలోనూ మీ పిల్లలకు అవసరమైన మద్దతు మరియు సౌకర్యాన్ని ఇవ్వడం చాలా అవసరం. ఎందుకంటే ఆ సమయంలో వారు చాలా నొప్పిని మరియు అసౌకర్యాన్ని అనుభవిస్తారు. చిట్టచివరి దవడ నుండి దంతాలు పైకి లేచే సమయంలో శిశువులు ఎంతో అసౌకర్యానికి గురవుతారు. ఆ సమయంలో తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉండాలి. శారీరకంగా ఎటువంటి సంకేతాలు లేకపోవడం వలన దంతాలు వచ్చే సమయంలో శిశువులకు కలిగే అసౌకర్యాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోలేరు. అందుకే తల్లిదండ్రులు పిల్లలను పళ్ళు వచ్చే సమయంలో చాలా శ్రద్ధగా పర్యవేక్షించాలి.

 

దంతాలు వచ్చే సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలను నివారించాలి ?

దంతాలు బయటకు వచ్చే సమయంలో గాయం ఏర్పడేందుకు అవకాశం ఉంది. అందువలన కొన్ని రకాల ఆహారాలను ఇవ్వడం మానుకోవాలి. ఎందుకంటే అవి నొప్పిని మరియు దుర్వాసనని కలిగిస్తాయి. దంతాలు బయటకు వచ్చే సమయంలో మీరు ఇవ్వకూడని కొన్ని ఆహారాలు -

 

1.సిట్రస్ ఆహారాలు :

సిట్రస్ ఆహారాల యొక్క ఆమ్ల స్వభావం ఒక దంతం బయటకు రావడానికి సిద్ధంగా ఉన్న ప్రదేశంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. కాబట్టి సిట్రస్ ఆహారాలు ఇవ్వడం మానుకోండి.

 

2. టమాటాలు , టమాటా సాస్ :

టమాటా యొక్క రుచి మండుతున్న అనుభూతిని కలిగిస్తుంది. మరియు గుచ్చినట్లుగా ఉంటుంది. అందువలన ఎట్టి పరిస్థితులలోనూ టమాటాలను ఇవ్వడం మానుకోండి.

 

3. కారంగా ఉండే ఆహారాలు :

బహిరంగంగా కనిపించే గాయాలు తన బాధను వ్యక్తపరచలేని ఒక చిన్న శిశువుకు కారంగా ఉండే ఆహారాలను కచ్చితంగా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది మంటను తీవ్రతరం చేస్తుంది.

 

4. ఉప్పగా ఉండే ఆహారాలు

ఉప్పు మండుతున్న అనుభూతిని పెంచుతుంది. ఇది మీ పిల్లలకి మరింత అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

 

5. అతిచల్లని ఆహారాలు :

కొంచెం చల్లగా ఉండే ఆహారాలు మీ బిడ్డకు మంచిదే అయినప్పటికీ, బాగా చల్లగా ఉండే గడ్డకట్టిన ఆహారాలను ఇవ్వకుండా ఉండటం మంచిది. టీథర్స్ కూడా గుచ్చుకున్న అనుభూతిని పెంచుతాయి. మీ బిడ్డకు మరింత సౌకర్యాన్ని పెంచుతుంది.

 

దంతాల రావడానికి సంకేతాలు ఏమిటి ?

 

ఒక దంతం బయటకు రావడానికి ఇది కండరాలు మరియు చర్మాన్ని నెట్టుకుంటూ బయటకు రావడం ప్రారంభిస్తుంది. అదే అసలైన నొప్పి మరియు బాధ వెనుక ఉన్న కారణం. ఆ వయస్సులో పిల్లలు మాటల ద్వారా దానిని తెలియపరచలేదు కనుక వారి ప్రవర్తన ద్వారా మనము గ్రహించాలి. ఇది మీ పిల్లలలో చిరాకు, మంకుతనము, ముక్కు కారడం, ఆకలి మందగించడం, విరోచనాలు, జ్వరం, ఆహారం తినడానికి నిరాకరించడం మరియు చిగుళ్ల వాపుతో ఎర్రగా మారి గట్టిగా కొరికే ప్రయత్నం కూడా చేస్తారు. వారి నొప్పిని తగ్గించడానికి వారికి సహాయకారి కావాలి. 

తల్లిదండ్రులు శిశువులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా నిర్ణయిస్తారు ?

 

మొట్టమొదటిసారిగా దంతాలు వచ్చే సమయంలో పంటి ప్రక్రియను శిశువులకు ఆహ్లాదకరంగా ఉండే ఆహారం ఇవ్వాలని సూచించారు. దీనిని చదవండి.

 

1. మీ పిల్లలకు ఆహారం ఇచ్చే విషయంలో మీరు సాహసోపేతంగా ఉండవలసిన అవసరం లేదు. వారు ఇష్టంగా తినే ఆహారాన్ని వారికి ఇవ్వవచ్చు. వారు తినడానికి సౌకర్యంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వాలి అని నిర్ధారించుకోండి.

 

2 .ఈ సమయంలో అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వారిని బాధిస్తుంది కనుక మృదువైన ఆహారము, స్మూతీస్ మరియు ఇంట్లో తయారుచేసిన జ్యూస్ల వంటి మృదువైన ఆహారాన్ని ఇవ్వాలని నిర్ధారించుకోండి.

 

3. మీ బిడ్డకు పండ్లు మరియు కాయగూరలతో తయారుచేసిన ఆరోగ్యకరమైన ఆహారాలను గుజ్జుగా లేదా సూప్లాగా తయారు చేసి ఇవ్వండి. మీ పిల్లలకు ఆహారాన్ని తినాలి అనిపించకపోవచ్చు. అందుకే మీరు వారి ఆహారాన్ని మెత్తగా చేసి ఇవ్వవచ్చు.

 

4. ఈ సమయంలో పిల్లలు సరైన ఆహారాన్ని తీసుకునే స్థితిలో ఉండరు. ఈ విషయంలో మీరు ఎక్కువ ఆందోళన చెందకూడదు. ఈ ప్రక్రియలో వారు కొంత బరువు కూడా తగ్గవచ్చు. వారు ఈ పంటి దశనుండి కోలుకున్న తర్వాత తిరిగి దానిని పొందుతారు.

 

5. మీ పిల్లలు ఆ సమయంలో ఎంతో నొప్పితో బాధపడుతూ ఉంటారు మరియు ఎక్కువగా ఆహారాన్ని తీసుకోలేరు కాబట్టి ఎక్కువ పాలు మాత్రమే తీసుకోగలుగుతారు. అందుకే పిల్లలు ముందు కంటే కూడా ఎక్కువ పాలు తాగడం కూడా మీరు గమనించవచ్చు. దీనివలన వారికి అవసరమైన పోషకాలు మరియు కేలరీలను అందుకోగలుగుతారు. పాలు వారిని హైడ్రేట్ గా ఉంచడానికి కూడా సహాయపడతాయి.


దంతాల ప్రక్రియ అన్నది పిల్లల ఎదుగుదలలో ఒక భాగం మాత్రమే. అందువలన మీరు ఎక్కువ ఒత్తిడికి, ఆందోళనకు గురి కావలసిన అవసరం లేదు. వారు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత వారి ఆకలి మెరుగుపడుతుంది మరియు బరువు కూడా పెరుగుతారు. మీ పిల్లలకు మీరు ఇచ్చే ప్రేమ మరియు మీరు కలిగించే సౌకర్యం పిల్లలు ఈ దశ నుండి సులభంగా బయటకు రావడానికి సహాయపడుతుంది.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • 1
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
  • Reply
  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}