• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఫుడ్ అండ్ న్యూట్రిషన్

గర్భధారణ సమయంలో పోషక లోపాలను ఎదుర్కోవడం..

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Sep 18, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

గర్భధారణ సమయంలో పిండం పెరుగుదలకు పోషకాల యొక్క అవసరం ఎంతో ఉంటుంది. ఈ పోషకాలు తల్లి తినే ఆహారం నుండి మాత్రమే వస్తాయి. కొన్ని సందర్భాలలో ఆమె పోషక లోపాలకు గురి అవుతుంది. సాధారణంగా కనిపించే పోషక లోపాలు ఏమిటి, అవి పిండం పై ఎటువంటి ప్రభావం చూపుతాయి మరియు వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకోవడానికి దీన్ని చదవండి.

 

గర్భధారణ సమయంలో సాధారణ పోషక లోపాలు :

 

గర్భధారణ సమయంలో మహిళలు కలిగి ఉండే కొన్ని పోషక లోపాలు మరియు వాటిని ఎలా ఎదుర్కోవాలో ఇక్కడ తెలుపబడ్డాయి.

 

వీటిని ఎలా ఎదుర్కోవాలి :

 

* ఐరన్ లోపము :

 

గర్భధారణ సమయంలో సాధారణంగా హిమోగ్లోబిన్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. పిండం పెరుగుదలకు రక్తం యొక్క అవసరం ఎక్కువగా ఉంటుంది. ఐరన్ లోపం వలన కూడా తల్లి రక్తహీనతకు గురవుతుంది.

 

ముదురు ఆకుపచ్చ ఆకుకూరలు, ముఖ్యంగా మెంతికూర, తోటకూర, మరియు ఆకూరలను చపాతి పిండిలో కలుపుకోవచ్చు. రైస్ మరియు సూప్ లలో కూడా కలుపుకోవచ్చు. ఇవి పాస్తా మరియు పప్పులతో కలిపి కూడా తీసుకోవచ్చు.

 

బీన్స్, నల్ల శనగలు, సోయా బీన్స్ వంటి చిక్కుళ్ళను రోజుకు ఒక్కసారైనా తీసుకోండి. మీరు వాటితో మొలకలు చేసి ఉడికించి సలాడ్లలో కలుపుకోవచ్చు. లేదా పొడి చేసి  చపాతీ పిండి లో కలుపుకోవచ్చు. లేదా మామూలు కూరలాగా కూడా చేసుకోవచ్చు.

 

గర్భవతులలో తరచుగా ఉండే ఆకలిని తీర్చడానికి ఖర్జూరం మరియు ఎండుద్రాక్ష ఎంతో మంచిది. మీరు మాంసాహారులైతే మీ ఆహారంలో మటను, చికను , ఫిష్ వంటి కొన్ని మాంసాహారాలను తీసుకోవచ్చు.

 

శాఖాహారులకు ఒక మాట, సిట్రిక్ ఫ్రూప్ట్స్  కానీ జ్యూస్ గాని తీసుకోండి. ఉసిరిలో మంచి సి విటమిన్ ఉంటుంది. శాఖాహారులు ప్రతిరోజు దీనిని మీ ఆహారంలో తీసుకున్నట్లయితే ఐరన్ కూడా సక్రమంగా అందుతుంది.

 

* ప్రోటీన్ లోపం :

 

మీరు ఎప్పుడు బలహీనంగా అలిసిపోయినట్లుగా ఉన్నట్లయితే ప్రోటీన్ల లోపం వల్ల పిండానికి కూడా సమస్యలు వస్తాయి. ఇవి కండరాల బలహీనత మరియు ఎముకల బలహీనతల నుండి వివిధ రకాల జననలోపాల వరకు దారి తీస్తాయి.

 

శాఖాహారులకు గర్భధారణ సమయంలో ప్రోటీన్ లను శరీరానికి అందించడం ఒక పెద్ద సమస్య. కాబట్టి మీరు రోజు వారి ఆహారంలో ప్రతిరోజూ కనీసం ఐదు ఆహార పదార్థాలను ఎంచుకోండి. ఒక కప్పు పప్పు, ఒక్క ముక్క చీస్, రెండు పన్నీర్ టిక్కాలు (50 గ్రాములు), ఒక ప్లేట్ మొలకెత్తిన బీన్స్ సలాడ్, ఒక గ్లాస్ మిల్క్ షేక్, ఒక కప్పు పెరుగు, రెండు ముక్కల డోక్లా, ఒక గ్లాస్ మజ్జిగ లేదా పాలు.

 

* ఫోలిక్ యాసిడ్ లోపం :

 

ఫోలిక్ ఆసిడ్ సప్లిమెంట్ల ద్వారా సరఫరా చేయడమే కాకుండా ఆహారంలో కూడా  మంచి వనరులు ఉన్నాయి. పిండంలో మెగాలోబ్లస్టిక్ రక్తహీనత మరియు న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడం చాలా ముఖ్యం.

 

పప్పు ధాన్యాలు, చిక్కుళ్ళు ముఖ్యంగా నల్ల శనగలు మరియు పెసలు, ఆకుకూరలు ముఖ్యంగా బచ్చలికూర , చులై మరియు పుదీనా.

 

గ్రీన్ బీన్స్, నారింజ మరియు టమాటాలలో ఈ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. మీ పోలిక్ యాసిడ్ సరఫరాను పొందడానికి టమాటాలు మరియు పుదీనాతో చట్నీ చేసుకోవచ్చు. సెనగలుతో కలిపి సలాడ్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు.

 

* క్యాల్షియం లోపం :

 

పిండం యొక్క పెరుగుదలకు మరియు ఎముకల అభివృద్ధికి క్యాల్షియం ఎంతో ముఖ్యం.

 

మీకు పాలు (కాల్షియం లభించే ఆహారాలలో ఒకటి) తీసుకోవడం ఇష్టం లేనట్లయితే, ప్రతిరోజు చీస్, పన్నీర్, పెరుగు, రాగి పిండి, బాగా ఉడికించిన చిక్కుళ్ళు మరియు ఆకుకూరలను మీ ఆహారంలో చేర్చండి.

 

క్యాల్షియం అధికంగా ఉండే ఎండుకొబ్బరిని మీ కూరలలోను, సలాడ్ లలోనూ ఉపయోగించినట్లయితే క్యాల్షియంను ఆహారంలో  పెంచడానికి ఉపయోగపడుతుంది.

 

మరింత తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి : గర్భధారణ సమయంలో క్యాల్షియం ఎందుకు ముఖ్యమైనది?

 

దయచేసి గమనించండి: అయోడిన్ గురించి ఒక మాట- పిండం యొక్క శారీరక మరియు మానసిక పెరుగుదలకు అయోడిన్ అవసరం. కాబట్టి గర్భధారణ సమయంలో అయోడైజ్డ్ ఉప్పును మాత్రమే వాడండి.

 

సమతుల్య ఆహారం అనేది గర్భధారణ లో ఒక ముఖ్యమైన భాగం. ఇది మీ ఆరోగ్యానికి మరియు పెరుగుతున్న పిండానికి కూడా ఎంతో అవసరం. కాబట్టి మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి అని నిర్ధారించుకోండి. మీ వైద్యుని సంప్రదించిన తరువాత వ్యాయామం చేయండి. మరియు చురుకైన జీవనశైలిని కొనసాగించండి . మేము మీ ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన గర్భధారణ సమయాన్ని కోరుకుంటున్నాము!


గర్భధారణ సమయంలో పోషక లోపాలపై వచ్చిన ఈ బ్లాగ్ మీకు ఉపయోగపడిందా? దయచేసి మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాతో పంచుకోండి!

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • 1
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.

| Nov 17, 2020

Thank you

  • Reply
  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}