• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

తెలంగాణలో ఎక్కువుతున్న డెంగ్యూ: చిన్నారుల కోసం 8 డెంగ్యూ గృహ నివారణ చిట్కాలు..

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jun 12, 2022

 8

దోమకాటుతో వచ్చే డెంగీ వ్యాధి నగరంలో ప్రబలుతోంది. సాధారణంగా వానాకాలంలో ఎక్కువగా కనపడే డెంగీ.. ఇప్పుడు సీజన్స్‌కు అతీతంగా  నగరంలో విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నగరంలో 167 డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. ప్రజలు సైతం జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గడంతో పెరిగే దోమలను ఎదుర్కోవడం చాలా కష్టం. డెంగ్యూ జ్వరాలు పెరిగిపోతాయి. డెంగ్యూ నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ దోమల నియంత్రణ అన్నది మన ఇండ్ల నుండి మరియు మన పరిసరాల నుండి  ప్రారంభించాలి. వృద్ధులు మరియు పసిపిల్లలు  రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన అంటు వ్యాధుల బారిన పడతారు.మీరు మీ ప్రియమైన వారిని డెంగ్యూ నుండి రక్షించుకునేందుకు ఏమి చేయగలరో తెలుసుకునేందుకు చదవండి..

డెంగ్యూ అంటే ఏమిటి ? దాని లక్షణాలు ఎలా ఉంటాయి ?

డెంగ్యూ జ్వరం అనేది దోమల ద్వారా సంక్రమించే ఒక వైరల్ వ్యాధి. ఇది ఎనాఫిలిస్ అనే దోమ కాటు తో వ్యాపిస్తుంది. దోమకాటు ద్వారా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించిన తరువాత రోగం బయటపడేందుకు నాలుగు నుండి పది రోజులు పడుతుంది .దీని ప్రధాన లక్షణం తీవ్రమైన కీళ్ల నొప్పులు . ఆ కారణంగా దీనిని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు.

డెంగ్యూ జ్వరం తో సంబంధం ఉన్న సాధారణ లక్షణాలు :

మీ పిల్లలకు 105 డిగ్రీల వరకు అధిక చలి జ్వరం ఉంటుంది .తీవ్రమైన కీళ్ల నొప్పులు దీనికి మరొక ముఖ్యమైన సంకేతం. చాలామంది పిల్లల్లో చర్మంపై తెలుపు మరియు ఎరుపు రంగు మచ్చలు మరియు దద్దుర్లు కనిపిస్తాయి . తీవ్రమైన తలనొప్పి, కడుపునొప్పి ,వాంతుల తో పాటుగా విపరీతమైన నీరసం ఉంటుంది.

ఈ లక్షణాలు ఉన్నట్లయితే ఎన్నో సమస్యలకు దారి తీస్తాయి . తీవ్రమైన బలహీనత తో పాటుగా వాంతిలో రక్తం పడుతున్నట్లు అయితే అత్యవసర వైద్య సేవలకు సంకేతాలు. డెంగ్యూ లక్షణాలపై మరింత చదవండి.

పిల్లలలో డెంగ్యూ ఎందుకు ప్రమాదకరం ?

మన దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ డెంగ్యూ వేగంగా వ్యాపిస్తుంది డెంగ్యూ సోకిన ప్రతి ఆరుగురిలో ఒకరు చిన్న బిడ్డ గా ఉంటున్నారు.

పిల్లలు అనారోగ్యానికి ఎందుకు గురవుతున్నారు ?

ఉద్యానవనాలు మరియు ఆట స్థలాలు :

ఉద్యానవనాలు మరియు ఆట స్థలాలు లాంటి బహిరంగ ప్రదేశాలు ఈ అంటు దోమలకు ముఖ్య స్థావరాలు. ఇవి నిల్వ ఉన్న నీటిలో వ్యాప్తి చెందుతాయి. పిల్లలు ఈ ప్రాంతాలలో ఆడటం వలన వారు తరచుగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

పాఠశాలలు :

ఎన్నో పాఠశాలలు దోమలకు నిలయాలుగా ఉంటున్నాయి .ఒక పిల్లవాడిని దోమ కుట్టినప్పుడు అది అతి త్వరగా వేరొక పిల్లవానికి వ్యాపిస్తుంది.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం :

సాధారణంగా పిల్లలకు చిన్న వయసులో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది సరైన పోషకాహారం లేకపోవడం తో త్వరగా రోగనిరోధక శక్తి కి దారి తీస్తుంది. ఈ కారణంగా డెంగ్యూ జ్వరం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

దుస్తులు :

Dengue mosquito వచ్చే ఈ డ్రెస్ దోమ సాధారణంగా పగటిపూట వ్యాప్తి చెందుతుంది అది అది దాని ఇష్టం వచ్చిన దగ్గర పుట్టేందుకు అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ క్రింది భాగంలో ను చేతులు మోకాళ్ల నుండి పాదాల వరకు ఎక్కడైనా కాటు వేస్తాయి మీ పిల్లలు ఫుట్బాల్ ఆడే సమయంలో ట్రాక్ పాయింట్ మరియు మోకాళ్ల వరకు ఉండే ప్యాంట్లు వేసుకున్నట్లయితే దోమలకు కాటు వేసేందుకు ఎంతో స్థలం దొరికి కాటువేసి ,ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది.

మరిన్ని సామీప్య బ్లాగులు :

డెంగ్యూ జ్వరం వ్యాప్తి: అవగాహన లక్షణాలు నివారణ చర్యలు,మీ పిల్లలను డెంగ్యూ నుండి ఎలా నివారించాలి ?ఈ ఆరు డెంగ్యూ నివారణ చిట్కాలను తనిఖీ చేయండి, ఈ రుతుపవనాల సమయంలో డెంగ్యూ లక్షణాలు, చికిత్స మరియు మీ పిల్లల కొరకు నివారణ చిట్కాలు...

డెంగ్యూ జ్వరం కోసం 8 గృహ నివారణలు :

డెంగ్యూ కి పూర్తిగా చికిత్స చేసేందుకు సరైన మెడిసిన్ ఇప్పటివరకు నిరూపించ బడలేదు. కానీ ఆయుర్వేదంలో ఈ లక్షణాలకు కొన్ని పరిష్కారాలు ఉన్నాయి .ఈ వ్యాధితో బాధపడే వారి శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం .పోషకాల తో కూడిన సూప్ లి మరియు తీయని ఫ్రూట్ జ్యూస్లు దీనిని నయం చేయడానికి బాగా ఉపయోగపడతాయి .మీ పిల్లల కోసం మీరు చేయవలసిన ఇంటి నివారణ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

తిప్పతీగ (గేలోరి):

ఈ ఆకులు డెంగ్యూ నియంత్రించడంలో బాగా పనిచేస్తాయి అని నిర్ధారించబడింది .ఈ తిప్పతీగ కాండాన్ని నల్ల మిరియాల తో చేర్చి బాగా మరిగించి కొన్ని రోజులపాటు తీసుకున్నట్లయితే ఇది చాలా బాగా ఉపయోగకారిగా ఉంటుంది .ఇది జీవక్రియ తో పాటుగా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

బొప్పాయి ఆకులు :

బొప్పాయి చెట్టు యొక్క ఆకులు చాలా ప్రభావవంతంగా పని చేస్తున్నట్లుగా కనుగొనబడింది .బొప్పాయి ఆకులను ఉడికించ కుండా నేరుగా పచ్చి ఆకుల నుండి రసం తీసి రోజుకి ఒకటి లేదా రెండు సార్లు తీసుకోండి . ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచేందుకు ఉపయోగపడుతుంది.

మెంతి ఆకులు :

మెంతి ఆకులు నీటిలో నానబెట్టి దాని రసం తాగండి మెంతి ఆకులతో టీ కూడా తయారుచేసి ఇవ్వవచ్చు ఇది పిల్లలలో చలి జ్వరాన్ని తగ్గిస్తుంది. ఇది అలసటను కూడా పోగొడుతుంది.చిన్నారులు చక్కగా నిద్రపోయేందుకు కూడా ఇది సహాయపడుతుంది.

నిమ్మ మరియు యూకలిప్టస్ ఆయిల్  :

ఈ నూనెలు సహజమైన దోమల వికర్షకం లుగా పనిచేస్తాయి దీనిని దోమల మందులు తయారు చేసే కంపెనీలు కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి దీనిని రెండు సంవత్సరాలు కంటే ఎక్కువ వయస్సు గల పిల్లల్లో మాత్రమే వాడాలి కానీ బట్టల మీద రాయడం ఇంట్లో ఉంచడం లాంటివి చేయవచ్చు . పొగ కోసం కర్పూరాన్ని వాడవచ్చు. మరియు పై నూనెలతో కలిపి  ఉపయోగించినట్లయితే స్ప్రే లాగా చాలా బాగా పనిచేస్తుంది.

లావెండర్ ఆయిల్ :

ఇది ఒక ప్రముఖమైన దోమల వికర్షకం లావెండర్ నూనెను దోమలను తిప్పికొట్టేందుకు మీ ఇంటి చుట్టు ఉపయోగించవచ్చు.

పసుపు :

ఎన్నో తరాలుగా వాడుతున్న పసుపు అంటువ్యాధులతో పోరాడే సామర్థ్యానికి ప్రసిద్ధి . పాలలో కొంచెం పసుపు కలిపి తీసుకున్నట్లయితే రోగి యొక్క జీవక్రియను పెంచుతుంది.

తులసి :

తులసి ని భారతీయ గృహాలలో ఆధ్యాత్మిక పరంగాను మరియు ఆరోగ్య పరంగాను ఎక్కువగా ఉపయోగిస్తారు .టీ తయారు చేసేందుకు ఈ తులసి ఆకులను ఉపయోగించినట్లయితే ఈ వైరస్ తో పోరాడి ఉపశమనం పొందడానికి ఉపయోగపడుతుంది.

నల్ల మిరియాలు :

ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి ఈ మిరియాలు బాగా ఉపయోగపడతాయి .రెండు గ్రాముల మిరియాలు ,కొన్ని తులసి ఆకులు వేసి బాగా మరిగించిన నీటిని తీసుకున్నట్లయితే ఇది డెంగ్యూ చికిత్స కు ఎంతో మంచిది. ఇది అనేక సమస్యలను కూడా నివారిస్తుంది.

పిల్లలు డెంగ్యూ నివారణకు 8 మార్గాలు :

పిల్లలు అనారోగ్యం తో బాధ బాధపడుతున్నట్లయితే తల్లిదండ్రులుగా అది మీకు బాధాకరమైన దృశ్యం . డెంగ్యూ జ్వరాన్ని నివారించడానికి సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

ఔషధ మొక్కలు :

నిమ్మ గడ్డి లేదా లెమన్ గ్రాస్  వంటి కొన్ని మొక్కలను ఇంటి లోపల పెంచుకున్నట్లు అయితే అవి దోమలను దూరంగా ఉంచుతాయి . ఇవి సహజంగానే దోమలను తరిమి కొడతాయి .కొన్ని రకాల మొక్కలు తలనొప్పి మరియు మైగ్రేన్ లను కూడా తగ్గిస్తాయి .ఈ మొక్కలను దోమల మందులను మరియు బామ్లను తయారుచేసే కంపెనీలు కూడా ఉపయోగిస్తారు . వీటితో తయారుచేసిన లిక్విడ్ తో ఇంటిని శుభ్రపరిచి నట్లయితే దోమలను పోగొడతాయి.

కొబ్బరి నూనె :

ఈ అద్భుతమైన నూనె యొక్క ప్రయోజనాలకు అంతం లేదనిపిస్తుంది. మీ వంటకాలలో కొబ్బరి నూనెను ఉపయోగించండి .దోమలు ఎక్కడైతే కుడతాయో ,ఆ ప్రదేశాలలో కొబ్బరినూనెను రాయండి . చేతుల మీద ,మోకాళ్ళ కింద భాగంలోనూ ,చేతుల కింద భాగంలోనూ, పాదాల పైన కొబ్బరినూనెను రాసినట్లయితే దోమ కాటు నుండి రక్షించ పడతారు.

బట్టలు :

మీ పిల్లలకు ఫుల్ గా ఉండే ట్రాక్ పాయింట్లతో పాటుగా ఫుల్ స్లీవ్స్ ఉండే షర్ట్ లను వేయండి.  అలా చేసినట్లయితే దోమకాటు కు బహిర్గతం కాకుండా ఉంటాయి.

సహజ దోమల వికర్షకాలు :

కృత్రిమమైన దోమల మందులను మరియు కాయలను ఉపయోగించినట్లయితే మీ పిల్లల సున్నితమైన చర్మానికి హాని కలిగిస్తాయి. దానికి బదులుగా సహజ లక్షణాలను ఉపయోగించండి. కొన్ని వేపాకులను కట్టకట్టి ఒక గుడ్డలో మూటకట్టి గది మూలల్లో ఉంచండి ఒక అట్ట ముక్క మీద కొన్ని చుక్కల వేపనూనె వేసి గదిలో ఉంచండి .ఆవ నూనెలో కొంత వామ్ము కలిపి కూడా దోమల నివారణి గా వాడవచ్చు .ఒక మట్టి పాత్రలో కర్పూరాన్ని కాల్చడం ద్వారా కూడా దోమలను నివారించవచ్చు.

ఇంటి పరిసరాలలో ప్రాథమిక పరిశుభ్రత :

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అన్నది దోమల నివారణకు మొదటిదశ. దోమలు దాగి ఉండే ఇంటి మూలలను శుభ్రపరచడం అన్నది చాలా మంచి ఆలోచన. దోమలు గుడ్లు పెట్టే ప్రదేశాలను శుభ్రపరచండి. దోమల కారణంగా మీ కుటుంబంలో సమస్యలు తెచ్చుకోకండి. పక్షుల స్నానం కోసం నీటిని నిల్వ చేయకుండా చూడండి . మీ మొక్కల కారణంగా దోమల వ్యాప్తి జరగకుండా ఈ నెలలో పూల కుండీలను ఎక్కువగా ఉంచకండి.

రోగ నిరోధక శక్తి :

మీ పిల్లలలో రోగ నిరోధక శక్తిని పెంచండి. వారి ఆహారంలో మంచి ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి . ఇది వారి ప్లేట్లెట్ కౌంట్ తగ్గకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది.  మాంసాహారులైతే మాంసం ,గుడ్డు ,చేపల ద్వారా మంచి ప్రొటీన్ లభిస్తుంది . శాకాహారం తినే పిల్లలు అయితే పప్పుధాన్యాలు ,ఆకుకూరలు మరియు పాల ఉత్పత్తులు ద్వారా మంచి పోషకాలు లభిస్తాయి.

ఈ గృహ నివారణలు డెంగ్యూ ని వ్యాప్తి చెందకుండా నివారించడానికి మరియు అనారోగ్య లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతాయి . కానీ మీలో ఇక్కడ పేర్కొన్న లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించండి .మీ ఇంటి లోపల మరియు పరిసర ప్రాంతాలలోనూ దోమలు గుడ్లు పెట్టకుండా నిరోధించడానికి ఈ సులభమైన చర్యలు తీసుకోండి.

డెంగ్యూ నివారణకు మా బ్లాగు మీకు ఉపయోగపడిందా ? మీ దగ్గర మరేదైనా చిట్కాలు ఉన్నట్లయితే ఈ వ్యాఖ్యల విభాగంలో మాతో పంచుకోండి .మీ అభిప్రాయాలు తెలుసుకోవడం మాకెంతో సంతోషం.

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}