Babycare

శిశువుల కోసం 6 శీతాకాలపు డైపర్ సంరక్షణ చిట్కాలు.

Aparna Reddy
0 to 1 years

Created by Aparna Reddy
Updated on Oct 26, 2020

 6
Reviewed by Expert panel

శిశువులు చాలా సున్నితమైన చర్మం కలిగి ఉంటారు మరియు ఏడాది పొడవునా వారిని రక్షించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి సీజన్ దాని సొంత సమస్యను తెస్తుంది మరియు తల్లిదండ్రులుగా మనం కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ వారి సంరక్షణ గురించి తెలుసుకోవాలి. శీతాకాలం సాధారణంగా పసిపిల్లల చర్మానికి చాలా కఠినంగా ఉంటుంది. మీ పిల్లలు ఇప్పటికీ డైపర్లే ఉపయోగిస్తున్నట్లు అయితే, పునర్వినియోగపరచదగినవి లేదా బట్టతో తయారు చేసినవి అయినప్పటికీ వారి చర్మం పొడిబారకుండా మరియు తేమను కోల్పోకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

 

శీతాకాలంలో దగ్గు , జలుబు మరియు ముక్కు కారడం వంటి సాధారణమైన వ్యాధులకు కారణం ఏమిటో మీకు తెలుసా? వీటికి కారణం డైపర్ కూడా కావచ్చు, అంటే తడిగా ఉన్న డైపర్లు.

 

శీతాకాలంలో పసిపిల్లల డైపర్లను ఎలా చూసుకోవాలి ?

 

శీతాకాలం అంతా మీ బిడ్డను సురక్షితంగా ఉంచడానికి సరైన డైపరింగ్ గురించి తెలుసుకోవడం మరియు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. శీతాకాలంలో 6 డైపరింగ్ చిట్కాలను తప్పక తెలుసుకోవాలి.

 

డైపర్లను తరచు మార్చండి :

శీతాకాలంలో సాధారణంగా పిల్లలు ఎక్కువగా డైపర్లను తడిపే సమయం. అందువలన మీరు డ్రైవర్లపై నిరంతరం నిఘా ఉంచాలి. అవసరమైతే ప్రతి రెండు గంటలకు ఒకసారి డ్రైవర్లను తనిఖీ చేయండి మరియు మార్చండి. జననేంద్రియ ప్రాంతాలలో డైపర్ మార్చడానికి ముందు పూర్తిగా శుభ్రపరచండి. తడి డైపర్లను ఎక్కువ సేపు వాడడం వల్ల దద్దుర్లు మరియు చికాకు వస్తుంది. అందువలన ముందు జాగ్రత్త కోసం జననేంద్రియ ప్రాంతాల చుట్టూ డైపర్ రాష్ క్రీం ను రాస్తూ ఉండండి.

 

డైపర్ రకం - బట్టతో తయారు చేసినవి మరియు డిస్పోజబుల్ :

ఇది పూర్తిగా మీ ఎంపిక. ఇది మీకు మరియు మీ బిడ్డ సౌకర్య వంతమైన వాటిపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఒక నియమం రెండింటికీ వర్తిస్తుంది. మీరు మీ బిడ్డను పొడిగా ఉంచాలి మరియు తరచూ మార్చాలి. చాలామంది తల్లిదండ్రులు శీతాకాలంలో డిస్పోజబుల్ డైపర్లను వాడటానికి ఇష్టపడతారు. ఎందుకంటే అవి మంచిగా తడి పీల్చుకునే లక్షణాలను కలిగి ఉంటాయి మరియు బిడ్డను ఎక్కువ సేపు పొడిగా ఉంచుతాయి. ఏది ఏమైనప్పటికీ, బట్టతో తయారు చేసిన డైపర్లు మీ ప్రాధాన్యత అయితే, మీరు వాటిని బాగా శుభ్రపరచి మరియు ఎండలో ఆరబెట్టాలి అని నిర్ధారించుకోండి. లేదంటే డ్రైయర్ ను ఉపయోగించండి. గుర్తుంచుకోవలసిన మరొక విషయం ఏమిటంటే, బిగుతుగా ఉండే డైపర్ లను ఉపయోగించకుండా నిరోధించడం. ముఖ్యంగా శీతాకాలంలో కొంచెం పెద్ద సైజు లో ఉన్న డైపర్లను ఉపయోగించడం మంచిది. దీనిని కూడా చదవండి: సాంప్రదాయబద్ధంగా బట్టతో తయారు చేసిన డైపర్స్ మరియు బేబీ డైపర్ రాష్..

 

మాయిశ్చరైజర్లను విరివిగా ఉపయోగించడం :

చాలా మంది తల్లులు తరచుగా మరిచిపోయే మరొక విషయం ఏమిటంటే, శిశువు యొక్క లోపలి భాగాలను తేమగా ఉంచడం. మంచి మాయిశ్చరైజర్ను వాడండి మరియు స్నానం చేసిన ప్రతి సారి, లేదా డైపర్ మార్చిన ప్రతి సారి కూడా మీ బిడ్డను కొంత సమయం ఆరనివ్వండి. అదే విధంగా ముందుభాగం తేమ లేకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మీ బిడ్డకు తామర ఉంది అని మీరు అనుమానించినట్లయితే మీ సొంత వైధ్యాలను ఆశ్రయించకుండా వెంటనే మీ శిశువు వైద్యుని సంప్రదించండి.

 

శీతాకాలంలో బట్టలు ఎంపిక :

శీతాకాలంలో మీ చిన్నారిని వెచ్చగా ఉంచటం ఎంతో ముఖ్యం. కానీ మీరు వారిని ఎక్కువ బట్టలతో కప్పి ఉంచాలని కాదు. గుర్తుంచుకోండి. బిడ్డ ను ఎక్కువ వేడిగా ఉంచినట్లయితే దద్దుర్లను కూడా కలిగిస్తుంది. అందువల్ల వారిని ఫుల్ ఫాంట్ లో ఉంచండి. వెచ్చగా ఉండే స్థాయిలో మాత్రమే వాటిని ఉంచండి. మీరు డైపర్లను ఉపయోగిస్తున్నప్పుడు అవి బిగుతుగా ఉండి అసౌకర్యానికి కారణం అవుతాయి. కాబట్టి బిగుతుగా ఉండే వాటిని నివారించండి. మృదువైన సౌకర్యవంతమైన పైజామా ,ప్యాంట్లు లేదా వార్మర్ లను ఉపయోగించండి.

 

కొంత డైపర్ లేని సమయం తప్పనిసరి :

శీతాకాలంలో కూడా మీరు మీ బిడ్డను డైపర్ లేకుండా రోజుకి కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు వదిలివేయడం చాలా అవసరం. ఇది ఘర్షణ మరియు దద్దుర్లను నివారించడానికి సహాయపడుతుంది. మరియు శిశువు యొక్క లోపలి భాగాలు పొడిగా ఉండే లాగా చేస్తుంది.

 

అవసరమైతే హ్యుమిడి ఫైర్ ను వాడండి :

 

మీరు చల్లని దేశంలో ఉన్నట్లయితే మీ బిడ్డ నిద్రిస్తున్న గదిలో  హ్యుమిడి ఫైర్ ను ఉపయోగించవచ్చు. ఎందుకంటే గదిలోని వేడి తేమను పూర్తిగా పీల్చే వేస్తుంది. హ్యుమిడి ఫైర్ ను ఉపయోగించినట్లయితే ఆ తేమను తిరిగి తీసుకు వస్తుంది. వేసవిలో బేబీ డైపర్ ను పరిశుభ్రంగా ఉంచడానికి చిట్కాలు.

 

వెచ్చని స్నానం :

సబ్బు మరియు నీరు అధికంగా వాడటం వల్ల మీ శిశువు యొక్క సున్నితమైన చర్మాన్ని డ్రై గా మారుస్తుంది. కాబట్టి మీరు శీతాకాలంలో తేలికపాటి సబ్బులను ఉపయోగించాలని గుర్తుంచుకోండి. స్నానం చేసే సమయంలో ఎక్కువ సేపు నీటిలో నానబెట్టవద్దు మరియు నీరు ఎక్కువ వేడిగా కానీ లేదా మరీ చల్లగా కానీ ఉండకుండా చూసుకోండి. గోరు వెచ్చగా ఉండేలాగా చూసుకోండి. బిడ్డ స్నానం చేసిన వెంటనే త్వరగా అతన్ని టవల్లో చుట్టి పొడిగా ఉంచండి. మరీ గట్టిగా రుద్దకండి. బిడ్డ ఇంకా తేమగా ఉండగానే మాయిశ్చరైజర్ను రాయండి. అలా చేసినట్లయితే అది త్వరగా గ్రహించబడుతుంది. బేబీ పౌడర్లను ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి. ముఖ్యంగా జననేంద్రియ ప్రాంతాల చుట్టూ పౌడర్ ను ఉపయోగించకూడదు. ఇది శిశువు యొక్క చర్మాన్ని గాలి పీల్చుకోవడానికి అనుమతించదు.

 

పిల్లలు ఎంతో సున్నితమైన చర్మాన్ని కలిగి ఉంటారు .అందువలన ఆ విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం . ముఖ్యంగా శీతాకాలంలో ఉపయోగించాల్సిన ఉత్పత్తులు మరియు మీ బిడ్డను వెచ్చగా మరియు సురక్షితంగా ఉంచడానికి చిట్కాలపై మీ వైద్యుడిని సంప్రదించాలని గుర్తుంచుకోండి. సువాసన లేని మరియు సురక్షితమైన ఉత్పత్తులను ఎంచుకోండి. మీ బిడ్డకు సులభంగా దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటే దానిని నివారించడానికి డైపర్ రాష్ క్రీమ్ ను ఉపయోగించాలి అని గుర్తుంచుకోండి. మరియు డిస్పోజబుల్ డైపర్లను వాడండి. నిజానికి శిశువు మలవిసర్జన చేసిన సమయంలో తుడవడానికి బదులుగా నీటితో శుభ్ర పరచాలి అని వైద్యులు సిఫార్సు చేశారు. ఎందుకంటే తుడవడం కొన్నిసార్లు శిశువు యొక్క చర్మాన్ని ఇబ్బందికి గురి చేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా మీ శిశువు యొక్క బట్టలు ఉతకడానికి తేలికపాటి డిటర్జెంట్ ను వాడండి.

 

శిశువు యొక్క చర్మం పలుచగా ఉండి త్వరగా అసౌకర్యానికి గురవుతుంది. కానీ ఇది చాలా స్థితిస్థాపకంగా ఉంటుంది అని ఫిలడెల్ఫియా కి చెందిన ఎం డి మరియు చర్మ వ్యాధి నిపుణులు అయిన బ్రూస్ బ్రాండ్ తెలిపారు. అయినప్పటికీ, వారి చర్మ సంరక్షణ చిట్కాలు సరళమైనవి ఎందుకంటే తక్కువ శ్రమ మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి.


శీతాకాలంలో డైపర్ సంరక్షణపై ఉన్న  బ్లాగ్ మీకు నచ్చిందా ? మీ అభిప్రాయాలను మరియు సూచనలను దిగువ వ్యాఖ్యల విభాగంలో మాతో పంచుకోండి. మీ నుండి వినడానికి మేము ఇష్టపడతాము.

This content has been checked & validated by Doctors and Experts of the parentune Expert panel. Our panel consists of Neonatologist, Gynecologist, Peadiatrician, Nutritionist, Child Counselor, Education & Learning Expert, Physiotherapist, Learning disability Expert and Developmental Pead.

  • Comment
Comments ()
Kindly Login or Register to post a comment.
+ Start A Blog

Top Babycare Blogs

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}