• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
వేడుకలు మరియు పండుగలు

దీపావళి అనగానే మన అందరికి గుర్తుకు వచ్చేది

Mounika Saride
గర్భధారణ

Mounika Saride సృష్టికర్త
నవీకరించబడిన May 15, 2022

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

దీపావళి అనగానే మన అందరికి గుర్తుకు వచ్చేది, ఇల్లంతా దీపాలు అలంకరించటం, బాణాసంచాలు కాల్చటం-పేల్చటం, దానితో పాటు ఆకాశంలోకి తారాజువ్వలు ఎగర వేయటం.. వగైరా, వగైరా!

"దీపావళి" పేరులోనే ఉంది "దీపాల వరుస" అని. దీపాలను వరుసగా వెలిగించి కుని, మనలోని సంతోషాల్ని, ఆనందాన్ని, వ్యక్తీకరించే రోజు దీపావళి.

నరకాసుర వధనే దీపావళి జరుపు కోవటానికి కారణంగా కొన్ని పురాణ గాధలు చెబుతున్నాయి. మరి ఒకరి చావు, మరొకరికి పండుగ ఎలా అవుతుంది ? దానికీ దీపాలు సంబంధం ఏమిటి ??

నరకుడు భూదేవి పుత్రుడు. అతనికి వున్న దివ్యశక్తులతో అందరిని చీకటి లోనే ఉంచేసాడు.అందుకే నరకు డoటే భయం.

సత్యభామ సాయం తో శ్రీ కృష్ణుని చేతిలో ఆశ్వయుజ  కృష్ణ చతుర్దశి అంటే బహుళ చతుర్దశి నాడు నరకుడు సంహరింప బడాడ్డు .

అప్పటి  నుండి ఆ ఆశ్వయుజ కృష్ణ చతుర్దశిని నరక చతుర్దశి గా పిలవపడుతోంది.

ఆమరునాడు వచ్చేదే అమావాస్య దానినే దీపాల అమావాస్య లేదా దీపావళి అమావాస్య అని పిలుస్తారు

అదే  దీపాల వెలుగులో మెరిసే అమావాస్య చీకటి .

చీకటి వెలుగులంటే అంధకారము, కాంతి.. కానీ, వీటికి అనేక పర్యాయ పదాలున్నాయి. మనకి కావాల్సినవి  లేదా కోరదగినవి వెలుతురు గాను, మనకి పనికిరానివి లేదా హానికరమైనవి చీకటిగాను అభివర్ణిస్తారు.

మనలోని అఙ్యానం,అనారోగ్యం, దుఃఖం, భయం, కోపం, బాధ, చికాకు, మనకున్న దారిద్రయము, మనకొచ్చే అపకీర్తి, అవమానం, అలాగే ప్రాణి కోటికి హాని కలిగించే స్వార్ధం, క్రౌర్యం , అలసత్యం, అమానుషత్వం మొదలైన వన్నీ చీకటి  గానే భావించాలి.

"నరకాసుర వథ" అంటే ఆ చీకట్లను ప్రారద్రోలి 'వెలుగు' ను ఆహ్వానించటం. "దీపావళి" అంటే జ్యోతులను వెలిగించటం. ఇంటిలో వెలుగునిచ్చే దీపాలతో పాటు, మనలోని  ఙ్యానజ్యోతులను వెలిగించటం. మనలోని అహంకారం, అవిద్యలను వధించటం. అదే ఆనందమయం. ఆరోగ్యం, ఆహ్లాదం, కీర్తి,ఙ్యనం అన్నీ ఆ జ్యోతి స్వరూపాలే.

కానీ, ఈరోజు దాని స్ఫూర్తి మరచి, బాణాసంచాలు కాల్చటమే దీపావళి గా మారిపోయింది. ప్రమాద హేతువు లయిన తారాజువ్వలు, ఎంతో శబ్ధ కాలుష్యాన్ని కలిగించే బాంబులు పేల్చటం పరిపాటి అయిపోయింది.

అందుకే, ఈ పండుగను సంతోష సంబరాలతో జరుపుకోవటం తో పాటు, కాస్తంత సామాజిక స్పృహ కూడా ఉండటం అత్యంత ఆవశ్యకరం.

మన ఆనందం తోటి వారికి, ఇతర ప్రాణికోటికి హాని కాకూడదు. మళ్ళీ  అది అఙ్యనమవుతుంది. అంటే "దీపావళి" స్ఫూర్తిని పూర్తిగా విస్మరించి నట్టేకదా !

దీపావళి అంటే ప్రమోదం. ప్రమాదం కాకూడదు. ఇప్పటికీ పూరి గుడిసెల్లో నివసించే నిరుపేదల గుండెల్లో దీపావళి అంటే భయం. బాణాసంచాలు అగ్ని ప్రమాదాలకు హేతువు. అందుకే మనం చాలా భాద్యతాయుతంగా ఈ దీపావళిని జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 'ఇదే, మనం ఈ తరానికి ఇచ్చే సందేశం'.

బాణాసంచా కాల్చేటప్పుడు మన శరీరాన్ని రక్షించు కోవటంతోపాటు, పరియవరణాన్ని కూడా రక్షించాలి. అతి శబ్ధ,వాయు కాలుష్యలు లేకుండా చూసుకోవాలి.

దీపావళి అంటే మన ఆనందమే కాదు, అది అందరి ఆనందం.

అది విజయానికి సంకేతం .

అఙ్యానం పై ఙ్యానం విజయం

దైన్యం పై దరహసాల విజయం

క్రోదం పై క్షమ విజయం

"చికటి పై వెలుగుల విజయం "

ఆనాడు, రావణ వధ అనంతరం శ్రీరాముల వారికి దీపాల తో ప్రజానీకం స్వాగతం పలికారు. "దీపం" అహంకార అఙ్యన అంతానికి చిహ్నం.

ఈనాడు, ప్రజా శ్రేయస్సును ఆశించి చేసే ప్రతిపనికి ఇటువంటి ఆదరణే ప్రజానీకం నుండి లభిస్తుంది.

ఈనాటి బాలల్ని ఆదిశగా పయనింప చేయాలి.

ఏదైనా సాయం పొందినపుడు పొందిన వారి కళ్ళలో కనిపించే ఆనందాన్ని తమ నిజమైన ఆనందంగా భావించ గలిగే మనస్సున మనుషులుగా తీర్చిదిద్దాలి .

నరకుడిలా ప్రవర్తించే వారిని దండించటానికి ఎవరూ వెనుకాడకూడదు. వారిని ఎదిరించే సాహసాన్ని ఈనాటి పిల్లలకు నూరిపోయ్యాలి.

మంచి చెడుల మధ్య అంతరాన్ని గుర్తించ గలిగే విఙ్యతని మనం మన పిల్లలకు అందించి గలిగినప్పుడు భావితరాల వారి అత్యంత మంచి పౌరులుగా ఖ్యతి నార్జించ గలుగుతారు.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • 3
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.

| Apr 13, 2019

iijjiiiiiuuujhhuuuuuuuuuuuuuuuuuuuuuuuuuyuyyyy

  • Reply
  • నివేదించు

| Jun 11, 2019

Hi mam

  • Reply
  • నివేదించు

| Mar 03, 2020

  • Reply
  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన వేడుకలు మరియు పండుగలు బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}