• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
వేడుకలు మరియు పండుగలు

అతిథులను ఆకట్టుకునే ప్రత్యేకమైన దీపావళి డ్రై ఫ్రూట్స్ వంటకాలు.

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Nov 11, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

మీరు తప్పక ప్రయత్నించాల్సిన దీపావళి రెసిపీలు. దీపావళికి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. సన్నాహాలు జోరందుకుంటున్నాయి. దీపావళి వేడుకల యొక్క అంతర్భాగాలలో అతి ముఖ్యమైనది ప్రత్యేకమైన , ఆహ్లాదకరమైన ఆహారాలను తయారు చేయడం. సాంప్రదాయమైన స్వీట్లు మరియు నమ్కీన్ అన్ని వయసుల వారిని ఎంతో ఆకట్టుకుంటాయి. పండుగ సమయంలో మన ప్రియమైన వారితో వీటిని పంచుకోవడం బాగుంటుంది. మీరు త్వరగా తయారు చేయగల ఒక రుచికరమైన దీపావళి రెసిపీ మా దగ్గర ఉంది. మరియు ఇది అన్ని రకాల పోషకాలతో నిండి ఉంటుంది. దీనిని తనిఖీ చేయండి: పిల్లల శరీరాన్ని వేడిగా వుంచుకోవడానికి పదమూడు శక్తివంతమైన శీతాకాలపు ఆహారాలు.

 

సాంప్రదాయంతో పాటుగా ఈ దీపావళికి మీరు రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన దీపావళి డెజర్ట్ రెసిపీ కోసం చూస్తున్నట్లయితే, ఇక ఎదురుచూడవలసిన అవసరం లేదు! మన డ్రై ఫ్రూట్స్ తో తయారు చేయగలిగిన లడ్డూలు ఎక్కువ కేలరీలను కలిగి ఉండవు. కొవ్వులు తక్కువగా ఉంటాయి కానీ యాంటీ ఆక్సిడెంట్ల తో నిండి ఉంటాయి. వీటిని కూడా నేర్పండి: దీపావళి సాంప్రదాయాలను పిల్లలకు అలవాటు చేయగలం ?

 

ఆరోగ్యకరమైన  దీపావళి  డెసర్ట్  రెసిపీని  సిద్ధం   చేయండి :

 

డ్రై  ఫ్రూట్స్ తో  లడ్డు  తయారు  చేయడానికి  కావలసిన  పదార్థాలు :

 

ఒకకప్పు గింజలుతీసి చిన్నముక్కలుగా  

తరిగిన ఖర్జూరాలు (తాజా, మెత్తగా ఉండే నల్లనివి)

 

ఎండు ద్రాక్ష సగం కప్పు

 

ఒక కప్పు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్( తరిగిన జీడిపప్పు, బాదం పప్పు, ఆక్రోట్, పిస్తా)


 

డ్రై  ఫ్రూట్స్  తో  లడ్డుని  తయారు  చేసే  విధానం :

 

డ్రై ఫ్రూట్స్ ను బరకగా మిక్సి వేసి పక్కన పెట్టుకోండి.

 

ఎండు ద్రాక్ష మరియు ఖర్జూరాలను మిక్సీలో విడిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.

 

ఎండు కొబ్బరి తురిమి పక్కన పెట్టుకోండి

 

వీటన్నిటినీ బాగా కలపండి.

 

మీ చేతులకు ఆయిల్ రాసుకుని ఆపై చిన్న లడ్డులాగ చుట్టకోండి.

 

వీటిని ఎండుకొబ్బరి తురుములో ముంచండి.

 

వీటిని ఫ్రిజ్లో ఉంచండి. ఆపై వడ్డించండి.

 

కాజు  కట్లీ ..  త్వరగా  చేయగల  మరియు సాంప్రదాయ  దీపావళి  రెసిపీ

 

అవును, పాపులర్ కాజు కట్లీ బర్ఫీని ఇంట్లో కూడా తయారు చేయడం చాలా సులభం. మీకు కావాల్సిందల్లా కొంచెం పాలు, కేసర్, జీడిపప్పు మరియు వయోల.(ఫుడ్ ఫ్లేవర్) ఇంట్లో కూడా ఈ రుచికరమైన స్వీట్ ను తయారు చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి.

 

కాజు  కట్లీ  తయారు  చేయడానికి  కావలసిన  పదార్థాలు:

 

200 గ్రాముల జీడిపప్పు మొక్కలు

 

రెండు స్పూన్ల కుంకుమ పువ్వు

 

నాలుగు కప్పుల నీరు

 

12 టేబుల్ స్పూన్లు చక్కెర

 

ఒక స్పూన్ ఆకుపచ్చ ఏలకుల పొడి

 

4 షీట్లు సిల్వర్ వ్రాప్

 

కాజు  కట్లీ  తయారు  చేసే  విధానం :

 

ముందుగా జీడిపప్పును మెత్తగా పొడి చేసుకోవాలి.

 

నాన్ స్టిక్ పాన్ లో నాలుగు కప్పుల నీటిని పోసి మరుగుతుండగా చక్కెర మరియు కుంకుమ పువ్వు వేసి బాగా కలపండి.

సిరప్ చిక్కబడే వరకూ మరిగించండి.

 

యాలకుల పొడి వేసి బాగా కలపండి.

 

అందులో జీడిపప్పు పొడి వేసి బాగా కలపండి.

 

దీనిని సుమారు మూడు నిమిషాల పాటు ఉడికించాలి.

 

ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని గది ఉష్ణోగ్రతలో చల్లారనివ్వండి.

 

ఈ మిశ్రమాన్ని ఒక పళ్లెంలోకి మార్చుకోండి.

 

దీనినీ సిల్వర్ వ్రాప్ తో అలంకరించండి.

 

చివరిగా స్క్వేర్ షేప్ లో కట్ చేసి వడ్డించండి.

 

సజ్జలు  మరియు  ఖర్జూరంతో  లడ్డూలు :

 

సజ్జలు  మరియు  ఖర్జూరంతో  లడ్డు  తయారు  చేయడానికి  కావలసిన  పదార్థాలు :

 

ఒక కప్పు సజ్జల పిండి

 

గింజలు తీసి సన్నగా తరిగిన ఇరవై ఖర్జూరాలు

 

సన్నగా తరిగిన నాలుగు స్పూన్ల బాదం మరియు ఆక్రోట్

 

ఒక కప్పు నీరు

 

నాలుగు స్పూన్లు స్వచ్ఛమైన నెయ్యి

 

సజ్జలు  మరియు  ఖర్జూరాలతో  లడ్డూలను  తయారు  చేసే  విధానం :

 

సజ్జలపిండిని సన్నని మంట మీద మాడకుండా వేపుకోండి.

 

కొంచెం నీటిలో చిన్న మంటమీద ఖర్జూరాలను ఉడికించండి.

 

ఖర్జూరాలు మెత్తగా ఉడికిన తర్వాత అందులో డ్రైఫ్రూట్స్ మరియు సజ్జపిండిని జోడించండి

 

ఈ మిశ్రమం కొంచెం వేడిగా ఉన్నప్పుడే మీ అరచేతులకు నెయ్యి రాసుకుని లడ్డూలను తయారు చేయండి.

 

ఈ దీపావళిని రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పదార్థాలతో జరుపుకోండి. చక్కెర మరియు కొవ్వు అధికంగా ఉండే పదార్థాలతో కాకుండా శరీరానికి అనుకూలంగా ఉండే విధంగా తయారు చేసుకోండి.

 

పిల్లలకు  డ్రై ఫ్రూట్స్  వలన  కలిగే  ఆరోగ్యకరమైన  ప్రయోజనాలు  ఏమిటి?

ఈ సీజన్లో డ్రై ఫ్రూట్స్ వలన అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ అందులో కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి..

 

పుష్కలమైన  ఫైబర్ :

కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి మరియు ఆరోగ్యకరమైన గుండెను కాపాడుకోవడానికి బాదం మరియు ఖర్జూరాలు ఎంతో మంచిది. ఖర్జూరాలతో తయారుచేసే డిజర్ట్ వలన గుండె జబ్బుల కారణంగా ఆహార పరిమితుల్లో ఉన్నవారికి కూడా ఇది కచ్చితంగా సరిపోతుంది.

 

పుష్కలమైన  పోషకాలకు  మూలం :

డ్రై ఫ్రూట్స్ లో విటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ మరియు క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి.

 

యాంటీ  ఆక్సిడెంట్లు :

ఎండిన అత్తి పండ్లలో మరియు ఖర్జూరాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

 

శక్తి :

డ్రై ఫ్రూట్స్లో చక్కెర శాతం అధికంగా ఉంటుంది మరియు తక్షణ శక్తిని ఇవ్వడానికి ఇవి మంచి వనరులు. ముఖ్యంగా అథ్లెట్లకు.

 

కుంకుమపువ్వు  (కేసర్జాఫ్రాన్):

కుంకుమ పువ్వులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కణాలలో ద్రవాలు సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. తద్వారా బాధాకరమైన కండరాల తిమ్మిరి నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది.

 

మీకు ఇష్టమైన దీపావళి స్నాక్స్ మరియు స్వీట్లు ఏమిటి? దిగువ వ్యాఖ్యల విభాగంలో మాతో పంచుకోండి !

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • 1
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.

| Jan 02, 2021

  • Reply
  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన వేడుకలు మరియు పండుగలు బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}