• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

శీతాకాలంలో ప్రసవం అయితే ? శీతాకాలంలో ప్రసవం అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Nov 17, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

గర్భధారణ అనేది ఒక స్త్రీ జీవితంలో అత్యంత విలువైన క్షణం. కాబట్టి, శీతాకాలంలో గర్భం ధరిస్తే తల్లి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మూడవ త్రైమాసికం శీతాకాలంలో ఉంటే ? మీ డెలివరీ పై సీజన్ ప్రభావం చూపుతుందని మీరు ఆశ్చర్యపోతున్నారా ? మూడవ త్రైమాసికం శీతాకాలంలో ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

 

ఈవ్యాసం శీతాకాలంలో మీకు ప్రసవ సమయం అయితే తెలుసుకోవాల్సిన కొన్ని వాస్తవాలను మరియు కొంత సమాచారాన్ని తెలుపుతుంది. డెలివరీ తేదీ నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో ఉంటే ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో చదవండి. డెలివరీ సమయం శీతాకాలంలో అయితే తీసుకోవాల్సిన పరిష్కారాలు మరియు జాగ్రత్తలు.

 

శీతాకాలంలో ప్రసవం జరగడం వలన నవజాతశిశువు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందా ?

 

అవును, శీతాకాలంలో ప్రసవించడం నవజాత శిశువు ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. శీతాకాలంలో చల్లగా ఉండే బయటి వాతావరణం మరియు పెరుగుతున్న మీ అంతర్గత శరీర ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తుందనేది వాస్తవం.

 

అయితే, డెలివరీ సమయంలోనూ మరియు ఆ తర్వాత ఆరోగ్యంగా మరియు సౌకర్యంగా ఉండడానికి మీరు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు ఎక్కడ ఉన్నాయి. మరింత తెలుసుకోండి..

 

1. చర్మ సంరక్షణ : తక్కువ తేమ మరియు అతిశీతలమైన గాలి కారణంగా శీతాకాలంలో గర్భవతియైన స్త్రీకి ముఖ్యంగా,  చివరి వారంలోకి వచ్చేసరికి చర్మం మరింత దురదగా బిగుతుగా మారుతుంది. దీనిని నివారించడానికి ఓట్మీల్ స్నానం చేయడం, ఎక్కువ తేమ ఉండే మాయిశ్చరైజింగ్ లోషన్లు వాడటం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, తేలికపాటి సబ్బులను వాడడం మొదలైనవి సిఫార్సు చేశారు. అదే విధంగా, పుష్కలంగా నీరు త్రాగాలి.

 

2. ఫ్లూ ను నివారించండి : అనేక కారణాల వల్ల శీతాకాలంలో ఫ్లూ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. తల్లి తన గడువు తేదీకి దగ్గర పడుతున్న సమయంలో ఫ్లూ బారిన పడే అవకాశం ఉంది. ఫ్లూ వచ్చినప్పుడు గర్భిణి స్త్రీలు తీవ్రమైన సమస్యలకు గురవుతారు. నవజాత శిశువులకు కూడా ఫ్లూ వచ్చినట్లయితే తీవ్రమైన అనారోగ్యం, మరికొన్నిసార్లు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. నవజాత శిశువులకు ఆరు నెలల వయస్సు వచ్చే వరకు ఫ్లూ షాట్ ఇవ్వకూడదు. అయినప్పటికీ, గర్భధారణ సమయంలో తల్లి కి ఫ్లూ షాట్ ఇచ్చినట్లయితే తల్లి ద్వారా తన బిడ్డకు ప్రతిరోధకాలు పంపుతుంది. అది శిశువు ఫ్లూ షాట్ తీసుకునే వరకు వారిని కాపాడుతుంది. గర్భధారణ సమయంలో ఏ సమయంలోనైనా ఫ్లూ షాట్ ను తీసుకోవడం సురక్షితం. కాబట్టి శీతాకాలంలో ప్రస్తావించే ముందు ఫ్లూ షాట్ తీసుకోవడం సురక్షితం.

 

3. ముందస్తు ప్రసవం : మీ గడువు శీతాకాలంలో ఉంటే, ముందస్తు ప్రసవానికి అవకాశాలు ఎక్కువ. నిర్ణీత తేదీ కంటే ఒక వారం రోజులు ముందుగానే ప్రసవ నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది.

 

4. ప్రసవం తర్వాత డిప్రెషన్ : తల్లికి ఎస్ ఏ డి (సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్) యొక్క చరిత్ర ఉంటే శీతాకాలంలో ప్రసరించడం వలన ప్రసవానంతరం నిరాశకు గురై ఎక్కువ ప్రమాదం కలిగిస్తుంది.

 

5. విటమిన్ డి లోపం : శీతాకాలంలో సూర్యరశ్మి ఉండే సమయం తగ్గుతుంది. ఇది తల్లులకు విటమిన్-డి లోపాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే శీతాకాలంలో చల్లని వాతావరణం కారణంగా వారు ఎక్కువగా ఇంట్లోనే తమ సమయాన్ని గడుపుతారు. ఇది తల్లి మరియు పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

 

6. ప్రసవం తరువాత వచ్చే డిప్రెషన్ను తగ్గిస్తుంది : చమత్కారమైన కొత్త అధ్యయనం ప్రకారం శీతాకాలంలో ప్రసవించే స్త్రీలు ప్రసవానంతరం నిరాశకు గురి అయ్యే అవకాశం తక్కువ. ప్రసవం తరువాత నిరాశకు ప్రధాన కారణం డెలివరీ తర్వాత తల్లినీ మరియు బిడ్డను బయటకు రానివ్వకుండా ఇంటి లోపల ఉంచుతారు. కానీ ప్రసవం శీతాకాలంలో జరిగినప్పుడు ఇది బలవంతంగా చేయకుండా సహజంగానే ఉంటుంది. అంతేకాకుండా శీతాకాలంలో స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మరింత అందుబాటులో ఉంటారు. వారితో కలిసి ఉండడం కొత్తగా తల్లి అయిన వారికి ఎక్కువగా మానసిక ఆనందాన్ని కనిపిస్తాయి. ఇది ప్రసవం తరువాత వచ్చే డిప్రెషన్ నుండి తల్లిని కాపాడుతుంది.

 

7. సౌకర్యంగా ఉంచుతుంది : గర్భం ముగిసే సమయానికి మహిళలు వివిధ రకమైన సమస్యలను ఎదుర్కొంటారు. అది వారికి ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. వారి అంతర్గత ధర్మో స్టార్ట్ గణనీయంగా పెరగడం వలన వారి లోపల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఇది వారికి ఎంతో అసౌకర్యంగా వుంటుంది మరియు వారి నిద్రపై కూడా ప్రభావితం చేస్తుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు వారికి ఎయిర్ కండిషనర్ కూడా సహాయపడదు. శీతాకాలంలో గడువు తేదీ ఉంటే చల్లని వాతావరణం మంచిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. మరియు అంతర్గత ధర్మో స్టార్ట్ పెరుగుదల వాస్తవానికి చల్లని వాతావరణంలో వెచ్చగా ఉండటానికి సహాయపడుతుంది. అధిక వేడి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు.

 

8. శీతాకాలంలో సూర్యరశ్మి స్థాయి తక్కువగా ఉండటం వలన తల్లి విటమిన్ డి లోపానికి గురవుతుంది. తల్లికి విటమిన్ డి లోపం ఎదురైతే చిన్నతనంలోనే ఆటో పిక్ డెర్మటైటిస్ అనే ప్రమాదం పిల్లలకి సంభవిస్తుంది.

 

9. నవజాత శిశువు యొక్క ఊపిరితిత్తుల ఆరోగ్యంపై శీతాకాలం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. శీతాకాలంలో జన్మించిన పిల్లలు జీవితంలోని తరువాత దశలలో శ్వాసకోశ సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది.

 

10. శీతాకాలంలో జన్మించిన పిల్లలు మొదటి నెలలో వచ్చే శ్వాసకోస ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. వారు భవిష్యత్తులో ఊపిరితిత్తుల సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

 

11. తల్లిలో విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉన్నట్లయితే పిల్లలకు బాల్య శ్వాస మరియు బాల ఉబ్బసం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

 

12. శీతాకాలంలో జన్మించిన పిల్లలు వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా అలర్జీలకు గురవుతారు. ఎందుకంటే వారి తల్లి తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు గురైనందువలన పిల్లలకు ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి.

 

13. శీతాకాలంలో తల్లిదండ్రులు చల్లని వాతావరణం శిశువుకు హాని కలిగిస్తుందని భావించి వారిని పూర్తిగా కప్పి ఉంచాలనే ప్రయత్నం చేస్తారు. వాస్తవానికి, ఎక్కువ పొరల దుస్తులు, ఒత్తయిన దుప్పట్లు నవజాత శిశువు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. బట్టలతో అధికంగా కప్పడం వలన శిశువులు ఎక్కువ వేడికి గురై ఎస్ ఐ బి ఎస్ (ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్) కు దారి తీస్తుంది.


శీతాకాలంలో మీ ప్రసవ సమయం ఉన్నట్లయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ఉన్న ఈ బ్లాగ్ మీకు నచ్చిందా ? మీరు శీతాకాలంలో మీ బిడ్డకు జన్మనిచ్చారా ? మీరు ఏమైనా సమస్యలను ఎదుర్కొన్నారా? మీ అభిప్రాయాలను మరియు సూచనలను ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో మాతో పంచుకోండి !

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}