• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

గర్భవతిగా ఉన్నప్పుడు కాఫీ తాగడం మీకు సురక్షితమేనా ?

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jul 01, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

మీరు ఒక సారి గర్భం దాల్చిన తర్వాత, ఎన్నో విషయాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది .అందులో ఒకటి ,గర్భవతిగా ఉన్నప్పుడు కాఫీ తాగడం మీకు అలవాటు. దాన్ని పూర్తిగా మానేయమని నేను చెప్పడం లేదు . కానీ ,మీకు ఇష్టమైన కప్పు తో మునిగిపోయే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ఉంది.

 

గర్భధారణ సమయంలో మీరు ఎంత కెఫిన్ తీసుకోవచ్చు ?

 

గర్భధారణ సమయంలో మీరు మీ కెఫిన్ వినియోగాన్ని రోజుకి 200 మిల్లిగ్రాముల కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి .అంతకంటే ఎక్కువగా తీసుకున్నట్లయితే పుట్టబోయే బిడ్డకు గణనీయమైన ప్రమాదాలను కలిగిస్తుంది.

 

గర్భవతిగా ఉన్నప్పుడు కాఫీ అధికంగా తీసుకోవడం వలన కలిగే ప్రమాదాలు ఏమిటి ?

 

కాఫీలో లభించే కెఫిన్ అనే రసాయనం మావి ని దాటి శిశువును చేరుతుంది .మామూలు స్త్రీలకంటే కూడా గర్భిణీ స్త్రీలలో కెఫిన్ జీవక్రియ నెమ్మదిగా జరుగుతుంది .అందుకే రక్తంలో దీని స్థాయి ఎక్కువగా ఉండి ,ఎక్కువ సమయం కూడా ఉంటుంది . అందువలన మావి దాటి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి . సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువ పరిమాణంలో కాఫీని తీసుకున్నట్లయితే ఈ క్రింది పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు.

 

పిండం యొక్క హృదయ స్పందన రేటు పెరుగుతుంది:

 

ఇది శిశువు యొక్క గుండెను అనారోగ్యానికి గురి చేయవచ్చు . తల్లి విపరీతంగా కాఫీ తాగడం వలన పిండం యొక్క గుండె గదులు వేరుచేసే కణజాలాలు పలచగా మారిపోతాయి.

 

* తక్కువ బరువు గల శిశువులు జన్మించడం.

 

* ముందుగానే ప్రసవం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి

 

* చనిపోయిన బిడ్డలు పుట్టడం.

 

*గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 

గర్భధారణ సమయంలో కాఫీ తాగడం పూర్తిగా నివారించాలా ?

 

గర్భం దాల్చడానికి మరియు పిండం అభివృద్ధి చెందడానికి ప్రమాదకరంగా ఉన్న ప్రతి దానిని నివారించడం అన్నది ఎల్లప్పుడూ మంచిది. అయినప్పటికీ, మీరు కాఫీ కి అలవాటు పడినట్లయితే కాఫీని పూర్తిగా నివారించడం వలన కలిగే తలనొప్పి ,అలసట వంటి లక్షణాలను , ఇప్పటికే ఉన్న గర్భధారణ అసౌకర్యాలకు జోడించడం మంచిది కాదు. రోజుకు ఒక కప్పు కాఫీ తీసుకోవడం సురక్షితం. గరిష్టంగా రెండు కప్పులు మాత్రమే తీసుకోవాలి . ఖచ్చితంగా దీనికంటే ఎక్కువ మాత్రం తీసుకోకూడదు.

 

అలాగే ఒక కప్పు కాఫీలోని కెఫిన్ పరిమాణం మారుతూ ఉంటుంది. ఎలా అంటే ..మనం ఉపయోగించే బ్రాండ్ మరియు కాఫీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది , అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది . మరియు అది ఎలా తయారు చేస్తారు , అనే అంశం మీద కూడా ఆధారపడి ఉంటుంది . ఒక కప్పు ఫిల్టర్ కాఫీ లేదా రెండు కప్పుల ఇన్స్టంట్ కాఫీ లో 200 మిల్లీగ్రాములు కెఫిన్ ఉంటుంది .(ఒక కప్పు=6 నుండి 8 ఔన్సులు)అదే విధంగా మీకు ,ఒక కప్పు స్టార్బక్స్ కాఫీ లో అయితే దాదాపు దానికి రెట్టింపు దాటుతుంది.

 

కేవలం కాఫీలో మాత్రమే కెఫిన్ ఉంటుంది అనుకోకండి. టి ,చాక్లెట్స్ ,పాల ఉత్పత్తులు మరియు ప్రోజన్ ఐటమ్స్  లో కూడా గణనీయమైన మొత్తంలో కెఫిన్ కలిగి ఉంటుంది . అందుకే మీరు రెండు కప్పుల కాఫీ తీసుకున్నట్లయితే ఇతర కెఫిన్ ఆహారాలు మరియు పానీయాలు తీసుకోకూడదు.

 

గర్భం యొక్క మొదటి త్రైమాసికంలో కాఫీ యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయి :

 

గర్భం యొక్క మొదటి త్రైమాసికంలో సిఫార్సు చేయబడిన దానికంటే ఎక్కువ కాఫీని తీసుకోవడం వలన మామూలు కంటే రెండు రెట్లు అధికంగా గర్భస్రావం అయ్యేందుకు అవకాశం ఉంటుంది . పిండం యొక్క అభివృద్ధి చెందుతున్న కణాలను ఇది ప్రభావితం చేస్తుంది . కెఫిన్ , మావి యొక్క ప్రవాహాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మరియు రక్తపోటును పెంచుతుంది . ఇది గర్భం యొక్క మొదటి వారాలలో గర్భస్రావం జరిగేందుకు దారితీస్తుంది.

 

గర్భధారణ యొక్క మూడవ త్రైమాసికంలో కాఫీ యొక్క ప్రభావాలు విధంగా ఉంటాయి ?

 

శిశువు యొక్క పెరుగుదల పై ప్రభావం చూపిస్తుంది :

 

మూడవ త్రైమాసికంలో అధికంగా కెఫిన్ తీసుకోవడం వలన శిశువు యొక్క మానసిక పెరుగుదలకు అవరోధం ఏర్పడవచ్చు. మూడవ త్రైమాసికంలో శిశువు త్వరగా పెరుగుతుంది . మరియు బరువు కూడా పెరుగుతుంది . ఈ సమయంలో శిశువు యొక్క జీవక్రియ పరిపక్వం చెందుతున్న సమయంలో మావి లోనికి వెళ్లి జీవక్రియను తగ్గిస్తుంది . అందుకే మూడవ త్రైమాసికంలో ఎక్కువ కాఫీ తాగడం వలన శిశువులో మానసిక పెరుగుదల తగ్గడంతోపాటు బరువు తక్కువగా గల పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది.

 

పుట్టబోయే బిడ్డ యొక్క నిద్ర  సరళిని ప్రభావితం చేస్తుంది :

 

కెఫిన్ అధికంగా తీసుకోవడం వలన గర్భం యొక్క తర్వాత దశలో బిడ్డ కదలికలలో మార్పు వస్తుంది . అదే విధంగా శిశువు పుట్టిన తర్వాత కూడా నిద్ర సరళిని ప్రభావితం చేస్తుంది.

 

ప్రసవం  యొక్క సమయాన్ని ప్రభావితం చేస్తుంది :

 

మూడవ త్రైమాసిక సమయంలో కాఫీ అధికంగా తీసుకున్నట్లయితే , అది మీ గర్భధారణను పెంచుతుంది .మూడవ త్రైమాసికంలో అధికంగా తీసుకున్న ప్రతి 100 మిల్లీ గ్రాముల  కెఫిన్ ,5 నుండి 8 గంటల పాటు ప్రసవ సమయాన్ని పెంచుతుంది అని కనుగొనబడింది . గర్భం గడువు తేదీని దాటుతుంది కాబట్టి ,ఇది ఎన్నో అనర్థాలకు దారి తీయవచ్చు.

 

గర్భవతిగా ఉన్నప్పుడు బ్లాక్ కాఫీ సురక్షితమేనా ?

 

తక్కువ గా వేపి తయారుచేసిన బ్లాక్ కాఫీ లో తక్కువ కెఫిన్ ఉంటుంది .అందువలన గర్భధారణ సమయంలో ఎటువంటి హాని జరగదు .అందులో ఎంత మోతాదులో కాఫీ పొడి ఉపయోగిస్తున్నాము అన్నది ముఖ్యమైన విషయము .పలచగా ఉండే కాఫీలో కెఫిన్ తక్కువగా ఉంటుంది.

 

గర్భధారణ సమయంలో   ఢికాఫ్ కాఫీ సురక్షితమైనదా ?

 

ఢికాఫ్ కాఫీ అంటే కెఫిన్ లేనిది అని కాదు. కాఫీ బీన్స్ నుండి కాఫీ పొడిని తయారు చేసే సమయంలో వివిధ పద్ధతుల సహాయంతో 97% కెఫిన్  తొలగించబడుతుంది. అంటే 3 శాతం కెఫిన్ మిగిలి ఉంటుంది. అయితే ఇది మామూలు కాఫీ కంటే ఎంతో మంచిది .కొన్ని కంపెనీలు ఈ ప్రక్రియ కొరకు ఉపయోగించే రసాయనాలు హానికరమైనవి. అందుకే ఖరీదు చేసే ముందు లేబుల్ ను పరీక్షించండి . అందులో సహజ పద్ధతిలో చేయబడిందా  లేదా ,'స్విస్ వాటర్ ప్రాసెసెడ్' అని లేబుల్ చేయబడి ఉంటే అందులో రసాయనాలు ఉపయోగించకపోవడం వలన, ఆ కాఫీ త్రాగడం సురక్షితం.

 

గర్భవతిగా ఉన్నప్పుడు కాఫీకి ప్రత్యామ్నాయాలు :

 

మీ శిశువు ఆరోగ్యం కోసం గర్భధారణ సమయంలో మీరు కాఫీ తాగడం మానేసి నట్లయితే ,మీకు ఏదో కోల్పోయిన భావనకు కలగవచ్చు. అందుకే గర్భధారణ సమయంలో కాఫీ కి బదులుగా తీసుకునే కొన్ని ప్రత్యామ్నాయాలు ఇక్కడ ఉన్నాయి..

 

నట్స్ :

 

మీ రోజువారి ఆహారంలో కొన్ని బాదం, వాల్ నట్స్ లేదా జీడిపప్పులను తీసుకోవడం ద్వారా కాఫీని మానేసినందు వల్ల కలిగే శక్తిని తిరిగి పొందవచ్చు.

 

సిరియల్ బార్స్ :

 

భోజనానికి భోజనానికి మధ్య ఓట్స్ లాంటి సీరియల్స్ తో చేసిన బిస్కెట్స్ ను తీసుకున్నట్లయితే , అవి శక్తిని పొందేందుకు సహాయ పడతాయి.

 

చక్కెర లేని పండ్ల రసాలను మరియు పండ్లను తీసుకున్నట్లయితే గర్భధారణ సమయంలో మిమ్మల్ని అవి ఎప్పుడూ తాజాగా ఉంచుతాయి.

 

ఇతర పానీయాలు :

 

మీకు వర్షం కురుస్తున్న సమయంలోనూ లేదా వాతావరణం చల్లగా ఉండే సమయంలోనూ వేడిగా కాఫీ తాగాలి ,అని అనిపించవచ్చు. దానికి ఇక్కడ కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.

 

* పెప్పర్ మెంట్ టి

 

* లెమన్ టీ

 

* మూలికల టీ

 

* అల్లం టీ

 

గర్భవతిగా ఉన్నప్పుడు కాఫీ త్రాగడం వల్ల శిశువు బరువు తగ్గుతుందా ?

 

కెఫిన్ తో శిశువు యొక్క బరువు ముడిపడి ఉంటుంది .అందువల్ల ముఖ్యంగా మూడవ త్రైమాసికంలో కాఫీ అధికంగా తీసుకోవడం వలన శిశువు బరువు పెరిగే సమయంలో, ప్రతిరోజు 100 మిల్లీగ్రాముల కెఫిన్ తీసుకోవడం వల్ల శిశువు 3/ 4 నుండి ఒక ఔన్స్ వరకు బరువు కోల్పోవచ్చు.

 

గర్భధారణ సమయంలో కాఫీ తాగడం సురక్షితమా ? దయచేసి ఈ కింది వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి. 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}