• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్ ఆరోగ్యం మరియు వెల్నెస్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్

ఏడాది పిల్లల వయస్సువారి ఎదుగుదల, ఆహార మరియు ఇంటి చిట్కాలు

Akshita Iyer
1 నుంచి 3 సంవత్సరాలు

Akshita Iyer సృష్టికర్త
నవీకరించబడిన Dec 14, 2018

పిల్లల లో ఎదుగుదల లేకపోడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చును వాటిని తల్లి దండ్రుల అధికమించి పిల్లల బరువు, ఎత్తు సరిపపడేలా ఉండేలా చూసుకోవాలి. సరైన ఒడ్డు ఎత్తు ఆరోగ్యానికి చిహ్నం. వారు పెద్దవారవుతున్న కొద్దీ చాల సందర్భాల్లో ప్రస్తావనకు వస్తుంది. మరి తయారుగా ఉండేదుకు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఏ అంశాలు ఏ ఆహార పదార్థంలో ఉంటాయి. అవి బిడ్డల ఎదుగుదలకు ఎలా ఉపయోగపడతాయి అని ధ్యాస వహించాల్సి ఉంది.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి 20-30 శాతం పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారు.పిల్లలు బరువు తక్కువగా పుట్టిన అప్పుడు వారిని పెంచడం చాలా కష్టంతో కూడుకున్న పని. వారి పెంపక వ్యయం కూడా ఎక్కువవుతుంది. ఇది ఆర్థిక స్థోమతలేనివారికి కష్టమవుతుంది. అలా పుట్టినవారిని ఎంతో జాగ్రత్తగా పెంచితేనే వ్యాధులనుండి కాపాడవచ్చు. అయినా, వారి పెరుగుదల ఒక్కొక్కసారి సరిగ్గా ఉండకపోవచ్చు. అలా జరిగే నష్టం భౌతికంగాను, మానసికంగాను రెండువిధాలా వుంటుంది. శిశువు తక్కువ బరువుతో పుట్టినప్పుడు వారిని తక్కువ బరువున్న పిల్లలుగా నిర్థారిస్తారు.ఆరోగ్యకరమైన శిశువు పుట్టినప్పుడు 2.5 నుంచి 4 కేజీల బరువు ఉంటుంది. ఐదవ నెల నిండేసరికి పిల్లలు పుట్టిన నాటికి ఉన్న బరువుకు రెండింతలు అవుతారు. ఏడాది నిండేసరికి మూడింతలవుతారు. మొదటి నెల నుంచి మూడవ నెల వరకు సరాసరిన నెలకు 800 గ్రాముల నుంచి కేజీ వరకు బరువు పెరుగుతారు. ఇక ఎత్తు విషయానికి వస్తే పుట్టినప్పుడు పిల్లలు సాధారణంగా 50 సెంటీమీటర్ల పొడవుంటారు. ఆరు నెలలు నిండేసరికి 66 సెంటీమీటర్లు, ఏడాది నిండేటప్పటికి 75 సెంటీమీటర్ల వరకు పెరుగుతారు.

పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో బరువుతో పుడతారు. కొందరు బరువు తక్కువగా పుడితే, మరికొందరు కాస్త ఎక్కువ బరువుతో పుడతారు. ఏది ఏమైన కూడా పుట్టిన నాలుగు నెలల తర్వాత శిశువు పెరుగుదలలో చెప్పుకోదగ్గ మార్పులు కనిపిస్తాయి. తల్లి పాలు మాత్రమే తాగే శిశువులో ఎదుగుదల బాగా కనిపిస్తుంది. కానీ నాలుగు నెలలు తర్వాత కూడా పెరుగుదల కనిపించకపోతే తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతారు. అలా భయపడాల్సిన పని లేదు. శిశువు పెరుగుదల ఏ ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుందో తెలుసుకుంటే సరిపోతుంది.

పిల్లల బరువు లో తేడాలుండడానికి గల సాధారణ సూచికలు:

మొదటిది శిశువు తన తల్లి గర్భం లో ఉన్నప్పుడు నవమాసాలు పూర్తి చేసిందా లేదా అనేది ముఖ్యవిషయం ఎందుకంటే పూర్తిగా నెలలు నిండి పుట్టిన శిశువులు రెండున్నర కిలోల నుంచి మూడు లేదా మూడున్నర కిలోల బరువు ఉండటం సహజం. పుట్టిన బిడ్డలు కిలో, కిలోన్నర బరువు తో కూడా పుడుతారు. శిశువు ఎదిగే కొద్ది ఎత్తు, బరువులో కొంత మార్పు కనిపిస్తుంది. పుట్టిన నెలలో శిశువు కొంత బరువు తగ్గుతారు. దీన్ని కూడా సహజంగానే పరిగణించాలి అని చెబుతున్నారు నిపుణులు. అయితే రెండు, మూడు, నాలుగు నెలలు వచ్చే వరకు శిశువు బరువు బాగా పెరుగుతుంది.

శిశువులో శారీరక, మానసిక పెరుగుదల ఏ విధంగా ఉందో గమనించుకోవాలి. వయసుకు తగ్గ పనులు చేస్తున్నారా లేదా మౌనంగా ఉంటున్నారో ఓ సారి పరిశీలించుకోవాలి.ఇది వారు వారి వయసుకు తగ్గ అభివృద్ధి చెందుతున్నారో లేదో తెలుసుకోవడానికి ఇదొక సూచికం.

శిశువులో శారీరక ఎదుగుదల కీలకం. అలా పెరుగితేనే ఆరోగ్యంగా ఉన్నట్టు. కాబట్టి ప్రతినెల శిశువు బరువును చెకప్‌ చేస్తుండాలి. దాంతో పాటు వయసుకు తగ్గ మానసిక ఎదుగుదల చాలా ముఖ్యం.

ఒక్కోసారి ఆరోగ్యoగా పుట్టినా కూడా వివిధ రకాల కారణాల వల్ల చక్కగా ఎదగలేకపోవచ్చు. ఉదాహరణకు పాలు సరిపడా లేకపోవడం, విటమిన్‌ లోపాలు, ఇన్ఫెక్షన్లు ఇలా శిశువు ఎదుగుదలకు ఎన్నో అంశాలు చెక్‌ పెట్టవచ్చు.

శరీర ఎత్తు, బరువు అనేది జన్యుపరమైన అంశాల మీద కొంత వరకు ఆధారపడి ఉంటుంది. కానీ పిల్లల ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఎత్తు, బరువులో తేడాలు కనిపిస్తాయి.

బరువు తక్కువగా ఉన్న పిల్లలు భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలకు గురవకుండా ఉండాలంటే వారి శరీర బరువు పెరగాల్సిందే. పిల్లల తల్లిదండ్రులు వారి బరువు పెరగటానికి తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. అది కూడా వారి శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలు పెరగకుండా, ఆరోగ్యకర మార్గాల ద్వారా బరువు పెరిగేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

పిల్లలు బరువు, పొడవు, ఎదుగుదలకు ఆహార చిట్కాలు:

విటమిన్ డి అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో క్యాల్షియం అంది, ఎముకల పెరుగుదలకు సహాయపడి, వ్యాధినిరోధకత తగ్గి , పెరుగుదల మెరుగుపడుతుంది. ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారాలు పొడవు పెరుగుటలో సహాయపడే టిష్యులను మరమత్తు చేసి కొత్త టి ష్యూల ఏర్పాటుకు సహాయపడుతాయి. కాబట్టి, ఎత్తు పెరగడంలో విటమిన్ డి, ప్రోటీన్లను, అవసరం అయ్యే మినిరల్స్ , ఎత్తు పెరగడానికి సహాయపడే క్యాల్షియంను శరీరంలో పెంచడంలో అద్భుతంగా సహాయపడుతాయి. కాబట్టి, బలంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి రోజు ఆహారం లో క్యాల్షియం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

పాలు, పెరుగు, వెన్న వంటి పాల ఉత్పత్తులు అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉంటాయి ముఖ్యంగా, కాల్షియం మరియు ఐరన్ లను పుష్కలంగా కలిగి ఉంటాయి. ఈ రకం పాల ఉత్పత్తులు అన్ని ఫుల్-క్రీమ్ పాలతో చేస్తారు. వీటిని పిల్లలకు తినిపించటం వలన వారి శరీరంలో ఆరోగ్యకర కొవ్వు పదార్థాలు నిండేలా చేస్తాయి. వీటికి బదులుగా, పాల ఉత్పత్తులను స్మూతీస్ లలో కూడా కలుపుకొని తినవచ్చు.

పిల్లలు ఎక్కువగా తీపి ఉన్నా, క్యాలోరీలు పూర్తిగా లేని వాటిని తీసుకోవటం వలన వారు బరువు పెరగలేరు. వీటికి బదులుగా మంచి పోషకాలు మరియు అధిక క్యాలోరీలు గల ఆహార పదార్థాలను వారికి అందించటం వలన శరీర బరువు పెరుగుతుంది. కావున తల్లి-దండ్రులు ప్రతి రోజు భోజనంలో పోషకాలు ఎక్కువగా గల ఆహార పదార్థాలను సమకూర్చాలి. తలిదండ్రుల వారి పిల్లల కోసం పోషకాలు అధికంగా గల ఆహార పదార్థాలతో ఆహార ప్రణాళికను తయారు చేసి వాటిని అనుసరించేలా ప్రేరేపించాలి.

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
పైన పేరెంటింగ్ బ్లాగ్లు
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}