• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్ క్రీడలు మరియు ఆటలు

మీ పిల్లలను ఈ వేసవిలో ఇంట్లోనే బిజీగా ఉంచేందుకు 8 మార్గాలు

Aparna Reddy
3 నుంచి 7 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Apr 28, 2020

 8
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

వేసవి కాలం, వర్షాకాలం, వడగాలులు ఇవి అన్ని ఒక పక్కన పెడితే ,దానికి తోడు ఈ సెలవులు .పిల్లలు త్వరగా నిద్ర లేవాలి, స్కూల్ కి వెళ్లాలి,హోం వర్క్ చేయాలి అని ఆలోచించే పని లేకుండా రకరకాల కార్యక్రమాల కోసం ఎదురు చూసే సమయం ఇది. పిల్లలకు చాలా త్వరగా విసుగు వస్తుంది .కానీ ఈ భయంకరమైన వాతావరణంలో ఇంట్లో నుండి బయటకు కదిలే అవకాశమే లేకుండా పోయింది.

మీ పిల్లలను సెలవు దినాలలో బిజీగా ఉంచేందుకు కొన్ని చిట్కాలు :

తోటి తల్లిదండ్రులు పరీక్షించి మరియు ప్రయత్నించిన కొన్ని చిట్కాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది .ఇవి ఇంట్లోనే ఉంటూ విసుగు చెందుతున్న మీ పిల్లలను సంతోషంగా మరియు బిజీగా ఉంచేందుకు సహాయపడుతాయి.

1. ఇంటి పనులలో సహకరించనివ్వండి :

పిల్లల నుండి భోజనానికి ముందు టేబుల్ సర్దడం లో సహాయం తీసుకోండి. ఒక క్లాత్ ఇచ్చి ఒక్కొక్క ప్రదేశం లో దుమ్మును శుభ్రపరచమని చెప్పండి .(ప్రమాదాలు జరగకుండా గమనిస్తూ ఉండండి )ఆరిన బట్టలను తీసి మడిచి పెట్టమని చెప్పండి .చెట్లకు నీళ్లు పట్టడం లాంటి పనులు చెప్పండి .మీ పిల్లలను ఇంటి పనులలో బిజీగా ఉంచాలి అనుకుంటే ఎన్నో పనులు ఉంటాయి . ఇది పిల్లలకు ఒక రకమైన బాధ్యతను ,స్వతంత్ర భావాలను నేర్పుతుంది . ఎప్పటికప్పుడు వారి పనులు చేసుకోవడానికి భవిష్యత్తులో కూడా ఇది వారికి ఎంతో ఉపయోగపడుతుంది.

2. వారితో కలిసి మీరు కూడా ఆటలు ఆడండి :

వారితో కలిసి  బోర్డ్ గేమ్స్ ను ఆడండి.(లూడో, స్కరబెల్, పాములు  మరియు నిచ్చెనలు, చెస్ మొదలగునవి ) దాగుడు మూతలు లేదా మ్యూజికల్ చైర్స్ ఆడండి. ట్రెజర్ హంట్ లాంటివి గేములను నిర్వహించి మీ పిల్లలను ఆ ట్రెజర్ లను కనుగొనమని తెలపండి. వాటర్ గన్స్ తో ఆడుకోండి లేదా బబుల్ గేమ్ ను చెదర కొట్టండి.(డిష్ వాషింగ్ లిక్విడ్ ను నీళ్లతో కలిపి బుడగలు తయారు చేయండి) పిల్లలకు ఇష్టమైన పాటలకు డాన్స్ చేయమనండి .పిల్లలతో సమయాన్ని గడుపుతూ కుటుంబసమేతంగా సంతోషించండి. ఆ అందమైన జ్ఞాపకాలను ఫోటోలు తీసుకొని భద్రపరచుకోండి.

3. పిల్లల్లోని సృజనాత్మకతను బయటకు తీయండి :

మీ పిల్లలకు బొమ్మలు వేసేందుకు తెల్లకాగితాలు ఇవ్వండి. మీ చిన్నారులు  పెయింటింగ్ చేసి, కలర్స్ వేసినప్పుడు వారిని అభినందించండి. మీ పిల్లలను చేతులతో పెయింటింగ్ వేసే లాగా ప్రోత్సహించండి .ఇల్లంతా మురికిగా అవ్వకుండా పిల్లలను వార్తా పత్రికల మీద కూర్చోబెట్టి సులువుగా శుభ్రపరుచుకునేందుకు వీలైన వాటర్ పెయింట్స్ ను ఇవ్వండి.

4.DIY(డు ఇట్ యువర్ సెల్ఫ్స్వయంగా చేసే పనులు:

దీనికి ముందు ఇతర పిల్లలు చేసిన ప్రాజెక్టులను చేయవచ్చు, కొన్నింటిని కలిపి చేయవచ్చు,కరెంట్ అఫైర్స్ లేదా సైన్సుకు సంబంధించిన అంశాల గురించి చార్టులు తయారు చేయవచ్చు. కొత్త విషయాలు నేర్చుకునేందుకు వారికి ఇది ఒక మంచి అవకాశం.చిన్న పిల్లలు మరియు కొంచెం పెద్ద పిల్లలతో కలిసి గ్రీటింగ్ కార్డులు తయారు చేయవచ్చు.పాత అట్టపెట్టెల తో కోటలను తయారు చేయవచ్చు .(ఈ కోట మిగిలిన సెలవులకు ఒక రహస్య ప్రదేశంలో ఉపయోగపడుతుంది) చాట్ పేపర్స్ మరియు రంగులతో యువరాణి కిరీటాలను, సూపర్ హీరో మాస్క్ లను తయారు చేయండి. (వారిని సూపర్ మాన్ బ్యాట్ మాన్ మరియు సిండ్రిల్లా లాగా ఉండనివ్వండి)ఈ డి ఐ వై ప్రాజెక్టులు పిల్లల్లో సృజనాత్మకత మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.

5. కలిసి ఆడే ఆటలు :

సైమన్ స్పేస్ లాంటి ఆటలను ఆడించండి. ఈ ఆట కోసం మీరు చేయవలసిందల్లా కేవలం మాట్లాడటం .మీరు మీ పనులు చేసుకుంటూనే అదే సమయంలో పిల్లలను బిజీగా ఉంచడం చాలా బాగుంటుంది .ఆ గేమ్ ఏమిటంటే సైమన్ స్పేస్ అని అంటూ మీరు  ఒక ఆదేశాన్ని  ఇస్తేనే వాళ్ళు ఆ పని చేయాలి .మీ మాటకు ముందు సైమన్ సేస్ అని చెప్ప కుండా ఉనట్లయితే పిల్లలు ఆ పనిని చేయకూడదు. ఈ గేమ్ పై మీ పిల్లలు ఎంతో శ్రద్ధ చూపిస్తారు.

6. చదవడం అలవాటు గా చేయండి :

కొన్ని కొత్త కథల పుస్తకాలను ఖరీదు చేయండి . వారితో కలిసి మీరు కూడా వాటిని చదవండి .నర్సరీ రైమ్స్ నుండి భారతీయ పురాణాల వరకు మీ పిల్లలు వివిధ విషయాల గురించి తెలుసుకునేందుకు చదవడం అన్నది మంచిగా ఉపయోగపడుతుంది.

7. బొమ్మలను మారుస్తూ ఉండండి :

మీ పిల్లలు కొన్ని బొమ్మల తో ఆడుకుంటున్న సమయంలో మిగతా బొమ్మలను తీసి లోపల ఉంచండి. వాళ్ళు ఎప్పుడైతే ఆడుకుంటున్న బొమ్మలతో విసుగు చెందుతారో అప్పుడు మిగతా వాటిని బయటకు తీసి ఇవ్వండి .ఆ విధంగా పిల్లలు తమంతట తాము బిజీగా ఉంటారు. కొత్త బొమ్మల కోసం పేచి పెట్టరు.

8. ఒక ప్లే డే  ని నిర్వహించండి :

మీ పిల్లల యొక్క స్నేహితులను స్నాక్స్ మరియు ఆటల కోసం ఆహ్వానించారా ?ఆటల ప్లానింగ్ మరియు వాటిని నిర్వహించడం  మీ పిల్లలతో చేయించండి. ఆడుకోవడం అయిపోయాక పిల్లలందరికీ తప్పనిసరిగా శుభ్రపరిచే పని అప్పగించండి. ఒక్కొక్క స్నేహితుని ఇంట్లో  వారానికి ఒక్కసారి అదేవిధంగా కలుసుకోవచ్చు . పిల్లలు ఆ రోజు కోసం ఎదురు చూస్తూ గడుపుతారు.

ఈ వేసవి సెలవులలో పిల్లలు విసుగు చెంది మంచాలకు అతుక్కొని పోవడం అనేది చాలా సాధారణం .కానీ ముందుగానే ప్రణాళిక వేయడం ,ఆ ప్లాన్ మీ పిల్లలకు తెలియజేయడం ద్వారా వారు దానిలో చురుగ్గా పాల్గొనడానికి అవకాశం ఉంది. ఇలా చేసినట్లయితే మీ పిల్లలు ఈ వేసవి సెలవులలో బయటకు వెళ్లకుండానే హుషారైన మరియు విద్య తో కూడిన వేసవి సెలవులను కలిగి ఉంటారు.

ఈ కంటెంట్‌ను పేరెంట్యూన్ నిపుణుల ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు.  మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ & లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ కి సంబందించిన నిపుణులు ఉన్నారు.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}