జరిగింది చాలు. మీ పిల్లలకు స్క్రీన్ సమయాన్ని తగ్గించే చిట్కాలు.

Aparna Reddy సృష్టికర్త నవీకరించబడిన Jun 15, 2020

ప్రస్తుత తరం సాంకేతిక పరిజ్ఞానం కలిగిన తరం అని మనకందరికీ తెలుసు .కానీ మీ పిల్లలు ఎక్కువ సమయం ఆ పరికరాలకు బానిసలు అవుతున్నారు అని మీకు తెలుసా ! మరియు ఈ వ్యసనం మంచిది కాదు.
జీవితం పట్ల మన వైఖరి , మన పిల్లలను టీవీ లకు మరియు ఫోన్ లకు వ్యసనపరులు గా చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాను.
మీ పిల్లవాడు ఇంట్లో ఉన్నప్పుడు.. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ తండ్రి ల్యాప్‌టాప్ లేదా ఆఫీస్ కాల్ లో బిజీగా ఉంటారు. తల్లులు ఇంటి పనులతో అంతకంటే బిజీగా ఉంటారు .అటువంటి వాతావరణంలో పిల్లలు టీవీ లేదా మొబైల్ ఫోన్ ల పై ఆధారపడవలసి వస్తుంది .మీ పిల్లలు శారీరకంగా మీకు దగ్గరగా ఉన్నారు . కానీ ,మానసికంగా మాత్రం కాదు.
మీ ఉద్యోగ జీవితంలోనూ మరియు వ్యక్తిగత జీవితాల్లోనూ చిన్న మార్పులు చేసుకోగలిగితే పిల్లలు టీవీ మరియు ఫోన్ లలో గడిపే సమయాన్ని సులభంగా తగ్గించవచ్చు.
గాడ్జెట్స్ కు బానిసలైన పిల్లలు ఈ లక్షణాలకు గురవుతున్నారు :
1. సంఘ విద్రోహులు మరియు దేనికి పనికి రాని వారు.
2. మానసిక స్థిరత్వము లేనివారు.
3. మొండి వారు.
4. నిద్ర రుగ్మతలు.
5. అవగాహన లోపము.
6. ఆత్మగౌరవాన్ని కోల్పోవడం.
అవసరమైనప్పుడు మాత్రమే గాడ్జెట్స్ ను ఉపయోగించే విధంగా మీ పిల్లలకు సహాయపడే కొన్ని చిట్కాలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
1. గాడ్జెట్ నిబంధనలు:
ఈ గ్యాడ్జెట్స్ ని పిల్లలు ఏ సమయంలో , ఏ అవసరానికి వాడాలో మీరే వారికి ఒక నియమాన్ని స్థిర పరచాలి. ఉదాహరణకు ఏదైనా స్కూల్ వర్క్ ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించుకునేలాగా సూచించండి . కేవలం చదువు కి అవసరం అయినప్పుడు మాత్రమే వీటిని ఉపయోగించే విధంగా పిల్లలను సిద్ధ పరచండి.
2. గాడ్జెట్స్ కు దూరంగా ఉండడం:
మీ పిల్లలకు మీరు మాదిరిగా ఉండండి. తల్లిదండ్రులు సెల్ ఫోన్లు, ల్యాబ్ టాప్ లు, ఐ పాడ్ లు మొదలైన పరికరాలను మీ పిల్లలు ముందు ఉపయోగించకండి. వీటన్నింటినీ ప్రక్కనపెట్టి మీ ఖాళీ సమయంలో పిల్లలతో కలిసి ఆటలు ఆడడం , చదువుకోవడం, మరేదైనా కళాత్మకమైన పనులు లేదా సామాజిక పరమైన చర్యలు లేదా సృజనాత్మకమైన కార్యక్రమాలలో పాల్గొనండి.
3. గాడ్జెట్స్ సమయాలు :
గాడ్జెట్స్ ను ఉపయోగించే సమయాలకు పరిమితులను నిర్ణయించడం ద్వారా వాటి వాడకాలు తగ్గించగల మని నేను చెబుతాను.
4. గాడ్జెట్స్ కు ప్రత్యామ్నాయాలు :
ప్రకృతి గురించి వారికి తెలియజేయండి. మీరు చిన్నతనంలో ప్రకృతిని ఎంత బాగా ఆస్వాదించే వారో మరియు బయటకు వెళ్లి ఆడుకునే సమయం ఎంత బాగుంటుందో ,మీ చిన్ననాటి జ్ఞాపకాలను వారితో పంచుకోండి.
5. ఇతర కార్యక్రమాలకు వారిని అలవాటు చేయండి :
మీ పిల్లలను బయటకు వెళ్లేందుకు అలవాటు చేయండి. వారి ఆసక్తిని బట్టి క్రీడలు వైపు వారిని మళ్ళించండి .ఏదైనా కళలవైపు కు వెళ్లే విధంగా క్లాసులకు పంపించండి . ఇది వారిని గాడ్జెట్ల నుండి దూరంగా ఉంచుతుంది. వారికి కేవలం చదువు మాత్రమే కాకుండా ఇటువంటి వాటిని అలవాటు చేసినందువల్ల వారు ఎల్లప్పుడూ మానసికంగా మరియు శారీరకంగా బలంగా ఉంటారు.
ఈ బ్లాగు మీకు నచ్చిందా ? దయచేసి ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి.
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు
పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ బ్లాగ్లు
పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ చర్చలు
పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ ప్రశ్న

{{trans('web/app_labels.text_some_custom_error')}}
{{trans('web/app_labels.text_some_custom_error')}}