• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

11 నమ్మదగని గర్భధారణ అపోహలు..

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Aug 20, 2020

11
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

అభినందనలు ! మీరు గర్భవతి ! ఇది స్త్రీ జీవితంలో అత్యంత మహిమాన్వితమైన సమయాలలో ఒకటి. ఇది ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం. మీరు గర్భధారణ సమయంలో ఎంతో గారాబాన్ని అపురూపంగా ఆనందించే సమయంలో, కొన్నిసార్లు అనవసరమైన ఆందోళనలతో ఆనందానికి అంతరాయం ఏర్పడుతుంది. మంచి ఉద్దేశ్యం ఉన్న కుటుంబం మరియు స్నేహితుల నుండి చేయకూడనివి మరియు చేయవలసిన విషయాల తో ఒక పెద్ద జాబితా తయారవుతుంది. "ఇది తినవద్దు, ధరించ వద్దు, ఇక్కడికి వెళ్ళవద్దు, అక్కడికి వెళ్ళవద్దు " అంటూ జాగ్రత్తలు చెబుతారు. ఇటువంటి సందర్భాలలో ఏది మంచో  ఏది అపోహో తెలియక తల్లి ఎంతో ఒత్తిడికి లోనవుతుంది.

 

ఆ విలువైన తొమ్మిది నెలలు మీరు అటువంటి ఒత్తిడిని కోరుకోరని ఖచ్చితంగా మేము అనుకుంటున్నాము. కాబట్టి మేము సాధారణమైన గర్భధారణ అపోహలను తొలగించేందుకు మరియు వాటి వెనుక ఉన్న నగ్నసత్యాలు తెలుసుకోవడానికి మా నిపుణులతో మాట్లాడాము. గైనకాలజిస్టు మరియు ప్రసూతి వైద్యుడు సీతారాం భారతి , డాక్టర్ రింకు సేన్ గుప్తా థార్ర్ ఈ అపోహల నుండి బయట పడడానికి మనకు సహాయపడ్డారు. ఆ అపోహలు కింద ఇవ్వబడ్డాయి...

 

గర్భధారణ సమయంలో తలెత్తే అపోహలు:

 

1. గర్భధారణ సమయంలో కుంకుమ పువ్వు తినడం వల్ల పిల్లలు తెల్లగా పుడతారు.

 

అపోహ :

ఇది అసలు నిజం కాదు. గర్భధారణ సమయంలో తీసుకునే ఏ ఆహారం కూడా చివరికి కుంకుమ పువ్వు కూడా పిల్లల చర్మపు రంగుపై ఎటువంటి ప్రభావం చూపదు. శరీరపు రంగు జన్యుశాస్త్రం ద్వారా నిర్ణయించబడుతుంది.

 

2. మామిడి, పైనాపిల్, నువ్వులు మరియు బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం జరుగుతుంది.

 

అపోహ :

"ఇది నిజం కాదు"అని డాక్టర్ థార్ చెప్పారు. " ఈ ఆహారాలు మీ బిడ్డకు హాని కలిగిస్తాయనే  వైద్య ఆధారాలు లేవు " అని ఆమె తెలిపారు. కానీ మామిడి వంటి రసాయనాలతో పండించిన పండ్లను తినడం వల్ల మీకు గ్యాస్టిక్ అసౌకర్యాన్ని కలిగిస్తుంది కనుక అటువంటి పండ్లను తినడం మానేయడం మంచి పద్ధతి. సేంద్రియంగా పండించిన పండ్లను ఎంచుకొని తినడం మీకు మంచిది. మరియు వాటిని తీసుకునే ముందు బాగా కడగాలి . తద్వారా రసాయనాలు లేదా పురుగుల మందులకు దూరంగా ఉంటారు.

 

3. మీరు ఎక్కువగా పాలు తీసుకోవాలి.

 

అపోహ :

మీకు మంచి కాల్షియం లభించడానికి రెండు గ్లాసుల పాలు సరిపోతాయి. వాస్తవానికి పాల మీద ఆధారపడకుండా జున్ను లేదా తాజాగా ఇంట్లో తయారుచేసిన పన్నీరు లాంటి ఇతర పాల ఉత్పత్తులను తీసుకోవడం కూడా మంచిది. ఇవి మీ శరీరానికి అన్ని రకాల పోషకాలను కూడా ఇస్తాయి. అదేవిధంగా మీకు ఆహారం తీసుకునేటప్పుడు విసుగు కూడా రాదు. అలాగే , పాలు కొన్నిసార్లు గ్యాస్ లేదా ఇతర సమస్యలను కలిగిస్తాయని గుర్తుంచుకోండి. కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోండి.

 

4. కాఫీ, టి, ఆల్కహాల్ మరియు సిగరెట్లు మానుకోండి .

 

వాస్తవం :

సిగరెట్లు మీ పిండానికి ఆరోగ్యకరమైన రక్తం ప్రవాహాన్ని పరిమితం చేయగలవు మరియు దానికి హాని కలిగిస్తాయి కాబట్టి ఇది నిజం. కానీ , టీ మరియు కాఫీ ల గురించి, " మీరు టీ మరియు కాఫీ ని మితంగా తీసుకున్నంత వరకూ అది మంచిదే" అని డాక్టర్ థార్ చెప్పారు. మీరు కాఫీని మానలేకపోతున్నట్లయితే  డీకెఫిన్ తాగడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా ఒక గ్లాసు వైను తీసుకున్నట్లయితే పర్వాలేదు.

 

5. నెయ్యి వంటి కొవ్వు పదార్థాలను ఇద్దరి కోసం తినండి .

 

అపోహ :

ఇక్కడ కూడా, ఎంతో ప్రజాదరణ పొందిన మరొక అపోహ. మొదటి కొన్ని నెలల్లో పిండం బటాని అంత చిన్నదిగా ఉంటుంది. కనుక నిజానికి ఆ బిడ్డ ఎంత తినగలదు ? డాక్టర్ థార్ ఆరోగ్యకరమైన మంచి ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోవడం మంచిది అని తెలిపారు. భోజనానికి భోజనానికి మధ్యలో ఎక్కువ సమయం ఉండకుండా చూసుకోవాలి అని తెలిపారు. అవసరం అయిన దానికంటే ఎక్కువగా తినడం అనవసరమయిన బరువును పెంచడానికి కారణం అవుతుంది. ఇది బిడ్డ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.

 

ఇక నెయ్యి కి సంబంధించినంతవరకూ మీరు దానిని ఇష్టపడుతున్నట్లు అయితే, మీరు దానిని ఆస్వాదించడం కొనసాగించవచ్చు. వైద్యపరంగా ఈ విషయంలో ఎటువంటి నిరాకరణ లేదు. కానీ మీరు సి సెక్షన్ కోసం షెడ్యూల్ చేయబడితే కొవ్వు పొర కడుపు లోపలి  ప్రక్రియను నెమ్మది చేస్తుంది .కాబట్టి అదనపు కొవ్వు నుండి దూరంగా ఉండటం మంచిది.

 

6. నిద్రించే సమయంలో బోర్లా పడుకోకండి .

 

వాస్తవం :

బోర్లా పడుకోవడం అన్నది పూర్తిగా అనివార్యమే అయినప్పటికీ, మీరు గర్భవతిగా ఉన్నప్పుడు ఎడమ వైపు తిరిగి పడుకోవడం ఎల్లప్పుడూ మంచిది . అని డాక్టర్ థార్ మీరు ఎడమ వైపు లేదా కుడి వైపు తిరిగి నిద్రించడం వలన రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  అందువలన మావికి పోషకాలను అందిస్తుంది. ఇది శిశువుకు మేలు చేస్తుంది.

 

మీరు ఇష్టమైన వైపు తిరిగి నిద్ర పోవడం వలన మీ శరీరం నుండి వ్యర్థ ఉత్పత్తులు మరియు ద్రవాలను సమర్థవంతంగా తొలగించడానికి మూత్రపిండాలకు సహాయపడుతుంది. ఇది మీ చీలమండలు చేతులు మరియు కాళ్ళు పై వాపును తగ్గిస్తుంది . అని ఆమె తెలిపారు. కాబట్టి నిద్రించడానికి మీకు ఇష్టమేనా వైపుని ఎంచుకోండి.

 

7. మైక్రోవేవ్ ఓవెన్ దగ్గర నిలబడడం లేదా కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చోవడం రేడియేషన్ కు కారణం అవుతుంది.

 

వాస్తవం/అపోహ :

దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేనప్పటికీ, ఈ రేడియేషన్ పరికరాలకు గురికావడాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నించండి. అలాగే, మైక్రోవేవ్లో ఆహారం లేదా ద్రవాలను వేడి చేయడం వల్ల కొన్ని ముఖ్యమైన పోషకాలను నాశనం చేస్తాయని గుర్తుంచుకోండి . కాబట్టి మీరు ఆహారాన్ని వేడి చేయడానికి స్టవ్ ను ఉపయోగించుకుని పాత మార్గంలోనే  వెళ్లడానికి ప్రయత్నించండి.

 

8. సంభోగం కలిగి ఉంటే గర్భస్రావం కావచ్చు.

 

అపోహ :

మీ శిశువు అమ్నియోటిక్ శాక్ మరియు గర్భాశయం యొక్క బలమైన కండరాల ద్వారా రక్షించబడుతుంన్నందున, సంభోగం వలన గర్భస్రావం అయ్యే అవకాశాలు ఏమీ లేవు. అయినప్పటికీ, తక్కువ మావి వంటి కొన్ని సమస్యలు ఉన్నప్పుడు జననేంద్రియ నిపుణుడు గర్భధారణ సమయంలో లైంగిక సంబంధం నుండి దూరంగా ఉండమని సలహా ఇస్తారు. అలాగే ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉండేందుకు లూబ్రికెంట్ను వాడమని కూడా సలహా ఇవ్వచ్చు. మీ వైద్య పరిస్థితి గురించి మీ గైనకాలజిస్ట్ కు పూర్తిగా తెలుస్తుంది కనుక వారిని సంప్రదించండి.

 

9. మీరు వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలి మరియు మెట్లు ఎక్కడం మానుకోవాలి.

 

అపోహ :

డాక్టర్ థార్, " మీరు ఎంత చురుకుగా ఉంటారో,  అది మీకు మరియు మీ బిడ్డకు అంత మంచిది."అని తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకోండి. మరియు రాత్రి 8 గంటల పాటు నిద్ర పోండి. ఈ తొమ్మిది నెలల పాటు కూడా కొంత వ్యాయామం చేయండి. ఈ దశలో చేసే వ్యాయామం మీకు ప్రసవం తర్వాత కూడా సహాయపడుతుంది.

 

10. మీ బొడ్డు యొక్క ఆకారము మరియు వేవిళ్ళు మీ పిల్లల లింగాన్ని నిర్ణయిస్తాయి.

 

అపోహ:

అల్ట్రాసౌండ్ ద్వారా తప్ప శిశువు యొక్క లింగాన్ని నిర్ణయించేందుకు మరొక మార్గం లేదు. వేవిళ్ళు, లేదా బొడ్డు ఆకారం, బిడ్డ కదలికలు, తల్లి యొక్క రంగు మరియు గర్భం ధరించే సమయం శిశువు యొక్క లింగాన్ని నిర్ధారించ లేవు. ఏమైనప్పటికీ, ఆశ్చర్యాన్ని కలిగించేది ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది కదా ?

 

11. ఎగుడు దిగుడుగా ఉన్న రోడ్డు మీద ప్రయాణించే వద్దు మరియు గ్రహణం సమయంలో బయటకు వెళ్లకూడదు.

 

అపోహ :

అమ్నియోటిక్ శాక లో శిశువు సురక్షితంగా ఉంటుంది. కాబట్టి ఇవి మీ పిల్లలను బాధించే అవకాశాలు లేవు. రహదారి కొంచెం ఎగుడుదిగుడుగా ఉంటే మీరు వెనుకకు తొత్రిల్లుతారు. కాబట్టి మీ సొంత సౌలభ్యంకోసం నెమ్మదిగా నడవండి. గ్రహణం సమయంలో బయటకు వెళ్లడం వలన పిండానికి ఎటువంటి హాని కలిగిస్తుందని వైద్య ఆధారాలు లేవని డాక్టర్ థార్ తెలిపారు.

 

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు అన్ని వైపుల నుండి సలహాలను(కొన్నిసార్లు విరుద్ధమైనవి) పొందుతారు. మీ ఇంగిత జ్ఞానం ఉపయోగించుకోండి  మరియు సందేహాస్పదంగా ఉన్నప్పుడు మీ గైనకాలజిస్ట్ ను సంప్రదించండి మరియు ఒత్తిడి లేకుండా ఉండండి. మీ ఆందోళనలను తగ్గించడానికి మేము సహాయపడ్డామని ఆశిస్తున్నాము. మీ గర్భధారణ సమయమును ఆస్వాదించండి.

 

గర్భం గురించి ఇంకేమైనా అపోహలు ఉన్నాయా ? వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి . మీ నుండి వినడానికి మేము ఇష్టపడతాము !

 

 

 

 

 

 

 

 

 

 

 

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}